రాష్ట్ర స్థాయి ఖోఖో చాంపియన్ ప్రకాశం
జె.పంగులూరు: ఎస్‌ఆర్‌ఆర్ ఖోఖో అకాడమీ ఆధ్వర్యంలో స్థానిక ఎంఎస్‌ఆర్, బీఎన్‌ఎం జూనియర్ కళాశాలలో గత మూడు రోజుల నుంచి పంగులూరులో జరుగుతున్న 44వ రాష్ట్ర స్థాయి బాలబాలికల పోటీలు ఆదివారంతో ముగిశాయి. ఈ పోటీల్లో అత్యంత ప్రతిభ కనబరిచిన ప్రకాశం బాలుర జట్టు ప్రథమ స్థానం సాధించింది. ద్వితీయ స్థానం కృష్ణ, మూడో స్థానం వైజాగ్, విశాఖ పట్నం సంయుక్తంగా సాధించాయి. బాలికల విభాగంలో చిత్తూరు మొదటి స్థానం సాధించింది. రెండో స్థానం శ్రీకాకుళం సాధించగా, మూడో స్థానం విజయనగరం, ప్రకాశం జట్లు సంయుక్తంగా సాధించాయి. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు గరటయ్య, కె.హనుమంతరావు, యూనియన్‌న్ బ్యాంక్ అసోసియేషన్ సెక్రటరీ రాజేష్ ఖన్నా, కేకేఎఫ్‌ఐ సెక్రటరీ సీతారామిరెడ్డి, రఘుబాబు, గ్రామ పెద్దలు వీరనారాయణ, రామారావు, రావూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
మ్యాచ్‌ల వివరాలు
మొదట జరిగిన చిత్తూరు, శ్రీకాకుళం బాలికల ఫైనల్ మ్యాచ్‌లో మొదటి టాస్ గెలిచిన చిత్తూరు జట్టు డిఫెన్స్ ఎంచుకొని నిర్ణీత 9 నిమిషాలకు 26 పాయింట్లు సాధించింది. అనంతరం డిఫెన్స్ చేసిన శ్రీకాకుళం జట్టు నిర్ణీత 9 నిమిషాల్లో 14 పాయింట్లు సాధించింది. 12 పాయింట్ల తేడాతో శ్రీకాకుళంపై చిత్తూరు విజయం సాధించింది. అనంతరం జరిగిన బాలుర మ్యాచ్‌లు మొదట టాస్ గెలిచిన ప్రకాశం జట్టు రన్నింగ్ ఎంచుకుంది. డిఫెన్స్ చేసిన కృష్ణా నిర్ణీత 9 నిమిషాలకు 10 పాయింట్లు సాధించింది. అనంతరం డిఫెన్స్ చేసిన ప్రకాశం నిర్ణీత 9 నిమిషాలకు 24 పాయింట్లు సాధించి మ్యాచ్ వన్ సైడ్ చేసింది. మంచి ప్రతిభ కనబరిచిన బాజీ ఆల్ రౌండర్ ట్రోఫీని అందుకున్నాడు.
బాలికల విభాగంలో చిత్తూరుకు ప్రథమ స్థానం
రాష్ట్ర స్థాయి ఖోఖో చాంపియన్ ప్రకాశం


