పండుగలా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి నేతృత్వంలో బాపట్ల నియోజకవర్గంలో వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాపట్లలోని కోన చాంబర్‌లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఏరియా అసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. మూర్తి రక్షణనగర్‌లో కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి చేజెర్ల నారాయణరెడ్డి, కోకి రాఘవరెడ్డి, కొక్కిలిగడ్డ చెంచయ్య, ఏడుకొండలరెడ్డి, సుధీర్‌బాబుతోపాటు వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
కోన రఘుపతి ఆధ్వర్యంలో బాపట్లలో రక్తదాన శిబిరం రేపల్లెలో ఈవూరు గణేశ్ నేతృత్వంలో రోగులకు పండ్లు పంపిణీ చీరాలలో కేక్ కటింగ్‌లు, రక్తదాన శిబిరం గాదె మధుసూదన్‌రెడ్డి ఆధ్వరంలో మార్టూర్‌లో రక్తదాన శిబిరం వరికూటి ఆధ్వర్యంలో వేమూరులో బీసీ హాస్టల్ విద్యార్థులకు బెడ్లు పంపిణీ అద్దంకి నియోజకవర్గంలో కేక్ కటింగ్‌లు, రక్తదాన శిబిరం
రేపల్లె నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త ఈవూరు గణేశ్ నేతృత్వంలో వైఎస్.జగన్ జన్మదిన వేడుకలు జరిగాయి. రేపల్లెలోని పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వం ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. నిజాంపట్నం, నగరం మండలాల్లో కేక్‌లు కట్ చేశారు. చెరుకుపల్లిలో కేక్ కటింగ్‌తోపాటు రక్తదాన శిబిరాన్ని నిర్వహించి అన్నదానం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నేతలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
బాపట్ల జిల్లాలో భారీగా సేవా కార్యక్రమాలు
సాక్షి ప్రతినిధి, బాపట్ల: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలు ఆదివారం జిల్లా వ్యాప్తంగా పండుగలా జరిగాయి. వైఎస్సార్ సీపీ సమన్వయకర్తలు, ముఖ్యనేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున వేడుకలు నిర్వహించారు. కేక్‌లు కట్ చేశారు. అన్నదానం, రక్తదాన శిబిరాలు నిర్వహించారు. రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. విద్యార్థులకు నోట్ పుస్తకాలు, బెడ్లు, దుప్పట్లు అందజేశారు. బైక్‌ర్యాలీలు నిర్వహించారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లాలో వాడవాడలా వేడుకలు ఘనంగా జరిగాయి. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాలనలో జరిగిన మంచిని, పథకాల అమలును ప్రజలు మరోమారు గుర్తు చేసుకున్నారు.
పండుగలా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
పండుగలా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు


