కట్టుకున్నవారే కాలయముళ్లు | Wife assassination 8 months after love marriage | Sakshi
Sakshi News home page

కట్టుకున్నవారే కాలయముళ్లు

Apr 5 2026 4:40 AM | Updated on Apr 5 2026 4:40 AM

Wife assassination 8 months after love marriage

ప్రేమ పెళ్లి చేసుకున్న 8 నెలలకే భార్య హత్య 

మరో ఘటనలో అనుమానంతో భార్య గొంతు కోసిన భర్త

అడ్డాకుల/పటాన్‌చెరు టౌన్‌: రక్షణ గా ఉండాల్సిన భర్తలే భార్యల పాలిట కాలయముళ్లు అయ్యారు. వేర్వేరు జిల్లాల్లో జరిగిన ఈ సంఘ టనలు కలకలం రేపాయి. ఒకచోట ప్రేమించి పెళ్లి చేసుకున్న ఎనిమిది నెలలకే మనస్పర్థలతో భార్య ప్రా ణం తీస్తే.. మరోచోట అనుమానంతో పెళ్లయిన ఏళ్ల తర్వా త భార్యను కిరాతకంగా గొంతు కోసి చంపాడొక భర్త. వివరా లివి. మహబూబ్‌నగర్‌ జిల్లా మూసాపేట మండలం పోల్కంపల్లి గ్రామానికి చెందిన నర్సు కె.శ్రీదేవి (21).. అదే గ్రామా ని కి చెందిన చందుతో ప్రేమలో పడింది. 

కులాలు వేరైనా ఎని మిది నెలల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. తర్వాత పెద్దలను ఒప్పించి గ్రామంలో చందు ఇంట్లోనే ఉంటూ కాపు రం చేస్తున్నారు. ఇటీవల భార్యభర్తల మధ్య మనస్పర్థలు పెరిగాయి. చందు నిత్యం తన భార్యను హింసించేవాడు. ఈక్రమంలో శుక్రవారం రాత్రి భార్యను కొట్టి గొంతు నులిమి చంపాడు. పొలం వద్ద చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసు కుందనేలా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. చివరికి గ్రామస్తు ల సమాచారంతో ఎస్‌ఐ ఎం.వేణు పొలం వద్దకు చేరుకుని విచారణ చేపట్టారు. 

మృతురాలి భర్త చందును అదుపులోకి తీసుకుని విచారించారు. యువతి మృతదేహానికి జిల్లా ఆస్ప త్రిలో శనివారం పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత సాయంత్రం గ్రామానికి తీసుకొచ్చారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత ఏర్పడింది. చందు అక్కడికి వచ్చే వరకు అంత్యక్రియలు నిర్వహించేది లేదని మృతురాలి బంధువులు పట్టుబట్టారు. మహబూబ్‌నగర్‌ డీఎస్పీ వెంకటేశ్వర్లు గ్రామానికి చేరుకుని ఇరువర్గాలకు నచ్చజెప్పారు. ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా అడ్డాకుల, దేవరకద్ర ఎస్‌ఐలు శ్రీనివాస్, నాగన్న బందోబస్తు చేపట్టారు. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు చందుపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఎం.వేణు తెలిపారు. 

అనుమానమే పెనుభూతమై..
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కోనసీ మ జిల్లా, అల్లవరం మండలం మొగలమూరుకు చెందిన పరమేశ్వరరావు, లీలా వతి (54) దంపతులు పటా న్‌చెరు ఏపీఆర్‌ కాలనీలో కుమారుడు మహావీర్‌ ఆరు ద్ర, కోడలు సుజాతతో కలి సి ఉంటున్నారు. కాగా కొంతకాలంగా పరమేశ్వరరావు, లీలావతి పై అనుమానం పెంచుకొని తరచూ గొడవ పడుతు న్నాడు. శనివారం ఉదయం కూడా భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. కుమారుడు, కోడలు తమ కుమారునికి వ్యాక్సిన్‌ వేయించేందుకు ఉదయం 10 గంటల సమయంలో బయటికి వెళ్లారు. 

ఈ క్రమంలో పరమేశ్వరరావు కూరగా యలు కోసే కత్తితో లీలావతి గొంతుకోసి పరారయ్యాడు. కుమారుడు, కోడలు వచ్చి చూసేసరికి లీలావతి రక్తపు మడు గులో చనిపోయి ఉండటంతో అరుస్తూ బయటికి వచ్చారు. సమాచారం అందుకున్న సీఐ రాజు సిబ్బందితో కలిసి ఘట నా స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. క్లూస్‌ టీం బృందాన్ని రప్పించి ఆధారాలు సేకరించారు. పరారైన పరమేశ్వరరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement