విద్యార్థినిపై కీచక టీచర్‌ దారుణం.. ఘటనలో ఏడుగురు అరెస్ట్ | Narayanpet Teacher Misbehave With Student Case Updates | Sakshi
Sakshi News home page

విద్యార్థినిపై కీచక టీచర్‌ దారుణం.. ఘటనలో ఏడుగురు అరెస్ట్

Mar 30 2026 11:35 AM | Updated on Mar 30 2026 11:55 AM

Narayanpet Teacher Misbehave With Student Case Updates

నారాయణపేట: మద్దూరు మండలంలోని మోమినాపూర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఘటనలో ఏడుగురిపై పోక్సో కేసు నమోదు చేసి.. రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ డా.వినీత్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్పీ వివరాల మేరకు.. ప్రధాన నిందితుడు పెద్దూరుపాడుకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు చండేపల్లి స్వామి ఓవిద్యార్థినితో అనుచితంగా ప్రవర్తించినట్లు సీసీ కెమెరాలో రికార్డు కాగా.. మరో టీచర్‌ గుర్నాథ్‌రెడ్డి ఆ వీడియోను ఉపాధ్యాయుడు కర్ని చెన్నకేశవులు దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పట్టించుకోలేదు. దీంతో గుర్నాథ్‌రెడ్డి సదరు వీడియోను సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేయించారు.

ఈ విషయంపై గ్రామానికి చెందిన గుల్ల రవికుమార్, బి.ఆనంద్, నిడ్జింత విజయ్‌కుమార్, మేకల రవి సదరు వీడియోను అనధికారికంగా పంచుకోవడంతో పాటు అదే గ్రామంలో రాజీ ప్రయత్నాలు వంటి చర్యలకు పాల్పడ్డారు. ఈ కేసును డీఎస్పీ నల్లపు లింగయ్య విచారించగా.. విద్యారి్థనిపై ప్రధాన నిందితుడు పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. అతడితో పాటు అతడికి సహకరించిన వ్యక్తులపై పోక్సో, ఐటీ, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టాల కింద కేసులు నమోదు చేసి.. సీసీ కెమెరాలు, మొబైల్‌ ఫోన్లు స్వా«దీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.

ఏడుగురు నిందితులను కోర్టులో హాజరుపర్చగా.. రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు. జిల్లాలోని విద్యాసంస్థల్లో విద్యార్థుల భద్రత అత్యంత ప్రాధాన్యతగా భావిస్తున్నామని.. ఇలాంటి ఘటనలు ఎక్కడైనా జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సమస్యలను చట్టపరంగా పరిష్కరించకుండా స్వయంగా రాజీ ప్రయత్నాలు చేయడం.. లేదా నేరాలను దాచిపెట్టడం వంటి చర్యలకు పాల్పడితే తీవ్రమైన నేరాలుగా పరిగణించి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement