గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు,శ్రావణ మాసం, తిథి: బ.ద్వాదశి ప.1.57 వరకు, తదుపరి త్రయోదశి, నక్షత్రం: పుష్యమి సా.5.03 వరకు, తదుపరి ఆశ్లేష, వర్జ్యం: తె.5.11 నుండి 6.42 వరకు (తెల్లవారితే బుధవారం), దుర్ముహూర్తం: ఉ.8.16 నుండి 9.06 వరకు, తదుపరి రా.10.47 నుండి 11.35 వరకు,అమృత ఘడియలు: ఉ.11.02 నుండి 12.35 వరకు.
సూర్యోదయం : 5.49
సూర్యాస్తమయం : 6.07
రాహుకాలం : ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు
మేషం.... వ్యవహారాలు మందగిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరాశ పరుస్తాయి.
వృషభం... సన్నిహితుల సాయం అందుతుంది. కార్యజయం. స్వల్ప ధనలబ్ధి. వ్యవహారాలలో క్రియాశీలపాత్ర పోషిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.
మిథునం... కార్యక్రమాలలో అవాంతరాలు. కొత్త రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.
కర్కాటకం... పరిచయాలు పెరుగుతాయి. స్థిరాస్తులు కొంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. నేర్పుగా సమస్యలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.
సింహం.... శ్రమాధిక్యం. కొన్ని వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.
కన్య.... కొత్త పనులు చేపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. ఆహ్వానాలు రాగలవు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.
తుల.... కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి. వాహనయోగం. చర్చలు సఫలం. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.
వృశ్చికం..... పనులు కొన్ని వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో సమస్యలు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళపరుస్తాయి. ఆలయ దర్శనాలు.
ధనుస్సు... సోదరుల నుంచి సమస్యలు. ఆకస్మిక ప్రయాణాలు. స్థిరాస్తి వివాదాలు. ఆరోగ్యభంగం. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా కొనసాగుతాయి.
మకరం...... ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. నూతన వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో మరింత ప్రగతి.
కుంభం..... పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి వివాదాలు నుంచి గట్టెక్కుతారు. ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.0
మీనం.... ఆస్తుల విషయంలో చికాకులు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక వ్యవహారాలలో చిక్కులు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.


