ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు బలైన భారతీయ విద్యార్థి..భూమి అమ్మి పైచదువులకు | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు బలైన భారతీయ విద్యార్థి..భూమి అమ్మి పైచదువులకు

Published Mon, May 6 2024 4:03 PM

Indian Student Stabbed To Death During Fight In Australia Claims Family


ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో భారతీయ విద్యార్థి హత్యకు గురయ్యాడు. హర్యానాలోని కర్నాల్‌కు చెందిన 22 ఏళ్ల భారతీయ విద్యార్థి నవజీత్ సంధుని  పలుమార్లు కత్తితో పొడిచి చంపిన ఘటన  విషాదాన్ని నింపింది. ఏడాదిన్నర క్రితం స్టడీ వీసాపై ఆస్ట్రేలియా వెళ్లి అక్కడ మెల్‌బోర్న్‌లో ఉంటున్నాడు. ఈ ఘటనపై మెల్‌బోర్న్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, హర్యానా, కర్నాల్‌లోని గగ్సినా గ్రామానికి చెందిన నవజీత్‌   స్టడీ వీసాపై ఎంటెక్‌ చదివేందుకు  ఆస్ట్రేలియా వెళ్లాడు. కర్నాల్‌,  బస్తాడా గ్రామానికి చెందిన మరో  ఇద్దరు యువకులు కూడా  మూడు నెలల  క్రితం  చదువు​కోసం ఆస్ట్రేలియాకు వెళ్లాడు. నవజీత్ స్నేహితుడు శ్రవణ్ మరో ఇద్దరితో  కలిసి ఒకే అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నాడు. ఇటీవల, శ్రవణ్ అక్కడి నుండి వేరే ప్రాంతానికి మారాలని నిర్ణయించు కున్నాడు. ఈ విషయంలో స్నేహితుల మధ్య వివాదం తలెత్తింది. ఈ క్రమంలో నవజీత్‌ కారులో సామాన్లు తరలించేందుకు ప్రయత్నిస్తుండగా నిందితులు మళ్లీ శ్రవణ్‌తో గొడవకు దిగారు.  వారిని నివారించినందుకు గాను నవజీత్‌పై కత్తితో దాడిచేశారు. ఛాతీపై తీవ్రమైన కత్తిపోటు గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనలో శ్రవణ్‌ కూడా గాయపడ్డాడు.

అయితే గొడవ పడవద్దు అన్నందుకే నవజీత్‌పై దాడి చేశారని బాధితురాలి మేనమామ, ఆర్మీ అధికారి యశ్వీర్ తెలిపారు. నవజీత్ తెలివైన విద్యార్థి  అనీ, సెలవుల కోసం జూలైలో ఇండియాకు రావాల్సి ఉందని తెలిపారు.  రైతు అయిన అతని తండ్రి, నవజీత్‌  చదువుకోసం ఒకటిన్నర ఎకరాల భూమిని  విక్రయించాడని ఆవేదన వ్యక్తం చేశారు.  మరోవైపు ఆస్ట్రేలియా నుంచి తమ కుమారుడి మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు సహకరించాలని మృతుడి కుటుంబం భారత ప్రభుత్వాన్ని వేడుకుంటోంది.

 

Advertisement
 
Advertisement