ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..? | Weekly Horoscope Telugu 13-09-2026 To 19-09-2026 | Sakshi
Sakshi News home page

Weekly Horoscope In Telugu: ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Sep 13 2026 12:51 AM | Updated on Sep 13 2026 5:43 AM

Weekly Horoscope Telugu 13-09-2026 To 19-09-2026

మేషం....
కొత్త  పనులకు శ్రీకారం చుడతారు. పరపతి పెరుగుతుంది. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. వాహనాలు, భూములు కొంటారు. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. కాంట్రాక్టులు కొన్ని దక్కించుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాల విస్తరణలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో చేపట్టిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. రాజకీయవర్గాలకు అన్ని విధాలా సానుకూలమైన సమయం. వారం చివరిలో మానసిక వేదన, అనారోగ్య సూచనలు. మిత్ర విరోధాలు. నలుపు, ఆకుపచ్చ రంగులు, అన్నపూర్ణాష్టకం పఠించండి.

వృషభం...
పనుల్లో మరింత అభివృద్ధి ఉంటుంది.  కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని మీ అభిప్రాయాలను వెల్లడిస్తారు.  పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి.  గత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. రాజకీయవర్గాల ఆశలు ఫలిస్తాయి. వారం ప్రారంభంలో బంధువుల నుండి ఒత్తిడులు. అనారోగ్యం. శ్రమాధిక్యం. ఎరుపు, చాక్లెట్‌ రంగులు,  లక్ష్మీస్తోత్రాలు పఠించండి.

మిథునం...
ముఖ్యమైన వ్యవహారాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా సాగుతాయి. బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. మీ అంచనాలు నిజమవుతాయి. ఆత్మీయుల సలహాలు స్వీకరిస్తారు. ఆస్తి వివాదాల పరిష్కారం.  ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు.  ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. విద్యార్థులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు. ఉద్యోగాలలో కొంత పనిభారం తగ్గి ఊరట లభిస్తుంది. కళారంగం వారికి  కొన్ని సమస్యలు తీరతాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. మానసిక ఆందోళన.  తెలుపు, చాక్లెట్‌æరంగులు,  రాఘవేంద్రస్తోత్రాలు పఠించండి.

కర్కాటకం...
కొత్త పనులు ప్రారంభించేందుకు అనువైన కాలం. సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. సోదరులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం అందుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార లావాదేవీలు మీలో మరింత ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగాలలో నెలకొన్న సమస్యలు తీరి ఒడ్డునపడతారు. రాజకీయవర్గాలకు ఈతిబాధలు తొలగుతాయి. వారం మధ్యలో  బంధువర్గంతో తగాదాలు. అనారోగ్యం.  నీలం, నేరేడు రంగులు, గణేశ్‌ స్తోత్రాలు పఠించండి.

సింహం....
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. కుటుంబ, ఆరోగ్య సమస్యలు  కొంత చికాకు పరుస్తాయి. బంధువులతో మనస్పర్థలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. కొన్ని   వ్యవహారాలు మధ్యలో విరమిస్తారు. విద్యార్థుల యత్నాలు నెమ్మదిగా సాగుతాయి. ప్రత్యర్థుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలలో లాభాలు అంతగా ఉండవు. ఉద్యోగాలలో అదనపు పనిభారం.  పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. వారం మధ్యలో శుభవార్తలు. వాహన, గృహయోగం.  నీలం, తెలుపు రంగులు, . గణేశ్‌ను పూజించండి.

కన్య...
ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగించినా అవసరాలకు డబ్బు అందుతుంది. పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆప్తుల నుంచి ఆహ్వానాలు రాగలవు. భూవివాదాల నుండి గట్టెక్కుతారు. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు. వాహనసౌఖ్యం. నిరుద్యోగులకు ఉద్యోగలాభం.  వ్యాపారాలు అనుకున్న మేరకు లాభిస్తాయి. ఉద్యోగాలలో వివాదాలు తీరి ఉపశమనం లభిస్తుంది. రాజకీయవర్గాలకు ఊహించని పదవులు రావచ్చు. వారం చివరిలో మానసిక ఆందోళన. కుటుంబంలో కొన్ని ఇబ్బందులు.  ఆకుపచ్చ,,లేత గులాబీరంగు, కనకధారా స్తోత్రం పఠించండి.

