జిల్లాలో ఐదు మండలాల్లో వర్షం | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో ఐదు మండలాల్లో వర్షం

Oct 14 2025 7:01 AM | Updated on Oct 14 2025 7:01 AM

జిల్లాలో ఐదు మండలాల్లో వర్షం

జిల్లాలో ఐదు మండలాల్లో వర్షం

కడప అగ్రికల్చర్‌: ఉపరితల ఆవర్తణంగా కారణంగా జిల్లాలో ఐదు మండలాల్లో వర్షం కురిసింది. ఇందులో భాగంగా గోపవరం మండలంలో అత్యధికంగా 20 మి.మీ వర్షంకురిసింది. అలాగే జమ్మలమడుగులో 15.2 , మైలవరంలో 10.2, కమలాపురంలో 4.6, బద్వేల్‌లో 1 మి.మీ వర్షం కురిసింది.

16న జాబ్‌మేళా

కడప ఎడ్యుకేషన్‌ : కడప నగరంలోని ప్రభుత్వ పురుషుల కళాశాల (స్వయంప్రతిపత్తి)లో జవహర్‌ నాలెద్జ్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో ఈ నెల 16న మినీ జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్‌ డా.జి.రవీంద్రనాథ్‌ తెలిపారు. ఈ జాబ్‌ మేళాలో హెటేరో లాబ్స్‌ లిమిటెడ్‌, నెక్స్‌టెల్‌ మెటా ప్రైవేట్‌ లిమిటెడ్‌, అపోలో ఫార్మసీ పాల్గొంటుందని జేకేసీ కోఆర్డినేటర్‌ సీహెచ్‌. రాము తెలిపారు. ఇంటర్మీడియట్‌, డిగ్రీ, బి.టెక్‌, మాస్టర్‌ డిగ్రీలతోపాటు డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు కళాశాలలోని జేకేసీ మెంటార్లు సారధి (9347256400) రవీంద్రారెడ్డి (9390052901) లను సంప్రదించాలని సూచించారు.

దరఖాస్తుల ఆహ్వానం

కడప ఎడ్యుకేషన్‌ : కడప రిమ్స్‌ వద్ద ఉన్న మైనార్టీ ఐటీఐలో మిగిలిన సీట్లకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్‌ జ్ఞానకుమార్‌ తెలిపారు. పదో తరగతి, ఇంటర్‌ పాస్‌ లేదా ఫెయిల్‌ అయిన విద్యార్థులు అర్హులని తెలిపారు. అభ్య ర్థులు, పది, ఇంటర్‌ మార్కుల జాబితా, టీసీ, కుల ధ్రువీకరణపత్రం, ఆధార్‌, ఫొటో, మెయిల్‌ ఐడీతోపాటు మైబెల్‌ నెంబర్‌ iti.ap.gov.in అనే పోర్టల్‌లో దరఖాస్తును సమర్పించాలని తెలి పారు. రిజిస్టర్‌ చేసిన దరఖాస్తును తప్పనిసరిగా వెరిఫికేషన్‌ చేయించుకోవాలని తెలిపారు. కంప్యూటర్‌ కోర్సు(కోపా)కు 10వ తరగతి పాస్‌, వెల్డర్‌ కోర్సుకు పదవ తరగతి ఫెయిన్‌ వారు అర్హులని తెలిపారు. 17వ తేదీ అడ్మిషన్‌ కౌన్సెలింగ్‌ ఉంటుందని ప్రిన్సిపాల్‌ తెలిపారు.

15న కౌన్సెలింగ్‌

కడప రూరల్‌ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో వివిధ కేటగిరీలకు చెందిన ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈనెల 15వ తేదీన కౌన్సెలింగ్‌, సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ నిర్వహించనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ నాగరాజు తెలిపారు. మెడికల్‌ ఆఫీసర్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌, ఫార్మసిస్ట్‌, ఎఫ్‌ఎన్‌ఓ, శానిటరీ అటెండర్‌, టీబీ హెల్త్‌ విజిటర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కౌన్సిలింగ్‌ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు తమ ఒరిజినల్‌ సర్టిఫికెట్స్‌తో హాజరు కావాలన్నారు. అభ్యర్థుల ఎంపిక జాబితాను డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. కడప.ఏపీ.జిఓవి.ఇన్‌ వెబ్‌ సైట్‌ లో చూడవచ్చని పేర్కొన్నారు.

అర్జీదారులకు నాణ్యమైన పరిష్కారం చూపాలి

– జాయింట్‌ కలెక్టర్‌ అదితిసింగ్‌

కడప సెవెన్‌రోడ్స్‌ : ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా స్వీకరించిన అర్జీలకు అర్జీదారులు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం అందించాలని జాయింట్‌ కలెక్టర్‌ అదితి సింగ్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సభా భవన్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అర్జీల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి జేసీ అదితి సింగ్‌తోపాటు డీఆర్‌ఓ విశ్వేశ్వర నాయుడు, వివిధ శాఖల జిల్లా అధికారులు హాజరై ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు. పీజీఆర్‌ఎస్‌లో రీ ఓపెన్‌ అయిన అర్జీలను మరింత నాణ్యతతో పరిష్కరించాలని, జిల్లా అధికారులు మీకు వచ్చిన అర్జీలను సమ యం కేటాయించి రివ్యూ చేయాలన్నారు. ఎవరైనా అర్జీలపై నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని అధికారులను హెచ్చరించారు. అనంతరం అర్జీదారుల నుంచి వారు అర్జీలను స్వీకరించారు. అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

భూరీసర్వేపై

అవగాహన కల్పించాలి

సిద్దవటం : భూ రీసర్వే పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని విజయవాడ సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ డిప్యూటీ డైరెక్టర్‌ టి.శ్రీనివాసులురెడ్డి తెలిపారు.సోమవారం సిద్దవటం మండలంలోని కనుములోపల్లిలోని సర్వే నంబర్‌ 29, 30, 31లోని 12.05 ఎకరాల భూమిలో సర్వేయర్లు చేపట్టిన రీసర్వేను పరిశీలించారు. సంబంధిత రైతులు ప్రసాద్‌రెడ్డి, గౌస్‌బాషాలతో మాట్లాడారు. సర్వే సిబ్బంది రైతులకు నోటీసులు అందిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా సర్వే ల్యాండ్‌ అధికారి ఎ.మురళీకృష్ణ, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ సర్వే శ్రీలత, పోరభాకర్‌, సర్వేయర్‌ సోమశేఖర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement