ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి | Rasi Phalalu: Daily Horoscope On 10-09-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి

Sep 10 2026 3:02 AM | Updated on Sep 10 2026 5:20 AM

Rasi Phalalu: Daily Horoscope On 10-09-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, తిథి: బ.చతుర్దశి ఉ.10.10 వరకు, తదుపరి అమావాస్య, నక్షత్రం: మఖ ప.2.53 వరకు, తదుపరి పుబ్బ, వర్జ్యం: రా.10.41 నుండి 12.15 వరకు, దుర్ముహూర్తం: ఉ.9.55 నుండి 10.43 వరకు, తదుపరి ప.2.47 నుండి 3.36 వరకు,అమృత ఘడియలు: ప.12.33 నుండి 2.03 వరకు.

సూర్యోదయం : 5.49
సూర్యాస్తమయం : 6.05
రాహుకాలం : ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు 

మేషం... ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. సన్నిహితులతో మాటపడతారు. చేపట్టిన కార్యక్రమాలు ముందుకు సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

వృషభం..... శ్రమ పెరుగుతుంది. విలువైన వస్తువులు జాగ్రత్త. ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగిస్తుంది. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

మిథునం.... కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తా శ్రవణం. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. పరపతి పెరుగుతుంది. పుణ్యక్షేత్రాల సందర్శనం.  వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

కర్కాటకం... పనుల్లో ప్రతిబంధకాలు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. వ్యయప్రయాసలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళపరుస్తాయి.

సింహం..... కుటుంబంలో సంతోషకరంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వాహనయోగం. చర్చలు సఫలం. ప్రముఖుల సలహాలు స్వీకరిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

కన్య.... బంధువుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలు ముందుకు సాగవు. ఎంతగా కష్టించినా ఫలితం కనిపించదు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

తుల..... దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. శుభకార్యాలకు హాజరవుతారు. స్థిరాస్తి వృద్ధి. ప్రత్యర్థులపై పైచేయి. వ్యాపారాలు, ఉద్యోగాలు వృద్ధి చెందుతాయి.

వృశ్చికం... నూతన ఉద్యోగాలు లభిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి.

ధనుస్సు.... బంధువులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. భూవివాదాలు. ఆలోచనలు స్థిరంగా సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.

మకరం.... శ్రమాధిక్యంతో పనులు పూర్తి. బంధువుల నుంచి అపవాదులు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

కుంభం... కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో మరింత సఖ్యత. విందువినోదాలు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

మీనం... ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. ఆలయాలు సందర్శిస్తారు. ధనలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement