కోర్టులో ఖైదీల మధ్య ఘర్షణ ఎపిసోడ్‌.. అండర్‌ ట్రయల్‌ ఖైదీ మృతి | One dead after fight between two groups breaks out in Delhi court l | Sakshi
Sakshi News home page

కోర్టులో ఖైదీల మధ్య ఘర్షణ ఎపిసోడ్‌.. అండర్‌ ట్రయల్‌ ఖైదీ మృతి

Jun 5 2025 3:23 PM | Updated on Jun 5 2025 3:51 PM

One dead after fight between two groups breaks out in Delhi court l

ఢిల్లీ:  కోర్టు లాకప్‌లోఖైదీల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ అమన్‌ అనే అండర్‌ ట్రయల్‌ ఖైదీ మృతి చెందాడు. ఢిల్లీలోని సాకేత్‌ కోర్టులో అండర్‌ ట్రయల్‌ ఖైదీ అమన్‌ను విచారణ నిమిత్తం హాజరుపరిచిన క్రమంలో తోటి ఖైదీలు హత్యాయత్నం చేశారు.  

రిమాండ్‌లో ఉన్న ఇద్దరు ఖైదీలు.. ఆ అండర్‌ ట్రయల్‌ ఖైదీని గొంతుకోసి తీవ్రంగా గాయపరిచారు. అయితే ఆ ఖైదీ ఈరోజు(గురువారం) మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.  ఈ ముగ్గురు తొలుత తిహార్‌ జైలు 8వ నెంబర్‌ గదిలో ఉంచారు. అయితే వీరిని బుధవారం విచారణకు ఢిల్లీ సాకేత్‌ కోర్టుకు హాజరు పరిచిన క్రమంలో అండర్‌ ట్రయల్‌ ఖైదీపై మిగతా ఇద్దరు ఖైదీలు దాడికి యత్నించారు. 

ఈ క్రమంలోనే అమన్‌ అనే ఖైదీ  గొంతు కోశారు. దాంతో గాయపడిన అతన్ని దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించగా, ఈరోజు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. అదికారులు చెప్పిన దాని ప్రకారం  ఈ రెండు గ్రూపుల మధ్య కోర్టు లాకప్‌లోఏ తీవ్ర ఘర్షణ జరిగి అది ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసిందన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement