
వైభవంగా పోలేరమ్మ తిరునాళ్ల
అశేష భక్తుల మధ్య శిడిమానోత్సవం
చీరాల టౌన్: మండలంలోని కొత్తపాలెం గ్రామ పంచాయతీలో కొలువుదీరిన పోలేరమ్మ ఆలయ 24వ వార్షికోత్సవాలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ నెల 17 నుంచి నిర్వహిస్తున్న తిరునాళ్లలో ఆఖరి రోజు శిడి మానోత్సవం వైభవంగా నిర్వహించారు. దేవస్థాన కమిటీ అధ్యక్షుడు బక్కా శివప్రసాద్‌రెడ్డి, పాలకవర్గం ఆధ్వర్యంలో భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. మహాలక్ష్మి అమ్మవారికి పూజలు, అమ్మవారి సేవ, ప్రభోత్సవాలు భక్తిశ్రద్ధలతో చేశారు. శిడి పెళ్లి కొడుకు వేషధారణలో గ్రామంలో ఉత్సవం చేసి, శిడిమానులో మేకను పెట్టి గుడిచుట్టూ ప్రదక్షిణలు చేశారు. పోలేరమ్మను ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు సుబ్బారెడ్డి, కృష్ణారెడ్డి, సిద్దారెడ్డి, సురేష్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, రాంబాబురెడ్డి పాల్గొన్నారు.

వైభవంగా పోలేరమ్మ తిరునాళ్ల

వైభవంగా పోలేరమ్మ తిరునాళ్ల