No Headline | - | Sakshi
Sakshi News home page

No Headline

May 22 2024 9:45 AM | Updated on May 22 2024 9:45 AM

No He

No Headline

పేరు: తాళ్లపాక అన్నమాచార్యులు

జననం: 1408 మే 09

మూలం: తాళ్లపాక

మరణం: 1503 ఫిబ్రవరి 23, తిరుపతి

సంగీతశైలి: కర్ణాటక సంగీతం

వృత్తి: రచయిత, యోగి, స్వరకర్త, కవి, పదకవితాపితామహుడు

వాయిద్యాలు: తంబూర

రాజంపేట: తెలుగుసాహితీ చరిత్రలో లభించిన ఆధారాల ప్రకారం మొదటి వాగ్గేయకారుడు అన్నమయ్య. ఆయనకు పదకవితాపితామహుడు అని బిరుదు ఉంది. దక్షిణాపథంలో భజన సంప్రాదాయానికి పదకవితాశైలికి ఆద్యుడు. గొప్ప వైష్టవభక్తుడు..

● భాగవతసేవా పరాయణులైన నారాయణసూరి, లక్కమాంబలకు సంతానం లేకపోవడంతో ఏడుకొండలస్వామిని మొక్కుకున్నారు. తిరుమలకు చేరుకున్న ఈ దంపతులు స్వామి మందిరంలోకి ప్రవేశించారు. గరుడస్తంభం వద్ద సాగిలి మొక్కారు. వెంకటేశ్వరస్వామి తన నిజఖడ్గమైన నందకాన్ని ఆ పుణ్యదంపతులకు ప్రసాదించాడు. వాళ్లు పరమానంద భరితులయ్యారు. వెంకటపతిని దర్శించి స్తుతించారు. సంతోషంతో తాళ్లపాకకు తిరిగివచ్చారు. 1408 మే 9న రాజంపేట మండలం తాళ్లపాకలో అన్నమయ్య జన్మించాడు. తన ఎనిమిదవ యేట అన్నమయ్యకు ఆయన గురువు ఘన విష్ణుదీక్ష నొసిగినప్పుడు అన్నమాచార్య నామం స్థిరపడింది.

అన్నమయ్య తిరుమల పయనం..

అన్నమయ్య ఇంటిలో తల్లి సంగీతం, తండ్రి పాండిత్యం ఛాయలతో పెరిగాడు. ఉపవీత సంస్కా రం పొందిన తర్వాత ఇంటి గురుకులంలో విద్యాభాస్యం కొనసాగింది. ఏకసంధాగ్రహి అయినందున అనతికాలంలో ఉన్నత విద్యావంతుడయ్యాడు. తన పదహారవ యేట అన్నమయ్యకు శ్రీ వెంకటేశ్వర దర్శనానుభూతి కలిగింది. అప్పటి నుంచి అన్నమయ్య అద్భుతమైన కీర్తనలు రచింపసాగాడు. వేడుకుందామా వెంకటగిరి వెంకటేశ్వరుని..అంటూ భక్తబృందంతో కలిసి అన్నమయ్య తిరుమలకు పయనమయ్యాడు. వెంకటేశ్వరుని కీర్తిస్తూ తిరుమలలోనే జీవితం గడిపాడు.

సంసారం..సంకీర్తనం

తిరుమల నుంచి తాళ్లపాకకు చేరుకున్న అన్నమయ్యకు తిమ్మక్క, అక్కమ్మ అనే పడతులతో వివాహం జరిగింది. వైవాహిక జీవితంలో పడిన అన్నమయ్య ఒకరోజు తన ఇద్దరు భార్యలతో తిరుమలకు చేరుకున్నారు. ఆ సమయంలోనే శ్రీ వేంకటపతిపై రోజుకొక సంకీర్తన వినిపించాలని సంకల్పించాడు. అప్పటి నుంచి అన్నమయ్య పుంఖానుపుంఖాలుగా కీర్తనలు చెప్పారు. అతని శిష్యులు వాటిని గానం చేస్తూ తాళపత్రాలకు ఎక్కించారు. భార్యలతో కలిసి తీర్థయాత్రలకు బయలుదేరారు. ముందుగా తన స్వగ్రామంలోని చెన్నకేశవుని అర్చించారు. మార్గంలోని నందలూరు సౌమ్యనాథుడు, ఒంటిమిట్టి రామయ్య, కడప వెంకటరమణుని, చాగలమర్రి చెన్నకేశవున్ని, అహోబిలం నృసింహస్వామిలను దర్శించుకుని కీర్తనలు ఆలపించారు. వైష్ణవ క్షేత్రాలను దర్శించుకుంటూ, తను ఆలపించిన కీర్తనలు అంతటా ప్రసిద్ధి చెందాయి.

