క్యార్‌వ్యాన్‌లోకి వచ్చి అతడలా చేసేసరికి భయపడ్డా: కాజల్ అగర్వాల్ | Sakshi
Sakshi News home page

Kajal Aggarwal: భయానక అనుభవాన్ని బయటపెట్టిన హీరోయిన్ కాజల్

Published Tue, May 21 2024 7:21 PM

Kajal Aggarwal Shocking Incident Craziest Fan Latest

సినిమా హీరోయిన్లకు అప్పుడప్పుడు చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. అభిమానం పేరు చెప్పి ఎలా పడితే అలా ప్రవర్తించి ఇబ్బంది పెడుతుంటారు. స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇలాంటి అనుభవాల్ని చాలాసార్లు ఎదుర్కొంది. కొన్ని నెలల క్రితం జ్యూవెల్లరీ షాప్ ప్రారంభోత్సవానికి వస్తే ఏకంగా మీదమీదకొచ్చేశాడు. అయితే గతంలో షూటింగ్ సందర్భంగా ఓ వ్యక్తి వల్ల చాలా భయపడ్డానని కాజల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పుకొచ్చింది.

(ఇదీ చదవండి: రెండు ఓటీటీల్లో 'కల్కి'.. ఏకంగా అన్ని కోట్లకు అమ్మేశారా?)

'కొన్నిరోజుల క్రితం ఓ సినిమా షూటింగ్‌లో ఉన్నాను. మొదటి రోజు పూర్తయ్యాక ఆ మూవీ అసిస్టెంట్ దర్శకుడు.. పర్మిషన్ లేకుండా నా క్యార్‌వ్యాన్‌లోకి వచ్చేశాడు. సడన్‌గా తన షర్ట్ తీసేసి ఛాతీపై నా పేరుతో ఉన్న పచ్చబొట్టుని చూపించాడు. ఎవరు లేని టైంలో అతడు అలా చేసేసరికి నేను చాలా భయపడ్డాను. నాపై అభిమానాన్ని టాటూ రూపంలో చూపించినందుకు సంతోషమే. కానీ ఇలా చేయడం మాత్రం కరెక్ట్ కాదని స్మూత్‌గా వార్నింగ్ ఇచ్చాను' అని కాజల్ తనకెదురైన భయానక అనుభవాన్ని బయటపెట్టింది.

'సత్యభామ' అనే మూవీతో త్వరలో థియేటర్లలోకి రాబోతున్న కాజల్.. మరోవైపు ఫ్యామిలీ లైఫ్ కూడా ఎంజాయ్ చేస్తోంది. పెళ్లి వల్ల సినిమాలకు కాస్త గ్యాప్ తీసుకుంది. కానీ ఇప్పుడు రెండింటిని బ్యాలెన్స్ చేస్తోంది. అయితే ఈమె చేతిలో ప్రస్తుతానికి స్టార్ హీరోల సినిమాలైతే ఏం లేవు.

(ఇదీ చదవండి: Allu Arjun: ఊహించని ప్లేసులో కనిపించిన అల్లు అర్జున్.. ఫొటో వైరల్)

Advertisement
 
Advertisement
 
Advertisement