హనుమకొండలో ఘోరం.. స్విమ్మింగ్‌పూల్‌లో పడి.. | Mother And Her Two Daughters Found Dead In Swimming Pool In Hanamkonda | Sakshi
Sakshi News home page

హనుమకొండలో ఘోరం.. స్విమ్మింగ్‌పూల్‌లో పడి..

Apr 2 2026 10:56 AM | Updated on Apr 2 2026 11:23 AM

Mother And Her Two Daughters Found Dead In Swimming Pool In Hanamkonda

హనుమకొండ జిల్లా: అనుమానాస్పద స్థితిలో స్విమ్మింగ్‌ పూల్‌లో పడి తల్లి, ఇద్దరు కూతుళ్లు మృతి చెందిన ఘటన మండలంలోని పున్నేలు క్రాస్‌ సమీపంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలంలోని పున్నేలు గ్రామానికి చెందిన అజారుద్దీన్‌ – ఫర్హత్‌(26) దంపతులకు ఇద్దరు కుమారైలు ఉమేరా(8), అయేషా(6) ఉన్నారు. వీరి కుటుంబానికి ఓ వెంచర్‌లో స్విమ్మింగ్‌ పూల్‌ ఉండగా.. దానిని నడుపుకుంటూ జీవనం సాగిస్తుండేవారు. 

తరచూ వెళ్లే మాదిరిగానే బుధవారం రాత్రి కుటుంబ సమేతంగా స్విమ్మింగ్‌ పూల్‌కు వెళ్లినట్లు తెలిసింది. ఈక్రమంలో ఏం జరిగిందో తెలియదు కానీ ఇద్దరు కూతుళ్లతో పాటు తల్లి స్విమ్మింగ్‌ పూల్‌లో పడి అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉన్నారు. కుటుంబ సభ్యులు, స్థానికులు మృతదేహాలను బయటికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. తల్లి, కూతుళ్ల మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

 ప్రమాదవశాత్తు మృతిచెందినట్లుగా భర్త అజారుద్దీన్‌ చెబుతున్నాడు. ఇటీవల అయేషా మూడోసారి గర్భం దాల్చడం విషయంలో దంపతులకు గొడవలు జరుగుతున్నాయని, అనుమానాస్పద స్థితిలో మృతి చెందలేదని తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. మృతురాలి తండ్రి అలీ అనుమానాస్పద మృతిగా ఫిర్యాదు చేసినట్లు ఎస్సై పస్తం శ్రీనివాస్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement