ఇన్‌స్టా రీల్‌ కోసం వందడుగుల ఎత్తు నుంచి దూకి.. | Jharkhand Youth Dies After Jump Into Water From 100 Feet To Make Instagram Reels, More Details | Sakshi
Sakshi News home page

ఇన్‌స్టా రీల్‌ కోసం వందడుగుల ఎత్తు నుంచి దూకి..

Published Wed, May 22 2024 9:12 AM

Instagram reel madness Jharkhand Youth Dies After jump into water

ఇన్‌స్టాగ్రామ్‌ రీల్‌ కోసం సాహసం చేయబోయి ఓ టీనేజర్‌ ప్రాణాలు కోల్పోయాడు. స్నేహితుల కళ్లెదుటే.. అదీ మొబైల్‌లో చిత్రీకరిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

జార్ఖండ్‌లోని షాహిబ్‌గంజ్‌కు చెందిన 18 ఏళ్ల తౌసిఫ్‌.. స్నేహితుల ప్రొత్సహాం నేపథ్యంలో ఓ క్వారీలోని సరస్సులోకి 100 ఫీట్ల ఎత్తులోంచి దూకాడు. దూకిన వెంటనే ఈత కొడుతూ కనిపించిన తౌసిఫ్‌ ఆ తరువాత కొంచెం దూరం వెళ్లకముందే మునిగిపోయాడు. అప్పటికే ఆ సరస్సులో ఈత కొడుతున్న స్నేహితులు రక్షించేందుకు యత్నించినా ఫలితం లేకుండా పోయింది.

స్థానికులు, పోలీసులకు సమాచారం అందించగా.. కాసేపటికి తౌసిఫ్‌ మృతదేహాన్ని వెలికితీశారు. డీఎస్పీ విజయ్‌ కుమార్‌ కుష్వా వెల్లడించిన వివరాల ప్రకారం.. నీళ్లలో దూకగానే ఆ లోతుకు టీనేజర్‌ తనను తాను నియంత్రించుకోలేక మునిగిపోయడు.

Advertisement
 
Advertisement
 
Advertisement