ఆదాయానికి మించి ఆస్తులు.. పోలీసుల అదుపులో ఇన్‌స్టా క్వీన్‌ | Amandeep Kaur, a Punjab Police head constable known as Instagram Queen | Sakshi
Sakshi News home page

ఆదాయానికి మించి ఆస్తులు.. పోలీసుల అదుపులో ఇన్‌స్టా క్వీన్‌

May 27 2025 9:28 PM | Updated on May 27 2025 9:36 PM

Amandeep Kaur, a Punjab Police head constable known as Instagram Queen

చండీఘడ్‌: మహీంద్రా థార్. రాయల్ ఎన్‌ఫీల్డ్ బులెట్ బైక్‌. కోట్ల విలువ చేసే రెండు ప్లాట్లు. రెండు ఐఫోన్లు.  రోలెక్స్ వాచీ.. కోట్లు విలువ చేసే ఆస్తులు ఎవ‌రివో తెలుసా? పోలీస్ శాఖలో కానిస్టేబుల్‌గా ప‌నిచేసిన ఇన్‌స్టా క్వీన్  ఆమెందీప్ కౌర్‌వి.  

గ‌త నెల‌లో పంజాబ్  పోలీస్ శాఖ ఆమెందీప్‌ కౌర్‌ని విధుల నుంచి తొల‌గించింది. పోలీస్ కానిస్టేబుల్‌గా ప‌నిచేస్తూ దేశ సంఘ విద్రోహ శ‌క్తుల‌తో చేతులు క‌లిపార‌నే ఆధారాల‌తో స‌స్పెండ్ చేసింది.  దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌దిద్దుకోవాల‌నే నానుడిని నిజం చేస్తూ పోలీస్ శాఖ వేటు వేయ‌డంతో కానిస్టేబుల్‌గా ఉన్న స‌మ‌యంలో భారీ ఎత్తున డ‌బ్బులు సంపాదించింది.

ప్ర‌భుత్వ ఉద్యోగం పోవ‌డంతో సంపాదించిన డ‌బ్బులతో జ‌ల్సాలు చేస్తూ ఇన్ స్టా గ్రామ్ క్వీన్‌గా పేరు సంపాదించింది. అయితే, ఈ క్ర‌మంలో పంజాబ్ విజిలెన్స్ బ్యూరో ఆమెను అరెస్ట్ చేసింది. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయ‌ని గుర్తించిన అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బథిండాలో జరిగిన విచారణ ఆధారంగా అవినీతి కేసు నమోదైంది.

ఈ ఏప్రిల్ నెల‌లో మాద‌క ద్ర‌వ్యాల కేసులో  ఆమెందీప్ కౌర్‌పై  నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (NDPS) యాక్ట్ కింద కేసు నమోదు కావ‌డంతో జైలు పాల‌య్యారు. అయినప్పటికీ, ఆమె మే 2 న బథిండా కోర్టు నుంచి బెయిల్‌పై విడుదల అయ్యారు. తాజాగా, విచార‌ణ‌లో పంజాబ్ పోలీసులకు క‌ళ్లు బైర్లు క‌మ్మేలా ఆమెందీప్ కౌర్‌కు ఆస్తులు ఉన్న‌ట్లు గుర్తించారు. ఆమె ఆస్తులు మొత్తం రూ. 1.35 కోట్లగా ఉన్నాయి.  వాటిని ఎన్డీపీసీ యాక్ట్ కింద సీజ్ చేశారు. ఈ ఆస్తులు రెండు ప్లాట్లు, మహీంద్రా థార్, రోలెక్స్ వాచీ, మూడు ఫోన్లు ఉన్నాయి.

సీజ్ చేసిన ఆస్తులు లెక్కిస్తే

విరాట్ గ్రీన్, బథిండా (217 చదరపు యార్డులు): రూ.99,00,000

డ్రీమ్ సిటీ, బథిండా (120.83 చదరపు యార్డులు): రూ.18,12,000

థార్ కార్: రూ.14,00,000

రాయల్ ఎన్‌ఫీల్డ్ బులెట్: రూ.1,70,000

ఐఫోన్ 13 ప్రో మాక్స్: రూ.45,000

ఐఫోన్ ఎస్ఈ: రూ.9,000

వివో ఫోన్: రూ.2,000

బ్యాంక్ బ్యాలెన్స్ (SBI): రూ. 1,01,588.53

రోలెక్స్ వాచీ: ధర తెలియాల్సి ఉంది. 

విచారణ సందర్భంగా 2018 నుంచి 2025 వరకు ఆమె సంపాదించిన ఆస్తుల గురించి ఆరా తీశారు. ఆమె తీసుకున్న జీతం, బ్యాంకు అకౌంట్లు, ఆమెకు ఉన్న అప్పులను అధికారులు ప‌రిశీలించారు.

విచారణలో ఆమె ఖర్చులు తన ఆదాయాన్ని దాటినట్టు తేలింది. ఇన్‌స్టా క్వీన్ అనే పేరు దక్కించుకున్న ఆమె ఇన్‌స్టా గ్రామ్‌లో ఖరీదైన వస్తువులతో వీడియోలను పోస్ట్ చేసింది. వాటి ఆధారంగా ఆమె ఆదాయంపై అధికారుల కన్ను పడింది. 

ఆమెందీప్ కౌర్ 2018 నుండి 2024 మధ్య మొత్తం రూ.1.08 కోట్ల ఆదాయం సంపాదించింది. కానీ ఆమె ఖర్చులు రూ. 1.39 కోట్లు పైగా ఉన్నాయి. అంటే రూ.31.27 లక్షలు ఆమె ఆదాయానికి మించిన ఖర్చు చేశాయి. 28.85 శాతం ఆమె చట్టబద్ధమైన ఆదాయానికి మించి ఉంది. మే 26న జ‌రిపిన విచార‌ణ ఆధారంగా అవినీతి నిరోధక చట్టం కింద విజిలెన్స్ బ్యూరో అధికారులు ఆమెను అద‌పులోకి తీసుకున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement