HYD: ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య | Tragedy at Kukatpally, Hyderabad | Sakshi
Sakshi News home page

HYD: ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య

Mar 31 2026 4:22 PM | Updated on Apr 1 2026 12:03 PM

Tragedy at Kukatpally, Hyderabad

సాక్షి, హైదరాబాద్‌: కూకట్‌పల్లిలో దారుణం జరిగింది. ఇద్దరు కుమారులను హత్య చేసి తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన కైతలాపూర్‌ రాఘవేంద్ర కాలనీలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్‌ టీమ్‌ సైతం రంగంలోకి దిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.  

పోలీసుల దర్యాప్తులో తల్లి స్రవంతి ముందుగా ఇద్దరు కుమారులు కార్తిక్‌,కౌశిక్‌లను హత్య చేసింది. ఇద్దరు చనిపోయారని నిర్ధారించుకున్న తరువాత తల్లి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

మరోవైపు, భార్య స్రవంతిని వదిలేసి భర్త ప్రవీణ్ రెండో పెళ్లి చేసుకున్నాడు. దీంతో అత్తమామలు స్రవంతికి కొంత స్థలాన్ని రాసిచ్చారు. అయితే, ఆ స్థలాన్ని తిరిగి ఇవ్వాలని భార్యను వేధిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో, ఇదే కారణంగా భార్య, పిల్లలను భర్త ప్రవీణ్ హత్య చేసి ఉండవచ్చని బాధితురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement