బెంగళూరు రేవ్ పార్టీ.. మరో వీడియో రిలీజ్! | Sakshi
Sakshi News home page

Hema: బెంగళూరు రేవ్ పార్టీ.. మరో వీడియో రిలీజ్‌ చేసిన హేమ!

Published Tue, May 21 2024 3:49 PM

Tollywood actress Hema Released Another Video In Social Media

బెంగళూరు రేవ్ పార్టీ టాలీవుడ్‌ను కుదిపేస్తోంది. ఈ పార్టీకి టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారంటూ వార్తలు రావడంతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది. దీంతో తాము పార్టీకి వెళ్లలేదంటూ నటి హేమ, హీరో శ్రీకాంత్‌ వీడియోలను రిలీజ్ చేశారు. తాము హైదరాబాద్‌లోనే ఉన్నామంటూ క్లారిటీ ఇచ్చారు. కన్నడ మీడియాలో, సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. అనవసరంగా తన పేరును లాగొద్దని విజ్ఞప్తి చేశారు.

అయితే ఇదిలా ఉండగా.. హేమ తాజాగా మరో వీడియోను రిలీజ్‌ చేశారు. తన ఇంట్లోనే బిర్యానీ వండుతున్న వీడియోను పంచుకున్నారు. దీంతో హేమ చేసిన వీడియో మరోసారి సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. తాను హైదరాబాద్‌లోనే ఉన్నానని చెప్పేందుకు బిర్యానీ రెసీపీ చేస్తున్న వీడియోను రిలీజ్ చేసినట్లు తెలుస్తోంది. 

అసలేం జరిగిందంటే..

బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ‌ సమీపంలో ఆదివారం అర్ధరాత్రి రేవ్‌ పార్టీ జరిగింది. ‌బర్త్‌డే పార్టీ పేరుతో జీఆర్‌ ఫామ్‌హౌస్‌లో జరిగిన ఈ రేవ్‌ పార్టీపై పోలీసులు పక్కా సమాచారంతో దాడి చేశారు. ఈ పార్టీలో పెద్ద ఎత్తున డ్రగ్స్‌, కొకైన్‌ స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఈ పార్టీని ఏర్పాటు చేసినట్లు బెంగళూరు పోలీసులు వెల్లడించారు. ఈ రేవ్‌ పార్టీలో టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ సెలబ్రిటీలు సైతం ఉన్నట్లు పెద్దఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. 

Advertisement
 
Advertisement
 
Advertisement