నాట్స్ ఆధ్వర్యంలో లైఫ్ స్టైల్ మేనేజ్‌మెంట్ వెబినార్ | Sakshi
Sakshi News home page

నాట్స్ ఆధ్వర్యంలో లైఫ్ స్టైల్ మేనేజ్‌మెంట్ వెబినార్

Published Mon, May 20 2024 5:40 PM

Lifestyle Management Webinar Held By NATS

అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా ఆన్‌లైన్ వేదికగా లైఫ్ స్టైల్ మేనేజ్‌మెంట్‌పై వెబినార్ నిర్వహించింది. జీవితాన్ని ఎలా అందంగా మలుచుకోవాలి..? మనం ఆలోచించే తీరు ఎలా ఉండాలి..? మానసిక ఆరోగ్యం ఎలా పెంపొందించుకోవాలి..? అనే అంశాలపై ఈ వెబినార్‌లో చర్చించారు. ప్రముఖ వైద్యురాలు మీనా చింతపల్లి ఈ వెబినార్‌లో మైండ్ మేనేజ్‌మెంట్‌కి సంబంధించిన అనేక కీలక అంశాలు వివరించారు. 

ముఖ్యంగా ఆటిజం బాధితుల పట్ల ఎలా వ్యవహరించాలి..? వారికి ఎలాంటి మానసిక మద్దతు అందించాలి..? చిన్నప్పటి నుంచి పిల్లల వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో ఎలా వ్యవహారించాలి అనే విషయాలపై విలువైన సూచనలు చేశారు. ఈ వెబినార్‌కి అనుసంధానకర్తగా వెంకట్ మంత్రి వ్యవహారించారు.  నాట్స్ మాజీ ఛైర్ పర్సన్ అరుణ గంటి ఈ కార్యక్రమ నిర్వహణలో కీలకపాత్ర పోషించారు.

 జీవితంలో ఒత్తిడులను అధిగమించడం.. మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడం కోసం విలువైన సూచనలు చేసిన మీనా చింతపల్లికి నాట్స్ ప్రెసిడెంట్ బాపయ్య చౌదరి(బాపు)నూతి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. లైఫ్ స్టైల్ మేనేజ్‌మెంట్ అనేది ప్రతి ఒక్కరికి అత్యంత కీలకమైన విషయమని దీనిపై అవగాహన కల్పించిన మీనా చింతపల్లికి నాట్స్ బోర్డు ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని కృతజ్ఞతలు తెలిపారు.

(చదవండి: నాట్స్ సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం!)

Advertisement
 
Advertisement
 
Advertisement