
అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వస్తోన్న చిత్రం పుష్ప-2 ది రూల్. ఈ మూవీ కోసం బన్నీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, ఫస్ట్ సింగిల్‌కు ఆడియన్స్ అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. పుష్ప పుష్ప అంటూ సాగే లిరికల్ సాంగ్ యూట్యూబ్‌ను షేక్ చేసింది. ముఖ్యంగా పుష్ప షూ స్టెప్‌కు ఫ్యాన్స్ ఫుల్ ఫిదా అయ్యారు.
తాజాగా పుష్ప టీమ్ నుంచి మరో అప్‌డేట్ వచ్చేసింది. బుధవారం ఉదయం 11:07 గంటలకు అప్‌డేట్ ఇవ్వనున్నట్లు చిత్రబృందం ట్వీట్ చేసింది. దీంతో పుష్ప-2 రెండో సింగిల్ రిలీజ్ ఉంటుందని తెలుస్తోంది. కాగా.. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాను ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు సుకుమార్ ఇప్పటికే ప్రకటించారు.
✌️🎵
Tomorrow 11:07 AM ❤️#Pushpa2TheRule 🎶— Mythri Movie Makers (@MythriOfficial) May 21, 2024