అన్నమయ్య కీర్తనలు..రచనలు..

అన్నమయ్య సంకీర్తనా సేవ సంగీత, సాహిత్య, భక్తి పరిపుష్టం. తెలుగు వ్యావహారిక భాష, దేశి సంగీత విధానాలు రెండు అతని రచనలలో ఉన్నాయి. లభించిన వాటిలో తొలి సంకీర్తనలు కనుక అన్నమయ్య సంకీర్తనాచార్యుడు, పదకవితాపితామహుడు అయ్యాడు. 32వేల కీర్తనలు ఆలపించారు. అలుమేలు మంగ, శ్రీనివాసుల కీర్తనలకు తన జీవితాన్ని అంకితం చేసిన పరమ భక్తుడు అన్నమ య్య. రచనలలో భక్తి, సంగీతం, సాహిత్యం, శృంగారం, వేదాంతము అత్యంత మనోహరంగా వినసొంపుగా ఉన్నా యి. దక్షిణాపథంలో భజన సంప్రదా యానికి అన్నమయ్యే ఆద్యుడు.

23 నుంచి 25 వరకు

అన్నమయ్య

జయంత్యుత్సవాలు

ఈనెల 23 నుంచి 25 తేదీ వరకు అన్నమయ్య 616వ జయంత్యుత్సవాలను టీటీడీ నిర్వహిస్తోంది. తాళ్లపాక, అన్నమయ్య 108 విగ్రహం వద్ద సంగీత, నృత్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 23న తాళ్లపాకలో అన్నమయ్య ధ్యానమందిరం వద్ద ఉదయం 9 గంటలకు గోష్టిగానం, సప్తగిరి సంకీర్తనలు ఉంటాయి. 10.30 గంటలకు శ్రీవారి కళ్యాణం నిర్వహించనున్నారు.

భూమన, వైవీ సుబ్బారెడ్డి హయాంలో

జన్మస్థలికి మహర్దశ

టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి, మాజీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి హయాంలో తాళ్లపాక అన్నమాచార్యుల జన్మస్థలికి మళ్లీ మహర్దశ కలిగిందనే చెప్పవచ్చు. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో తాళ్లపాక, 108 అడుగుల అన్నమయ్య విగ్రహం ఏర్పాటు జరిగాయి. నభూతో నభవిష్యతి అన్న రీతిలో అన్నమయ్య 600వ జయంత్యుత్సవాలు జరిగాయి. సీఎం వైఎస్‌ జగన్‌ పాలనలో టీటీడీ చైర్మన్‌గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి, ప్రస్తుత చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి మళ్లీ థీంపార్కు, అన్నమయ్య ధ్యానమందిర పునఃనిర్మాణానికి మోక్షం లభించింది.

తాళ్లపాకలోని అన్నమాచార్య ధ్యానమందిరం

అదివో అల్లదివో శ్రీవారి వాసము

పదివేల శేషుల పడగలమయం... లాంటి

కీర్తనలతో పదకవితా పితామహుడుగా తాళ్లపాక అన్నమాచార్యలు శ్రీవారి భక్తుల హృదయాల్లో చెరగని ముద్రవేసుకున్నాడు. అన్నమాచార్యుడి 614వ జయంతి సందర్భంగా సాక్షి అందిస్తున్న ప్రత్యేక కథనం...

తొలి తెలుగు వాగ్గేయకారుడు అన్నమయ్య

23 నుంచి అన్నమాచార్యుని జయంతి ఉత్సవాలు

అటు తాళ్లపాక, ఇటు 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద ఉత్సవాలు

ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు శ్రీహరి నారాయణచార్యులు. ఈయనను తాళ్లపాక స్వామి అని కూడా పిలుస్తారు. 12వ తరానికి చెందిన వారు. వీరి కుటుంబీకులు తిరుమలలో శ్రీవారి ఆలయంలో సంకీర్తన కై ంకర్యపరులుగా కొనసాగుతున్నారు. అన్నమయ్య వారసులుగా శ్రీవారి నిత్య కై ంకర్యాలలో చేసుకునే మహాభాగ్యం మా కుటుంబీకులకు మహాఅద్భుతమైన అవకాశంగా భావిస్తున్నామని హరిస్వామి చెబుతున్నారు.

No Headline1
1/2

No Headline

No Headline2
2/2

No Headline

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement