మిస్సవుతున్నందుకు బాధగా ఉంది.. సుధీర్‌ బాబు ట్వీట్! | Sakshi
Sakshi News home page

Sudheer Babu : ఆ స్పెషల్‌ డేట్‌ మిస్ అవుతున్నా.. సుధీర్ బాబు పోస్ట్ వైరల్!

Published Tue, May 21 2024 3:18 PM

Tollywood Hero Sudheer Babu Harom Hara Post Poned

టాలీవుడ్‌ యంగ్‌ హీరో సుధీర్‌బాబు, మాళవిక శర్మ జంటగా నటించిన తాజా చిత్రం హరోం హర. ఈ చిత్రాన్ని జ్ఞానసాగర్‌ ద్వారక దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ మూవీని మే 31న రిలీజ్‌ చేస్తున్నట్లు ఇప్పటికే అనౌన్స్‌మెంట్‌ చేశారు. సూపర్ స్టార్‌ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయాలని భావించారు.

కానీ ఊహించని విధంగా సినిమాను వాయిదా వేస్తున్నట్లు సుధీర్ బాబు ట్వీట్‌(ఎక్స్)లో పోస్ట్‌ చేశారు. కొన్ని కారణాల వల్ల హరోం హర మూవీని వాయిదా వేస్తున్నట్లు రాసుకొచ్చారు. సినిమా వాయిదా వేస్తున్నందుకు బాధగా ఉందన్నారు. స్పెషల్ డేట్‌ మిస్ అవుతున్నానని సుధీర్‌ బాబు ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.

సుధీర్‌బాబు తన ట్విటర్‌లో రాస్తూ..' వివిధ కారణాల వల్ల హరోం హర సినిమాను వాయిదా వేస్తున్నాం. వచ్చేనెల జూన్ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తాం. మొదట అనుకున్న ప్రకారం కృష్ణ గారి బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేయాలనుకున్నా. కానీ మిస్ అయినందుకు బాధగా ఉంది. అయినప్పటికీ జూన్ ఇప్పటికీ నా లక్కీ నెల. ఈ సమయంలోనే ప్రేమకథా చిత్రం, సమ్మోహనం చిత్రాలు విడుదలయ్యాయి.  అలాగే హరోం హర కూడా మీ అంచనాలకు తగ్గట్టుగానే ఉంటుంది.' అని పోస్ట్ చేశారు. 1989 నాటి చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement