breaking news
-
హైదరాబాద్ పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై కార్ల బీభత్సం! భారీగా ట్రాఫిక్ జామ్!
సాక్షి, హైదరాబాద్: నగరంలోని రాజేంద్రనగర్ పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై అర్థరాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉప్పరపల్లి సమీపంలో వేగంగా వెళ్తున్న కార్లు వరుసగా ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే వాహనదారులు అప్రమత్తమయ్యారు. అయితే, వరుసగా కార్లు ఢీకొనడంతో అక్కడ కొద్దిసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది.ఈ ప్రమాదం కారణంగా పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాగే, రద్దీ కారణంగా వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. అయితే, ప్రమాదానికి గల అసలు కారాణాలు ఇంకా తెలియాల్సి ఉంది.ఇదీ చదవండి: పిల్లల్ని మాట్లాడనివ్వాలి.. అప్పుడే ఇలాంటివి బయటపడతాయి! -
ఆధ్యాత్మికత ముసుగులో వేధింపులు.. గురూజీ అసభ్య మెసేజ్‌లు
సాక్షి, హైదరాబాద్: ఆధ్యాత్మిక సాధనల పేరుతో ఓ వివాహితకు అసభ్యకర సందేశాలు పంపుతూ, ఆమె భర్తను చంపేస్తానని బెదిరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీచైతన్య గురూజీ అలియాస్ మేరెడ్డి సునీల్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 71లో శ్రీవిద్యా సాధనా సెంటర్‌ను సునీల్ రెడ్డి నిర్వహిస్తున్నారు. సునీల్‌రెడ్డి వేధింపుల కారణంగా ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ కుటుంబంలో కలకలం రేపింది.హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 10, స్రవంతి నగర్‌కు చెందిన విష్ణుదీప్రెడ్డి సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఆయన భార్య శ్రీవిద్యా సాధనా సెంటర్‌కు వెళ్తున్నారు. ఈ క్రమంలో కేంద్రం నిర్వాహకుడైన మేరెడ్డి సునీల్‌రెడ్డి ఆధ్యాత్మిక సాధనల పేరుతో ఆమెతో సాన్నిహిత్యం పెంచుకున్నారని బాధితురాలి భర్త ఆరోపించారు. ఆ తర్వాత తన భార్యకు సునీల్‌రెడ్డి తరచూ అసభ్యకర సందేశాలు పంపుతూ, వ్యక్తిగత సంభాషణలు జరిపేవారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. ఈ వ్యవహారం తన దృష్టికి రావడంతో భార్యకు పంపిన సందేశాల గురించి తెలుసుకుని ఆందోళనకు గురైనట్లు తెలిపారు.నిలదీస్తే చంపేస్తానని బెదిరింపులు?తన భార్యకు సందేశాలు పంపుతున్న విషయంపై విష్ణుదీప్రెడ్డి సాధనా కేంద్రానికి వెళ్లి ప్రశ్నించారు. అక్కడ సునీల్‌రెడ్డిని నిలదీయగా, ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ తన జీవితాన్ని నాశనం చేస్తానని, మరోసారి అటువైపు వస్తే చంపేస్తానని బెదిరించినట్లు విష్ణుదీప్రెడ్డి ఆరోపించారు. ఈ పరిణామాలతో తమ వైవాహిక జీవితంలో తీవ్ర గందరగోళం ఏర్పడిందని పేర్కొన్నట్లు సమాచారం. తన భార్యకు పంపిన సందేశాలు, బెదిరింపులకు సంబంధించిన ఆధారాలను సేకరించిన ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై న్యాయస్థానం ఆదేశాల మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు సునీల్‌రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు తెలిసింది.బీఎన్ఎస్ 351(2) కింద కేసువిష్ణుదీప్రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్న బెదిరింపుల అంశానికి సంబంధించి పోలీసులు భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 351(2) కింద కేసు నమోదు చేశారు. ఈ సెక్షన్ నేరపూరిత బెదిరింపులకు సంబంధించినది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.ఇదీ చదవండి: హనుమకొండలో కీచక ఎస్ఐ బాగోతం బట్టబయలు -
సీఈఓ పేరుతో రూ.2.7 కోట్ల టోకరా!
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు ఏకంగా ఓ వ్యాపార సంస్థ సీఈఓ పేరుతోనే నకిలీ వాట్సాప్ ఖాతా సృష్టించి, ఆ సంస్థ ఖాతా నుంచి రూ.2.7 కోట్లను కొల్లగొట్టారు. సీఈఓనే సందేశాలు పంపినట్లు నమ్మించి అకౌంటెంట్‌తో విడతలవారీగా ఈ మొత్తాన్ని వివిధ బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయించారు. అనుమానాస్పద జిప్ ఫైల్‌ను తెరిచిన తర్వాత వాట్సాప్ సంభాషణల్లో మార్పులు కనిపించడం, సీఈఓ పేరుతో మరో నంబర్ నుంచి సందేశాలు రావడం ఈ వ్యవహారంలో కీలక పరిణామాలు. చివరకు సదరు అకౌంటెంట్ సీఈఓను నేరుగా సంప్రదించి నిర్ధారించుకోవడంతో మోసం బయటపడింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నగరానికి చెందిన రెడ్ రోజ్ సూపర్ మార్కెట్ సంస్థ ఆర్థిక లావాదేవీలను పర్యవేక్షించే అకౌంటెంట్ మహమ్మద్ అబ్దుల్ సత్తార్‌కు సంస్థలోని ఓ ఉద్యోగి వాట్సాప్ నంబర్ నుంచి జిప్ ఫైల్ వచ్చింది. ఆయన సదరు ఫైల్‌ను తన ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని తెరిచారు. అనంతరం అదే ఫైల్‌ను కంప్యూటర్లో తెరిచేందుకు ప్రయత్నించగా, అది హానికరమైన ఫైల్ కావచ్చంటూ అలెర్ట్ కనిపించింది. అయినప్పటికీ దాన్ని తెరవడంతో కంప్యూటర్ స్పందించడం ఆగిపోయింది. వెంటనే సంస్థ ఐటీ సిబ్బందిని సంప్రదించగా, వారు కంప్యూటర్ను పరిశీలించి సాధారణ స్థితికి తీసుకొచ్చారు. సమస్య పరిష్కారమైందని భావించిన అకౌంటెంట్ తిరిగి తన విధులు కొనసాగించారు. అయితే, ఆ తర్వాత ఆయన వాట్సాప్‌లో అనుమానాస్పద మార్పులు కనిపించాయి. రెడ్ రోజ్ సూపర్ మార్కెట్ సంస్థ సీఈఓ జియా ఉర్ రెహమాన్‌తో గతంలో జరిపిన వాట్సాప్ సంభాషణలు తొలగిపోయినట్లు అకౌంటెంట్ గుర్తించారు. అదే సమయంలో సీఈఓ పేరుతో మరో నంబర్‌తో కొత్త కాంటాక్ట్ కనిపించింది. ఆ నంబర్ నుంచి గతంలో సీఈఓతో జరిగిన సంభాషణలకు సంబంధించిన కొన్ని సందేశాలను పంపడంతో, అది నిజంగానే సీఈఓకు చెందిన నంబర్ అని అకౌంటెంట్ నమ్మాడు. ఈ నమ్మకాన్ని ఆసరాగా చేసుకున్న సైబర్ నేరగాళ్లు సంస్థ నిధులను ఇతర ఖాతాలకు బదిలీ చేయాలంటూ సీఈఓ మాదిరిగా అకౌంటెంట్‌కు సూచించారు. ఆ ఆదేశాలు నిజమైనవేనని భావించిన అకౌంటెంట్ ఒక్కో విడతగా డబ్బులు పంపడం ప్రారంభించారు. ఇలా ఈ నెల 1 నుంచి 8వ తేదీ వరకు సంస్థ బ్యాంకు ఖాతా నుంచి మొత్తం ఏడు లావాదేవీల్లో రూ.2.7 కోట్లు బదిలీ చేశారు. ఈ మొత్తాలు ఇండస్ఇండ్ బ్యాంక్, క్యాథలిక్ సిరియన్ బ్యాంక్, బంధన్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంకులకు చెందిన వివిధ ఖాతాలకు బదిలీ అయ్యాయి. అక్టోబర్ 9న సీఈఓ పేరుతో ఉన్న వాట్సాప్ కాంటాక్ట్ నుంచి మరో రూ.50 లక్షలు బదిలీ చేయాలంటూ సందేశం వచ్చింది. దీంతో అనుమానించిన అకౌంటెంట్ ఆయనను నేరుగా సంప్రదించి ఆరా తీయడంతో మోసం వెలుగులోకి రావడంతో సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. అకౌంటెంట్ తెరిచిన అనుమానాస్పద జిప్ ఫైల్ కారణంగానే మొబైల్, కంప్యూటర్ లేదా వాట్సాప్ సంభాషణలు హ్యాక్ అయి ఉండవచ్చని సంస్థ అనుమానం వ్యక్తం చేసింది. తొలుత సంస్థ ఉద్యోగి వాట్సాప్‌ను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు దాని నుంచి అకౌంటెంట్‌కు జిప్ ఫైల్ పంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. -
72 ఏళ్ల వృద్ధురాలు... 23 రోజులు ‘డిజిటల్ అరెస్ట్’!
