ఓట్ల కోసమే సాధువులపై దాడి: ప్రధాని మోదీ | Sakshi
Sakshi News home page

ఓట్ల కోసమే.. సాధువులను మమత బెదిరిస్తున్నారు: ప్రధాని

Published Mon, May 20 2024 6:36 PM

Pm Modi Sensational Comments On Tmc

కోల్‌కతా: బుజ్జగింపు రాజకీయాల కోసమే పశ్చిమబెంగాల్‌ తృణమూల్‌ (టీఎంసీ) గూండాలు సాధువులపై దాడులు చేస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు. సోమవారం(మే20) పశ్చిమ బెంగాల్‌లోని జార్‌గ్రామ్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడారు.

‘టీఎంసీ గూండాలు  రామకృష్ణ మిషన్‌పై దాడి చేశారు. ఇది చేసింది తామేనని టీఎంసీ ప్రకటించడం సిగ్గుచేటు. సీఎం రామకృష్ణ మిషన్‌, భారత్‌ సేవాశ్రమ్‌ మఠాల సాధువులను బెదిరిస్తున్నారు. ఆదివారం రాత్రి జల్పాయ్‌గురిలోని రామకృష్ణ మిషన్‌పై దాడి చేశారు.

ఇలాంటి వాటిని బెంగాల్‌ ప్రజలు సహించరు. ఇస్కాన్‌, రామకృష్ణ మిషన్‌, భారత్‌ సేవాశ్రమ్‌ సంఘ్‌ సంస్థలు సేవ, విలువలకు నిదర్శనం, కానీ సీఎం మమతా బెనర్జీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం బహిరంగంగా వారిని బెదిరిస్తున్నారు’అని మోదీ మండిపడ్డారు.

కాగా, ఓ ఎన్నికల ప్రచార ర్యాలీలో మాట్లాడుతూ రామకృష్ణ మిషన్‌, భారత్‌ సేవాశ్రమ్‌ సంస్థలకు చెందిన సాధువులు బీజేపీ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తున్నారని మమతా బెనర్జీ విమర్శించారు. అయితే మమత వ్యాఖ్యలను రెండు సంస్థలకు చెందిన సాధువులు ఖండించారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement