breaking news
-
భార్యకు నిప్పంటించి.. కూతురిని ఆ మంటల్లో తోసేసి..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని నల్లకుంట పరిధిలో దారుణ ఘటన వెలుగుచూసింది. భార్యపై అనుమానంతో పెట్రోల్ పోసి ఆమెకు నిప్పంటించాడు. ఈ క్రమంలో అడ్డు వచ్చిన తన బిడ్డను కూడా మంటల్లో తోసే ప్రయత్నం చేయగా.. అతి కష్టం మీద ఆమె బయట పడింది. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి.వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా చెందిన వెంకటేశ్, త్రివేణి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అనంతరం, ఉద్యోగ రీత్యా వీరిద్దరూ హైదరాబాద్‌కు వచ్చారు. నల్లకుంట వద్ద ఉన్న తిలక్‌నగర్ బస్తీలో రెంటుకు ఉంటున్నారు. వీరికి ఒక పాప, ఒక బాబు ఉన్నారు. వెంకటేశ్ సెంట్రింగ్ పనిచేస్తుండగా.. త్రివేణి ఒక హోటల్లో పనిచేస్తుంది. అయితే, త్రివేణి హోటల్ నుంచి ఇంటికి ఏ కొంచెం ఆలస్యంగా ఇంటికి వచ్చినా ఆమెను అనుమానంతో వెంకటేశ్ వేధించేవాడు. భర్త వేధింపులు తాళలేక కొద్దిరోజుల క్రితం త్రివేణి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో తాను మారతానని నమ్మబలికి త్రివేణిని వెంకటేశ్ హైదరాబాద్ తీసుకొచ్చాడు. తీరా.. హైదరాబాద్ వచ్చిన తర్వాత వెంకటేశ్ మళ్లీ మొదటికొచ్చాడు. ఇద్దరి మధ్య కలహాలు పెరగడంతో ఆగ్రహానికి లోనైన వెంకటేశ్.. త్రివేణిని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. మంగళవారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో భార్య త్రివేణి, కొడుకు ఇద్దరు ఒకే మంచంపై నిద్రపోతుండగా.. కూతురు కింద పడుకుని ఉంది. ఆ సమయంలో మంచంపై నిద్రపోతున్న భార్య త్రివేణిపై పెట్రోల్ పోసి నిప్పటించాడు. ఇంతలో వెంకటేశ్‌ను కూతురు అడ్డుకునే ప్రయత్నం చేయగా.. ఆమెకు కూడా మంటల్లోకి తీసే ప్రయత్నం చేశాడు. వెంకటేశ్ అక్కడి నుంచి పరారీ అయ్యాడు. ఎలాగోలా పాప తప్పించుకుంది. ఈ ఘటనలో పరారీలో ఉన్న నిందితుడు వెంకటేష్‌ను పోలీసులు గంటల వ్యవధిలోనే అరెస్ట్ చేయగలిగారు. కాగా, పాప ఇంట్లో నుంచి బయటకు పరిగెత్తుకుంటూ వచ్చి చుట్టుపక్కల వాళ్లు చెప్పడంతో మంటలను ఆర్పే ప్రయత్నం చేయగా.. త్రివేణి అప్పటికే చనిపోయింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని త్రివేణి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి అప్పలయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్, మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా నిందితుడి కదలికలను ట్రాక్ చేసి అరెస్టు చేశారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. -
రెండు కుటుంబాల్లో అలుముకున్న చీకట్లు
ఆ రెండు కుటుంబాల్లో ఒకేసారి చీకట్లు అలుముకున్నాయి. రోడ్డు ప్రమాదం.. వాళ్ల ఏకైక బిడ్డలను బలిగింది. బాల్యమిత్రులైన ఇద్దరు స్నేహితుల జీవిత ప్రయాణం అనూహ్యంగా.. అర్ధాంతరంగా ముగిసిపోయింది. సాక్షి, కామారెడ్డి: మాచారెడ్డి మండలం లచ్చాపేట గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. జక్కుల సాయికిషోర్(21), మిరిదొడ్డి అజయ్(21) అనే స్నేహితులు గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించారు. మరణించిన వారు తమ కుటుంబాలకు ఏకైక కుమారులే. యువకుల తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారి మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మాచారెడ్డి చౌరస్తా నుంచి లచ్చాపేటకు ద్విచక్రవాహనంపై వెళ్తున్న వీరిద్దరూ శివారులో రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఢీకొన్నారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ స్థానికులు కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం కొంపల్లిలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మొదట సాయికిషోర్, తర్వాత కొంతసేపటికి అజయ్ మరణించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై అనిల్ తెలిపారు. బాధితుల్లో ఒకరి కాలి ఎముక.. ఆ లారీ చక్రానికి తగిలి టైరు పంక్చర్ అయ్యిందంటే.. ప్రమాద తీవ్రతను అర్థం చేసుకోవచ్చు!. అందుకే అతివేగం అత్యంత ప్రమాదం అని చెప్పేది. -
మావోయిస్టు అగ్రనేత గణేశ్ ఎన్కౌంటర్
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/సాక్షి ప్రతినిధి, నల్లగొండ : వరుస ఎన్కౌంటర్లు..లొంగుబాట్లతో వెనక్కి తగ్గిన మావోయిస్టుల సాయుధ పోరాటానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఒడిశాలోని కందమాల్ జిల్లాలో గురువారం చోటు చేసుకున్న ఎదురుకాల్పుల్లో ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు పాక హన్మంతు అలియాస్ గణేశ్ ఉయికే (69) మరణించారు. నల్లగొండ జిల్లాచండూరు మండలం పుల్లెంల ఆయన స్వగ్రామం. ఎస్ఓజీ ఆపరేషన్‌లో..: ఆపరేషన్ కగార్తో మావోయిస్టుల సాయుధ పోరాటంపై నిర్బంధం పెరిగింది. దీంతో పదిమంది లోపు సభ్యులతోనే దళాలు సంచరిస్తున్నాయి. ఈ క్రమంలో ఒడిశాలోని గంజాం–కందమాల్ జిల్లాల సరిహద్దులో చకపాద పోలీస్‌స్టేషన్ పరిధిలో రంభా అడవుల్లో కీలక మావోయిస్టు నేత ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఒడిశాలో యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ చేపట్టే స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (ఎస్ఓజీ), సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ జవాన్లతో కూడిన 23 మంది సభ్యుల జాయింట్ టాస్‌్కఫోర్స్ బృందం ఈ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టింది. గురువారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఇరువర్గాలు ఎదురుపడటంతో కాల్పులు చోటుచేసుకున్నాయి. అర్ధగంట పాటు పలుమార్లు కాల్పులు కొనసాగాయి. ఆ తర్వాత ఘటనా స్థలిలో నలుగురు మావోయిస్టుల మృతదేహాలతోపాటు ఏకే 47, రెండు ఇన్సాస్లు, 303 తుపాకీని పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. మూడు రోజుల ఉత్కంఠ ఒడిశా కేడర్‌కు చెందిన 22 మంది మావోయిస్టులు ఈ నెల 23న మల్కన్‌గిరిలో ఆయుధాలతో సహా లొంగిపోయారు. ఆ మరుసటి రోజు కందమాల్ జిల్లాలో గుమ్మ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టులు రాకేశ్, అమృత్ చనిపోయారు. వీరిలో ఒకరు పార్టీ సరఫరా వ్యవస్థలో కీలకమైన వ్యక్తిగా తెలుస్తోంది. ఈ ఎన్కౌంటర్లో లభించిన వివరాల ఆధారంగా సమీప అడవుల్లో గురువారం గాలింపు చర్యలు చేపట్టగా, మరో నలుగురు మావోలు మృత్యువాత పడ్డారు. అందులో ఒక మహిళా మావోయిస్టుతోపాటు గణేశ్ ఉయికే కూడా ఉన్నారు.44 ఏళ్ల పాటుఅజ్ఞాత జీవితం రాజేశ్ తివారీ, చమ్రుదాదా, రూపా అనే ఇతర పేర్లతోనూ అజ్ఞాతంలో గణేశ్ పనిచేశారు. వివిధ రాష్ట్రాల్లో కలిపి మొత్తం రూ.1.20 కోట్ల రివార్డు ఆయనపై ఉంది. రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ ద్వారా ఆయుధం పట్టిన గణేశ్ దాదాపు 44 ఏళ్ల పాటు అజ్ఞాత జీవితం గడిపారు. ఒడిశాతోపాటు కేకేటీ (కేరళ, కర్ణాటక, తమిళనాడు), ఎంఎంసీ (మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్), దండకారణ్యం జోన్లలో ఆ పార్టీ విస్తరణకు ఆయన కృషి చేశారు.జగదల్పూర్లో మొట్టమొదట ఆర్గనైజర్‌గా పనిచేశారు. 1990లో సౌత్ బస్తర్ జిల్లా కమిటీ సభ్యునిగా ఫీల్డ్ వర్క్ చేశారు. ఆ తర్వాత వెస్ట్ బస్తర్ డివిజనల్ కమిటీ కార్యదర్శిగా (డీసీఎస్) 2003 వరకు పనిచేశారు. ఆపై పార్టీ ఆయన్ను దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలోకి (ఎస్జెడ్సీ) తీసుకుంది. తర్వాత సౌత్ జోన్ బ్యూరోకు (రీజినల్ కమిటీ) ఇన్చార్జ్ అయ్యారు. 2017లో కేంద్ర కమిటీలోకి వచ్చారు. దక్షిణ బస్తర్ ప్రాంతంలో గోండు భాషలో(దేవనగరి లిపి) ఆయన పలు పత్రికలు నడపడంలో క్రియాశీలక పాత్ర పోషించారు. గిరిజనులకు అర్థమయ్యేలా జిల్లా స్థాయి, ప్రాంతీయ స్థాయిలో ఆ పత్రికలను నిర్వహించారు. తద్వారా గిరిజనులను ఉద్యమంవైపు నడిపించడంలో కీలకంగా వ్యవహరించారు. ఆయన ఉద్యమ ప్రస్థానం అంతా దండకారణ్యం కేంద్రంగానే కొనసాగింది.పార్టీలోనే ఆయన హుస్నాబాద్‌కు చెందిన శారదను వివాహం చేసుకున్నారు. ఆమెకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో పార్టీని వీడి 2007లో బయటకు వచ్చారు. ఆ తరువాత హన్మంతు మళ్లీ పెళ్లి చేసుకోలేదు. ఒడిశాలో పార్టీ ఖతం? కరోనా తర్వాత మావోయిస్టు పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఒడిశాలోని ఏవోబీతోపాటు కందమాల్, కలహంది, కోరాపూట్, గంజాం జిల్లాల్లో మావోయిస్టులకు పట్టుంది. ఈ ఏడాది జూన్‌లో జరిగిన ఎన్కౌంటర్లో ఏవోబీ బాధ్యతలు చూస్తున్న ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవితోపాటు మరో కీలక నేత చైతో మరణించారు. తాజాగా కేంద్ర కమిటీ సభ్యుడిగా ఒడిశా బాధ్యతలు చూస్తున్న గణేశ్ ఎన్కౌంటర్లో చనిపోయాడు. ‘గణేశ్ మరణంతో ఒడిశాలో మావోయిస్టు పార్టీ వెన్ను విరిగింది. ఇక్కడితో మా రాష్ట్రంలో మావోయిస్టుల కార్యకలాపాలు దాదాపుగా ఆగిపోయినట్టే’అని ఆ రాష్ట్ర డీజీపీ యోగేశ్ బహదూర్ ఖురానీయా గురువారం మీడియాతో అన్నారు. ‘మావోయిస్టు రహిత రాష్ట్రంగా మారేందుకు అడుగు దూరంలో ఒడిశా నిలిచింది. 2026 మార్చి 31 కల్లా దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తాం’అని ఎక్స్ వేదికగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పేర్కొన్నారు. ఆర్ఎస్యూ నుంచి.. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు పాక హన్మంతు అలియాస్ గణేశ్‌ది వ్యవసాయ కుటుంబ నేపథ్యమే. ఆయనకు ఇద్దరు తమ్ముళ్లు, ముగ్గురు చెల్లెళ్లు ఉన్నారు. 1961లో జని్మంచిన హన్మంతు 7వ తరగతి వరకు స్వగ్రామమైన పుల్లెంలలో చదువుకున్నాడు. చండూరులో పదో తరగతి వరకు, ఇంటర్ నల్లగొండలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదివారు. ఆ తర్వాత నల్లగొండలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో బీఎస్సీలో చేరారు. 1983లో డిగ్రీ చదువుతున్న సమయంలోనే హన్మంతు మావోయిస్టు పార్టీ పట్ల ఆకర్షితుడయ్యారు. రాడికల్ స్టూడెంట్ యూనియన్‌లో (ఆర్ఎస్యూ) పనిచేశారు. డిగ్రీ చదువును మధ్యలోనే వదిలేని అజ్ఞాతంలోకి వెళ్లారు. నల్లగొండ ఏబీవీపీ నేత ఏచూరి శ్రీనివాస్ హత్య కేసులోనూ హన్మంతు నిందితుడిగా ఉన్నాడు. డిగ్రీ చదివే సమయంలో ఆర్ఎస్యూ అధ్యక్షుడిగా వ్యవహరించిన హన్మంతు మావోయిస్టు పార్టీలో చేరి కేంద్ర కమిటీ సభ్యునిగా ఎదిగారు. తల్లిదండ్రులు చనిపోయినప్పుడు... విద్యార్థి దశ నుంచే మావోయిస్టు పార్టీలోకి వెళ్లిన హన్మంతు ఆ తర్వాత ఇంటికి వచ్చింది లేదు. తల్లిదండ్రులు ఏళ్ల తరబడి ఎదురుచూసినా ఒక్కసారి కూడా రాలేదని గ్రామస్తులు చెప్పారు. నాలుగేళ్ల కిందట ఆయన తండ్రి చంద్రయ్య, రెండేళ్ల కిందట తల్లి ఎట్టెమ్మ మృతి చెందారు. అయినా హన్మంతు వారిని చివరిసారిగా చూసేందుకు కూడా రాలేదు. కుటుంబ సభ్యులకు హన్మంతు ఎక్కడ ఉన్నది తెలియదు. హన్మంతు మృతదేహాన్ని కుటుంబ సభ్యులు తీసుకొచ్చుకునేందుకు సుముఖత వ్యక్తం చేసినట్టు పోలీసులు తెలిపారు. వారు శుక్రవారం ఒడిశాకు బయలుదేరే అవకాశముంది. మా అన్న ఎలా ఉంటాడో కూడా తెలియదు మా అన్న నా చిన్నతనంలోనే ఉద్యమంలోకి పోయాడు. చిన్నప్పుడు చూశాం. ఆ తర్వాత ఎక్కడకు పోయిండు. ఎక్కడ ఉంటుండు అనేది మా కుటుంబానికి తెలియదు. మా అన్న వస్తాడని అమ్మానాన్న ఎంతో కాలం ఎదురు చూశారు. కానీ, వారు చనిపోయినప్పుడు కూడా రాలేదు. పోలీసుల ఎన్కౌంటర్లో హన్మంతు మృతి చెందాడనే విషయం నాకు తెలియదు. – హన్మంతు పెద్ద తమ్ముడు అశోక్మావోయిస్టు కేంద్ర కమిటీ ఖాళీ !ఆ సభ్యులే లక్ష్యంగాకగార్ ఆపరేషన్లు ఈ ఏడాది 11 మంది ఎన్కౌంటర్, ఐదుగురు సరెండర్ ప్రస్తుతం నామ్ కే వాస్తేగా మారిన కేంద్ర కమిటీ ? సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: సాయుధ విప్లవ పోరాట పంథాను అనుసరించే పీపుల్స్‌వార్, మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ (ఎంసీసీ) పార్టీలు విలీనమై 2004లో భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) ఏర్పాటైంది. ఆరంభంలో ఆ పార్టీ థింక్‌ట్యాంక్, పెద్దతలగా పేర్కొనే సెంట్రల్ కమిటీలో మొత్తం సభ్యుల సంఖ్య 42గా ఉండేది. అయితే ఆపరేషన్ కగార్ మొదలైన తర్వాత ఆ పార్టీ థింక్ ట్యాంక్ ఖాళీ అయ్యే పరిస్థితి ఎదురైంది. యాక్టివ్‌గా ఉంది నలుగురే.. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. ఆ పార్టీ కేంద్ర కమిటీలో కేవలం ఆరుగురే మిగిలి ఉన్నారు. అందులో ముప్పాళ్ల లక్ష్మణరావు, తిప్పిరి తిరుపతి, మిసిర్ బెహ్రా పొలిట్‌బ్యూరో సభ్యులుగా ఉన్నారు. వీరే కాకుండా పసునూరి నరహరి, మల్లా రాజిరెడ్డి వంటి తెలంగాణ నేతలతోపాటు జార్ఖండ్‌కు చెందిన తుపాన్దా అలియాస్ అనల్‌దా సెంట్రల్ కమిటీలో ఉన్నారు. ఇందులోనూ ముప్పాళ్ల లక్ష్మణరావు, మల్లా రాజిరెడ్డి వయోభారంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు సమాచారం. వీరిద్దరినీ మినహాయిస్తే కేంద్ర కమిటీలో నలుగురు నేతలే ఉన్నట్టుగా పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇందులో ఇద్దరు పొలిట్‌బ్యూరోలో, మరో ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్నారు. లొంగుబాట్లు.. పోతుల సుజాత అలియాస్ కల్పన, పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న పార్టీకి ఆయుధాలు అప్పగించి లొంగిపోయారు. ఇలా కాకుండా ఆయుధాలు, తమ వెంట ఉన్న కేడర్‌తో లొంగిపోయిన మావోయిస్టుల్లో మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను, తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్నతోపాటు రామ్‌ధేర్ ఉన్నారు. అంతకుముందు అనారోగ్య కారణాలతో మరణించిన కేంద్ర కమిటీ సభ్యుల్లో రావుల శ్రీనివాస్, హరిభూషణ్æ, అక్కిరాజు హరగోపాల్, కటకం సుదర్శన్ ఉన్నారు. కగార్తో నష్టాలు.. ఆపరేషన్ కగార్‌ను 2024 జనవరి 1న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ క్రమంలో 2024 ఆగస్టులో చివరిసారిగా కేంద్ర కమిటీ సమావేశమైంది. ఇందులో మడ్వి ఇడుమా (హిడ్మా)తో పాటు తక్కళ్లపల్లి వాసుదేవరావును కేంద్ర కమిటీలోకి తీసుకున్నారు. ఆ తర్వాత దాడుల ఉధృతి పెరిగింది. సెపె్టంబర్ 4న ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్‌మాడ్‌లో జరిగిన ఎన్కౌంటర్లో 38 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈరోజు వరకు ఇదే అతి పెద్ద ఎన్కౌంటర్. ఇందులో ఇడుమా (హిడ్మా) స్థాయి కలిగిన ఆదివాసీ మహిళా మావోయిస్టు నీతి అలియాస్ ఊర్మిళ చనిపోయింది. అప్పటి నుంచి మావోయిస్టు కేంద్ర కమిటీ సమావేశం కావడం వీలు కాలేదు. 2025 ఏప్రిల్‌లో శాంతి చర్చల ప్రతిపాదన దశలోనూ కేంద్ర కమిటీ సమావేశం అయ్యేందుకు అవకాశం కల్పించాలని మావోయిస్టులు డిమాండ్ చేసినా కేంద్రం అంగీకరించలేదు. విస్తరణ కష్టమే..: ఆ పార్టీకి చెందిన వేర్వేరు రాష్ట్ర కమిటీల్లో కీలక నేతలు ఉన్నారు. అయితే, తీవ్ర నిర్బంధం మధ్య కొత్త వారిని కేంద్ర కమిటీలోకి ప్రమోట్ చేయడానికి కనీసం మావోయిస్టులు సమావేశమై, చర్చించు కునే పరిస్థితులు లేవు. దీంతో కేంద్ర కమిటీని విస్తరించడమనేది ఆ పార్టీకి కలగా మారింది. చివరకు ఆ పార్టీ చీఫ్‌గా తిప్పిరి తిరుపతిని ఎన్నుకున్నామని కొందరు చెప్పగా.. అలాంటిదేమీ లేదని మరికొందరు మావోయిస్టులు అంటున్నారు. -
పురుగుల మందు తాగించి, గొంతు నులిమి..