సాక్షి, సిటీబ్యూరో: సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), క్రైమ్ బ్రాంచ్ అధికారులమంటూ వీడియో కాల్స్ చేసి.. మనీలాండరింగ్ కేసులో ఇరుక్కున్నారని బెదిరించి.. అరెస్టు చేస్తామంటూ భయపెట్టి ఓ 72 ఏళ్ల వృద్ధురాలిని సైబర్ కేటుగాళ్లు నెల రోజుల పాటు డిజిటల్ అరెస్టులో ఉంచారు. బెయిల్ బాండ్ సహా వివిధ పేర్లు చెప్పి ఏకంగా రూ.2.12 కోట్లు కాజేశారు. ఈ మేరకు సోమవారం కేసు నమోదు చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నాంపల్లిలోని రెడ్‌హిల్స్ ప్రాంతంలో నివసించే రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగిని (72) బాధితురాలిగా ఈ మోసం గత నెల 7 నుంచి 30 వరకు కొనసాగింది. బాధితురాలికి గత నెల 5న గుర్తుతెలియని నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. టెలికమ్యూనికేషన్స్ శాఖ ప్రతినిధినని చెప్పిన వ్యక్తి.. ఆమె మొబైల్ నంబర్‌ను అక్రమ కార్యకలాపాలకు వినియోగించారని పేర్కొన్నాడు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారి మాట్లాడతారని చెప్పి మరో వ్యక్తితో వీడియో కాల్లో మాట్లాడించారు.తాను ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారి కరణ్ శర్మ అంటూ పరిచయం చేసుకున్న ఆ వ్యక్తి జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అనుమానితురాలిగా పరిగణిస్తున్నట్లు బాధితురాలితో చెప్పాడు. ఆమె పేరుతో కెనరా బ్యాంకు ఖాతా, ఏటీఎం కార్డు ఉన్నాయని, ఆ ఖాతా ద్వారా రూ.2 కోట్లు బదిలీ అయ్యాయని ఆరోపించాడు. ఆ ఖాతాను వినియోగించుకునేందుకు అనుమతించి 10 శాతం కమీషన్ పొందారనీ భయపెట్టాడు. తనకు ఆ వ్యవహారంతో సంబంధం లేదని బాధితురాలు చెప్పినా నిందితులు వినిపించుకోలేదు. అరెస్టు చేస్తామని, బ్యాంకు ఖాతాలు, ఆస్తులు స్తంభింపజేస్తామని బెదిరించారు. ఈ వీడియో కాల్ కట్ చేయకూడదని, ఫోన్ స్విచ్ఛాఫ్ చేయకూడదని, ఈ విషయం ఎవరికీ చెప్పకూడదని ఆదేశించారు. మొబైల్‌ను ఛార్జింగ్ పెట్టి నిరంతరం అందుబాటులో ఉండాలని కూడా స్పష్టం చేశారు. తమ మాటలు నిజమని నమ్మించేందుకు సీబీఐ, ఈడీ, ముంబై క్రైమ్ బ్రాంచ్, ఇంటర్‌పోల్, సుప్రీంకోర్టు పేర్లతో పలు పత్రాలు పంపాడు. వాటిలో అరెస్టు ఆదేశాలు, గోప్యత ఒప్పందాలు, ఖాతాల నిలుపుదల ఉత్తర్వులు, కోర్టు నోటీసులుగా కనిపించే పత్రాలు ఉన్నాయి. నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలంటే లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని, ఆధార్ కార్డు పంపాలని కోరడంతో బాధితురాలు వాటినీ పంపరు. సెప్టెంబర్ 6న 15 ప్రశ్నలతో కూడిన ‘ఇంటరాగేషన్ రికార్డు’ను వాట్సాప్ ద్వారా పంపిన కేటుగాళ్లు సమాధానాలు రాయాలని ఆదేశించారు. దీంతో బాధితురాలు జంగానే దర్యాప్తు జరుగుతోందని నమ్మిన స్వదస్తూరీతో సమాధానాలు పంపారు. ఇదిలా ఉండగా... జార్జ్ మాథ్యూస్‌గా చెప్పుకున్న వ్యక్తి ఆర్థిక లావాదేవీల బాధ్యతలు తీసుకున్నట్లు కేటుగాళ్లు చెప్పారు. ఓపక్క కరణ్ శర్మగా చెప్పుకున్న వ్యక్తి విచారణ పేరుతో బాధితురాలితో మాట్లాడుతుండగా, జార్జ్ మాథ్యూస్‌గా చెప్పుకున్న వాడు ఏ ఖాతాకు ఎంత మొత్తం బదిలీ చేయాలన్నది సూచించాడు. తాము చెప్పిన డబ్బులు బదిలీ చేస్తే 48 నుంచి 72 గంటల్లో తిరిగి ఇస్తామని నమ్మించాడు. దీంతో బాధితురాలు సెప్టెంబర్ 7న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతా నుంచి ‘గోపికా వాస్దేవ్ మెమోరియల్ సొసైటీ’ పేరుతో ఉన్న బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాకు రూ.93.70 లక్షలు బదిలీ చేశారు. కేటుగాళ్లు నగదు అందినట్లు ప్రభుత్వ రసీదు మాదిరిగా ఓ పత్రాన్ని తయారు చేసి పంపారు. మరుసటి రోజు రూ.24.70 లక్షలకు సంబంధించిన మరో రసీదును కూడా పంపారు. ఈ పత్రాలపై ఈడీ, భారత ప్రభుత్వం, సుప్రీంకోర్టు పేర్లు కూడా ఉన్నాయి. ఆ తర్వాత ‘చట్ట అమలు సంస్థల తనిఖీ కోసం ఆస్తుల సమర్పణ’ అనే పేరుతో మరిన్ని పత్రాలు పంపి వేర్వేరు బ్యాంకు ఖాతాలకు డబ్బులు బదిలీ చేయాలని చెప్పారు. ఆ ఖాతాలు ఆర్ఎన్ఎంకే సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీమతి ప్రభావతి దేవి చారిటబుల్ ట్రస్ట్, ఆల్ కచార్ ఎలక్ట్రిక్ ఆటో ఓనర్ అండ్ డ్రైవర్ అసోసియేషన్, హిలాక్సీ ఫౌండేషన్ పేర్లతో ఉన్నాయి. సెప్టెంబర్ 21 తేదీతో ‘బెయిల్ బాండ్’ పేరుతో మరో పత్రాన్ని సైబర్ నేరగాళ్లు బాధితురాలికి పంపారు. బెయిల్ కోసం రూ.30 లక్షలు చెల్లించాలంటూ మొత్తం మూడుసార్లు డిమాండ్ చేసి రూ.90 లక్షలు స్వాహా చేశారు. ఇలా సెప్టెంబర్ 7 నుంచి 30 వరకు ‘డిజిటల్ అరెస్టు’లో ఉండి మొత్తం పది లావాదేవీల్లో రూ.2,12,51,000 స్వాహా చేశారు. ఈ మొత్తంలో కొంత బాధితురాలు తన బంగారం అమ్మి కూడా చెల్లించారు. జార్జ్ మాథ్యూస్‌గా చెప్పుకున్న వ్యక్తి తనతో మాట్లాడేటప్పుడు ‘ఎంపీఎన్సీ 105’ అనే రహస్య కోడ్‌ను ఉపయోగించాలని చెప్పినట్లు బాధితురాలు పేర్కొన్నారు. అక్టోబర్ 2న ‘ప్రదీప్’ పేరుతో సేవ్ చేసుకోవాలని మరో మొబైల్ నంబర్ ఇచ్చారని, అయితే ఆ నంబర్‌కు తాను ఫోన్ చేయలేదని పేర్కొన్నారు. అక్టోబర్ 3న బాధితురాలితో ఆఖరుసారిగా మాట్లాడిన జార్జ్ మాథ్యూస్ అనే వ్యక్తి ఆపై స్పందించలేదు. దీంతో బాధితురాలు గూగుల్‌లో వెతికి తాను ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో జరుగుతున్న సైబర్ మోసానికి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.కామేష్క్రైమ్ రిపోర్టర్,సాక్షి -
ఆటోడ్రైవర్‌తో వివాహేతర సంబంధం చివరికి..!
హైదరాబాద్: వివాహం చేసుకో అని సలహా ఇచ్చిన మహిళపై ఓ వ్యక్తి కత్తితోదాడిచేసి హత్యచేశాడు. అల్లాపూర్ సీఐ నవీన్‌కుమార్ తెలిపిన మేరకు.. బీదర్‌కు చెందిన అంజలి అక్క, బావలతో కలిసి బబ్బుగూడలో నివాసముంటోంది. ఈమె భర్త సాగర్ ఓ కేసులో రెండేళ్లపాటు జైలులో ఉన్నాడు. ఆ సమయంలో సాగర్ స్నేహితుడు ఆటో డ్రైవర్ అశ్విన్ (25), అంజలి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో ఇద్దరం కలిసి జీవిద్దామని అశ్విన్ పట్టుబట్టాడు. అయితే అంజలి అందుకు ఒప్పుకోలేదు. మరొకరిని పెళ్లిచేసుకోవాలని సలహాచెప్పింది. దీంతో ఆగ్రహించిన అశ్విన్ ఈనెల 10న కత్తితో దాడి చేశాడు. రక్షించేందుకు సోదరి అశ్విని యత్నించగా ఆమెపై కూడా దాడిచేశాడు. స్థానికులు ఆసుపత్రికి తరలించగా అంజలి చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. -
స్టార్ హోటల్లో బాలికపై లైంగిక దాడి
హైదరాబాద్: సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయం పెంచుకుని బాలికను ప్రేమ పేరుతో మోసం చేసి, లైంగికంగా వేధించడంతో పాటు బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్న వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన మేరకు.. ఆసిఫ్‌నగర్‌కు చెందిన బాలికతో మహమ్మద్ ఖురేషీ సామాజిక మద్యమాల ద్వారా పరిచయం పెంచుకున్నాడు. అనంతరం బాలికకు సంబంధించిన చిత్రాలు, వీడియోలు సేకరించి వాటిని అడ్డుపెట్టుకుని బెదిరింపులకు పాల్పడ్డాడు. బంజారాహిల్స్‌లోని స్టార్ హోటల్ లీలాకు బాలికను పిలిపించి లైంగికంగా, శారీరికంగా వేధింపులకు పాల్పడ్డాడు. అంతేకాకుండా బాలిక నుంచి రూ.29 వేలు, బంగారు ఆభరణాలు, పాస్‌పోర్టు తీసుకున్నాడు. నెలసరి ఆలస్యం కావడంపై బాలిక ఆందోళన వ్యక్తంచేయగా, బలవంతంగా గర్భ నిరోధక మాత్రలను వేశాడు. నిందితుడి ఇంటికి వెళ్లి తల్లితో మాట్లాడేందుకు ప్రయత్నించగా ఇంటికి తాళం వేసి ఉంది. ఆరా తీయగా నిందితుడు తల్లితో కలిసి దుబాయ్‌కు పరారైనట్లు తెలుసుకున్నారు. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితడు మహమ్మద్ ఖురేషీపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భార్యను గొంతుకోసి హత్య చేసిన భర్త
హైదరాబాద్: భార్యపై అనుమానం పెంచుకు న్న భర్త గొంతుకోసి కి రాతకంగా ఆమెను హతమార్చిన సంఘటన రంగారెడ్డి జిల్లా బాలాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. కోల్ కతాకు చెందిన ముస్తఫా 20 ఏళ్ల క్రితం వలస వచ్చి జల్పల్లి కమాన్ ఎదురుగా ఉన్న న్యూబాబానగర్ బస్తీలో ఉంటున్నాడు. ముస్తఫా కూలి పని చేస్తుండగా, భార్య అజ్మీరా బేగం (30) ఫంక్షన్‌హాళ్ల లో పనిచేస్తోంది. వీరికి ముగ్గురు కుమారులు. ఇటీవల ఆమె ఎవరితోనో ఫోన్ మాట్లాడుతుందంటూ భర్త అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయమై తరచూ గొడవలు సైతం జరుగుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం రాత్రి 7.30 గంటల సమయంలో అజ్మీరా ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయం చూసి ముస్తఫా కత్తితో గొంతుకోసి పరారయ్యాడు. అజ్మీరా తల్లిదండ్రులు పోలీ సులకు ఫిర్యాదు చేశారు. కాగా, నిందితు డు పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయినట్లు సమాచారం. ఇదీ చదవండి: ఆటోడ్రైవర్‌తో వివాహేతర సంబంధం చివరికి..! -
రూ.20 లక్షలతో ఏసీబీకి చిక్కిన తహసీల్దార్!
హైదరాబాద్: లంచం తీసుకుంటూ అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ సుదర్శన్‌రెడ్డి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డారు. రూ.20 లక్షలు తీసుకుంటుండగా అధికారులు ఆయనను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.ఈ ఘటనకు సంబంధించి తహసీల్దార్ సుదర్శన్‌రెడ్డితో పాటు సర్వేయర్ శ్రీనివాసులును కూడా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే, ఈ లంచం వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.ఇదీ చదవండి: ‘అంతా మా డాడీ చూసుకుంటాడు లే!’ -
వాచ్‌మన్ ఉద్యోగం తీసేశారనే చిన్నారి హత్య: సీపీ సుమతి
సాక్షి, మేడ్చల్: మేడ్చల్ జిల్లా కౌకూర్‌లో ఐదేళ్ల చిన్నారి హత్య కేసులో సంచలన విషయాలు బయటకొచ్చాయి. ఐదేళ్ల చిన్నారి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసును ఛేదించిన విషయాన్ని సీపీ సుమతి వెల్లడించారు. రూ. 20 లక్షల కోసం వాచ్‌మన్‌గా పని చేసిన విక్రమ్ అనే వ్యక్తి ఈ హత్య చేశాడని సీపీ సుమతి తెలిపారు. విక్రమ్ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టి చివరకు పట్టుకున్నామన్నారు. ఈ కేసు ఛేదనకు సంబంధించిన వివరాలను సీపీ మీడియాకు తెలిపారు. తొలుత సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పరిసరాల్లో, ఆ తర్వాత పటాన్చెరులో అతడి ఫోన్ సిగ్నల్స్ గుర్తించాము. సెల్ ఫోన్ సిగ్నెల్స్ ఆధారంగా పాపను హత్య చేసిన విక్రమ్‌ను అరెస్ట్ చేశాం.తన ప్రవర్తన మార్చుకోవాలని చిన్నారి తాత, వాచ్‌మన్ విక్రమ్‌ను మందలించి వాచ్‌మన్ ఉద్యోగం నుంచి తీసేశారు. ఆ కోపంతోనే విక్రమ్ ఈ ఘాతుకం చేశాడు. కిడ్నాప్ అనంతరం పాపను నీటి సంపులో పడేయడంతో చిన్నారి మరణించింది. చిన్నారి హత్య అనంతరం ఆధారాలను మాయం చేసేందుకు కుట్ర జరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు విక్రమ్ సహా 8 మందిపై కేసు నమోదు చేశాం’ అని సీపీ సుమతి తెలిపారు. కాగా, విల్లా నంబర్ 84లో నివసించే మిల్టన్ ఫెర్నాండెజ్ కుమార్తె అరేలియా మోజెస్ శనివారం సాయంత్రం ఆడుకుంటూ కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులు ఇంటి పరిసరాల్లో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. చుట్టూ ఉన్న సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించిన పోలీసులు.. చిన్నారి వెనుక అదే నివాస సముదాయంలో గతంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసిన విక్రమ్ వెళ్లినట్లు గుర్తించారు. అనంతరం క్లబ్‌హౌస్ సెల్లార్‌లోని నీటి సంపులో చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. చిన్నారి కాళ్లు, చేతులు కట్టేసిన స్థితిలో మృతదేహం లభించింది. తనపై వచ్చిన ఫిర్యాదుల కారణంగా విక్రమ్‌ను ఉద్యోగం నుంచి తీసివేయడంతో కక్ష పెంచుకుని ఆ చిన్నారిని అపహరించి అనంతరం రూ.20 లక్షలు డిమాండ్ చేసినట్లు విచారణలో వెల్లడైంది. హత్య చేసిన సమయంలో పాప ఏడుపు ఎవరికీ వినిపించకుండా పాటలు పెట్టి ఐదేళ్ల చిన్నారి అరేలియా మోజెస్‌ను విక్రమ్ హత్య చేశాడు. మరోవైపు చిన్నారి అరేలియా మోజెస్‌ను హత్య చేసిన విక్రమ్‌ను తమకు అప్పగించాలని కుటుంబ సభ్యులు, స్థానికులు పోలీస్‌స్టేషన్ ఎదుట దర్నాకు దిగారు.చంపేసి.. ఆపై సంపులో వేసి..గాంధీ ఆస్పత్రి మార్చురీలో అరేలియా మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. చిన్నారిని చంపేసిన తర్వాతే నీటి సంపులో పడేసినట్లు పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో వెల్లడైంది. చిన్నారి మెడకు నైలాన్ తాడుతో ఉరివేసిన దుండగుడు, చనిపోయిందని నిర్ధారించుకున్నాక అదే తాడుతో కాళ్లు, చేతులను వెనుకకు మడిచి కట్టేసి నీటి సంపులో పడేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. చిన్నారిపై అత్యాచారం చేసిన ఆనవాళ్లు లేవని, నమూనాలు సేకరించి ల్యాబోరేటరీకి పంపినట్లు ఫోరెన్సిక్ వైద్యులు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం చిన్నారి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.ఇదీ చదవండి: భర్తను దారుణంగా చంపిన భార్య -
హీలియం గ్యాస్ పీల్చుకొని సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య
హైదరాబాద్: తలకు ప్లాస్టిక్ కవర్ చుట్టుకొని హీలియం గ్యాస్ పీల్చుకొని ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన మేరకు.. హర్యానాకు చెందిన సౌరభ్ శేఖర్(36) మాదాపూర్‌లోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. రాయదుర్గంలోని నాలెడ్జీసిటీలోని మై హోం భూజలో సోదరుడు లక్ష్య శేఖర్ వద్ద ఉంటున్నాడు. స్నేహితులను కలిసేందుకు వెళుతున్నాని చెప్పి శనివారం సాయంత్రం బయటకు వెళ్లాడు. కొండాపూర్‌లోని రాజరాజేశ్వరీనగర్‌లోని వీవీ హైట్స్ లో ఉన్నట్లు కుటుంబ సభ్యులకు వాట్సాప్ గ్రూపులో అదే రోజు రాత్రి మెసేజ్ పెట్టాడు. మరుసటి రోజు కుటుంబ సభ్యులు ఫోన్‌చేసినా స్పందించలేదు. ఆదివారం ఉదయం సోదరుడు వాట్సాప్‌లో పంపిన అడ్రస్‌కు వెళ్లి వాకబు చేశాడు. ఓ ఫ్లాట్‌లో తలకు ప్లాస్టిక్ కవర్, హీలియం సిలిండర్ పెట్టుకొని చనిపోయి ఉన్నాడు. గత పదేళ్లుగా అన్నం తినగానే కడుపు నొప్పి రావడం, వాంతులు అవుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. ఎలాంటి బాధ లేకుండా చనిపోయేందుకు హీలియం గ్యాస్ వాడినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. అనారోగ్యం కారణంగా చని పోతున్నానని, మమ్మీ, పప్పాకు సారీ అని నోట్రాశాడు. కేసు నమోదు చేసుకొని ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
కిడ్నాప్ ఉదంతం విషాదాంతం!
తెలంగాణ: అంతర్జాతీయ బాలికా దినోత్సవం, దేవీ శరన్నవరాత్రులు ప్రారంభమైన తొలిరోజు.. బాలా త్రిపుర సుందరీ దేవి అవతారంలో అమ్మవారిని పూజిస్తూ, బాలికలను దైవ స్వరూపాలుగా భావించే వేళ మేడ్చల్ జిల్లా కౌకూర్‌లో ఐదేళ్ల చిన్నారి హత్య ఘటన కలచివేసింది. బొల్లారం పోలీస్‌స్టేషన్ పరిధిలోని విల్లా ఆర్కిడ్స్లో నివసించే అరేలియా మోజెస్ కిడ్నాప్, హత్య స్థానికంగా తీవ్ర విషా దాన్ని నింపింది. పోలీసుల కథనం ప్రకారం.. విల్లా నంబర్ 84లో నివసించే మిల్టన్ ఫెర్నాండెజ్ కుమార్తె అరేలియా మోజెస్ శనివారం సాయంత్రం ఆడుకుంటూ కనిపించకుండా పోయింది.కుటుంబ సభ్యులు పరిసరాల్లో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమె రాల దృశ్యాలను పరిశీలించిన పోలీసులు.. చిన్నారి వెనుక అదే నివాస సముదాయంలో గతంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసిన విక్రమ్ వెళ్లినట్లు గుర్తించినట్లు సమాచారం. అనంతరం క్లబ్‌హౌస్ సెల్లార్‌లోని నీటి సంపులో చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. చిన్నారి కాళ్లు, చేతులు కట్టేసిన స్థితిలో మృతదేహం లభించింది. కేసు నమోదు చేసిన పోలీసులు హత్యకు దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారిని అపహరించిన అనంతరం రూ.20 లక్షలు డిమాండ్ చేసినట్లు విచారణలో వెల్లడైంది.గాలిస్తున్న ప్రత్యేక బృందాలుమొబైల్ సిగ్నల్స్ ఆధారంగా నిందితుడి ఆచూకీ కోసం పోలీ సులు గాలిస్తున్నారు. తొలుత సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పరిసరాల్లో, ఆ తర్వాత పటాన్చెరులో అతడి ఫోన్ సిగ్నల్స్ గుర్తించినట్లు సమాచారం. నిందితుడు విక్రమ్ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నట్లు సమాచారం. విక్రమ్ ప్రవర్తనపై ఫిర్యాదులు రావడంతో ఉద్యోగం నుంచి తొలగించారని, కక్షతోనే చిన్నారిని అపహరించి హత్య చేశాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఎంపీ ఈటల రాజేందర్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.చంపేసి.. ఆపై సంపులో వేసి..గాంధీ ఆస్పత్రి మార్చురీలో అరేలియా మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. చిన్నారిని చంపేసిన తర్వాతే నీటి సంపులో పడేసినట్లు పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో వెల్లడైంది. చిన్నారి మెడకు నైలాన్ తాడుతో ఉరివేసిన దుండగుడు, చనిపోయిందని నిర్ధారించుకున్నాక అదే తాడుతో కాళ్లు, చేతులను వెనుకకు మడిచి కట్టేసి నీటి సంపులో పడేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. చిన్నారిపై అత్యాచారం చేసిన ఆనవాళ్లు లేవని, నమూనాలు సేకరించి ల్యాబోరేటరీకి పంపినట్లు ఫోరెన్సిక్ వైద్యులు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం చిన్నారి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.ఇదీ చదవండి: నాయుడుపేటలో యువకుడి దారుణహత్య -
రెండేళ్ల చిన్నారిని బలిగొన్న సైనైడ్
హైదరాబాద్: బంగారు నగల తయారీలో వినియోగించే సైనైడ్‌ను రెండేళ్ల చిన్నారి చేతితో ముట్టుకుని.. వేళ్లను నోటిలో పెట్టుకోవడంతో అస్వస్థకు గురై మృతి చెందిన ఘటన జీడిమెట్ల పీఎస్ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఇన్స్పెక్టర్ కె.రవికుమార్ వివరాల ప్రకారం.. చింతల్ శ్రీనివాస్ నగర్‌కు చెందిన గోపి, జానకి దంపతుల కూతురు నిషా (2)తో కలిసి ఈ నెల 7న స్థానికంగా ఉన్న విష్ణు జ్యువెలర్స్ దుకాణానికి వెళ్లారు. అక్కడ సైనైడ్‌ను నిషా చేతితో పట్టుకుంది. ఆ తర్వాత వేళ్లను నోటిలో పెట్టుకున్న దృశ్యాలు దుకాణంలోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఇంటికి వెళ్లిన తర్వాత నిషా అపస్మారక స్థితికి చేరుకోవడంతో వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ మృతి చెందింది. బాలిక మృతికి జ్యువెలరీ షాప్ యాజమాన్యమే కారణమంటూ బంధువులు ఆందోళనకు దిగారు. షాపు యాజమాన్యం స్పందించకపోవడంతో చిన్నారి తల్లిదండ్రులు శనివారం జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. -
పచ్చని సంసారంలో ‘అత్తింటి ఇల్లు’ చిచ్చు!
కురవి: పచ్చని సంసారంలో కుటుంబ కలహాలు చిచ్చుపెట్టాయి. అత్తింటి స్థలంలో కట్టుకున్న ఇల్లును రెండు రోజుల్లో ఖాళీ చేయాలని పెద్దలు తీర్మానం చేయడంతో భార్యతో భర్త గొడవ పడ్డాడు. దీంతో మనస్తాపానికిగురైన భార్య..కూతురు, కొడుకును తీసుకొని తమ వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలం బలపాల శివారు లింగ్యాతండా గ్రామశివారులోని సామ్యకుంట వద్ద శనివారం జరిగింది.మృతురాలి తమ్ముడు చిన్ని, కురవి ఎస్సై సతీష్ కథనం ప్రకారం...లింగ్యా తండాకు చెందిన బానోత్ బాబులాల్ కుమారుడు నవీన్‌కు అదే తండాలోని మాలోత్ సుశీల–వీరుల కుమార్తె అనూష(31)కు పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు రుతి్వక, వర్షిణి (8), వృశాంత్కృష్ణ (4)లు ఉన్నారు. అనూష తండ్రి వీరు, అన్నయ్య గణేశ్ గతంలోనే చనిపోయారు. దీంతో బానోత్ నవీన్ అత్త సుశీల ఇచ్చిన స్థలంలో రేకుల ఇల్లు నిర్మించుకొని కిరాణాషాపు పెట్టుకుని జీవిస్తున్నాడు. కొన్నాళ్లుగా అత్తతో పంచాయితీ.. అత్త సుశీలతో నవీన్‌కు కొన్నాళ్లుగా గొడవ జరుగుతోంది. తన కూతురు, అల్లుడికి ఇంటి స్థలంలో పాటు రెండెకరాల భూమి ఇచ్చానని, తన బాగోగులు చూసుకోవడం లేదని సుశీల వారంరోజుల క్రితం పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టింది. దీంతో ఆమె ఇచ్చిన స్థలంలో కట్టుకున్న ఇంటిని ఖాళీ చేయాలని తీర్మానం చేశారు. మరో రెండు రోజుల్లో ఇల్లు ఖాళీ చేయాల్సి ఉండగా..భార్యభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతోపాటు శనివారం ఉదయం చిట్టీ డబ్బుల విషయంలో మరోసారి గొడవ జరిగింది. మనస్తాపం చెందిన అనూష తన ముగ్గురు పిల్లలను తీసుకొని ఆత్మహత్య చేసుకోవడానికి పొలం వద్దకు వెళ్తుండగా ఆమెను తన చిన్నాన్న కొడుకు చిన్ని చూసి ప్రశ్నించగా పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్తున్నాని చెప్పింది.అనుమానం వచ్చిన చిన్ని బావి వద్ద కరెంట్ లేదు... నీళ్లు ఎలా పెడతావు..అని ప్రశ్నించి వారిని బైక్ ఎక్కించుకుని తండా వైపు వెళ్లాడు. ఈ క్రమంలో అనూష బండి ఆపమని చెప్పి తన కొడుకు, కూతురుతో సహా బండి దిగింది. ఈ క్రమంలో బండిపై ఉన్న మరో కూతురు వర్షిణి కిందపడిపోయింది. వారిద్దరినీ అనూష తీసుకొని బావి వద్దకు వెళ్లగా, రుతి్వకను చిన్ని తన బండిపై ఇంటికి తీసుకెళ్లాడు.ఈ విషయాన్ని నవీన్‌కు చెప్పాడు. వెంటనే అతడు బావి వద్దకు వెళ్లగా.. అక్కడ కూడా ఇద్దరూ గొడవపడ్డారు, అనంతరం నవీన్ ఇంటికి వచ్చాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అనూష కూతురు వర్షిణి, కుమారుడు వృశాంత్ కృష్ణతో కలిసి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. సమీప రైతులు సమాచారం ఇవ్వడంతో తండావాసులు వచ్చి బావి నుంచి మృతదేహాలను బయటికి తీశారు. -
ఐదేళ్ల చిన్నారి కిడ్నాప్.. రూ.20 లక్షలు డిమాండ్!
సాక్షి తెలంగాణ: మేడ్చల్ జిల్లా కౌకూర్‌లో చిన్నారి కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. శనివారం బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలోని విల్లా ఆర్కిడ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. మిల్టన్ ఫెర్నాండెజ్ అనే వ్యక్తి తన కుమార్తె అరేలియా మౌజెస్ (5)తో కలిసి విల్లా నంబర్ 84లో ఉంటున్నారు.అదే విల్లాలో వాచ్‌మన్‌గా పనిచేస్తున్న విక్రమ్ కిడ్నాప్‌నకు పాల్పడి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. చిన్నారిని విడిచిపెట్టాలంటే రూ.20 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేసినట్లు తెలిసింది. బొల్లారం పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి ఆచూకీ కోసం విల్లా పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు.దీని వెనుక ఎవరున్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. బొల్లారంలో కిడ్నాప్ అయిన ఈ చిన్నారి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చుట్టుపక్క ప్రాంతాల్లో ఉన్నట్లు భావిస్తున్నారు. దీంతో మల్కాజ్గిరి పోలీసులు సికింద్రాబాద్‌లోని ఓ హోటల్‌తోపాటు పరిసర ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. శనివారం అర్ధరాత్రి సమయంలో డ్రోన్ కెమెరాలతోనూ పాప ఆచూకీ కోసం గాలించారు.ఇదీ చదవండి: ప్రేమ పేరుతో వేధింపులు.. 15 ఏళ్ల బాలిక బలవన్మరణం! -
ప్రేమ పేరుతో వేధింపులు.. 15 ఏళ్ల బాలిక బలవన్మరణం!
