
హుండీ ఆదాయం లెక్కింపు
చాపాడు : జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన అల్లాడుపల్లె శ్రీవీరభద్రస్వామికి భక్తులు సమర్పించిన హుండీల ద్వారా రూ.11.48 లక్షల ఆదాయం లభించినట్లు ఆలయ ఈఓ శంకర్ బాలాజీ తెలిపారు. దేవదాయ ధర్మాదాయ శాఖ డివిజనల్ ఇన్‌స్పెక్టర్ కిరణ్ కుమార్, ఆలయ చైర్మన్ పెరుగు వీరనారాయణ యాదవ్ పర్యవేక్షణలో ఈ ఏడాది మార్చి 6 నుంచి సోమవారం భక్తులు సమర్పించిన హుండీ ఆదాయాన్ని లెక్కించారు. రూ.11,48,720 నగదు, 118 గ్రాముల బంగారు, 1.800 కిలోల వెండి వీరభద్ర స్వామికి కానుకగా లభించిందని వెల్లడించారు. వీటిని మైదుకూరులోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో డిపాజిట్ చేసినట్లు ఆలయ ఈఓ తెలిపారు.