సైదాపూర్: ఓ పెళ్లయిన యువకుడు తమ కూతురు వెంటపడుతున్నాడని... ఎక్కడ అతడితో ప్రేమలో పడితే కుటుంబ పరువు పోతుందని భావించిన తల్లిదండ్రులు తమ పేగుబంధాన్ని తుంచుకున్నారు. కూతురుకు బలవంతంగా పురుగుల మందు తాగించి, చావకపోవడంతో గొంతు నులిమి చంపేశారు. మొదట ఆత్మహత్యగా చిత్రీకరించగా.. పోలీసుల విచారణలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన గత నెల 14న కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం శివరాంపల్లిలో చోటు చేసుకుంది. గురువారం హుజూరాబాద్ ఏసీపీ మాధవి నిందితులను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. ఏసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. సైదాపూర్ మండలం సర్వాయిపేట గ్రామ పంచాయతీ పరిధిలోని శివరాంపల్లి గ్రామానికి చెందిన రెడ్డి రాజు, లావణ్య దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఓ కొడుకు ఉన్నారు. పెద్ద కూతురు డిగ్రీ చదువుతోంది. చిన్న కూతురు(16) మండలంలోని ఓ ఆదర్శ పాఠశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. బాలికను అదే గ్రామానికి చెందిన పోలు అనిల్(27) కొంతకాలంగా ప్రేమపేరిట వేధిస్తున్నాడు. అనిల్‌కు అప్పటికే వివాహమైందని, అతనితో మాట్లాడొద్దని తన కూతురును రాజు పలుమార్లు మందలించాడు. అయినప్పటికీ ఆ యువకుడు తరచూ ఇంటికి వస్తూ, బాలికతో మాట్లాడుతుండడంతో తల్లిదండ్రులు ఆవేశానికి గురయ్యారు. చిన్న కూతురు వ్యవహారంతో తమ పరువుపోతోందని భావించారు.ఈ క్రమంలోనే కూతురును చంపాలని నిర్ణయించుకున్నారు. విష పురుగు కుట్టిందని.. ఆత్మహత్య చేసుకుందని..నవంబర్ 14న రాత్రి కుటుంబసభ్యులందరూ భోజనం చేసి నిద్రపోయారు. రాజు, లావణ్య బాలికను వేరే గదిలోకి తీసుకెళ్లారు. మొదట బలవంతంగా పురుగుల మందు నోట్లో పోశారు. చావకపోవడంతో రాజు తన కూతురు గొంతు నులిమి చంపేశాడు. మరునాడు ఉదయం 4గంటలకు కూతురు నిద్ర లేవడం లేదని, నోట్లోంచి నురగలు వచ్చాయని, ఏదైనా విషపురుగు కుట్టవచ్చని తండ్రి గ్రామస్తులకు చెప్పుకుంటూ రోదించాడు. తన కూతురు థైరాయిడ్, ఇతర అనారోగ్య కారణాలతో బాధపడుతోందని, పురుగుల మందు తాగి చనిపోయి ఉంటుందని నవంబర్ 15న పోలీసుస్టేషన్‌కు వెళ్లి పిటిషన్ ఇచ్చాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కేసు అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. బాలికను అదే గ్రామానికి చెందిన అనిల్ ప్రేమపేరుతో వేధించాడని, ఈ విషయమై బాలిక ఇంట్లో గొడవలు జరిగినట్లు తెలుసుకున్నారు. దీంతో రాజు, లావణ్యను పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. పెళ్లయిన వ్యక్తికి తమ కూతురు దగ్గరైతే.. తమ పరువు పోతుందని భావించి, తామే తమ కూతురును చంపేశామని ఒప్పుకున్నారు. దీంతో నిందితులను అరెస్టు చేసి, రిమాండ్ చేశామని ఏసీపీ తెలిపారు. ప్రేమ వ్యవహారాల్లో కన్న పిల్లలను చంపుకోవద్దని, ఆడ పిల్లలను ఎవరైనా వేధిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేస్తాయని అన్నారు. ఈ సమావేశంలో హుజూరాబాద్ రూరల్ సీఐ పులి వెంకట్, ఎస్ఐ తిరుపతి, ఏఎస్ఐ తిరుపతి పాల్గొన్నారు. -
Miyapur: భార్యను పిడిగుద్దులతో చంపిన భర్త
హైదరాబాద్: కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త కొట్టడంతో భార్య మృతి చెందిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ వెంకటేశ్వర్లు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ప్రకాశం జిల్లాకు చెందిన రారాజు, విజయలక్ష్మిదంపతులు నగరానికి వచ్చి గోకుల్ ప్లాట్స్‌లో ఉంటున్నారు. రారాజు స్థానికంగా ఇసుక, ఇటుక వ్యాపారం చేస్తున్నాడు. గత కొంతకాలంగా రారాజు మద్యానికి బానిస కావడంతో వారి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం మధ్యాహ్నం వారి మధ్య గొడవ జరిగింది. దీంతో ఆగ్రహానికి లోనైన రారాజు భార్య విజయలక్ష్మి మొఖంపై రారాజు బలంగా కొట్టాడు. దీంతో ఆమె అపస్మారక స్థితికి చేరుకుంది. సమీపంలోని ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మియాపూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు. -
పెన్సిల్ గుచ్చుకుని.. బాలుడి మృతి?
కూసుమంచి: ప్రమాదవశాత్తు కిందపడ్డ బాలుడి చేతిలోని పనునైన పెన్సిల్ గొంతు కిందభాగంలో దిగడంతో మృత్యువాతపడ్డాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్‌గూడెంకు చెందిన మేడవరపు ఉపేంద్రాచారి – మౌనిక దంపతులకు కుమారుడు విహార్ (8), కుమార్తె వర్షిత సంతానం. విహార్ స్థానిక ప్రైవేట్ పాఠశాలలో యూకేజీ, వర్షిత ఎల్కేజీ చదువుతున్నారు. రోజులాగే బుధవారం ఉదయం పిల్లలిద్దరూ బస్సులో పాఠశాలకు వెళ్లారు. మధ్యాహ్నం మూత్రవిసర్జన కోసం విహార్ మిగతా విద్యార్థులతో కలిసి వెళ్లాడు. ఆ తర్వాత పాఠశాల మైదానంలో పరుగెత్తుకుని వస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. అయితే బాలుడి చేతిలో పదునుగా చెక్కిన పెన్సిల్ ఉండటంతో బోల్తా పడగానే బాలుడి గొంతు కిందిభాగంలో అది దిగబడింది. దీంతో తీవ్ర రక్తస్రావం అవుతుండటంతో విద్యార్థులు పైకి లేపి ఉపాధ్యాయులకు తెలిపారు. కరస్పాండెంట్ నాగార్జున, ఉపాధ్యాయులు వచ్చి బాలుడిని తొలుత స్థానిక ఆర్ఎంపీ వద్దకు, అక్కడి నుంచి అంబులెన్స్‌లో ఖమ్మం తరలించే క్రమంలో ఊపిరి వదిలాడు. కాగా, ఉదయం ఆనందంగా ఇంటి నుంచి వెళ్లిన పిల్లలు ఇంకాసేపట్లో వస్తారని తల్లిదండ్రులు ఎదురుచూస్తుండగా ప్రమాదం విషయం తెలియడంతో ఆస్పత్రికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. విహార్ మరణంపై అనుమానాలు ఉన్నాయని తల్లిదండ్రులు ఇచి్చన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగరాజు తెలిపారు. పెన్సిల్‌పై రక్తపు మరకలు లేవెందుకు? కాగా, విహార్ చేతిలోని పెన్సిల్ గొంతులో గుచ్చుకోవడమే మృతికి కారణమని చెబుతున్నా.. పెన్సిల్‌కు రక్తపు మరకలు లేకపోవడంపై బాలుడి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. అయితే, బాలుడు బోల్తా పడినప్పుడు చేతిలోని పెన్సిల్ గొంతులో దిగిందని.. ఆ వెంటనే విహార్ స్నేహితులు కంగారుగా వెల్లకిలా తిప్పేలోగా పెన్సిల్ గొంతు నుంచి ఊడి కింద పడిందని చెప్పినట్లు తెలిసింది. ఆ తర్వాతే గొంతు వద్ద గాయం నుంచి రక్తస్రావం మొదలైందని వెల్లడించారని సమాచారం. ఈ విషయమై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సై సైతం విహార్ స్నేహితులు, పాఠశాల కరస్పాండెంట్, ఉపాధ్యాయులతో మాట్లాడి వివరాలు సేకరించారు. -
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని..
మహబూబాబాద్ రూరల్: భర్త చనిపోతే ఆయనపై ఉన్న ఇంటి రుణం మాఫీ అవుతుందని, పనిలోపనిగా తమ వివాహేతర సంబంధానికి అడ్డు తొలగుతుందని ఓ మహిళ తన ప్రియుడు, మరో వ్యక్తి సహాయంతో భర్తను హత్య చేయించింది. తర్వాత హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు యత్నించగా పోలీసులు కేసును ఛేదించి నిందితులను కటకటాల్లోకి పంపారు. డీఎస్పీ ఎన్.తిరుపతిరావు బుధవారం ఈ కేసు వివరాలు వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం బోడమంచ తండాకు చెందిన కౌలురైతు భూక్య వీరన్న సోమవారం రాత్రి ఇంటినుంచి బయటకు వెళ్లాడు. మంగళవారం తెల్లవారుజామున బోడమంచ తండా నుంచి బేరువాడ గ్రామానికి వెళ్లే దారిలో అతని మృతదేహం కనిపించింది. మృతుడి తల్లి రంగమ్మ ఫిర్యాదు మేరకు కేసముద్రం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. భూక్య వీరన్న భార్య విజయకు అదే తండాకు చెందిన బోడ బాలోజీకి మధ్య వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలో వీరన్న ఆర్థిక సమస్యలతో బాధపడుతుండగా బాలోజీ తన వ్యవసాయ భూమి అమ్మి కొన్ని అప్పులు కట్టాడు. ఇంకా అప్పులు మిగిలి ఉండటంతో బోడ బాలోజీ, అతని స్థలంలో అద్దెకు ఉండే ఆర్ఎంపీ వైద్యుడు, గూడూరు మండలం రాజనపల్లి గ్రామానికి చెందిన ధర్మారపు భరత్‌కు వీరన్న తన ఆర్థిక ఇబ్బందుల విషయాన్ని తెలియజేశాడు. దీంతో భరత్ ముత్తూట్ సంస్థలో వీరన్నకు ఇంటిపై రుణం ఇప్పించగా అదే సమయంలో రుణం తీసుకున్న వ్యక్తి ప్రమాదవశాత్తు చనిపోతే రుణం మాఫీ అవుతుందని కూడా చెప్పాడు. దీంతో విజయ, ఆమె ప్రియుడు బాలోజీ కలిసి ఎలాగైనా వీరన్నను చంపి దానిని ప్రమాదవశాత్తు చనిపోయినట్లుగా చిత్రీకరించాలని, దీనివల్ల అప్పు మాఫీతోపాటు తమ వివాహేతర సంబంధానికి అడ్డు కూడా తొలగుతుందని భావించారు. ఈ క్రమంలో ఆర్ఎంపీ వైద్యుడు భరత్ సహాయం తీసుకుని సోమవారం రాత్రి వీరన్నను మద్యం సేవిద్దామని చెప్పి బాలోజీ.. తండా బయట ఉన్న పామాయిల్ తోట వద్దకు పిలిచాడు. ముగ్గురూ కలిసి మద్యం తాగాక పథకం ప్రకారం బాలోజీ తనవెంట తెచ్చుకున్న ఇనుప రాడ్డుతో వీరన్న తల వెనుక బలంగా కొట్టడంతో కిందపడ్డాడు. భరత్ టవల్‌తో ముక్కు, నోరుమూసి చనిపోయాక దానిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించడానికిగాను బేరువాడ వెళ్లే రోడ్డు పక్కన పొలంలో మృతుడి ద్విచక్ర వాహనంతో సహా పడేశారు. కేసు విచారణలో భార్య విజయ తీరుపై అనుమానం వచ్చిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేయగా హత్యగా తేలింది. దీంతో విజయ, ఆమె ప్రియుడు బాలోజీ, ఆర్ఎంపీ భరత్‌ను అరెస్టు చేశామని డీఎస్పీ తెలిపారు. 24 గంటల్లోనే కేసును ఛేదించిన కేసముద్రం సీఐ సత్యనారాయణ, ఎస్సై క్రాంతికిరణ్, రెండవ ఎస్సై నరేశ్, సిబ్బందికి ఎస్పీ డాక్టర్ శబరీశ్ అభినందనలు తెలిపారు. -
బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి రాంగ్ రూట్లో..
సాక్షి, హైదరాబాద్: నగరంలో డ్రగ్స్ దందా మరోసారి బయటపడింది. ఈసారి.. చిక్కడపల్లిలో బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్‌ను విక్రయిస్తున్న ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుస్మిత అనే యువతి నగరంలోని ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్‌గా పని చేస్తోంది. అయితే.. తన బాయ్ ఫ్రెండ్ ఇమాన్యుల్‌తో కలిసి డ్రగ్స్ దందా నడుపుతోంది. ఈ క్రమంలో ముఠా గుట్టు రట్టు కావడంతో ఈ ప్రేమ జంట కటకటాల పాలైంది. సుస్మిత, ఇమాన్యుయెల్ సహా మొత్తం నలుగురి పోలీసులు అదుపులోకి తీసుకుని వాళ్ల నుంచి ఎండీఎంఏ, LSD బాటిళ్లు, ఓజీ కుష్ స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.4 లక్షల దాకా ఉండొచ్చని అధికారులు తెలిపారు. -
గచ్చిబౌలి: ఏఐతో కాపీ కొట్టి.. అలా ఇన్విజిలేటర్‌కు దొరికారు!
సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీయూ ఎగ్జామ్స్‌లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ వ్యవహారంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీని ఉపయోగించి కాపీ కొట్టే ప్రయత్నంలోనే అనూహ్యంగా ఆ ఇద్దరూ దొరికిపోయారని పోలీసులు వెల్లడించారు. గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ బాలరాజు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ పరీక్షలు జరిగాయి. మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడుతూ ఇద్దరు అభ్యర్థులు అనిల్ కుమార్, సతీష్ పట్టుబడ్డారు. వర్సిటీ రిజిస్ట్రార్ దివేశ్ నిగం ఫిర్యాదుతో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశాం.అయితే.. డిసెంబర్ 21వ తేదీన నిర్వహించిన పరీక్షల్లో ఇద్దరు ఏఐతో పరీక్ష కాపీ కొట్టబోయారు. ముందుగా.. షర్ట్ బటన్లకు అమర్చిన మైక్రో స్కానర్లతో పేపర్ స్కాన్ చేశారు. తరచూ బాత్రూమ్కు వెళ్లి ఏఐ సాయంతో సమాధానాలు సేకరించారు. చెవిలో ఉన్న బ్లూటూత్ పరికరాల ద్వారా సమాధానాలు వింటూ ఎగ్జామ్ రాశారు. ఈ క్రమంలో.. బ్లూటూ్ నుంచి వచ్చిన ‘బీప్’ శబ్దంతో ఇన్విజిలేటర్‌కు అనుమానం వచ్చి తనిఖీలు నిర్వహించడంతో అసలు విషయం బయటపడింది. ఈ ఘటనలో.. నిందితుల మొబైల్ ఫోన్, బ్లూటూత్ ఇయర్ ఫోన్స్, మైక్రో ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. -
హైదరాబాద్‌లో పిల్లల్ని ఎత్తుకెళ్లి విక్రయాలు : ముఠా అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పిల్లలను తెచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్న ఘటన కలకలం రేపింది. ఈ కేసులో 12 మంది సభ్యుల ముఠాను సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు అరెస్టు చేశారు. ఈ గ్యాంగ్‌లో ఎనిమిది మంది మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. ఈ ముఠానుంచి ఇద్దరు చిన్నారులను పోలీసులు రక్షించారు.హైదరాబాద్‌లోని కీలక ప్రాంతాలైన మియాపూర్,కూకట్పల్లి ఆల్విన్ కాలనీ, బిహెచ్ఎల్ జగదిరిగుట్ట ప్రాంతాలలో ఈ ముఠా కాపుకాసు పిల్లలను అపహరిస్తుంది. ఆ తరువాత ఒక్కో శిశువును రూ. 15 లక్షల చొప్పున విక్రయిస్తుందని పోలీసులు తెలిపారు. ఈ గ్యాంగ్ మొత్తం ఎనిమిది ఆసుపత్రులకు ఏజెంట్లుగా పని చేస్తున్నట్టు పోలీసులు గురించారు. అపహరించిన చిన్న పిల్లల్ని రెస్క్యూ హోంకు తరలించారు. -
లైంగిక దాడులు.. వరకట్న వేధింపులు
సాక్షి, సిటీబ్యూరో: అత్యాచారాలు, హత్యలు, వరకట్నం, లైంగిక వేధింపులు.. ఏదో ఒక రూపంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది సైబరాబాద్‌లో మహిళలపై నేరాలు పెరిగాయి. 2025లో కమిషనరేట్ పరిధిలో మొత్తం 37,243 కేసులు నమోదు కాగా.. ఇందులో 9 శాతం మహిళలపై జరిగినవే కావడం గమనార్హం. ఈ ఏడాది సైబరాబాద్‌లో 1,314 వరకట్న వేధింపుల కేసులు నమోదయ్యాయి. అలాగే షీ టీమ్‌కు వివిధ మాధ్యమాల ద్వారా 1,043 ఫిర్యాదులు అందగా.. వీటిలో 83 ఎఫ్ఐఆర్లు, 2,964 పెట్టీ కేసులు నమోదయ్యాయి. అలాగే 3,322 మంది పోకిరీలకు కౌన్సెలింగ్ ఇవ్వగా.. డెకాయ్ ఆపరేషన్స్‌తో 3,315 మంది ఆకతాయిలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 103 మానవ అక్రమ రవాణా కేసుల్లో 257 మందిని అరెస్టు చేశారు. మొత్తంగా చూస్తే.. గతేడాదిలో నమోదైన 37,689లతో పోలిస్తే ఈ ఏడాది కమిషనరేట్‌లో కేసులు 1.18 శాతం స్వల్పంగా తగ్గాయి. సైబర్ క్రైమ్‌లు, రోడ్డు ప్రమాదాలు, ప్రాపర్టీ సంబంధిత నేరాలు అత్యధికంగా ఉన్నాయి. ఈ మేరకు మంగళవారం సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి వార్షిక నివేదికను విడుదల చేశారు. అందులోని పలు కీలకాంశాలివీ.. తగ్గిన సైబర్ నేరాలు.. ఐటీ కంపెనీలు, ఉద్యోగులతో నిండిన సైబరాబాద్‌లో ఈ ఏడాది సైబర్ నేరాలు స్వల్పంగా తగ్గాయి. గతేడాది 11,914 క్రైమ్‌లు నమోదు కాగా.. 2025లో 35.9 శాతం మేర తగ్గి, 7,636లకు పరిమితయ్యాయి. వీటిలో 539 కేసుల్లో 917 మంది నిందితులను అరెస్టు చేశారు. అత్యధికంగా పార్ట్ టైం జాబ్, ట్రేడింగ్, విషింగ్ కాల్, అడ్వర్టయిజ్మెంట్ మోసాలు జరిగాయి. 2025లో సైబర్ నేరాలలో బాధితులు రూ.404 కోట్ల మోసపోగా.. రూ.20.75 కోట్లు బాధితులకు రీఫండ్ చేశారు. పెరిగిన చైల్డ్ పోర్నోగ్రఫీ.. ఐటీ హబ్‌గా పేరొందిన సైబరాబాద్‌లో చైల్డ్ పోర్నోగ్రఫీ పెరిగిపోయింది. పిల్లల అశ్లీల వీడియోలు, లైంగిక వేధింపులు, అత్యాచారాలు జరిగాయి. గతేడాది సైబరాబాద్‌లో చైల్డ్ పోర్నోగ్రఫీ కేసులు కేవలం నాలుగు నమోదు కాగా.. ఈ ఏడాది ఏకంగా 53 కేసులు రిజిస్టరయ్యాయి. అలాగే ఆన్లైన్లో వేధింపులు, బెదిరింపులు (సైబర్ స్టాకింగ్), మ్యాట్రిమోనీ, డేటింగ్ మోసాలు కూడా పెరిగాయి. 2025లో 40 సైబర్ స్టాకింగ్, 34 మ్యాట్రిమోనీ, 13 డేటింగ్ ఫ్రాడ్ కేసులు నమోదయ్యాయి.పెరిగిన డ్రగ్స్ కేసులు.. ఈ ఏడాది సైబరాబాద్‌లో రూ.16.85 కోట్ల విలువ చేసే 1,524 కిలోల మత్తు పదార్థాలు దొరికాయి. 575 నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్డీపీఎస్) కేసులు నమోదు కాగా.. 1,228 మందిని అరెస్టు చేశారు. అత్యధికంగా రూ.8.33 కోట్ల విలువ చేసే గంజాయి, రూ.3.30 కోట్ల విలువైన కొకైన్, రూ.4.27 కోట్ల విలువ చేసే హెరాయిన్ వంటివి ఉన్నాయి. అలాగే 2025లో సైబరాబాద్‌లో రూ.25.44 కోట్ల విలువ చేసే 2,730 కిలోల మత్తు పద్దార్థాలను ధ్వంసం చేశారు. స్థిరంగానే కన్విక్షన్లు..ఈ ఏడాది సైబరాబాద్‌లో నేర నిరూపణ (కన్విక్షన్లు) రేటు స్థిరంగానే ఉంది. వరుసగా రెండేళ్లు నేర నిరూపణలు 47 శాతం నమోదయింది. 2025లో మొత్తం 14,369 కేసులు డిస్పోజ్ కాగా.. ఇందులో 22 కేసుల్లో న్యాయస్థానం జీవితకాలం శిక్షలు విధించాయి. 22 కేసుల్లో 20 ఏళ్ల జైలు శిక్ష, 15 కేసుల్లో 10 ఏళ్ల జైలు, 49 కేసుల్లో ఏడేళ్లు, అంతకంటే ఎక్కువ కాలం శిక్షలు విధించారు. ట్రాఫిక్ జరిమానాలు డబుల్..ఏడాది సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు జరిమానాల కొరడా ఝుళిపించారు. 2025లో కమిషనరేట్ పరిధిలో 36.20 లక్షల చలాన్లు జారీ చేసిన పోలీసులు.. ఆయా వాహనదారులకు ఏకంగా రూ.239.37 కోట్ల జరిమానాలు విధించారు. గతేడాది 22.60 లక్షల చలాన్లలో రూ.111 కోట్ల ఫైన్లు విధించారు. ఈ ఏడాది కమిషనరేట్ పరిధిలో 4,608 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఇందులో 803 ఘోరమైన యాక్సిడెంట్లలో 850 మంది మరణించారు. అత్యధికంగా 430 ప్రమాదాల్లో 449 మంది ద్విచక్ర వాహనదారులు మృత్యువాత పడగా.. 283 కేసుల్లో 285 మంది పాదచారులు చనిపోయారు. 15,706 డ్రంకెన్ డ్రైవ్ (డీడీ) కేసులు నమోదయ్యాయి.2025లో 95 ఆర్థిక నేరాలలో 111 మంది నిందితులను అరెస్టు చేశారు. రూ.26.17 కోట్ల సొమ్మును స్తంభింపజేయగా.. రూ.11.50 కోట్ల ఆస్తులను అటాచ్ చేశారు. -
పూర్ణిమా..వాడిని వదిలేయ్!
హైదరాబాద్: అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ భార్య భర్తను కడతేర్చింది. ఈ ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బోడుప్పల్ ఈస్ట్ బృందావన్ కాలనీలో నివాసం ఉంటున్న వి.జె.అశోక్ (45) ఓ ప్రైవేట్ కళాశాలలో మేనేజర్‌గా పనిచే స్తున్నాడు. భార్య పూర్ణిమ ప్లేస్కూల్ నిర్వహిస్తోంది. వేరేకాలనీ లో ఉన్నప్పుడు నిర్మాణ పనుల్లో పనిచేస్తున్న పాలేటి మహేశ్ (22)తో పూర్ణిమ కొన్ని సంవత్సరా లనుంచి వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయంలో అశోక్ గతంలో భార్య ను మందలించాడు. ఈనెల 10వ తేదీన ఇంటిముందు మహేశ్ కనిపించడంతో పూర్ణిమతో భర్త గొడవ పడ్డాడు. దీంతో ఎలా గైనా అశోక్ అడ్డు తొలగించుకోవాలని మహేశ్, పూర్ణిమ పథకం పన్నారు. 11వ తేదీన సాయంత్రం ముందుగా మహేశ్ తన స్నేహితుడు బూక్యా సాయితో కలిసి అశోక్కోసం ఇంట్లోనే వేచి చూస్తున్నారు. అశోక్ ఇంటికి రాగానే ముగ్గురూ మూకుమ్మడిగా అతనిపై దాడికి పాల్పడ్డారు. పూర్ణిమ అశోక్ కాళ్లు పట్టుకోగా, ప్రియుడు, మరోవ్యక్తి మెడకు మూడు చున్నీలను బిగించి హత్యకు పాల్పడ్డారు. అనంతరం అనుమానం రాకుండా మృతుడి ఒంటిపై రక్తపు మరకలున్న దుస్తులను మార్చి, అంబులెన్స్‌లో అశోక్‌ను మల్కాజిగిరి ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మృతిచెందినట్లు తెలిపారు. వాష్‌రూంలో హార్ట్ ఎటాక్ వచ్చి తన భర్త అపస్మారక స్థితిలోకి వెళ్లాడని పూర్ణిమ బంధువులను నమ్మించింది. ఆసుపత్రి సిబ్బంది మేడిపల్లి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి ఒంటిపై గాయాలు కనిపించడంతో అనుమానాస్పద కేసుగా నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా భార్యను విచారించగా ప్రియుడు, మరోవ్యక్తి సాయంతో హత్యచేసినట్లు ఒప్పుకుంది. ప్రియుడు మహేశ్‌తోపాటు సహకరించిన సాయిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. -
సర్పంచ్ విజయోత్సవ ర్యాలీలో అత్యుత్సాహం.. బాలిక ప్రాణం తీసింది
సాక్షి, వికారాబాద్: వికారాబాద్ జిల్లా పూడూరు మండలం రాకంచర్ల గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామ సర్పంచ్ కమ్లిబాయ్ పెంటయ్య విజయోత్సవ ర్యాలీ సందర్భంగా జరిగిన ప్రమాదంలో సౌజన్య (7) అనే చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.వివరాల్లోకి వెళితే… ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధించిన కమ్లిబాయ్ పెంటయ్య గ్రామంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ సమయంలో చిన్నారి సౌజన్య కారు కిందపడి తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన బాలికను వెంటనే పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ బాలిక మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.ఈ ఘటనపై గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ర్యాలీలో కారే ప్రమాదానికి కారణమని గ్రామస్థులు ఆరోపించగా, సర్పంచ్ కమ్లిబాయ్ భర్త పెంటయ్య మాత్రం బాలిక కారు కింద పడలేదని వాదిస్తున్నారు. ఈ అంశంపై గ్రామస్థులకు, పెంటయ్యకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇరువర్గాలకు నచ్చజెప్పడంతో ప్రస్తుతం ఉద్రిక్తత కొంతమేరకు తగ్గినట్లు తెలుస్తోంది.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. బాలిక మృతదేహాన్ని పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిమిత్తం ఉంచారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. -
మంచిర్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, మంచిర్యాల: జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జైపూర్ మండలం ఇందారం వద్ద కూలీలతో వెళ్తున్న బోలెరో వాహనాన్ని ఓ లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో మగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీళ్లలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆగి ఉన్న లారీని బోలెరో ఢీ కొట్టడంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలపై పోలీసుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది. -
భార్య కాపురానికి రావడం లేదని..
హవేళిఘణాపూర్(మెదక్): ఓ వ్యక్తి భార్యపై అనుమానంతో తరచూ గొడవలు పడుతుండటంతో భరించలేని ఆమె తల్లిగారింటికి వెళ్లిపోయింది. అయితే ఆమె తిరిగి కాపురానికి రావ డం లేదనే అక్కసుతో అతను తన కుమారుడిని హత్య చేశాడు. మెదక్ జిలాల్లోని మెదక్ మండలంలో ఆదివారం ఈ ఘటన వెలుగు చూసింది. మెదక్ రూరల్ పోలీసుల కథనం ప్రకారం.. పెద్ద బాయి తండాకు చెందిన భాస్కర్ తన భార్య అమీనాపై అనుమానంతో తరచూ గొడవ పడుతుండేవాడు.ఈనెల 19న సాయంత్రం భాస్కర్ తన భార్యను కొట్టడంతో ఆమె పిల్లలను వదిలివేసి తల్లిగారింటికి వెళ్లిపోయింది. దీంతో తిరిగి కాపురం చేసేందుకు రావడంలేదనే కోపంతో అతను శనివారం రాత్రి నిద్రిస్తున్న తన చిన్న కుమారుడు లక్కీ(3)ని గొంతు నొలిమి చంపాడు. ఈ ఘటనపై తల్లి అమీనా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మెదక్ రూరల్ ఎస్ఐ లింగం తెలిపారు. ప్రస్తుతం చిన్నారి లక్కీ మృతదేహాన్ని మెదక్‌జిల్లా ఆస్పత్రి మార్చురీలో ఉంచారు. -
భయపెడుతున్న ‘గోస్ట్ పేరింగ్ ఎటాక్’
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త ఎత్తు వేస్తూ మోసాలకు తెరతీస్తున్నారు. తాజాగా నెటిజన్లను లక్ష్యంగా చేసుకుంటూ గోస్ట్ పేరింగ్ ఎటాక్ (వాట్సాప్ టేక్ఓవర్)ను, క్రోమ్ ఎటాక్‌లు మొదలు పెట్టినట్టు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) హెచ్చరించింది. క్రోమ్‌లో హానికరమైన, అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేస్తే వెంటనే వ్యక్తిగత, బ్యాంకులకు సంబంధించిన సమాచారం చోరీ చేస్తున్నట్టు టీజీ సీఎస్బీ డైరెక్టర్ శిఖాగోయల్ ఆదివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. అదేవిధంగా వాట్సాప్‌లో వచ్చే సందేశాల్లో ఉండే అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయగానే సైబర్‌నేరగాళ్లు గోస్ట్ పేరింగ్ ఎటాక్‌కు తెరతీస్తున్నట్టు తెలిపారు. లింక్‌పై క్లిక్ చేయగానే మనకు తెలియకుండానే మన వాట్సాప్ అకౌంట్‌ను సైబర్‌నేరగాళ్లు వారి డివైజ్‌లో లింక్ చేస్తున్నట్టు తెలిపారు. ఇలా వాట్సాప్ లింక్ అయిన తర్వాత మనకు వచ్చే.. మనం పంపే మెసేజ్‌లను, చాట్లను సీక్రెట్‌గా గమనిస్తూ మన నుంచి సమాచారం సేకరిస్తుంటారని చెప్పారు. అయితే గోస్ట్ ఎటాక్ జరిగినప్పటికీ మన వాట్సాప్ సాధారణంగానే పనిచేస్తుందని తెలిపారు. మీ వాట్సాప్ ఇతరులు లింక్ చేసుకున్నట్లు అనుమానిస్తే వెంటనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చేయకూడనివి..» ఓటీపీ, పిన్, సీవీవీ లేదా వాట్సాప్ కోడ్లు ఎవరికీ ఎప్పుడూ షేర్ చేయొద్దు. » ఎస్ఎంఎస్లు, ఈ–మెయిల్స్‌లో వచ్చే అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయొద్దు. » తెలియని వెబ్సైట్లు లేదా పాప్–అప్లలో లాగిన్ కావొద్దు. చేయాల్సినవి..»వాట్సాప్ లింక్ చేసిన పరికరాలను తనిఖీ చేయండి.» ఏదైనా అనుమానాస్పదంగా డివైజ్‌లు లింక్ అయినట్టు కనిపిస్తే వెంటనే వాటిని తీసివేయండి.» వాట్సాప్‌లో టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ యాక్టివేట్ చేసుకోవాలి. » మీకు సంబంధించిన కీలక సమాచారం. ఫొటోలు, వీడియోలు వేరేచోట కాపీ చేసి పెట్టుకోండి.» అనుమానాస్పద సందేశాలు, లింక్‌లు, పాప్–అప్ల స్క్రీన్షాట్లను తీసుకోండి. » లావాదేవీ ఐడీలు, యూటీఆర్ నంబర్లు, కాల్ లాగ్లను సేవ్ చేయండి.» గూగుల్ క్రోమ్ తాజా వెర్షన్‌ను అప్డేట్ చేయండి.» ఈ–మెయిల్, బ్యాంకింగ్, సోషల్ మీడియా పాస్‌వర్డ్‌లను మార్చండి.» మీ బ్యాంక్‌లకు అనుమానాస్పద లావాదేవీల సమాచారం వెంటనే తెలియజేయండి. » క్రోమ్, ఇతర యాప్‌లను ఎల్లప్పుడూ అప్డేట్ చేస్తూ ఉండాలి. -
దారి తప్పుతున్న యువ ఖాకీలు
ఒకప్పుడు సరదాగా మొదలైన బెట్టింగ్ ఇప్పుడు అనేక మందికి వ్యసనంగా మారింది. అయితే కేవలం సాధారణ పౌరుల జీవితాలను మాత్రమే ఛిన్నాభిన్నం చేస్తోందని అనుకోవడానికి వీల్లేకుండా పోయింది. ఈ మహమ్మరి కోరల్లో చిక్కుకుని పోలీస్ సిబ్బంది కూడా దారి తప్పుతున్నారు. అందుకు వరుసగా వెలుగుచూసిన ఉదంతాలే కారణం!ఆన్లైన్ బెట్టింగ్తో అప్పులపాలై.. సర్వం కోల్పోయి.. తన దగ్గర గన్‌మెన్‌గా పని చేస్తున్న కృష్ణ చైతన్య ఆత్మహత్యకు ప్రయత్నించాడని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. అంతకు ముందు.. ఈ వలయంలో చిక్కుకున్న ఓ అధికారి(అంబర్‌పేట ఎస్సై భానుప్రకాశ్) దాని నుంచి బయటపడేందుకు ఏకంగా సర్వీస్ రివాల్వర్‌తో పాటు ఓ కేసులో రికవరీ బంగారాన్ని తాకట్టపెట్టాడనే అభియోగాల కింద విచారణ ఎదుర్కొంటున్నారు.ఈ మధ్యలో.. నగరంలోని ఉప్పల్‌లో ఫిల్మ్‌నగర్ పీఎస్‌లో పని చేసే ఓ యువ కానిస్టేబుల్ ఆన్లైన్ బెట్టింగ్‌ల ఉన్న ఇంటిని అమ్మేసుకుని.. విధులకు దూరంగా ఉంటూ వస్తూ.. చివరకు ఒత్తిళ్ల నడుమ మానసికంగా కుంగిపోయి బలవన్మరణానికి పాల్పడ్డాడని తెలుస్తోంది. అలాగే ఆ మధ్య సంగారెడ్డి టౌన్ పోలీస్‌స్టేషన్‌లో పని చేసిన ఓ కానిస్టేబుల్ పిస్టల్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకోవడం వెనుక ఈ భూతమే ఉందనే ప్రచారం నడిచింది. చిన్న మొత్తాలతో ప్రారంభించిన ఆన్లైన్ గేమింగ్ వ్యసనం.. ఆ తరువాత పెద్ద అప్పులకు దారితీస్తోంది. గేమ్‌లలో డబ్బులు కోల్పోయి, సహోద్యోగులు.. స్నేహితుల వద్ద అప్పులు చేసి తిరిగి ఇవ్వలేని స్థితికి పోలీసు సిబ్బంది చేరుకుంటున్నారు. అప్పులు తీర్చమని ఒత్తిడి పెరగడంతో చివరకు.. మానసికంగా తీవ్రంగా కలత చెంది తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు.బెట్టింగ్ మహమ్మారి కోరల్లో పోలీసులు.. అందునా యువ సిబ్బంది చిక్కుకుపోతుండడం ఇటు ఉన్నతాధికారులకూ ఆందోళన కలిగిస్తోంది. బెట్టింగ్ వ్యసనం వల్ల కలిగే నష్టాల గురించి అవగాహన ఉండి.. అందునా టెక్నాలజీపై పట్టుఉన్న సిబ్బంది కూడా ఆ వ్యసనంలో మునిగిపోతుండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందని అంటున్నారు. దీన్ని అత్యవసరంగా కట్టడి చేసేందుకు కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం పోలీస్ శాఖలో బలంగా వినిపిస్తోంది. -
