ఎన్నికలవేళ తీవ్ర ఒడుదొడుకుల్లో స్టాక్‌మార్కెట్లు.. కారణం.. | Sakshi
Sakshi News home page

ఎన్నికలవేళ తీవ్ర ఒడుదొడుకుల్లో స్టాక్‌మార్కెట్లు.. కారణం..

Published Wed, May 22 2024 9:44 AM

Traders in Indian stock markets are turning to illegal election betting platforms

సార్వత్రిక ఎన్నికల ప్రారంభానికి ముందు స్టాక్‌మార్కెట్లు రికార్డు గరిష్ఠాలను చేరాయి. కానీ క్రమంగా సెన్సెక్స్‌ అస్థిరంగా మారింది. ప్రస్తుత కాలంలో సూచీలు నిత్యం తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. ఈసారి ఎన్నికల్లో గతంలో కంటే తక్కువ ఓటింగ్ శాతం నమోదవడంతో కేంద్రంలో అధికారపార్టీ, ప్రతిపక్షపార్టీల గెలుపుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దాంతో స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోలను సర్దుబాటు చేస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. సమీప భవిష్యత్తులో ఏం జరుగుబోతుందో పరిశీలిస్తున్నారు.

ఎన్నికల అనిశ్చితి వల్ల గత రెండు వారాలుగా స్మాల్ అండ్‌ మిడ్‌క్యాప్ స్టాక్‌లు తీవ్ర ఒడుదొడుకులకు గురవుతున్నాయి. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఈక్విటీ మార్కెట్‌లో మరింత అనిశ్చితులు ఏర్పడతాయని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు వచ్చేముందు 3-4 ట్రేడింగ్‌ సెషన్లు, ఫలితాలు వచ్చాక 3-4 ట్రేడింగ్‌ సెషన్లు మార్కెట్‌లో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నాయి.

ఇదీ చదవండి: 100 నుంచి 75 వేల పాయింట్ల వరకు ప్రస్థానం

స్టాక్‌మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాలనుకునే చాలామంది తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనుకుంటారు. కొందరికైతే స్టాక్‌మార్కెట్‌ గ్యాంబ్లింగ్‌ అనే అభిప్రాయం ఉంది. స్పష్టమైన వైఖరి, భవిష్యత్తు ప్రణాళిక లేకుండా మార్కెట్‌లో తాత్కాలికంగా డబ్బు సంపాదించే వారికి ఇది గ్యాంబ్లింగ్‌గానే కనిపిస్తోంది. ఈజీ మనీకి అలవాటుపడి మార్కెట్‌లో కాకుండా బయట ఇతర అవకాశాలు ఉంటే వెంటనే ఆయా మార్గాల్లోకి డబ్బు మళ్లిస్తుంటారు. ఇటీవల జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గెలుపోటములపై ఇప్పటికే బెట్టింగ్‌ల పర్వం మొదలైంది. దాంతో మార్కెట్‌లో ఉన్న చాలామంది బెట్టింగ్‌వైపు మొగ్గు చూపుతున్నారు. జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపునకు ముందే ఎవరుగెలుస్తారనే అంచానాలతో షాడో బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌లను పరిశీలిస్తున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement