పోలియో రహిత సమాజమే లక్ష్యం
బాపట్ల: పోలియో రహిత సమాజ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ తెలిపారు. జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని స్థానిక బాపట్ల పట్టణం రైల్వే పేట ప్రాథమిక పాఠశాలలో ఆదివారం కలెక్టర్ ప్రారంభించారు. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేశారు. పోలియోను బాపట్ల జిల్లా నుంచి తరిమి వేయాలని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 1,315 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 1.45 లక్షల మంది చిన్నారులకు చుక్కలు వేయడం లక్ష్యం అన్నారు. పట్టణంలోని ప్రాంతీయ వైద్యశాలకు కలెక్టర్, ఆయన సతీమణి భూమిక చంద్రలాలీ వచ్చి కుమారుడికి పోలియో చుక్కల మందు వేయించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్ ఎస్.విజయమ్మ, ఆర్డీఓ పి.గ్లోరియా, ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ ప్రవీణ్, తహసీల్దార్ షాలీమా పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్