తెలంగాణ: ప్రేమపేరిట వేధింపులు భరించలేక ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లింగంపేట గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు, సీఐ రవీందర్ కథనం ప్రకారం.. లింగంపేటకు చెందిన గౌతమి (15) మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో పదో తరగతి చదువుతోంది. కొంతకాలంగా ఇదే స్కూల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థి, గౌతమిని ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నాడు.ఈ విషయంలో సదరు విద్యార్థిని గత నెలలో గౌతమి కుటుంబ సభ్యులు హెచ్చరించినా అతడిలో మార్పు రాలేదు. తరచూ ఫోన్‌కాల్స్, ఇన్‌స్ట్రాగామ్ ద్వారా సందేశాలు పంపుతూ వేధింపులకు గురి చేశాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన గౌతమి శనివారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు గౌతమి రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు.గమనిక: మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001; మెయిల్: roshnihelp@gmail.comఇదీ చదవండి: నిర్మల్ జిల్లాలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి -
నిర్మల్ జిల్లాలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి
తెలంగాణ: నిర్మల్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పత్తి పంటకు నీరు పెడుతున్న ఓ యువ రైతు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోయాడు. చేతికొచ్చిన వయసులో యువకుడు మృతి చెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.వివరాల్లోకి వెళ్తే.. నిర్మల్ జిల్లా మామడ మండలం పరిమండల్ గ్రామానికి చెందిన నూక నరేష్ (27) పత్తి చేనులో పంటకు నీరు పెడుతున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురయ్యాడు.విద్యుదాఘాతానికి గురైన నరేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.ఇదీ చదవండి: నల్లొండలో దారుణం.. ఇద్దరు బాలికల కిడ్నాప్ యత్నం! -
నల్లొండలో దారుణం.. ఇద్దరు బాలికల కిడ్నాప్ యత్నం!
తెలంగాణ: నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో ఇద్దరు మైనర్ బాలికలను కిడ్నాప్ చేసేందుకు ఓ ఆటో డ్రైవర్ యత్నించిన ఘటన కలకలం రేపింది. తమను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు గుర్తించిన బాలికలు.. నడుస్తున్న ఆటోలో నుంచి కిందకు దూకారు. ఈ ఘటనలో ఓ బాలిక తీవ్రంగా గాయపడింది.వివరాల్లోకి వెళ్తే.. శాలిగౌరారం మండలం ఊట్కూరుకు వెళ్లేందుకు ఇద్దరు బాలికలు నకిరేకల్‌లో ఆటో ఎక్కారు. వారిని ఊట్కూరుకు తీసుకెళ్తానని నమ్మించిన డ్రైవర్.. అటువైపు వెళ్లకుండా కేతేపల్లి మండలం ఇనుపాముల గుట్ట వైపు ఆటోను మళ్లించాడు. ఈ క్రమంలో మరో వ్యక్తికి ఫోన్ చేసి మాట్లాడాడు.ఫోన్లో ఆటో డ్రైవర్ మాట్లాడిన మాటలు విన్న బాలికలు అప్రమత్తమయ్యారు. ఇద్దరు అమ్మాయిలు దొరికారని, ఇనుపాముల గుట్ట వద్దకు రావాలని అతడు మరో వ్యక్తికి చెప్పినట్లు సమాచారం. దీంతో తమను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని భయపడిన బాలికలు.. కదులుతున్న ఆటోలో నుంచి రోడ్డుపైకి దూకారు. ఈ ఘటనలో ఓ బాలికకు తీవ్ర గాయాలయ్యాయి.బాలికలు రోడ్డుపై పడిపోవడాన్ని గమనించిన వాహనదారులు వెంటనే స్పందించి వారిని కాపాడారు. ఆటో డ్రైవర్‌ను పట్టుకునేందుకు ప్రయత్నించగా.. అతడు అక్కడి నుంచి పరారయ్యాడు. బాలికల అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.ఇదీ చదవండి: సాయికృష్ణ మర్మాంగంపై దారుణంగా కొట్టారు -
9 రాష్ట్రాల్లో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల భారీ ఆపరేషన్!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగర సైబర్ క్రైమ్ పోలీసులు 2026 సెప్టెంబర్‌లో నమోదైన పలు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్సీఆర్పీ) ఫిర్యాదులపై స్పందించి మొత్తం 83 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. దేశవ్యాప్తంగా 9 రాష్ట్రాల్లో ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించి 23 కేసులకు సంబంధించి 35 మంది అంతర్రాష్ట్ర నిందితులను అరెస్ట్ చేశారు. ఇందులో తెలంగాణ నుంచి 10, ఏపీ నుంచి 9, మహారాష్ట్ర నుంచి 6, కేరళ, యూపీల నుంచి ముగ్గురు చొప్పున ఉండగా, బిహార్, హర్యానా, రాజస్థాన్, పంజాబ్‌ల నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. నిందితుల బ్యాంక్ ఖాతాల్లో నిలిపివేసిన మొత్తం రూ. 88,48,134 రూపాయలను బాధితులకు అందించారు.నిందితుల నేరాల స్వభావాన్ని పరిశీలిస్తే.. సోషల్ మీడియా నేరాల్లో 9 మంది, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్‌లో 7, డిజిటల్ అరెస్ట్ కేసుల్లో 6, ట్రేడింగ్ మోసాల్లో 5 మందితో పాటు ప్రకటనలు, గుర్తింపు చౌర్యం, జాబ్ ఫ్రాడ్ తదితర మోసాలకు పాల్పడిన వారు ఉన్నారు. ఈ నెలలో మొత్తం 38 మోసపూరిత కేసుల్లో బాధితులు ₹17.34 కోట్ల మేర నష్టపోగా, పోలీసులు రూ. 88.48 లక్షలను వెనక్కి ఇప్పించారు. మరోవైపు జోనల్ సైబర్ సెల్స్ పరిధిలో 381 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి 11 మందిని అరెస్ట్ చేయడంతో పాటు రూ. 67.54 లక్షలను బాధితులకు రీఫండ్ చేయించారు. ప్రధానంగా మధురానగర్‌కు చెందిన ఓ మహిళను డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరించి రూ. 6.60 లక్షలు కాజేసిన పూణే నిందితుడు శుభమ్ మోహన్ లొండేను పోలీసులు అరెస్ట్ చేశారు.సైబర్ పెట్రోల్ విభాగం డిజిటల్ నిఘా ద్వారా మైనర్లను అసభ్యకరంగా చూపుతూ మానిటైజేషన్ పొందుతున్న 140 సోషల్ మీడియా ఖాతాలను, పాత నాణాలు, బెట్టింగ్ పేరిట నడుస్తున్న పేజీలను గుర్తించి తొలగించేలా చర్యలు తీసుకుంది. అలాగే ఆన్లైన్ గేమింగ్, అక్రమ బెట్టింగ్, నకిలీ ఇన్వెస్ట్మెంట్ సైట్లను ప్రచారం చేస్తున్న 1,457 ప్రొఫైల్స్, 2,603 పెయిడ్ ప్రకటనలను నిలిపివేసి 9 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. గణేష్ నిమజ్జనం వేళ సోషల్ మీడియాలో న్యూసెన్స్ సృష్టించిన వారిపై 6 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. అటు 'సి-మిత్ర' విభాగం ద్వారా 1,928 కాల్స్ చేసి బాధితులకు అండగా నిలవడమే కాకుండా 307 జీరో ఎఫ్ఐఆర్లను నమోదు చేశారు. కేంద్ర హోంశాఖ, I4C ఆధ్వర్యంలోని 'మనీ రిస్టోరేషన్ మోడ్యూల్' (MRM), 'గ్రీవెన్స్ రెడ్రెసల్ మెకానిజం' (GRM) పోర్టళ్ల ద్వారా నిధుల రికవరీ, ఖాతాల పునరుద్ధరణ ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు.ఈ సందర్భంగా నగర అదనపు పోలీస్ కమిషనర్ (క్రైమ్స్ & సిట్) ఎమ్ శ్రీనివాసులు, ఐపీఎస్ ప్రజలకు పలు కీలక హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వ ఉన్నతాధికారుల పేరిట వచ్చే నకిలీ సందేశాలు, అధిక లాభాలు ఆశజూపే టెలిగ్రామ్/వాట్సాప్ ఇన్వెస్ట్మెంట్ గ్రూపులు, అనుమానాస్పద ఏపీకే ఫైళ్లు, హనీ ట్రాప్/సెక్స్టార్షన్ వలల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దేశ చట్టంలో 'డిజిటల్ అరెస్ట్' అనే విధానమే లేదని, సీబీఐ, ఈడీ, పోలీసు, నార్కోటిక్స్ లేదా ఫెడెక్స్ పేరిట వచ్చే బెదిరింపు వీడియో కాల్స్‌ను నమ్మి భయపడవద్దని తెలిపారు. ఎవరైనా సైబర్ మోసానికి గురైతే తక్షణమే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు లేదా www.cybercrime.gov.in పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు. -
ట్యాంక్‌బండ్ వద్ద ఘోరం.. వైద్యం ఖర్చుల్లేక చిన్నారిని
సాక్షి, హైదరాబాద్ : ట్యాంక్‌బండ్ వద్ద విషాదకర ఘటన చోటు చేసుకుంది. వైద్యం చేయించే స్తోమతలేదనే కారణంతో తన ఆరేళ్ల కుమార్తెను తల్లి హుస్సేన్ సాగర్‌లో విసిరేసింది. ఆ సమయంలో అటుగా వెళుతున్న ఆటోడ్రైవర్ వెంటనే స్పందించి ఆ పాపను కాపాడారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ప్రస్తుతం చిన్నారి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అయితే ఆ తల్లి, పాప ఎవరూ ఆ పాప ఆరోగ్య పరిస్థితి ఏమిటి అనే వివరాలు తెలియాల్సి ఉంది. -
పెద్దపల్లిలో హల్చల్.. పల్సర్‌పై ఫాలో.. మహిళ మెడలో చైన్ చోరీ!
కరీంనగర్: పెద్దపల్లి జిల్లా, రామగుండం ఎన్టీపీసీ కృష్ణానగర్‌లో చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళను లక్ష్యంగా చేసుకున్న ఇద్దరు దుండగులు పల్సర్ బైక్‌పై వెనుక నుంచి వచ్చి ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును అపహరించారు. ఊహించని ఘటనతో బాధితురాలు ఒక్కసారిగా షాక్‌కు గురైంది. చైన్ లాక్కున్న వెంటనే దుండగులు అదే బైక్‌పై వేగంగా అక్కడి నుంచి పరారయ్యారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అలాగే, సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తూ దుండగుల కోసం గాలింపు చేపట్టారు. బైక్ నంబర్, నిందితుల ఆనవాళ్ల ఆధారంగా వారిని గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.ఇదీ చదవండి: సుక్మాలో మందుపాతర పేలుడు.. నలుగురు జవాన్లకు తీవ్ర గాయాలు! -
ఖమ్మం బైపాస్ రోడ్డుపై ఘోర ప్రమాదం.. మూడేళ్ల చిన్నారి మృతి!
ఖమ్మం: జిల్లాలోని బైపాస్ రోడ్డుపై ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌పై తల్లిదండ్రులతో కలిసి ప్రయాణిస్తున్న మూడేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు రోడ్డుపై పడిపోగా.. వెనుక నుంచి వచ్చిన లారీ చిన్నారి తలపై నుంచి వెళ్లింది. ఈ ఘటనలో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది.పోలీసుల వివరాల ప్రకారం.. కల్లూరు మండలం ఎర్రబోయినపల్లి గ్రామానికి చెందిన జెట్టి అశోక్ తన భార్య, మూడేళ్ల కుమార్తెతో కలిసి బైక్‌పై ఖమ్మం నగరానికి వచ్చారు. బైక్‌పై తల్లిదండ్రుల మధ్య చిన్నారిని కూర్చోబెట్టుకుని వెళ్తుండగా ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ట్రాఫిక్ సిగ్నల్ గ్రీన్ పడింది. దీంతో అశోక్ బైక్‌ను ముందుకు కదిలించాడు.ఈ క్రమంలో మధ్యలో కూర్చున్న చిన్నారి ఒక్కసారిగా బైక్‌పై నుంచి జారి రోడ్డుపై పడిపోయింది. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న లారీ చిన్నారి తలపై నుంచి వెళ్లడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది.కళ్లముందే కుమార్తె మృతి చెందడంతో తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ప్రమాద వివరాలను సేకరించారు. లారీని ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఇదీ చదవండి: పెళ్లైనా పాత బంధాన్ని వదల్లేక కిరాతకం -
చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి
తెలంగాణ: రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ బైక్‌ను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు.స్థానికుల అందించిన వివరాల ప్రకారం.. మొయినాబాద్ మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి మధు తన భార్య సావిత్రి, కుమారుడు, కుమార్తెలుగా తెలుస్తోంది. వీరు కుటుంబంతో కలిసి బైక్‌పై వెళ్తుండగా.. గొల్లపల్లి పరిధిలోని మజీద్ మలుపు వద్ద గుర్తుతెలియని ఓ వాహనం వీరి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో ఇద్దరు దంపతులతో పాటు, కుమారుడు అక్కడికక్కడే ప్రాణాలను కోల్పోయారు. అయితే వారితో పాటు బైక్‌పై ప్రయాణిస్తున్న కుమార్తె ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడింది.అలాగే, ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ప్రమాదాన్ని పరిశీలించారు. మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కాగా, బైక్‌ను ఢీకొట్టిన వాహనం, అలాగే ప్రమాదానికి గల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.ఇదీ చదవండి: కర్నూలు జిల్లాలో అక్రమ టపాసుల నిల్వ.. పోలీసుల భారీ సీజ్! -
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో బంగారం పట్టివేత.. ప్రయాణికుడి పక్కా ప్లాన్!
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా విదేశీ బంగారం పట్టుబడింది. సుమారు రూ.2.25 కోట్ల విలువైన 1.48 కిలోల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తిరుచ్చి నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు ఈ బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు.అయితే, అధికారుల కళ్లుగప్పి బంగారాన్ని తరలించేందుకు ప్రయాణికుడు పక్కా ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. దుస్తుల కింద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పౌచ్‌లో బంగారాన్ని దాచినట్లు సమాచారం. అలాగే విమానంలో దాచిన బంగారాన్ని బయటకు తీస్తుండగా డీఆర్ఐ అధికారులు అతడిని పట్టుకున్నారు.దీంతో ప్రయాణికుడి వద్ద ఉన్న 1.48 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారం విలువ సుమారు రూ.2.25 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రయాణికుడిని అరెస్ట్ చేసి, బంగారం ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? ఎక్కడికి తరలించాలనుకున్నాడు? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.ఇదీ చదవండి: ఢిల్లీలో భూకంపం.. ఒక్కసారిగా కంపించిన భూమి! -
5 నిమిషాల్లో రూ. 2 కోట్ల బంగారం లూటీ!
సాక్షి, హైదరాబాద్/మేడిపల్లి: హైదరాబాద్ శివారులోని మేడిపల్లి పోలీసుస్టేషన్ పరిధిలో సోమవారం తెల్లవారుజామున భారీ చోరీ జరిగింది. వరంగల్ జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ఓ జ్యువెలరీ దుకాణాన్ని అంతర్రాష్ట్ర దొంగల ముఠా కొల్లగొట్టి కేవలం 5 నిమిషాల్లో ఏకంగా రూ. 2 కోట్ల విలువజేసే 1.4 కిలోల బంగారు, వజ్రాభరణాలతో పరారైంది. పోలీసు స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే ఈ చోరీ జరగడం గమనార్హం. సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలను అధ్యయనం చేసిన పోలీసులు దుకాణం షెట్టర్ రోడ్డుపై ఉన్న వారికి కనిపించకుండా తెల్లని వస్త్రం అడ్డుపెట్టి దొంగలు ఈ నేరం చేసినట్లు తేల్చారు. రాజస్తాన్‌కు చెందిన ఏడుగురు ఈ చోరీకి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.పక్కాగా పంజా... హనుమకొండకు చెందిన వెలిశెట్టి సుబ్రహ్మణ్యం టాటా కంపెనీకి చెందిన క్యారెట్‌లేన్ జ్యువెలరీ దుకాణాల ఫ్రాంచైజీ కలిగి ఉన్నారు. హనుమకొండలో ఒకటి, మేడిపల్లి బుద్ధనగర్‌లో మరొకటి నిర్వహిస్తున్నారు. అయితే ఈ జ్యువెలరీ ఫ్రాంచైజీకి కాపలాగా సెక్యూరిటీ గార్డు లేకపోవడంతో దొంగలు దీన్ని టార్గెట్ చేశారు. ఒకటిరెండు రోజులు గమనించి పక్కా పథకం ప్రకారం సోమవారం తెల్లవారుజామున పంజా విసిరారు. మొత్తం ఏడుగురు సభ్యులతో కూడిన ముఠా తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఈ దుకాణం వద్దకు చేరుకుంది. రహదారి పక్కన ప్రయాణికుల మాదిరిగా నిల్చున్న దొంగలు దుకాణం పరిసరాలను పరిశీలించి కాసేపు దూరంగా వెళ్లారు. ఆపై తెల్లవారుజామున 4:07 గంటలకు దుకాణం షట్టర్ వద్దకు ముగ్గురు రాగా మిగిలిన నలుగురు రోడ్డుపైనే ఆగిపోయారు. షట్టర్ వద్దకు వచ్చిన ముగ్గురు దొంగల్లో ఒకడు వెంట తెచి్చన ఓ వ్రస్తాన్ని షెట్టర్‌కు అడ్డుగా పెట్టి నిల్చోగా మిగిలిన ఇద్దరూ షెట్టర్ పక్కనున్న అలారం వైర్లను తొలుత కత్తిరించారు. ఆపై షెట్టర్ తాళాలను పగులగొట్టారు. అనంతరం ఆ వస్త్రాన్ని దుకాణం ఎదురుగా ఉన్న ట్రాన్స్ఫార్మర్ మాటున దాచి కాస్త దూరంగా వెళ్లి వాహనాల రాకపోకలు, జనసంచారమేదీ లేదని నిర్ధారించుకున్నారు.షట్టర్‌కు అడ్డు పెట్టడానికి వస్త్రాన్ని తెస్తున్న ముఠా సభ్యుడు ఐదు నిమిషాల్లో చోరీ పూర్తి... తెల్లవారుజామున 4:18 గంటలకు రోడ్డుపై ముగ్గురు కాపు కాయగా... నాలుగో వ్యక్తి ఆ వ్రస్తాన్ని షట్టర్‌కు మరోసారి అడ్డుగా పెట్టి నిల్చున్నాడు. మిగిలిన ముగ్గురూ ఆ తెరను చాటుగా చేసుకొని షెట్టర్ వద్ద నక్కారు. వారిలో ఇద్దరు షెట్టర్‌ను ఎత్తిపట్టుకోగా మరొకడు లోపలకు ప్రవేశించి ఐదు నిమిషాల వ్యవధిలో ఆరు ఫ్లాట్ బెడ్స్ (షోకేసులు) పగులగొట్టి వాటిలోని 435 ఉంగరాలు, 88 బ్రేస్లెట్లు, 19 గాజులు, 17 నెక్లెస్‌లు, 9 చెవి రింగులు, 8 పెండెంట్లు, 2 గొలుసులు, మంగళసూత్రం, ముక్కుపుడక కలిపి 580 ఆభరణాలను సంచిలో సర్దుకొని బయటకు వచ్చేశాడు. ఈ క్రమంలో టార్చిలైట్తోపాటు నాలుగు ఉంగరాలు షట్టర్ వద్ద పడిపోగా మిగిలిన సొత్తుతో నిందితులు ఉప్పల్ వైపు నడుచుకుంటూ వెళ్లారు. కాస్త దూరం వెళ్లాక ఆటో ఎక్కి ఉడాయించారు. నేరం జరిగిన సమయంలో దుకాణంలో రూ. 7 కోట్ల విలువైన సరుకు ఉంది. సోమవారం ఉదయం 7 గంటల వేళ దుకాణం వద్దకు వచ్చిన మేనేజర్ శ్రీనివాస్ చోరీ విషయాన్ని గుర్తించి యజమానితోపాటు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఉప్పల్ డీసీపీ సురేశ్‌కుమార్, మేడిపల్లి ఏసీపీ మోహన్ కుమార్, ఇన్స్పెక్టర్ జలందర్‌రెడ్డి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్లూస్ టీంను రప్పించి పలు ఆధారాలు సేకరించారు. సీసీ కెమెరాల్లో నమోదైన వివరాలతోపాటు ఇతర అంశాలు అధ్యయనం చేసి ఇది రాజస్తాన్ ముఠా చోరీగా భావిస్తున్నారు. నిందితుల కోసం రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు ఆటోడ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని ప్రశి్నస్తున్నాయి. అతడు చెప్పిన వివరాల ఆధారంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌తోపాటు ఇతర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల నుంచి ఫుటేజ్ సేకరించి విశ్లేషిస్తున్నారు. దుండగులు రైల్లో పారిపోయి ఉంటారనే అనుమానంతో ఆయా రాష్ట్రాల జీఆర్పీ అధికారులను అప్రమత్తం చేశారు. -
తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతు ఆత్మహత్య
మహబూబ్‌నగర్ క్రైం: భూ వివాదంతో మనస్తాపానికి గురైన ఓ రైతు తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. నాలుగు రోజుల కిందట నలుగురు వ్యక్తులు భూమిలో ఏర్పాటు చేసిన హద్దు రాళ్లు తొలగించడంతో పాటు పంట నష్టం చేశారు. ఊర్లో పెద్దమనుషుల మధ్య పంచాయితీ పెట్టినా రాజీ కుదరకపోగా.. తిరిగి అతడిపైనే దాడి చేయడంతో.. తీవ్ర మనస్తాపానికి గురై లావప్ప (54) ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా కోయిలకొండ తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో శనివారం చోటుచేసుకుంది. కోయిలకొండ ఎస్ఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. పారుపల్లి శివారులోని సర్వే నంబర్ 211లో మొత్తం 18 ఎకరాల 39 గుంటల భూమి ఉంది. ఇందులో ఎకరం 7 గుంటల భూమి మిస్సింగ్ సర్వే నంబర్ కింద ఉన్నట్లు తెలుస్తోంది. ఈ భూమి లావప్ప సోదరి లక్ష్మమ్మ పేరుపై ఉన్నట్లు సమాచారం. ఆమె భర్త మృతి చెందడంతో లావప్ప వద్దే ఉంటుండగా, ఆ భూమిని ఆయనే సాగుచేస్తున్నాడు. ఈ భూమి విషయంలో లావప్పకు, ఆయన బంధువులు లక్ష్మయ్య, చంద్రశేఖర్, విష్ణు, రామకృష్ణకు మధ్య సుమారు 20 ఏళ్లుగా వివాదం కొనసాగుతోంది. ఈ వ్యవహారంపై ఇరువర్గాలు కోర్టును ఆశ్రయించగా ప్రస్తుతం కేసు విచారణలో ఉంది. ఎకరం 7 గుంటల భూమిని తన పేరుపై రిజిస్ట్రేషన్ చేయాలని లావప్ప కొంతకాలంగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. నాలుగు రోజుల క్రితం లక్ష్మయ్య, చంద్రశేఖర్, విష్ణు, రామకృష్ణలు కలిసి ఆ పొలంలోని హద్దు రాళ్లు తొలగించి, పంటకు నష్టం చేశారని లావప్ప ప్రశ్నించడంతో అతడిపై దాడికి యత్నించారని ఆయన కుమారుడు కుర్మయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనలతో తీవ్ర మనస్తాపానికి గురైన లావప్ప శనివారం ఉదయం 6.30 గంటల సమయంలో తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు లక్ష్మయ్య, చంద్రశేఖర్, విష్ణు, రామకృష్ణలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నాగరాజు తెలిపారు. కాగా, సర్వే నంబర్ 211లోని భూమిపై క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపినట్లు కోయిలకొండ తహసీల్దార్ శ్రీధర్‌రావు తెలిపారు. ఈ భూమితో లావప్పకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. మంత్రి పరామర్శ లావప్ప ఆత్మహత్య విషయం తెలుసుకున్న రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి శనివారం ఆయన కుమారుడు కుర్మయ్యతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నట్లు సమాచారం. సమస్యపై వెంటనే విచారణ జరిపి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని మహబూబ్‌నగర్ ఆర్డీవోను మంత్రి ఆదేశించినట్లు తెలుస్తోంది.


