గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, తిథి: శు.పాడ్యమి ఉ.7.44 వరకు తదుపరి విదియ, నక్షత్రం: ఉత్తర ప.2.06 వరకు తదుపరి హస్త, వర్జ్యం: రా.10.36 నుండి 12.14 వరకు, దుర్ముహూర్తం: ఉ.5.51 నుండి 7.27 వరకు, అమృత ఘడియలు: ఉ.6.57 నుండి 8.34 వరకు.
సూర్యోదయం : 5.50
సూర్యాస్తమయం : 6.04
రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం : ప.1.30 నుండి 3.00 వరకు
మేషం... పలుకుబడి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. వస్తు, వస్త్రలాభాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.
వృషభం... పనుల్లో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ఆత్మీయులతో మాటపట్టింపులు. అనారోగ్యం. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలలో చిక్కులు. ఉద్యోగాలలో కొన్ని మార్పులు.
మిథునం... కుటుంబంలో చికాకులు. ఆధ్యాత్మిక చింతన. పనులు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు డీలా పరుస్తాయి. ఉద్యోగాలలో చిక్కులు.
కర్కాటకం... కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. పనుల్లో విజయం. వ్యాపారాలలో కొత్త ఆశలు. ఉద్యోగాలలో ప్రోత్సాహం.
సింహం... రుణదాతల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. పనుల్లో ఆటంకాలు. దూరప్రయాణాలు. అనారోగ్యం. శ్రమాధిక్యం. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో మార్పులు.
కన్య... వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఆకస్మిక ధనలబ్ధి. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు. దైవచింతన.
తుల... ఆర్థిక వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. ఆకస్మిక ప్రయాణాలు. పనుల్లో జాప్యం. ఆరోగ్యభంగం. వ్యాపారాలు నిరుత్సాహవంతంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు.
వృశ్చికం... వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. ఆస్తి వివాదాలు పరిష్కారం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.
ధనుస్సు....ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. భూములు, వాహనాలు కొంటారు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహం.
మకరం... పనులు వాయిదా పడతాయి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటుంది. ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.
కుంభం....రుణదాతల ఒత్తిడులు. అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. ఆరోగ్యభంగం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో నిరుత్సాహం.
మీనం... పరపతి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. విద్యార్థులకు ఊహించని ఫలితాలు. ఆర్థికాభివృద్ధి. వస్త్రలాభాలు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూలత.