గన్‌మెన్ ఆత్మహత్యాయత్నంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పంధన
సాక్షి, హైదరాబాద్: హయత్‌నగర్‌లో గన్‌మెన్ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కలకలం రేపింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు గన్‌మ్యాన్‌గా పనిచేస్తున్న చైతన్య ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. గన్‌మెన్ కృష్ణ చైతన్య ఇంట్లోనే తన వద్ద ఉన్న తుపాకితో కాల్చుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు వెంటనే చైతన్యను ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం చైతన్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రాథమిక సమాచారం మేరకు చైతన్య ఇటీవలే ఓ బెట్టింగ్ యాప్‌లో భారీగా డబ్బు పోగొట్టుకున్నట్టు సమాచారం. దాంతో ఏర్పడ్డ ఆర్థిక సమస్యలే ఈ అఘాయిత్యానికి కారణంగా భావిస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.ఈ విషయంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ.. చైతన్య విషయాన్ని సంచలనం చేయవద్దని మీడియాను కోరుతున్నాను. ఈరోజు ఉదయం ఎల్బీ నగర్ కామినేనిలో కానిస్టేబుల్ చైతన్యను కలిశాను. అతని పరిస్థితి విషమంగా ఉంది. అతను ఆర్థిక సమస్యల కారణంగా ఆత్మహత్యకు ప్రయత్నించాడు. దాదాపు 2 సంవత్సరాల క్రితం బెట్టింగ్ యాప్‌లు/గేమింగ్ యాప్‌లలో పాల్గొనడం వల్ల అతను ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాడు.అప్పుల కారణంగా అతని జీతంలో ఎక్కువ భాగం కట్ అవుతోంది.ఈరోజు ఉదయం అతను ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అతను బతికే ఉన్నాడు. సర్జరీ జరుగుతోంది. బతికే అవకాశాలు మాత్రం చాలా తక్కువ. దాదాపు 3 నెలల క్రితం అతను కుటుంబ సమస్యలతో బాధపడుతూ ఇంటి నుండి వెళ్లిపోయాడు. దాంతో అప్పుడు హయత్‌నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. అప్పటి నుండి అతను నాడీ సంబంధిత సమస్యలతో (మెదడు గడ్డకట్టడం) బాధపడుతున్నాడు. అయితే అతను విధుల్లో మాత్రం బాగానే ఉన్నాడని రంగనాథ్ తెలిపారు. -
ఆత్మహత్యా..? జారి పడ్డారా..?
యాదగిరిగుట్ట రూరల్: నవ దంపతుల మృతిపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. యాదగిరిగుట్ట మండలం వంగపల్లి రైల్వేస్టేషన్ శివారులో గురువారం అర్ధరాత్రి మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ రైలు నుంచి జారిపడి నవ దంపతులు కోరాడ సింహాచలం (25), కొంగరపు భవాని(19) మృతి చెందారు. చనిపోవడానికి ముందు రైలు లో సింహాచలం, భవాని ఏదో విషయంపై గొడవ పడుతుండగా, తోటి ప్రయాణికులు తీసిన వీడియో వైరల్ అవుతోంది. దీంతో గొడవ జరిగిన తర్వాతే భార్యాభర్తలిద్దరూ రైలు నుంచి కిందపడిపోయారని తెలుస్తోంది. ముందుగా నిర్ణయించుకొని ఆత్మహత్య చేసుకున్నారా.? లేదా భార్యను సముదాయిస్తున్న క్రమంలో ఇద్దరూ కలిసి జారి పడ్డారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీడియో ఎవరు చిత్రీకరించారనే దానిపై రైల్వే పోలీసులు ఆరా తీస్తున్నారు. -
మీర్‌పేట మాధవి కేసులో షాకింగ్ ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మీర్‌పేట మాధవి హత్య కేసు దాదాపుగా ఓ కొలిక్కి వచ్చింది. భర్త గురుమూర్తే ఆమెను కిరాతకంగా హతమార్చాడని పోలీసులు సైంటిఫిక్ ఆధారాలను కోర్టు ముందు ఉంచారు. ఈ క్రమంలో మరదలితో గురుమూర్తి వివాహేతర సంబంధ వ్యవహారమే ఈ హత్యకు కారణమని నిర్ధారణ అయ్యింది.మీర్‌పేట మాధవి హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. మరదలితో గురుమూర్తి వివాహేతర సంబంధం నడిపిన గురుమూర్తి.. దానికి అడ్డుపడుతోందనే భార్య మాధవిపై ఘాతుకానికి పాల్పడినట్లు తేలింది. ఈ మేరకు కేసు దర్యాప్తునకు సంబంధించిన పూర్తి వివరాలను తాజాగా ఆధారాలతో సహా పోలీసులు కోర్టుకు సమర్పించారు. ఈ ఏడాది జనవరిలో.. వెంకట మాధవి(35) అనే మహిళ కనిపించడం లేదని ఆమె తల్లి మీర్‌పేట పీఎస్‌లో కంప్లైంట్ ఇచ్చింది. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు జరిపారు. అయితే విచారణలో తన భార్యను తానే చంపినట్లు భర్త పుట్టా గురుమూర్తి అంగీకరించాడు. మాజీ ఆర్మీ జవాన్ అయిన పుట్టా గురుమూర్తి(39).. డీఆర్డీవోలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అయితే తన మరదలితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయంలోనే భార్య మాధవితో పలుమార్లు గొడవలు జరిగాయి. అయితే చాలాసార్లు పంచాయితీ చేసినప్పటికీ గురుమూర్తి తీరు మారలేదు. ఈ క్రమంలోనే మాధవితో గొడవ పడి.. ఆమెను దారుణంగా హతమార్చాడని పోలీసులు కోర్టుకు తెలిపారు. వివాహేతర సంబంధం విషయంలో మాధవి-గురుమూర్తి మధ్య గొడవ జరిగింది. మాధవిని గొంతు నులిమి చంపి ఆపై ముక్కలు చేసిన గురుమూర్తి.. శరీర భాగాలను కుక్కర్లో ఉడికించి.. ఎముకలను గ్రైండర్ చేసి జిల్లెలగూడలోని చెరువులో కలిపాడు. మాధవిది హత్యగా తెలిశాక పోలీసులు ఇంటి నుండి స్టౌ, కత్తి, రోలర్, వాటర్ హీటర్, బట్టలు వంటి ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. గురుమూర్తిపై హత్య, ఆధారాలను నాశనం చేయడం వంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే ఈ కేసులో శరీర భాగాలు దొరకడం కష్టం కావడంతో ఈ కేసు వీగిపోతుందని అంతా భావించారు. అయితే.. అతికష్టం మీద సైంటిఫిక్ ఆధారాలను సేకరించిన పోలీసులు తాజాగా వాటిని కోర్టు ముందు ఉంచారు. ఈ కేసు దర్యాప్తు సమయంలో.. హత్యకు గల కారణాలపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి. చివరకు వివాహేతర సంబంధం కారణంగానే మాధవిని గురుమూర్తి కడతేర్చినట్లు తేలింది. -
సర్పంచ్ విజయోత్సవాల నడుమ దారుణం..
మహబూబ్‌నగర్ జిల్లా: మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండలం వేములలో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతిపై అదే గ్రామానికి చెందిన యువకుడు లైంగికదాడికి పాల్పడడంతో ఆమె మృతి చెందింది. పోలీసులు, బాధితుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ యువతి (22) ఇంటర్ వరకు చదివి ఇంటి వద్దే ఉంటోంది. బుధవారం రాత్రి సర్పంచ్ ఎన్నికల విజయోత్సవాలు జరుగుతున్న సమయంలో అదే గ్రామానికి చెందిన విష్ణు మాట్లాడాలని చెప్పి ఆ యువతిని రైతువేదిక వద్దకు తీసుకెళ్లాడు. అక్కడే ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో అధిక రక్తస్రావం కావడంతో ఆ యువతి అపస్మారక స్థితికి చేరుకుంది. వెంటనే అతను ఇతరుల సాయంతో స్థానిక వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. చుట్టు పక్కల వారు తల్లికి సమాచారం ఇవ్వడంతో ఆమె కూడా అక్కడకు వచి్చంది. అప్పటికే ఆ యువతి పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానికుల సాయంతో అంబులెన్స్‌లో జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆ యువతి మృతి చెందినట్టు తెలిపారు. మృతదేహాన్ని అదే రోజు రాత్రి ఇంటికి తీసుకొచ్చారు. గురువారం ఉదయం కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తమ కూతురిపై అత్యాచారం చేసి హత్య చేశారని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ ఘటనా స్థలాన్ని మహబూబ్‌నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, భూత్పూర్ సీఐ రామకృష్ణ, మూసాపేట ఎస్ఐ వేణు పరిశీలించారు. ఘటనా స్థలంలో లభించిన ఆధారాలతో గ్రామంలో విచారణ జరిపారు. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు అత్యాచారం, అట్రాసిటీ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్టు ఎస్ఐ వేణు చెప్పారు. యువకుడు ఒక్కడే అత్యాచారం చేశాడా... ఇతరుల ప్రమేయం ఉందా అన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. -
లవ్ మ్యారేజ్ చేసుకుని..కొట్టి చంపేశాడు
తాండూరు టౌన్: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను అతి కిరాతకంగా కొట్టి చంపిన కేసులో ముగ్గురికి రిమాండ్ విధించినట్లు తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య తెలిపారు. పట్టణంలోని సాయిపూర్‌కు చెందిన పరమేశ్, తన భార్య అనూష (20)ను వరకట్నం తీసుకురావాలంటూ గురువారం కర్రతో కొట్టి దారుణంగా హత్య చేసి పరారైన విషయం విదితమే. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మృతురాలి భర్త పరమేశ్, అతని తల్లిదండ్రులు లాలమ్మ, మొగులప్పను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కీలకంగా మారిన సీసీ పుటేజీ.. ఈ హత్య కేసులో నిందితుడి ఇంటి సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డు అయిన పుటేజీ కీలకంగా మారింది. ఈ పుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం మధ్యాహ్నం లావుపాటి కర్రతో అనూష తలపై విచక్షణా రహితంగా దాడి చేస్తున్నట్లు నిక్షిప్తమైంది. Sensitive Content సీసీ ఫుటేజ్.. ప్రేమించి పెళ్లాడిన యువతిని కిరాతకంగా కొట్టి చంపిన భర్తతాండూరులోని సాయాపూర్లో జరిగిన ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు..కట్నం తేవాలని దూషిస్తూ, కర్రతో విచక్షణారహితంగా కొట్టడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన అనూష.. చికిత్స మృతియువకుడి… https://t.co/ujX5RCu0jI pic.twitter.com/gnlmskOTnv— Telugu Scribe (@TeluguScribe) December 19, 2025 ప్రేమించి.. పెళ్లి చేసుకుని.. -
తండ్రి భయంతో బాల్కనీ దాటే ప్రయత్నం..
రామచంద్రాపురం (పటాన్చెరు): ఇంట్లో స్నేహితుడితో ఉన్న సమయంలో అకస్మాత్తుగా తండ్రి రావడం చూసి భయపడిన కూతురు.. తమ బాల్కనీ నుంచి మరో బాల్కనీకి వెళ్లే ప్రయత్నంలో ఎనిమిదో అంతస్తు పైనుంచి కిందపడి మృతి చెందింది. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ పరిధిలోని ప్రభుత్వ డబుల్ బెడ్ రూమ్ కేసీఆర్ నగర్లో గురువారం రాత్రి ఈ సంఘటన జరిగింది. కొల్లూరు సీఐ గణేశ్ పటేల్ కథనం ప్రకారం.. హైదరాబాద్ పాతబస్తీలో నివాసముండే యువతి (20) ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తోంది. అక్కడ ఆమెకు ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ యువతి కుటుంబానికి తెల్లాపూర్ పరిధిలోని ప్రభుత్వ డబుల్ బెడ్రూమ్ కాలనీలో ఇల్లు ఉంది. కాగా గురువారం స్నేహితుడితో కలిసి కేసీఆర్ నగర్ కాలనీలోని 8వ అంతస్తులో ఉన్న తమ ఇంటికి వచ్చింది. వారిద్దరూ ఇంట్లో ఉన్న సమయంలో రేషన్ బియ్యం తీసుకునేందుకు నగరం నుంచి యువతి తండ్రి అక్కడికి వచ్చాడు. తలుపులకు తాళం తీసి ఉండటంతో.. లోపల ఎవరున్నారని అతను గట్టిగా అరిచాడు. తండ్రి మాటలు విన్న యువతి భయంతో ఎనిమిదో అంతస్తు బాల్కనీ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో పక్క బాల్కనీలోకి వెళ్లేందుకు ప్రయత్నించింది. అయితే పట్టుతప్పి ఆమె పైనుంచి కింద పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
భార్యను కొట్టి చంపిన భర్త
ధరూరు: దంపతుల మధ్య తలెత్తిన చిన్నపాటి గొడవ చివరకు భార్య హత్యకు దారితీసింది. జోగుళాంబ గద్వాల జిల్లా ధరూరు మండలం నెట్టెంపాడు గ్రా మానికి చెందిన కుర్వ గోవిందు– జమ్ములమ్మ (28) దంపతులకు ఇద్దరు కుమారులు. గురువారం రాత్రి భోజనం చేసి నిద్రకు ఉపక్రమించారు. శుక్రవారం తెల్లవారుజామున వారి మధ్య చిన్నపాటి గొడవ జరి గింది. మాటామాట పెరిగి కొట్టుకునే స్థితికి దారి తీయగా.. పెద్ద కుమారుడు మల్లికార్జున్ సర్దిచెప్పేందు కు ప్రయత్నించగా.. తండ్రి అతడిని కట్టెతో కొట్ట డంతో తీవ్ర గాయాల య్యాయి. ఈ క్రమంలో జమ్ములమ్మ గటిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి గొడవను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. భార్య జమ్ములమ్మ బయటకు పరుగులు తీయగా.. గోవిందు జమ్ములమ్మను వెంటాడి అందరి ముందే కట్టెతో కొట్టి చంపాడు. సమాచారం అందుకున్న రేవులపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గోవిందును అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్టు ధరూరు ఎస్ఐ శ్రీహరి తెలిపారు. -
ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య
పాల్వంచ: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది ఓ భార్య.. ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించింది. పోలీసులకు అందిన ఫిర్యాదుతో విచారణ చేపట్టగా విషయం బయటపడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ సతీష్ శుక్రవారం ఆ వివరా లు వెల్లడించారు. పాల్వంచ వెంగళరావుకాలనీకి చెందిన ధరావత్ హరినాథ్ (39) ఈనెల 15న తెల్లవా రుజామున ఇంటి వెనుకభాగంలో స్లాబ్ హుక్కు చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు ఆయ న భార్య శ్రుతిలయ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది.అయితే శ్రుతిలయకు మరో వ్యక్తితో వివాహే తర సంబంధం ఉందని, గతంలో పంచాయితీ చేసినా మార్పు రాలేదని హరినాథ్ తల్లి మంగమ్మ పోలీసు లకు ఫిర్యాదు చేసింది. దీంతో అనుమానాస్పద కేసుగా నమోదు చేసిన పోలీసులు శ్రుతిలయను విచారించగా అసలు విషయం బయటపడింది.అడ్డుగా ఉండడంతో...హరినా«థ్ భార్య శృతిలయ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌గా ములుగు జిల్లా వెంకటాపురం డివిజన్ పెనుగోలు బీట్‌లో విధులు నిర్వర్తిస్తోంది. ఆమె చర్ల మండలంలో పనిచేసినప్పుడు లింగాపురానికి చెందిన జర్నలిస్టు కొండా కౌషిక్‌తో పరిచయం ఏర్పడి..అది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం భర్తకు తెలియడంతో కొద్దిరోజులుగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో హరినాథ్‌ను హత్య చేయాలని పథకం పన్నింది. ఈనెల 15వ తేదీన హరినా«థ్ మద్యం మత్తులో ఇంట్లో నిద్రిస్తుండగా కౌషిక్‌కు శ్రుతిలయ సమాచారం ఇచ్చింది. ఆయన తనతోపాటు ఏపీలోని ఏటపాక రాయన్నపేటకు చెందిన బంధువు డేగల భాను, చర్లకు చెందిన స్నేహితుడు చెన్నం మోహన్‌ను తీసుకొచ్చాడు. నిద్రలో ఉన్న హరినాథ్ గొంతు నులిమి హత్య చేశాక స్లాబ్ హుక్కు ఉరి వేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించారు. పోలీసుల విచారణలో విషయం బయటపడడంతో నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్టు డీఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో సీఐ సతీశ్‌కుమార్, ఎస్ఐలు సుమన్, జీవన్‌రాజ్, సిబ్బంది పాల్గొన్నారు.


