
● నిరసన హోరు!
బద్వేలు పట్టణంలో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. తొలుత పార్టీ శ్రేణులు ఎన్‌జీవో కాలనీలోని వైఎస్సార్ విగ్రహం వద్ద నుంచి సిద్దవటం రోడ్డులోని ఎక్సైజ్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎకై ్సజ్ కార్యాలయం ఎదుట నకిలీ మద్యం సీసాలను పగులగొట్టి నిరసన తెలిపారు. అనంతరం ఎకై ్సజ్ సీఐ సీతారామిరెడ్డికి వినతిపత్రం సమర్పించారు. వైఎస్సార్‌సీపీ నేతలు రమణారెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, సుందరరామిరెడ్డి, పెద్దారెడ్డి పాల్గొన్నారు.