రెండు ఓటీటీల్లో 'కల్కి'.. ఏకంగా అన్ని కోట్లకు అమ్మేశారా? | Prabhas Kalki 2898 AD Movie Hindi And Southern Languages OTT Rights Sold For Whopping Price, Deets Inside | Sakshi
Sakshi News home page

Prabhs Kalki OTT Rights: షాకిస్తున్న 'కల్కి' ఓటీటీ డీల్.. ఎంతో తెలుసా?

Published Tue, May 21 2024 2:26 PM

Prabhas Kalki 2898 AD Movie OTT Sale Details Latest

ప్రభాస్ 'కల్కి' కోసం తెలుగు ప్రేక్షకులు వెయిటింగ్. ఎందుకంటే సంక్రాంతి తర్వాత సరైన మూవీ థియేటర్లలోకి రాలేదు. అలా వేసవి అంతా వృథా అయిపోయింది. దీంతో ఆడియెన్స్‌ని 'కల్కి'.. మళ్లీ థియేటర్లలోకి రప్పిస్తుందని అందరూ అనుకుంటున్నారు. విడుదలకు దాదాపు మరో నెలరోజులు మాత్రమే ఉండటంతో ప్రమోషన్స్ ఆ‍ల్రెడీ మొదలుపెట్టేశారు. తాజాగా ఓటీటీ డీల్ కూడా పూర్తయిపోయినట్లు తెలుస్తోంది.

'బాహుబలి' తర్వాత ప్రభాస్ ఒప్పుకొన్న పాన్ ఇండియా సినిమాల్లో 'కల్కి' ఒకటి. 'మహానటి'తో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న డైరెక్టర్ నాగ్ అశ్విన్.. దాదాపు ఐదారేళ్ల నుంచి ఈ ప్రాజెక్ట్ మీదే ఉన్నాడు. అలా విడుదలకు సిద్ధం చేశారు. జూన్ 27న గ్రాండ్‌గా వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. అయితే మూవీని రెండు ఓటీటీలకు అమ్మేశారట.

(ఇదీ చదవండి: Allu Arjun: ఊహించని ప్లేసులో కనిపించిన అల్లు అర్జున్.. ఫొటో వైరల్)

హిందీ వెర్షన్‌ హక్కుల్ని దాదాపు రూ.200 కోట్లకు నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుందని, అలానే దక్షిణాది భాషలకు కలిపి రూ.175 కోట్లకు అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుందని తెలుస్తోంది. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం రికార్డ్ ఓటీటీ డీల్ 'కల్కి'దే అని చెప్పొచ్చు.

ఇకపోతే 'కల్కి'లో ప్రభాస్‌తో పాటు దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ లాంటి భారీ తారాగణం ఉంది. అలానే దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ లాంటి స్టార్స్ కూడా ఉన్నారని టాక్ నడుస్తోంది. వైజయంతీ మూవీస్ దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్ పెట్టి నిర్మించినట్లు తెలుస్తోంది.

(ఇదీ చదవండి: 'ఫ్యామిలీస్టార్‌'ను వాళ్లు కావాలనే టార్గెట్‌ చేశారు: ఆనంద్‌ దేవరకొండ)

Advertisement
 
Advertisement
 
Advertisement