తుల...
ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. ప్రత్యర్థులు అనుకూలురుగా మారతారు. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలు మరింత లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో విధులు సమర్థవంతంగా నిర్వహిస్తారు. అలాగే,  సంతోషకరమైన సమాచారం అందుతుంది. పారిశ్రామికవర్గాలకు పట్టింది బంగారమే. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. అనారోగ్యం.  పసుపు, గులాబీ రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

వృశ్చికం..
ముఖ్యమైన పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి. బంధువులు, మిత్రులతో మనస్పర్థలు తీరి ఉపశమనం పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. నిరుద్యోగుల కల ఫలిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. సంఘంలో మరింత గౌరవం పొందుతారు. గృహం కొనుగోలు యత్నాలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారాలు సకాలంలో విస్తరిస్తారు. ఉద్యోగాలలో మీ అంచనాలు ఫలిస్తాయి. రాజకీయవర్గాలకు కార్యసిద్ధి.  వారం చివరిలో మానసిక అశాంతి. అనారోగ్యం.  తెలుపు, చాక్లెట్‌ రంగులు,  నవగ్రహస్తోత్రాలు పఠించండి.

ధనుస్సు...
కొన్ని కార్యక్రమాలు నెమ్మదిగా సాగుతాయి. బంధువులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. మీలోని నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. ఒక ప్రకటన నిరుద్యోగులు, విద్యార్థులకు వరంగా మారనుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యతిరేక పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చుకుంటారు. సేవాకార్యక్రమాలు చేపడతారు. వ్యాపార విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగాలలో మీ అంచనాలు ఫలిస్తాయి. కళారంగం వారికి యోగదాయకమైన కాలం. వారం చివరిలో సోదరులతో కలహాలు. బా«ధ్యతలు పెరుగుతాయి. గులాబీ, పసుపు రంగులు, శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.

మకరం...
ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆసక్తికరమైన సమాచారం అందుతుంది. వ్యవహారాలలో ఆటంకాలు తొలగి సాఫీగా సాగుతాయి. ఆలయ దర్శనాలు. ఇంటాబయటా ప్రోత్సాహకరంగా ఉంటుంది.  ఇంటర్వ్యూలు అందుతాయి. సోదరులు, సోదరీలతో ఉత్సాహంగా గడుపుతారు. కొన్ని పాత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపారాలు మరింత  పుంజుకుంటాయి. ఉద్యోగాలలో బాధ్యతలు తగ్గి  కొత్త ఆశలు చిగురిస్తాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటన  అవకాశాలు. వారం ప్రారంభంలో బంధువిరోధాలు. శ్రమాధిక్యం. ఆకుపచ్చ, తెలుపురంగులు, శివాలయ దర్శనం మంచిది.

కుంభం...
అనుకున్న పనులు మరింత వేగవంతంగా సాగుతాయి. మీపై వచ్చిన ఆరోపణల నుండి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సమాజంలో పరపతి పెరుగుతుంది. గృహ, వాహనయోగాలు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. పోటీపరీక్షల్లో విజయం. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో మీ ప్రతిభను చాటుకుంటారు. రాజకీయవర్గాలకు కొన్ని ఒత్తిడులు తొలగుతాయి. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. మిత్రులతో విభేదాలు. నీలం, లేత పసుపు రంగులు.  నృసింహస్తోత్రాలు పఠించండి.

మీనం...
కొత్త పనులు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల సలహాలు స్వీకరిస్తారు. భూ వివాదాల  ఎట్టకేలకు పరిష్కారం. శుభకార్యాలకు హాజరవుతారు. మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు, సంభాషణలు సాగిస్తారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుని అందర్నీ ఆశ్చర్యపరుస్తారు.  పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. కళారంగం వారికి పురస్కారాలు.  వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. ఆకుపచ్చ, తెలుపు రంగులు, ఆదిత్య హృదయం పఠించండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement