breaking news
-
గుంటూరు బాధితురాలికి వైఎస్సార్సీపీ నేతల పరామర్శ
సాక్షి, గుంటూరు: ఏపీలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్సార్సీపీ మహిళా నేతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని కృష్ణబాబు కాలనీలో జరిగిన కీచక ఘటనపై వాళ్లు తీవ్రంగా స్పందించారు. సోమవారం బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వంపై ధ్వజమెత్తడంతో పాటు పోలీసుల తీరును తీవ్రంగా తప్పుబట్టారు.వైఎస్సార్సీపీ మహిళా అధ్యక్షురాలు వరుదు కళ్యాణి, మాజీ మంత్రి విడదల రజిని, కాకాని పూజిత, నూరి ఫాతిమా, ఉప్పాల హారిక తదితర నేతలు బాధిత కుటుంబాన్ని కలిశారు. బాధితురాలికి ధైర్యం చెప్పి, పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.“ఫిర్యాదును పోలీసులు పక్కన పెట్టారు”ఈ సందర్భంగా మాజీ మంత్రి విడదల రజిని కూటమి ప్రభుత్వంపై, పోలీసులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బాధితురాలు ముందుగానే పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. “మహిళను వివస్త్రను చేసి కొట్టారు. ఏపీలో బిహార్ కంటే దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. బాధితురాలి ఫిర్యాదును పోలీసులు పక్కన పెట్టారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు గూండాల్లా వ్యవహరిస్తున్నారు. మహిళపై టీడీపీ నేత దౌర్జన్యంగా వ్యవహరించారు” అని రజిని విమర్శించారు.రాష్ట్రంలో మహిళలపై వరుస దాడులు జరుగుతున్నాయి. టీడీపీ నేతలు అధికార మదంతో వ్యవహరిస్తున్నారు. ఇక్కడ మహిళపై టీడీపీ నేత దౌర్జన్యంగా ప్రవర్తించాడు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. కూటమి ప్రభుత్వం రక్షణ కల్పించడంలో విఫలమైంది. గూండా రాజ్యం నడుస్తోంది అని వరుదు కల్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.మహిళల భద్రతపై ప్రశ్నలురాష్ట్రంలో మహిళల భద్రతపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని వైఎస్సార్సీపీ మహిళా నేతలు డిమాండ్ చేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. జరిగింది ఇదే.. గుంటూరు కృష్ణబాబు కాలనీలో చోటుచేసుకున్న ఘటన.. సంచలన చర్చకు దారి తీసింది. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. ఈ నెల 15వ తేదీ రాత్రి ఆమె తన ఇంటి ముందు ఉన్న కుళాయి నుంచి మోటార్ ద్వారా నీటిని పట్టుకుంటుండగా వివాదం మొదలైంది. 21వ డివిజన్ టీడీపీ కార్యదర్శి మల్లెల వెంకటరమణమూర్తి, ఆయన కుటుంబ సభ్యులు నీటి విషయంలో ఆమెతో వాగ్వాదానికి దిగారు. అనంతరం ఆమె ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేయగా.. మూర్తి సోదరి, ట్రాన్స్‌జెండర్ మాధవి దాడి చేసి కొట్టారు.ఆ తర్వాత ఆమెపై దాడి చేస్తూ దుస్తులు చింపివేసి అవమానించారు. రోడ్డుపైనే తనను వివస్త్రగా ఉంచి దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఆమె వేడుకున్నా కనికరించలేదు. స్థానిక మహిళలు జోక్యం చేసుకుని బాధితురాలికి దుస్తులు అందించి ఆదుకున్నారు. ఈ ఘటనపై బాధితురాలు ఈ నెల 16న పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మల్లెల వెంకటరమణమూర్తి, ఆయన సోదరి సహా తొమ్మిది మందిపై కేసు నమోదు చేశారు. -
బాబూ.. రైతు కన్నీటితో అమరావతా?
కర్షకులకు, భూమికి ఉండే అవినాభావ సంబంధం మాటలకు అందనిది. ఆ భూమిని నమ్ముకుని రైతు జీవనం సాగిస్తాడు. పంటలు వేసుకుని పసిపిల్లాడిని సాకుతున్నట్లుగా చూసుకుంటాడు. అలాంటి పంటపొలం నాశనం అవుతుంటే విలవిలలాడిపోతాడు. ఏపీ రాజధాని అమరావతిలోని కొన్ని గ్రామాలలో రైతులు పడుతున్న ఆవేదన, వారికి ఎదురైన దారుణమైన అనుభవం చూసేవారి కంట నీరు తెప్పిస్తుంది. సడన్‌గా ప్రభుత్వ అధికారులు, పోలీసులు వచ్చి పంటలను వారి కళ్లెదుటే ధ్వంసం చేస్తుంటే ఆ రైతులు, రైతు మహిళలు ఎవరికి చెప్పుకోవాలి. తమను రక్షించవలసిన ప్రభుత్వమే క్రూరంగా వ్యవహరిస్తుంటే రోదనలు, వేదనలు తప్ప ఏమి మిగులుతాయి!కొద్దిరోజుల క్రితం ఉండవల్లి గ్రామంలో కొన్ని భూములను సేకరించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం అనుసరించిన పద్దతి ఏ మాత్రం నాగరికంగా లేదన్న విమర్శలు వస్తున్నాయి. బుల్ డోజర్లు, జేసీబీలు తెచ్చి పచ్చని పంటలను దున్నేస్తుంటే, అక్కడ ఉన్న మహిళల ఆక్రందనలు ఆకాశానికి అంటాయి. అక్కడికి సమీపంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం ఉంది. ఈ రైతుల ఆక్రందనలు ఆయనకు వినిపంచలేదా అంటే ఏమి చెబుదాం. ఇదే తరహాలో ఎక్కడైనా గత వైఎస్సార్సీపీ పాలనలో జరిగి ఉంటే అప్పట్లో ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబు నాయుడు ఎన్ని ఆరోపణలు చేసేవారో చెప్పలేం. ఎల్లో మీడియా అయితే నానా రభస సృష్టించేవి.కృష్ణానది గర్భంలో పర్యావరణానికి విరుద్దంగా, అనుమతులు లేకుండా 2014 టరమ్‌లో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ప్రజావేదిక పేరుతో ఒక నిర్మాణం చేసింది. ప్రభుత్వమే ఇలా నిబంధనలకు విరుద్దంగా నిర్మించడం ఏమిటని, 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం కూల్చివేసింది. దానిని విధ్వంసంగా అభివర్ణిస్తూ చంద్రబాబుతో పాటు, ఇతర పార్టీల నేతలు నానా రచ్చ చేశారు. ఐదేళ్లపాటు అదే ప్రచారం చేశారు. ఆ వేదిక కూల్చడం వల్ల ప్రజలకు ఒక స్పష్టమైన సంకేతం వెళ్లింది. ఎవరూ చట్టాన్ని అతిక్రమించరాదన్న విషయాన్ని తెలియచేసినట్లయింది. అయినా అలా చేయడాన్ని తప్పు అని చెప్పిన టీడీపీ ఇప్పుడు ఏకంగా రైతుల జీవితాలు ధ్వంసం అయ్యేలా పంట పొలాలను నాశనం చేయడం ధర్మమేనా అని అడిగితే బదులు ఇచ్చేవారు లేరు. పైగా ఎల్లో మీడియా అలాంటి అకృత్యాలకు అండగా నిలబడి ఆ వార్తలను కప్పిపుచ్చే యత్నం చేసింది.కొన్నాళ్ల క్రితం ఒంగోలు సమీపంలోని కరేడు వద్ద కూడా బలవంతపు భూ సేకరణకు ప్రయత్నిస్తే రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఉండవల్లి, పెనుమాక, తదితర కొన్ని గ్రామాల రైతులు రాజధాని అవసరాలకు పొలాలు ఇవ్వకపోలేదు. సీడ్ యాక్సిస్ రోడ్డుకు కావల్సిన భూమి తీసుకుని, మిగిలినది తమకే వదలివేయాలని వారు కోరారు. ఆ భూమి ఇవ్వడానికి వీరు ఇష్టపడలేదు. అయినా ప్రభుత్వం వారితో సంప్రదింపులు జరిపి, వారు కోరిన విధంగా పరిహారం ఇచ్చి భూములు తీసుకోవచ్చు. అలాకాకుండా మార్కెట్ రేట్ కన్నా తక్కువ మొత్తాన్ని ఏకపక్షంగా వారి ఖాతాలలో జమచేసి భూములు లాక్కోవడం సమంజసమేనా? అందులోను రెండు, మూడునెలల్లో పంటలు వచ్చేవరకు ఆగకుండా వాటిని పాడు చేయడం ద్వారా ప్రభుత్వం ఏమి సాధిస్తుంది? రైతులను ఏడిపించడం తప్ప.కొందరు మహిళలు కూటమి ప్రభుత్వానికి శాపనార్ధాలు పెట్టిన తీరును అంతా గమనించారు. గత కొన్ని నెలలుగా ఈ గ్రామాల రైతులను రకరకాల రూపాలలో ప్రభుత్వం వేధించింది. లాండ్ పూలింగ్‌కు ఈ రైతులు భూములు ఇవ్వలేదు. అయినా వీరి భూములను ఎల్పీఎస్ కింద వేరే వారికి ప్లాట్లు కేటాయించింది. ఈ అధికారం ప్రభుత్వానికి ఎక్కడిదని అడిగితే ఎవరూ జవాబు ఇవ్వలేదు. రైతుల పంటపొలాల చుట్టూ గోతులు తవ్వడం, స్తంభాలు కూల్చి కరెంటు ఆపేయడం, మోటార్లు, పైపులు మాయం చేయడం వంటివి చేశారు. ఎవరైనా ఇతరులు ఇలా చేస్తే రౌడీయిజం అని, దౌర్జన్యం అని విమర్శిస్తారు. ఏకంగా ప్రభుత్వ అధికారులే ఈ దుశ్చర్యలకు పాల్పడితే, పోలీసుల అండ చూసుకుని పంటలను దున్నించివేస్తే ఏమనాలి? ఆ బాధ తట్టుకోలేక, తన భూమిని అమ్ముకోనివ్వలేదన్న ఆవేదనతో పద్మనాభ రెడ్డి అనే రైతు గుండెపోటుకు గురై మరణించారన్న సమాచారం మరింత ఆవేదన కలిగిస్తుంది. ఇది ప్రభుత్వ హత్యేనని వైఎస్సార్సీపీ మంగళగిరి ఇన్చార్జీ దొంతిరెడ్డి వేమారెడ్డి విమర్శించారు.ఇక ప్రభుత్వ అనుకూల వ్యక్తులు, శక్తులు రాజధానిలో భూములు ఇవ్వని వారిని ఆన్లైన్లో అసభ్యకరంగా ట్రోలింగ్ చేశారట. ఇలాంటివాటిపై ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. పైగా సోషల్ మీడియాపై నిత్యం చంద్రబాబు, తదితరులు నీతులు చెబుతుంటారు. ఈ రైతులు ఎవరూ కోర్టుకు వెళ్లకుండా సెలవు దినాలలో ఈ పనికి తెగబడ్డారు. ఇప్పటికే కోర్టులలో కేసులు పెండింగ్‌లో ఉన్నాయట. ఇక్కడ సాగు చేసుకుంటున్నవారిలో మెజార్టీ చిన్న, సన్నకారు వారే. ఏభై వేల ఎకరాల భూమి అందుబాటులో ఉన్నా, అక్కడ నిర్మాణాలు ఇంకా కొలిక్కి రాకపోయినా, బలవంతంగా తక్కువ పరిహరం ఇచ్చి తమ భూములు లాక్కున్నారని కొందరు వాపోతున్నారు.ఉండవల్లి, పెనుమాక వంటి గ్రామాలలో రాజధానితో సంబంధం లేకుండానే భూముల విలువ కోట్లలో ఉంది. ఆ సంగతి అందరికి తెలుసు. ఒక రైతును ఏడిపించి భూమిని తీసుకున్నా, తాను అంగీకరించబోనని గతంలో బీకర ప్రతిజ్ఞలు చేసిన ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కనీసం వీరికి సానుభూతి కూడా తెలిపినట్లు కనిపించలేదు. ముఖ్యమంత్రికి ఈ దౌర్జన్యాలు సరికాదని చెప్పలేకపోయారు. కొన్నాళ్ల క్రితం ఉండవల్లి రైతుల బాధలు వినడానికి వెళుతున్న వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ గూండాలు దాడిచేసి అడ్డుకున్నారు. ఈ పరిస్థితి బహుశా దేశంలో మరే రాష్ట్రంలో ఉండదేమో!ఒకప్పుడు ఢిల్లీ సమీపంలో భూ సేకరణపై జరిగిన రగడ దేశవ్యప్తంగా సంచలనం అయింది. కాంగ్రెస్, బీజేపీ, తెలుగుదేశం తదితర పక్షాలన్నీ కలిసి కొత్త భూ సేకరణ చట్టాన్ని తెచ్చి, మారర్కెట్ రేటుకు మూడు రెట్లు అధికంగా రైతులకు పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పుడు అవే పార్టీలు ఆ చట్టంతో సంబంధం లేకుండా లాండ్ పూలింగ్ అనే విధానాన్ని కనిపెట్టి రైతులను మభ్యపెట్టి భూములు తీసుకుంటున్నాయి. దీనివల్ల ఎక్కడైనా కొద్దిమందికి ప్రయోజనం కలిగిందేమో తెలియదు. కాని ఎక్కువమంది నష్టపోతున్నారు. దానికి అమరావతి భూ సమీకరణే ఉదాహరణ కావచ్చు. ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం రైతులపట్ల, మహిళలపట్ల కనికరం లేకుండా ప్రవర్తించడం మాత్రం అత్యంత బాధాకరం అని చెప్పాలి.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
‘కరవు సంక్షోభంపై చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం’
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులు, కరువు సంక్షోభం నేపథ్యంలో రైతులను ఆదుకోవడంలో, పొలాలకు నీటిని విడుదల చేయడంలో, కాలువలను ఆధునికీకరించడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వైఎస్సార్సీపీ జనరల్ సెక్రటరీ (వ్యవసాయం, రైతు విభాగం) ఎంవీఎస్ నాగిరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆదివారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.కూటమి ప్రభుత్వం పాలనలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే 2 ఖరీఫ్‌లు, 2 రబీలు పూర్తయి, ఇప్పుడు 3వ ఖరీఫ్ సీజన్ ప్రారంభమైందని.. కానీ ఇంతవరకు ఎప్పుడూ లేనంతటి సంక్షోభాన్ని రాష్ట్ర రైతాంగం ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. గత సీజన్లలో ఉత్పత్తులు లేక, అకాల వర్షాలతో వేరుశెనగ, ప్రత్తి పంటలు ఘోరంగా దెబ్బతిన్నాయని.. ధరలు లేక ఉల్లి, అరటి, చినీ, మొక్కజొన్న, పొగాకు, మామిడి, ఆక్వా రైతులు రోడ్డున పడ్డారని ఆయన గుర్తు చేశారు.ప్రభుత్వం ఇప్పటికైనా యుద్ద ప్రాతిపదికన స్పందించి వాటర్ మేనేజ్మెంట్, కాలువల్లో గుర్రపుడెక్క తొలగింపు చేపట్టడంతోపాటు రైతులకు ఇవ్వాల్సిన పాత బకాయిలన్నింటినీ తక్షణమే విడుదల చేసి, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికతో పాటు పశుగ్రాసం కొరత రాకుండా చర్యలు చేపట్టాలని ఎంవీఎస్ నాగిరెడ్డి డిమాండ్ చేశారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే..అధికారిక లెక్కల ప్రకారమే రాష్ట్రమంతా లోటు వర్షపాతంప్రభుత్వ అధికారిక డేటా ప్రకారమే జూలై 15 నాటికి ఖరీఫ్ సీజన్ ప్రారంభమై 6 వారాలు గడిచినా రాష్ట్రంలో 48.3 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ప్రస్తుతం ప్రాక్టికల్‌గా 11 జిల్లాలు మైనస్ 40 శాతం కంటే ఎక్కువ లోటుతో మరో 11 జిల్లాలు మైనస్ 30 శాతం పైగా లోటుతో, 5 జిల్లాలు మైనస్ 20 శాతం కంటే ఎక్కువ లోటు వర్షపాతంతో ఉన్నాయి. కేవలం నెల్లూరు జిల్లా మాత్రమే సాధారణ వర్షపాతంలో ఉంది. మిగతా రాష్ట్రమంతా తీవ్ర సంక్షోభంలో మునిగిపోయింది.వ్యవసాయ శాఖ అధికారిక డేటా ప్రకారం పంటల సాగు పరిస్థితి దారుణంగా ఉంది. జూలై 15 నాటికి జరగాల్సిన మొత్తం సాగులో కొన్ని పంటలు కేవలం 60 శాతం మాత్రమే సాగైంది. రాయలసీమలో పండే మిల్లెట్స్ (ఆరిక, వరగ, ఊద తదితర) సాగు కేవలం 43 శాతం మాత్రమే జరిగింది. అత్యధిక పెట్టుబడి అయ్యే వేరుశెనగ సాగు ఈ సీజన్ మొత్తంలో కేవలం 16శాతం మాత్రమే జరిగింది. ప్రభుత్వం కనీసం విత్తనాలను కూడా సరిగ్గా సప్లై చేయలేకపోయింది. వేరుశెనగ సాగు దెబ్బతింటే రాయలసీమలో పశుగ్రాసం కొరత ఏర్పడి, రైతులు పశువులను అమ్ముకుని వలసపోయే దీన స్థితి వస్తుంది. ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికకు ఆగస్టు 15 ఆఖరి గడువు కావస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన లేదు.కాలువల నిర్వహణ శూన్యంగోదావరి, కృష్ణా డెల్టాల్లో నీటి నిర్వహణ, కాలువల ఆధునికీకరణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. గోదావరి డెల్టాలో కాటన్ బ్యారేజ్ వద్దకు 17,250 క్యూసెక్కుల నీరు వస్తున్నా.. కాలువల్లో గుర్రపుడెక్క తీయకపోవడం, సమ్మర్ క్లోజర్లో మెయింటెనెన్స్ పనులు చేయకపోవడం వల్ల కోనసీమ జిల్లాలో నారుమళ్లు ఎండిపోతున్నాయి. నీరు సముద్రం పాలవుతున్నా, కిందకు వెళ్లడం లేదు. దీనిపై రైతులు రోడ్డెక్కి నిరసనలు తెలుపుతుంటే, ఇరిగేషన్ మంత్రి గత ప్రభుత్వంపై నెపం నెట్టడం హాస్యాస్పదం.కృష్ణా డెల్టాలో జూలై 1 వరకు గోదావరిలో నీరు లేనప్పుడు వైఎస్సార్ నిర్మించిన పులిచింతల ప్రాజెక్ట్ నుంచే నీటిని వదిలారు. ప్రస్తుతం పులిచింతలలో 29.5 టీఎంసీల నీరు నిల్వ ఉన్నప్పటికీ, ప్రకాశం బ్యారేజ్ వైపు వస్తున్న 4వేల క్యూసెక్కుల నీటి విడుదలను అకస్మాత్తుగా ఎందుకు నిలిపివేశారు. సీఎం డ్యాష్ బోర్డ్ డేటా ప్రకారం ఈ రోజు ఉదయం జీరో ఇన్ ఫ్లో కనిపిస్తోంది. తూర్పు, పశ్చిమ కృష్ణా డెల్టా పరిధిలోని కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో టైలాండ్ భూముల్లో ఎదబెట్టిన పొలాలు ఎండిపోతున్నాయి. వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో ఎక్కడైనా ఒక్క 100 ఎకరాలైనా నీరు లేక ఎండిపోయిందా?రైతు సంక్షేమ పథకాలకు మంగళం.. బకాయిలు నిలిపివేతగత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్ ప్రతి రైతును ఆదుకునేందుకు తెచ్చిన ఉచిత పంటల బీమా పథకాన్ని ఈ ప్రభుత్వం రద్దు చేసింది. ప్రస్తుతం తెచ్చిన 'స్వచ్ఛంద బీమా' (వాతావరణ బీమా) గడువు జూలై 15తోనే, దీన్ని పొడిగించమని విజ్ఞప్తి చేశాం.ఒకవేళ పాత ఉచిత బీమా ఉండి ఉంటే ఈ వాతావరణ సంక్షోభంలో రైతులకు వేల కోట్ల లబ్ధి చేకూరేది.ఇప్పటివరకు రైతులకు ఇవ్వాల్సిన ఇన్సూరెన్స్ క్లైమ్లు, సున్నా వడ్డీ బకాయిలు విడుదల చేయలేదు. తుఫాన్ ఇన్పుట్ సబ్సిడీ జీవో ఇచ్చినా రైతులకు డబ్బులు అందలేదు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం ఫైల్ ప్రభుత్వంలో ఉన్నా ఇంతవరకు నిధులు విడుదల చేయలేదు. పొగాకు రైతులకు మద్దతు ధర కల్పించేందుకు కేవలం రూ. 500 కోట్లు కేటాయించి, మార్క్ ఫెడ్ ద్వారా కనీస ధర 200 రూ లకకు కొనుగోళ్లు జరిపించి రైతులను ఆదుకోవచ్చు. వైఎస్ జగన్ హయాంలో మార్కెట్ జోక్యం చేసుకొని కొనుగోలు చేసిన విధంగా ఈ ప్రభుత్వం ఎందుకు చేయడం లేదు?ప్రభుత్వానికి వైఎస్సార్సీపీ డిమాండ్లునిర్మాణాత్మక ప్రతిపక్షంగా అధికారిక డేటా ఆధారంగానే మేము ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యలను తీసుకెళ్తున్నాం. ఎంతసేపూ వ్యవసాయం బ్రహ్మాండంగా ఉందని ప్రచారం చేసుకోవడం మానేసి, క్షేత్రస్థాయిలో రైతులు పడుతున్న ఇబ్బందులను గమనించాలి. రాబోయే 4-5 రోజుల్లో వర్షాలు పడకపోతే రాష్ట్రం భారీగా నష్టపోతుంది. ప్రభుత్వం ఇప్పటికైనా యుద్ద ప్రాతిపదికన స్పందించి వాటర్ మేనేజ్మెంట్, కాలువల్లో గుర్రపుడెక్క తొలగింపు చేపట్టాలి. అలాగే రైతులకు ఇవ్వాల్సిన పాత బకాయిలన్నింటినీ తక్షణమే విడుదల చేసి, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికతో పాటు పశుగ్రాసం కొరత రాకుండా చర్యలు చేపట్టాలి. -
కేంద్ర మంత్రి పెమ్మసాని, ఎమ్మెల్యేలు వెనకబడి పోయారు
నెహ్రూనగర్ (గుంటూరు వెస్ట్): స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో రాష్ట్రంలో గుంటూరు నగరానికి అవార్డు రాకపోవడంతో తీవ్ర వెనకబాటుకు గురైందని, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, స్థానిక ఎమ్మెల్యేలు వెనకబడిపోయారని సీఎం నారా చంద్రబాబునాయుడు అసహనం వ్యక్తం చేశారు. అధికారులు ఆశించిన స్థాయిలో పని చేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం గుడివాడలో జరిగిన స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా వర్చువల్‌గా ఈ–ఆటోలను ప్రారంభించారు. ఈ క్రమంలో స్వచ్ఛంధ్ర స్వర్ణాంధ్ర పురస్కారాల ప్రదానంలో భాగంగా సీఎం చంద్రబాబు గుంటూరు నగరంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన అవార్డుల ప్రకటనలో గుంటూరు పేరు ఎక్కడా వినిపించకపోవడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. కేంద్ర మంత్రి, స్థానిక ఎమ్మెల్యేలు, వెనకబడిపోయారని, ఇకనైనా వారు వేగం పెంచి ముందుకు వెళ్లాలని స్పష్టం చేశారు. ఒక పక్క సీఎం చంద్రబాబు గుంటూరు పారిశుధ్యంపై చురకలు అంటిస్తుంటే మరో పక్క కేంద్ర మంత్రి పెమ్మసాని నవ్వుతూ సమాధానం చెప్పడంపై ఒకింత విమర్మలకు తావించినట్లయింది. నగరాభివృద్ధిపై ప్రజల్లో చైతన్యం తేవాల్సిన అవసరం ఉందన్న సీఎం.. ‘ఐ లవ్ గుంటూరు‘ అనే బోర్డులు ఏర్పాటు చేసి, ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో వర్కవుట్ ప్రారంభించాలన్నారు. -
‘టీడీపీ నేతలు కాలకేయుల్లా మారిపోయారు’
సాక్షి, విశాఖపట్నం: గుంటూరులో సభ్య సమాజం తల దించుకునే ఘటన జరిగిందని.. టీడీపీ నేతలు కాలకేయుల్లా మారిపోయారంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ధ్వజమెత్తారు. శనివారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మహిళలు కూటమి పాలనలో స్వేచ్ఛగా బతకలేరా..?. మల్లెల మూర్తి అనే వ్యక్తి నీటి కుళాయి కోసం మహిళ వద్ద రూ.10 వేలు లంచం అడిగాడు. అక్కడ తలెత్తిన ఘర్షణ కారణంగా ఆమెను వివస్త్రను చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ప్రభుత్వం సిగ్గుతో తల దించుకోవాలి’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘రాష్ట్రంలో చట్టం, న్యాయం అమలు కావా..?. మహిళలపై వేధింపులు, దాడుల్లో కూటమి నేతలు ఉన్నారు. గుంటూరు ఘటనలో ఎమ్మెల్యే గల్లా మాధవి అనుచరులు సెటిల్మెంట్ చేసే ప్రయత్నం చేశారు. టీడీపీ నాయకులు ఇలాంటి పనులు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. టీడీపీ అంటే దుస్సాసన, దుర్మార్గుల పార్టీ. ఇలాంటి సంఘటన జరిగినందుకు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి. హోం మంత్రి ఇప్పుడు వీడియో కాల్లో పరామర్శ చేస్తారా..?. ఆ కుటుంబాల దగ్గరకు వెళ్లి ఏం జరిగిందో తెలుసుకోవాలి. టీడీపీ కార్యకర్తలు ఇంతటి దారుణనికి ఒడిగడితే మహిళా కమిషన్ ఏం చేస్తుంది?..ఘటన జరిగి మూడు రోజులు అయితే మీకు తెలియదా..?. సీఎం చంద్రబాబు ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. మల్లెల మూర్తి మీ పార్టీ కాబట్టి ఆయన్ని సస్పెండ్ చేశారు. అధికార దుర్వినియోగానికి గళ్ళా మాధవి పేటెంట్. అంబటి ఇంటిపై దాడి చేసినా పోలీసులు చర్యలు తీసుకోలేదు కాబట్టి ఇలాంటి దారుణాలకు టీడీపీ నాయకులు పాల్పడుతున్నారు. ఎమ్మెల్యే నజీర్పై ఎలాంటి చర్యలు తీసుకున్నారు. అరవ శ్రీధర్ అనే ఎమ్మెల్యే మహిళను లోబరుచుకొని అబార్షన్ చేయిస్తే చర్యలు తీసుకోలేదు. ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకపోతే మిగతా వారు ఇలాగే చేస్తారు. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మహిళను మోసం చేస్తే మీరు ఏం చేశారు?. కిరణ్ రాయల్ వలన లక్ష్మి అనే మహిళ ఇబ్బంది పడితే మీరు ఏం చర్యలు తీసుకున్నారు’’ అంటూ వరుదు కళ్యాణి నిలదీశారు. -
నూజివీడు టీడీపీలో రచ్చ రచ్చ
విజయవాడ: టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ మణిపై మరో వర్గం దాడి చేసింది. మణి కాళ్లు, చేతులు విరగొట్టింది టీడీపీలోని మరోవర్గం. కారుతో గుద్దించి కర్రలు , కత్తులతో దాడికి పాల్పడ్డారు. కారుతో వెంటాడి మరీ ఢీకొల్టారు. కిందపడిపోయిన మణి రెండు కాళ్ల పై నుంచి కారును పోనిచ్చారు దుండగులు. మూడు రోజుల క్రితం నారా లోకేష్ టీమ్ పై మణి పరోక్ష పోస్టులు పెట్టారు. చినబాబు టీమ్ నన్ను బెదిరిస్తే నేను ఎదిరిస్తా అంటూ పోస్టు పెట్టాడు మణి. చినబాబు పీఏ సాంబపై సైతం మణి పోస్టులు పెట్టాడు. ఓ మహిళ కోసం చినబాబు పీఏ సాంబ చెత్త పనులు చేస్తున్నాడంటూ అనే పోస్టు పెట్టాడు. మంచోడు మణి పేరుతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. పోస్టులు పెట్టిన 24 గంటల వ్యవధిలోనే మణి పై హత్యాయత్నం జరగడం కలకలం రేపుతోంది. మణి పై దాడి వెనుక పామర్రు టిడిపి మహిళా నేత పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మణిపై జరిగిన దాడి పై టీడీపీ సోషల్ మీడియాలో రచ్చ నడుస్తోంది. ఇదిలా ఉంచితే, మణి పై హత్యాయత్నం చేసినా కేసు నమోదు చేయలేదు పోలీసులు. -
‘లోకేష్ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’
ప్రకాశం: మంత్రి నారా లోకేష్‌కు వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి సవాల్ విసిరారు. లోకేష్‌కు ఐదు వ్యవసాయం మొక్కలు చూపిస్తానని, ఆ మొక్కల పేర్లు ఆయన కరెక్ట్‌గా చెప్తే తాను రాజకీయాలను శాశ్వతంగా వదిలేస్తానని చాలెంజ్ చేశారు. ఇది తాను ఒంగోలు నుండి లోకేష్‌కి విసురుతున్న సవాల్ అన్నారు కాకాణి.రాష్ట్రానికి ఆదాయవనరులు జగన్ సమకూరిస్తే వాటిని చంద్రబాబు అమ్ముతున్నాడు. చంద్రబాబు రైతులకు అండగా ఉండడు. గ్రావెల్లో అవినీతి, దగా డిఎస్సీలో అవినీతి.. ఇలా ప్రతి దానిలో అవినీతి. అవినీతికి కాదేది అనర్హం అనే విధంగా కూటమి ప్రభుత్వం దోచుకొంటుంది. ప్రజల సొమ్ముని ప్రయివేటు పరం చేస్తూ పాలన సాగిస్తున్నారు. చంద్రబాబు లోకేష్‌లకు దోచుకోవడమే పరమావధి. ప్రతిష్టాత్మక రామాయపట్నం పోర్ట్‌ని ప్రయివేట్ పరం చేసేశారు’ అని ధ్వజమెత్తారు కాకాణి. -
ఇక వెనక్కి తగ్గం.. కచ్చితంగా పోటీ చేస్తాం: నాదెండ్ల
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూటమి భవిష్యత్ సమీకరణాలపై మరోసారి చర్చ మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసి అధికారాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కూటమి ఐక్యతను కొనసాగించడమే లక్ష్యంగా నేతలు తరచూ సమన్వయ వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. అయితే తాజాగా జనసేన కీలక నేత, మంత్రి నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలు స్థానిక సంస్థల ఎన్నికల వేళ కొత్త చర్చకు దారితీశాయి.“అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి కోసం నాలుగు అడుగులు వెనక్కి వేశాం.. స్థానిక ఎన్నికల్లో అదే ఫార్ములా ఉండదు. పార్టీ బలం ఉన్న చోట తప్పకుండా పోటీ చేస్తాం” అంటూ మనోహర్ చేసిన వ్యాఖ్యలు జనసేన భవిష్యత్ వ్యూహామా? అనే సంకేతాలుగా కనిపిస్తున్నాయి.రాష్ట్రంలోని జనసేన నేతలకు అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని నాదెండ్ల మనోహర్ అన్నారు. నాయకత్వం బలంగా ఉన్న ప్రాంతాల్లో కచ్చితంగా పోటీ చేస్తామని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిని బలోపేతం చేయడమే లక్ష్యంగా నాలుగు అడుగులు వెనక్కి వేశామని.. అదే విధానాన్ని స్థానిక ఎన్నికల్లోనూ కొనసాగిస్తామని భావిస్తే పొరపాటని పేర్కొన్నారు. పార్టీ నాయకత్వాన్ని క్షేత్రస్థాయిలో మరింత పెంచుకునేలా ఎన్నికలకు సిద్ధం కావాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. అదే సమయంలో కూటమి పార్టీల మధ్య సమన్వయం కొనసాగిస్తూ ముందుకు సాగాలని సూచించారు.అసెంబ్లీ ఫార్ములా.. స్థానిక ఎన్నికల్లో వద్దు!అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మార్పే ప్రధాన లక్ష్యంగా జనసేన సీట్ల విషయంలో భారీ రాజీకి వెళ్లింది. తక్కువ స్థానాల్లో పోటీ చేసినప్పటికీ మెరుగైన ఫలితాలు సాధించింది. దీంతో పార్టీ కేడర్‌లో కొత్త ఉత్సాహం వచ్చింది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీ బలం పెంచుకునేందుకు కీలక అవకాశమని జనసేన భావిస్తున్నట్లు కనిపిస్తోంది. స్థానిక ఎన్నికల్లో గ్రామ, మండల, జిల్లా స్థాయిలో పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయాలని జనసేన చూస్తోంది. అందుకే బలమైన ప్రాంతాల్లో పోటీకి సిద్ధం కావాలనే సంకేతాలను నేతలు ఇస్తున్నారు.పవన్ వ్యూహానికి భిన్నమా?మరోవైపు.. చంద్రబాబు నాయకత్వంలోనే కూటమి ముందుకు సాగాలని.. రాబోయే ఎన్నికల్లోనూ అధికారం దక్కించుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పలుమార్లు ఆశాభావం వ్యక్తం చేశారు. కూటమిలో విభేదాలకు తావు లేకుండా, సమన్వయంతో ముందుకు సాగాలనే వైఖరిని ఆయన ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యలు కూటమిలో కొత్త చర్చకు కారణమయ్యాయి. ఇది కూటమి నుంచి దూరమయ్యే సంకేతమా? లేదంటే పార్టీ విస్తరణలో భాగమైన వ్యూహాత్మక అడుగులా? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.జనసేనలో పెరుగుతున్న ఆశలుఅసెంబ్లీ ఎన్నికల తర్వాత జనసేన కేడర్‌లో రాజకీయ ప్రాధాన్యత పెరిగింది. ప్రభుత్వంలో భాగస్వామ్యం రావడంతో పాటు, పార్టీకి కేటాయించిన పదవులు, బాధ్యతలు కూడా పెరిగాయి. ఈ నేపథ్యంలో స్థానిక స్థాయిలో కూడా తమకు తగిన ప్రాతినిధ్యం దక్కాలని జనసేన నాయకులు కోరుకుంటున్నారు. టీడీపీతో పొత్తు ఉన్నప్పటికీ.. తమ పార్టీని స్వతంత్రంగా బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందనే భావన జనసేనలో కనిపిస్తోంది.టీడీపీ ఆధిపత్యంపై కేడర్‌లో అసంతృప్తి?కొన్ని ప్రాంతాల్లో టీడీపీ ఆధిపత్యంపై జనసేన కార్యకర్తల్లో అసంతృప్తి ఉందనే చర్చ సాగుతోంది. తమ పార్టీకి తగిన గుర్తింపు, అవకాశాలు దక్కడం లేదనే భావన కొందరు నేతల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పవన్ కల్యాణ్ మాత్రం కేడర్‌ను నొప్పిస్తూ.. కూటమి ఐక్యతకు ప్రాధాన్యత ఇస్తూ శ్రేణులను సమన్వయం చేస్తున్నారు.వివాదమా.. వ్యూహమా?నాదెండ్ల వ్యాఖ్యలను కూటమిలో విభేదాలుగా చూడాలా? లేక స్థానిక ఎన్నికల్లో పార్టీ బలం పెంచుకునే సహజ రాజకీయ వ్యూహంగా చూడాలా? అనేది రాబోయే రోజుల్లో స్పష్టమయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా నాదెండ్ల వ్యాఖ్యలపై పవన్ ఎలా స్పందిస్తారనేది ఇక్కడ కీలకం కానుంది. -
సమస్యలపై ఎలుగెత్తాలి: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘‘రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే మనకు ముఖ్యం.. ప్రజా ప్రయోజనాలు, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పార్లమెంట్లో గట్టిగా మన గళం వినిపించాలి..’’ అని పార్టీ ఎంపీలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు వైఎస్సార్ సీపీ ఇదివరకే మద్దతు ఇచ్చిందని గుర్తు చేస్తూ.. దాన్ని మరోసారి పునరుద్ఘాటిస్తున్నామని చెప్పారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ అధ్యక్షతన వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈనెల 20 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఎంపీలతో చర్చించి మార్గనిర్దేశం చేశారు. వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథ్‌రెడ్డి, గొల్ల బాబూరావు, లోక్‌సభలో వైఎస్సార్సీపీ పక్షనేత పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, లోక్‌సభ సభ్యులు ఎం.గురుమూర్తి, వైఎస్ అవినాష్‌రెడ్డి, గుమ్మా తనూజారాణి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా మాజీ ఎంపీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి పాల్గొన్నారు. సమావేశంలో వైఎస్ జగన్ ఏమన్నారంటే.. డీఎస్సీ 2025 ఒక పెద్ద స్కామ్..రాష్ట్రంలో పాలన గాలికి ఎగిరి పోయింది. ఎక్కడ చూసినా స్కాములే. డీఎస్సీ 2025 పోస్టుల భర్తీలో పెద్ద స్కాం చోటు చేసుకుంది. అసలు పోటీ పరీక్ష రాయకుండానే ఉద్యోగాలు ఇవ్వడం ఏమిటి? డీఎస్సీ పరీక్ష పేపర్ల లీక్‌పైనా అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి. స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీలో అనేక అవకతవకలు జరిగాయి. కేవలం తమ వాళ్ల కోసం ప్రత్యేకంగా జీవోలు ఇచ్చారు. తమ పని అయిపోగానే ఆ జీవోలు రద్దు చేశారు. సర్టిఫికెట్లు ఇచ్చిన క్రీడా సంఘాలు కూడా వారి చేతుల్లోనే ఉన్నాయి. సాఫ్ట్ బాల్ అసోసియేషన్‌కు టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ అధ్యక్షుడు. జూడో సంఘానికి గౌరవ అధ్యక్షుడిగా విశాఖపట్నం ఎంపీ, లోకేశ్ తోడల్లుడు భరత్ ఉన్నారు. అడ్డగోలుగా భూపందేరాలు.. అంతులేని అవినీతి..మరోవైపు రాష్ట్రంలో ఇష్టానుసారంగా భూముల పందేరం జరుగుతోంది. దాదాపు రూ.5 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను లోకేశ్ తోడల్లుడికి అప్పనంగా అప్పగించారు. ఘోరమైన అవినీతి జరిగింది. అటు అమరావతి నిర్మాణంలో కూడా విపరీతమైన దోపిడీ జరుగుతోంది. చదరపు అడుగుకు రూ.20 వేలకు పైగా ఖర్చు చేస్తున్నారు. దేశంలో ఎక్కడా ఇలాంటి రేట్లు లేవు. రోడ్ల నిర్మాణాల్లోనూ దోపిడీయే. పూలింగ్‌కు భూములు ఇవ్వని రైతులపై దారుణాలకు దిగుతున్నారు. బలవంతంగా వారి భూములను లాక్కుంటున్నారు. ఇప్పటికే తీసుకున్న వేల ఎకరాలకే దిక్కులేదు. ఇప్పుడు మళ్లీ మా భూములు ఎందుకు తీసుకుంటున్నారని రైతులు అడుగుతున్నారు. ప్రభుత్వ తప్పులను వెలికి తీస్తున్న, ప్రశ్నిస్తున్న వారిపై వేధింపులకు దిగుతున్నారు. తప్పుడు కేసులు పెడుతున్నారు. సోషల్ మీడియా పేరిట చంద్రబాబు తీవ్ర అరాచకాలకు పాల్పడుతున్నారు. ఎవరి మీదనైనా సరే కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు. టీచర్లకు ‘టెట్’ ఇబ్బందులు..టీచర్ల ఇబ్బందులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలి. టెట్ రాకముందు నుంచి టీచర్లుగా పని చేస్తున్న వారికి ఇప్పుడు ‘టెట్’ తప్పనిసరి చేయడం సరికాదు. పైగా వాళ్లంతా కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో ఉత్తీర్ణులు అయిన వారే. వీళ్లు ఉద్యోగాలు పొందినప్పుడు టెట్ అనే పరీక్ష లేదు. ఇప్పుడు వీరిని టెట్ రాయమనడం భావ్యం కాదు. సుదీర్ఘ కాలంగా ఒకే సబ్జెక్టు బోధిస్తున్న వారిని ఇప్పుడు అన్ని సబ్జెక్టులున్న టెట్ పరీక్ష రాయమనడం, దాన్ని తప్పనిసరి చేయడం ఏ మాత్రం సరికాదు. దీనికి సంబంధించి కేంద్ర మంత్రిని కలవాలి. వారికి సమస్యను నివేదించాలి. ప్రజా ఆస్తులు పప్పుబెల్లాల్లా పంపకంరాష్ట్రంలో ప్రజల ఆస్తులను పప్పుబెల్లాల్లా పంచి పెడుతున్నారు. ప్రైవేటు పేరుతో ఎక్కడికక్కడ దోచిపెడుతున్నారు. పోర్టులు, హార్బర్లు సహా పలు సంస్థల ప్రైవేటీకరణ దారుణం. నిజానికి ఆయా ప్రాజెక్టుల పనులన్నీ మొదలై కొలిక్కి వస్తున్నాయి. అలాంటి వాటిని, దాదాపు పూర్తయిన వాటిని కూడా ఇప్పుడు ప్రైవేటుకు ఇవ్వడం అన్యాయం. దారుణమైన స్కామ్ ఇది. దాదాపుగా పూర్తైన రామాయపట్నం పోర్టును ప్రైవేటుకు ఇవ్వడం అతి దారుణం. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మొదలై దాదాపుగా నిర్మాణం పూర్తైన పోర్టును ప్రైవేటుకు ఇవ్వడం ఏమిటి? రూ.5 వేల కోట్ల విలువైన పోర్టును రూ.1,500 కోట్లకు ఇవ్వడం స్కామ్ కాదా? ఇలాంటి వాటిని ప్రైవేటుకు ఇచ్చేస్తే ఇక రాష్ట్రానికి ఆదాయాలు ఎలా వస్తాయి?అప్పుల్లో రికార్డు... ప్రతిచోట అవినీతి, దోపిడీ..ఇష్టానుసారంగా భూముల కేటాయింపులు చేస్తున్నారు. ఇసుక, లిక్కర్, మైన్స్.. దేన్నీ వదలకుండా దోపిడీ చేస్తున్నారు. ప్రతిచోటా మాఫియా నడుస్తోంది. ఇంకా ఈ ప్రభుత్వం అడ్డగోలుగా అప్పులు చేస్తోంది. అప్పుల్లో రికార్డులు సృష్టిస్తోంది. ఈ రెండు సంవత్సరాల్లో ఏకంగా రూ.3.6 లక్షల కోట్ల మేర అప్పులు చేశారు. పరిమితి లేకుండా విపరీతంగా అప్పు చేస్తున్నారు. ఎఫ్ఆర్బీఎం చట్టాన్ని ఉల్లంఘించి మరీ అప్పులు చేస్తున్నారు. ఇన్ని అప్పులు చేసినా ప్రజలకు చేసింది శూన్యం. మరోవైపు సిండికేట్ కారణంగా ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఏ పంటకూ గిట్టుబాటు ధర లేక రైతాంగం చాలా నష్టపోతోంది. భీమవరం సభ ద్వారా ఆక్వా రైతుల ఆగ్రహం పెల్లుబికింది. తాము దగాకు గురవుతున్నామని రైతులు ఆగ్రహంతో ఉన్నారు. మరోవైపు ఉద్యోగులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. వారికి గత ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు దిక్కులేదు. పీఆర్సీ లేదు.. ఐఆర్ లేదు.. 5 డీఏలు పెండింగ్.. సరెండర్ లీవ్స్ పెండింగ్.. ఉద్యోగులకు అన్నీ ఇబ్బందులే. వీటన్నింటినీ పార్లమెంట్ ఉభయ సభల్లో లేవనెత్తాలి. ఈ ప్రభుత్వ అవినీతి వ్యవహారాలను ఎండగట్టాలి. ముఖ్యంగా ప్రజా సమస్యలపై గట్టిగా పోరాడాలి. -
‘జగన్ గేమ్ ఛేంజర్.. చంద్రబాబు నేమ్ ఛేంజర్’
సాక్షి, తాడేపల్లి: చేనేత కార్మికుల సంక్షేమంలో వైఎస్ జగన్ ప్రభుత్వం గేమ్ ఛేంజర్‌గా నిలిస్తే, చంద్రబాబు ప్రభుత్వం పేర్లు మార్చడానికే పరిమితమైన "నేమ్ ఛేంజర్"గా మిగిలిపోయిందని వైఎస్సార్సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మండిపడ్డారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. జగన్ హయాంలో ఐదేళ్ల పాటు నిరంతరంగా అమలైన వైఎస్సార్ నేతన్న నేస్తం పథకానికి పేరు మార్చి, లబ్ధిదారుల సంఖ్యను తగ్గించి, రెండేళ్ల ఆలస్యంగా అమలు చేయడం ద్వారా కూటమి ప్రభుత్వం చేనేత కుటుంబాలను తీవ్రంగా నిరాశపరిచిందని ధ్వజమెత్తారు. ప్రెస్మీట్లో రమేష్ యాదవ్ ఏమన్నారంటే..గత ప్రభుత్వంలో ఐదేళ్లు నిర్వీరామంగా నేతన్న నేస్తం..వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది నుంచే వైఎస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని ప్రారంభించి ఐదేళ్ల పాటు ప్రతి ఏడాది రూ.24 వేల చొప్పున సుమారు 80 వేలకుపైగా చేనేత కుటుంబాలకు అందించింది. ఒక్కో కుటుంబానికి మొత్తం రూ.1.20 లక్షలు చేరేలా చేసి, ఐదేళ్లలో సుమారు రూ.970 కోట్లను వెచ్చించి చేనేత కుటుంబాలకు అండగా నిలిచింది. కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఈ పథకం అమలు ఆగలేదుపేరు మార్చి నేతన్నలకు వెన్నుపోటుచంద్రబాబు ప్రభుత్వం వైఎస్సార్ నేతన్న నేస్తం పేరును 'నేతన్న భరోసా'గా మార్చడమే తప్ప కొత్తగా చేసింది ఏమీ లేదు. 2025 ఆగస్టు 7న రూ.25 వేల ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చి, రెండేళ్ల పాటు అమలు చేయకుండా ఆలస్యం చేశారు. చివరకు కేవలం రూ.1,000 మాత్రమే పెంచి, 80 వేలకుపైగా ఉన్న లబ్ధిదారులను 54 వేలకే పరిమితం చేసి సుమారు 30 వేల మంది నేతన్నలను ఈ పథకం పరిధి నుంచి తప్పించింది.ఒక్కో కుటుంబానికి రూ.50 వేల చొప్పున వెంటనే చెల్లించాలినిజంగా బీసీలపై ప్రేమ ఉంటే 2024-25, 2025-26 సంవత్సరాలకు సంబంధించిన బకాయిలతో కలిపి అర్హులైన 80 వేలకుపైగా నేతన్నలందరికీ ఒక్కో కుటుంబానికి రూ.50 వేల చొప్పున వెంటనే చెల్లించాలి. పేర్లు మార్చడం కాదు.. వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసిన స్థాయిలో సంక్షేమాన్ని కొనసాగించగలిగితేనే చేనేత కుటుంబాలకు నిజమైన న్యాయం చేసినట్టవుతుంది అని రమేష్ యాదవ్ పేర్కొన్నారు. -
‘జగన్ 2.0 సూపర్ యాప్’ ఆవిష్కరణ
సాక్షి, తాడేపల్లి: పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘జగన్ 2.0 సూపర్ యాప్’ను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవిష్కరించారు. పార్టీ కార్యక్రమాలు, కార్యకర్తలు కోసం యాప్ డిజైన్ చేశారు. పార్టీ నేతలంతా నేరుగా కార్యకర్తలతో టచ్‌లో ఉండేలా ఈ యాప్‌ను రూపొందించారు. సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ నుంచి ఇవాళ అధికారిక ‘జగన్ 2.0 సూపర్ యాప్’ను ఆవిష్కరిస్తున్నామన్నారు.‘‘ఈ రోజు ఏం జరుగుతోంది అంటే.. సోషల్ మీడియాలో మన వాళ్లు పోస్ట్ చేసిన కంటెంట్‌ను ఇష్టం వచ్చినట్లుగా డిలీట్ చేయడం, అందుకోసం ఇష్టానుసారం కుట్రలు పన్నడం.. ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో మనమే ఒక యాప్ తీసుకొచ్చి ఒక ప్లాట్‌ఫామ్ క్రియేట్ చేస్తున్నాం. అదే జగన్ 2.0 సూపర్ యాప్. దీంట్లో ప్రతి కార్యకర్త నిర్భయంగా తన అభిప్రాయం చెప్పొచ్చు...అంతే కాకుండా దీని ద్వారా ప్రతి కార్యకర్త పార్టీతో అనుసంధానమై ఉంటాడు. ఇది మన యాప్ కాబట్టి, మన వాళ్లే ఇందులోకి వస్తారు కాబట్టి, ఎవరు పడితే వారు డిలీట్ చేసే హక్కు కూడా వారికి ఉండదు. ఇది ఒక మంచి పరిణామం. ఇష్టం వచ్చినట్లు చేసే కుట్రలు కూడా దీనివల్ల తిప్పి కొట్టొచ్చు.’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.ఇంకా పార్టీలో ఉన్న చిన్న కార్యకర్త మొదలు, పార్టీ కేంద్ర కార్యాలయం వరకు.. నియోజకవర్గస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి నాయకుడితో, ప్రతి కార్యకర్త అనుసంధానమై ఉంటాడు. ఎందుకంటే పార్టీలో ప్రతి ఒక్కరికి ఇది అందుబాటులో ఉంటుంది కాబట్టి. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు కానీ, పోలీసుల వేధింపుల వల్ల కార్యకర్తలు పడుతున్న ఇబ్బందులు కానీ, పార్టీకి సంబంధించిన ఏ అంశంపై కానీ, ఈ యాప్ ద్వారా నేరుగా ఒకరితో ఒకరు అనుసంధానమై టచ్‌లో ఉండే అవకాశం ఉంటుంది.👉 Click here to download the Jagan 2.0 Super App.ఈ యాప్‌లో మరో మంచి అంశం ఏమిటంటే, పార్టీలో మనం నిర్వహించే ప్రతి సమావేశం, ప్రెస్మీట్లు, ముఖ్యమైన కార్యక్రమాలు, ప్రకటనలు.. అన్నీ కూడా ఈ యాప్‌లో లైవ్ ఫీడ్ ద్వారా ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉంటుంది. భవిష్యత్తులో ఈ యాప్‌ను ఇంకా అభివృద్ధి చేయడం జరుగుతుంది. కార్యకర్తలు ఎక్కడైనా, ఏమైనా ఇబ్బంది పడుతుంటే వాటిని ఈ యాప్‌లో పోస్ట్ చేయడం, ఆ తర్వాత పార్టీ వాటిపై స్పందించడం, నియోజకవర్గంలో గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త ఆ కార్యకర్తకు అండగా నిలబడే అవకాశం కూడా ఉంటుంది...పోలీసుల వేధింపులతో ఇబ్బంది పడుతున్న మన పార్టీ వారు, ఇంకా రాజకీయ వేధింపులకు కూడా గురవుతున్న వారు ఇప్పుడు డిజిటల్ డైరీలో నమోదు చేస్తున్న వివరాలు.. ఆ డైరీ కూడా ఈ యాప్‌తో అనుసంధానం అవుతుంది. అంటే ఈ యాప్‌లో ఆ డిజిటల్ డైరీ కూడా అందుబాటులోకి వస్తుంది. దాని వల్ల వేధింపుల, సమస్యలు ఎదుర్కొంటున్న వారు నేరుగా ఈ యాప్ ద్వారా డిజిటల్ డైరీలో వాటిని ఫిర్యాదు చేయొచ్చు. ఆ వివరాలు నమోదు చేయొచ్చు...ఇతర సోషల్ మీడియా వేదికల్లో మనపై చేస్తున్న అనుచిత విమర్శలు, వీడియోలు, వ్యాఖ్యలపై ఫిర్యాదు చేసి, వాటిని తొలగింపచేసే ప్రయత్నం ఒకవైపు చేస్తూనే, మరోవైపు ఈ సూపర్‌యాప్‌ను ఎవరూ ఆపలేని విధంగా మనకు మనం సొంతంగా రూపొందించుకోవడం జరిగింది. ఈ యాప్ వల్ల ప్రతి కార్యకర్త నిత్యం, పార్టీ నాయకత్వంతో అనుసంధానమై ఉంటాడు’’ అని వైఎస్ జగన్ వివరించారు. -
ఏపీలో పాలన గాలికి ఎగిరిపోయింది: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. కీలకమైన అంశాలపై ఎంపీలకు ఆయన దిశా నిర్దేశం చేశారు. వైఎస్ జగన్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే మనకు ముఖ్యం.. వాటికోసం గళం విప్పాలని పిలుపునిచ్చారు.‘‘మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఇదివరకే మనం మద్దతు ఇచ్చాం. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతును మరోసారి పునరుద్ఘాటిస్తున్నాం. రాష్ట్రంలో పాలన గాలికి ఎగిరిపోయింది. ఎక్కడ చూసినా స్కాములే. డీఎస్పీ పోస్టుల భర్తీ పెద్ద స్కాం చోటు చేసుకుంది. పోటీపరీక్ష రాయకుండా ఉద్యోగాలు ఇవ్వడం ఏంటి?. డీఎస్సీ భర్తీలో తీవ్రమైన అవకతవకలు జరిగాయి. డీఎస్సీ పరీక్ష పేపర్లుకూడా లీక్‌కు సంబంధించి అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి.’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.‘‘స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీలో తీవ్ర అవకతవకలు. తమ వాళ్లకోసం జీవోలు ఇచ్చారు. ఈ పని అయిపోగానే ఆ జీవోలను రద్దు చేశారు. సర్టిఫికెట్లు ఇచ్చిన క్రీడా సంఘాలు కూడా వారి చేతుల్లోనే ఉన్నాయి. సాఫ్ట్ బాల్ అసోసియేషన్‌కు టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ అధ్యక్షుడు. జూడీ సంఘానికి గౌరవ అధ్యక్షుడిగా విశాఖపట్నం ఎంపీ, లోకేష్ తోడల్లుడు భరత్ ఉన్నాడు. మరో వైపు రాష్ట్రంలో ఇష్టానుసారంగా భూముల పందేరం జరుగుతోంది. ఐదు వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను లోకేష్ తోడల్లుడికి అప్పనంగా అప్పగించారు. ఘోరమైన అవినీతి జరిగింది’’ అని వైఎస్ జగన్ మండిపడ్డారు.‘‘అమరావతి నిర్మాణంలో కూడా విపరీతమైన దోపిడీ జరుగుతోంది. చదరపు అడుగుకు రూ.20 వేలపైనే పెడుతున్నారు. దేశంలో ఎక్కడా ఇలాంటి రేట్లు లేవు. రోడ్ల నిర్మాణాల్లోనూ దోపిడీయే. పూలింగ్‌కు భూములు ఇవ్వని రైతులపై దారుణాలకు దిగుతున్నారు. బలవంతంగా వారి భూములను లాక్కుంటున్నారు. ఇప్పటికే తీసుకున్న వేల ఎకరాలకే దిక్కులేదు. ఇప్పుడు మళ్లీ మా భూములు ఎందుకు తీసుకుంటున్నారని రైతులు అడుగుతున్నారు. ప్రభుత్వ తప్పులను వెలికి తీస్తున్న, ప్రశ్నిస్తున్నవారిపై వేధింపులకు దిగుతున్నారు. తప్పుడు కేసులు పెడుతున్నారు...సోషల్ మీడియా పేరిట చంద్రబాబు తీవ్ర అరాచకాలకు పాల్పడుతున్నారు. ఎవరిమీదనైనా సరే కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు. టెట్ రూపంలో టీచర్ల ఇబ్బందులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలి. టెట్ రాక ముందు నుంచీ టీచర్లుగా పనిచేస్తున్నవారికి టెట్‌ను తప్పనిసరి చేయడం సరికాదు. పైగా వాళ్లంతా కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో ఉత్తీర్ణులు అయినవారే. వీళ్లు ఉద్యోగాలు పొందనప్పుడు వీళ్లకు టెట్ అనే పరీక్ష లేదు. ఇప్పుడు వీరిని టెట్ రాయమనడం భావ్యంకాదు. సుదీర్ఘకాలంగా ఒకే సబ్జెక్టు బోధిస్తున్నవారిని, ఇప్పుడు అన్ని సబ్జెక్టులున్న టెట్ పరీక్షను తప్పనిసరి చేయడం సరికాదు. దీనికి సంబంధించి కేంద్ర మంత్రిని కలవాలి, వారికి సమస్యను నివేదించాలి. ..రాష్ట్రంలో ప్రజల ఆస్తులను పప్పుబెల్లాల్లా పంచిపెడుతున్నారు. ప్రైవేటు పేరుతో దోచిపెడుతున్నారు. పోర్టులు, హార్బర్లు సహా పలు సంస్థల ప్రైవేటీకరణ దారుణం. వీటి పనులన్నీ మొదలై కొలిక్కి వస్తున్నాయి. అలాంటి వాటిని కూడా, దాదాపుగా పూర్తైనవాటిని కూడా ఇప్పుడు ప్రైవేటుకు ఇవ్వడం అన్యాయం. దారుణమైన స్కాం ఇది. దాదాపుగా పూర్తైన రామాయపట్నం పోర్టును ప్రైవేటుకు ఇవ్వడం దారుణం. వైఎస్సార్సీపీ హయాంలో మొదలై దాదాపుగా నిర్మాణం పూర్తైన పోర్టును ప్రైవేటుకు ఇవ్వడం ఏంటి?. రూ.5 వేల కోట్ల విలువైన పోర్టును రూ.1500 కోట్లుకు ఇవ్వడం స్కాం కాదా?. ఇలాంటి వాటిని ప్రైవేటుకు ఇచ్చేస్తే ఇక రాష్ట్రానికి ఆదాయాలు ఎలా వస్తాయి...రాష్ట్రంలో ప్రతిదీ అవినీతి, దోపిడీయే. ఇష్టాను సారంగా భూముల కేటాయింపులు, ఇసుక, లిక్కర్, మైన్స్.. అన్నీ దోపిడీ చేస్తున్నారు. ప్రతిచోటా మాఫియా నడుస్తోంది. ఇష్టానుసారం ఈ ప్రభుత్వం అప్పులు చేస్తోంది. అప్పులు చేయడంలో రికార్డులు సృష్టిస్తోంది. ఈ రెండు సంవత్సరాల్లో 3.6లక్షల కోట్లమేర అప్పులు చేశారు. విపరీతంగా అప్పులు చేస్తున్నారు. ఎఫ్ఆర్బీఎం చట్టాన్ని ఉల్లంఘించి అప్పులు చేస్తున్నారు. ఇన్ని అప్పులు చేసిన ప్రజలకు చేసింది శూన్యం...సిండికేట్ కారణంగా ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రైతులు తీవ్రంగా నష్టోతున్నారు. భీమవరం సభ ద్వారా రైతులు ఆగ్రహం పెల్లుబికింది. తాము దగాకు గురవుతున్నామని రైతులు ఆగ్రహంతో ఉన్నారు. మరో వైపు ఉద్యోగులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఉద్యోగులకు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు దిక్కులేదు. పీఆర్సీలేదు. ఐఆర్ లేదు. 5 డీఏలు పెండింగ్, సరెండర్ లీవ్స్ పెండింగ్.. ఉద్యోగులకు అన్నీ ఇబ్బందులే.’’ అని వైఎస్ జగన్ వివరించారు. -
తిరుమలలో ప్రోటోకాల్ రగడ.. నారాయణ స్వామికి అవమానం!
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి దర్శన వ్యవస్థపై మరోసారి విమర్శలు వెల్లువెత్తాయి. మాజీ ఉప ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కె. నారాయణ స్వామి టీటీడీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు ప్రోటోకాల్ దర్శనం ఇవ్వాల్సి ఉండగా.. సాధారణ దర్శనానికి పంపించారని.. ఇది తనను అవమానించినట్లేనని పేర్కొంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.“దేవుడి దగ్గర అందరూ సమానమే. కానీ భక్తుల పట్ల మానవత్వం లేకుండా వ్యవహరించడం బాధాకరం. నాకు ప్రోటోకాల్ ఉన్నప్పటికీ సాధారణ దర్శనం ఇచ్చారు. ఇది అవమానంగా భావిస్తున్నాను” అని నారాయణ స్వామి అన్నారు. అలాగే తిరుమలలో వైఎస్సార్సీపీకి చెందిన నేతలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆయన వాపోయారు.అదే సమయంలో టీటీడీలో వీఐపీ సంస్కృతిపై కూడా ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. “తిరుమలలో పూర్తిగా వీఐపీ దర్శనాలను తొలగించి.. సామాన్య భక్తులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఎవరినీ అవమానించే పరిస్థితులు ఉండకూడదు” అని సూచించారు. ఈ అంశంపై సీఎం చంద్రబాబు వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.ఇదిలా ఉండగా.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల దర్శన విధానంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. క్షేత్రస్థాయిలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పండుగలు, రద్దీ రోజుల్లో సామాన్య భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండాల్సి వస్తోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో వీఐపీ, వీవీఐపీ దర్శనాలకు అధిక ప్రాధాన్యత లభిస్తోందన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. ప్రోటోకాల్ పేరుతో ప్రముఖులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుండటంతో సాధారణ భక్తుల దర్శన సమయం మరింత ఆలస్యమవుతోందని పలువురు విమర్శిస్తున్నారు. క్యూలైన్ల నిర్వహణ, భక్తుల సౌకర్యాల పర్యవేక్షణలో పోలీసులు, విజిలెన్స్ విభాగం మరింత చురుగ్గా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రద్దీ సమయాల్లో భక్తుల ఇబ్బందులు, నీరు, ఆహారం, వైద్య సదుపాయాలపై మరింత దృష్టి పెట్టాలని భక్తులు కోరుతున్నారు. -
ఉద్యమ కెరటం అస్తమించింది.. ముద్రగడకు వీడ్కోలు
ఒక ఉద్యమ కెరటం ఆగిపోయింది.. ఒక ఆత్మీయ అనుబంధం తెగిపోయింది. మాటకు, పట్టుదలకు మారుపేరు అయిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అనారోగ్యానికి గురై మరణించడం అందరిని కలచివేస్తుంది. ముద్రగడ కాపు ప్రజల కోసం ఎంతో కృషి చేసి ఆ వర్గానికి చాలా మేలు చేశారు కాని, తాను మాత్రం రాజకీయంగా నష్టపోయారని చెప్పాలి. ఎవరు కాపుల ప్రయోజనాలకోసం కృషి చేశారో, చేస్తారో తెలుసుకునే టైమ్‌కి ముద్రగడ కన్ను మూయడం దురదృష్టకరం.ఆయన కాపు సామాజికవర్గ డిమాండ్లపై ఉద్యమాలు చేసినా, ఇతర సామాజికవర్గాలతో ఎప్పుడూ ఘర్షణ పడలేదు. అదే ఆయన ప్రత్యేకత. ఉమ్మడి ఏపీలోకాని, విభజిత ఏపీలో కాని సామాజికవర్గ నేతలు అతి తక్కుమంది ప్రభావం చూపించారు. వారిలో ముద్రగడ అగ్రగణ్యుడుగా ఉన్నారు. కాపులు పేరుకు అగ్రవర్ణం అయినా, పేదల శాతం ఎక్కువగా ఉంది. వారిని ఆకర్షించడానికి కొన్ని రాజకీయ పార్టీలు పలు హామీలు ఇవ్వడం, మభ్యపెట్టడం, ఆ తర్వాత మర్చిపోవడం మామూలు అయింది.ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిన హామీని అమలు చేయాలని కోరుతూ 2014-19 టరమ్‌లో ముద్రగడ నడిపిన ఉద్యమం ఏపీని కుదిపివేసింది. ఆనాటి చంద్రబాబు ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టి ఉద్యమాన్ని అణచివేయాలని చూసినా, ఉద్యమ నేతలపై ఎన్ని కేసులు పెట్టినా, రకరకాల నిరసన పద్దతులను అవలంబించి ముద్రగడ చరిత్ర సృష్టించారు. మహిళలతో సహా కాపువర్గం వారంతా పళ్లాలతో నిరసన తెలుపుతూ చేపట్టిన ఆందోళన ప్రజలందరి దృష్టిని ఆకర్షించింది. తుని వద్ద ఆయన జరిపిన సభకు వేలాదిగా ఆ సామాజికవర్గ ప్రజలు స్వచ్చందంగా తరలివెళ్లడం ఒక చరిత్ర. అనూహ్యంగా తుని వద్ద రైలు దగ్దం ఘటనతో ఆయనతో సహా అనేక మంది ఉద్యమకారులపై కేసులు వచ్చినా చలించలేదు.టీడీపీ ప్రభుత్వం పెట్టిన కేసులను జగన్ ప్రభుత్వం ఎత్తివేసింది. తన కుటుంబ సభ్యులపై పోలీసులతో బూతులు తిట్టించారని అప్పటి టీడీపీ ప్రభుత్వంపై పలుమార్లు బాధపడ్డారు. ఆయనను రాజమండ్రి ఆస్పత్రిలో నిర్బంధించి ఎవరిని కలుసుకోవడానికి కూడా అనుమతించేవారు కాదని ఆయన చెబుతుండేవారు. రైతులకు సమస్య వచ్చినా, తన అనుచరులపై అక్రమ కేసులు పెట్టినా, రాజకీయాలతో సంబంధం లేకుండా ఆయన ఆందోళనలకు దిగేవారు. ఉత్తరకంచి గ్రామంలో జరిగిన ఒక ఘటనపై ఆయన దీక్ష చేయడం ఆ రోజుల్లో పెద్ద సంచలనం. కొన్నిసార్లు తన ఇంటిలోనే తలుపులు వేసుకుని దీక్ష చేసేవారు. కాంగ్రెస్ ప్రభుత్వం టైమ్‌లో కూడా ఆయన కాపుల డిమాండ్లపై దీక్ష చేపట్టారు. అప్పట్లో ఆయన ఆ పార్టీలోనే ఉన్నా ప్రజల కోసం ఉద్యమించడానికి ముందుండేవారు.కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రభుత్వం ప్రత్యేకంగా మంత్రి రోశయ్యను హెలికాఫ్టర్‌లో పంపించి ముద్రగడతో రాయబారం చేసి కాపులకు పలు వరాలను ఇవ్వడానికి అంగీకరించింది. ఆ తర్వాత లక్షల మందితో ఒక సభను పెడితే కోట్ల స్వయంగా హాజరయ్యారు. కొన్నిసార్లు అవసరమైతే మంత్రి పదవితో పాటు ఎమ్మెల్యే పదవిని వదలుకోవడానికి కూడా ఆయన వెనుకాడేవారు కారు. ముద్రగడ తండ్రి వీరరాఘవరావు రెండుసార్లు ఇండిపెండెంట్‌గా విజయం సాధించారు. ఆ తర్వాత రాజకీయాలలోకి వచ్చిన పద్మనాభం 1978 నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఒకసారి ఎంపీ అయ్యారు. గతంలో జనతా, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలలో ఉన్నారు. ప్రస్తుతం వైఎస్సార్సీపీలో ఉన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ పట్ల ప్రత్యేక అభిమానం కలిగి ఉన్నారు.ముద్రగడను హైదరాబాద్ పంపి, ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స చేయించి, కోలుకోవడం కోసం జగన్ ఎంతో కృషి చేసినా అది ఫలించలేదు. ముద్రగడ ఆత్మీయత అనేది ఒక అరుదైన అనుభవం. ఆయన ఇంటికి ఎవరు వెళ్లినా ఆతిథ్యం తీసుకోకుండా వెళ్లడానికి ఒప్పుకునేవారు కారు. నిత్య సంతర్పణ మాదిరిగా ఇంటి వద్ద కోలాహలం ఉంటుందంటే ఆశ్చర్యం కాదు. రాజకీయాలలో ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నప్పటికీ, తన వ్యక్తిత్వాన్ని ఎన్నడూ వదలుకోలేదు. తనను నమ్ముకున్నవారిని వదలిపెట్టలేదు. ఆయా సందర్భాలలో ప్రభుత్వ నేతలకు లేఖలు రాసి తన అభిప్రాయాలను చెబుతుండేవారు.చంద్రబాబుకు ఆ లేఖలు బాగా చికాకు పెట్టించేవి. ముద్రగడ వేసిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకపోయేవారు. టీడీపీ ప్రభుత్వం కాపులకు ఇచ్చిన హామీలను విస్మరిస్తే, జగన్ ప్రభుత్వం కాపు నేస్తంతో సహా పలు పథకాలను వారి సంక్షేమం కోసం అమలు చేసింది. తద్వారా కాపులకు కూడా ఇతరవర్గాలతో పాటు మేలు చేసిన వ్యక్తిగా జగన్‌ను ఆయన గుర్తించారు. జగన్ కూడా ఆయనను పితృ సమానుడుగా చూశారు. తన సంతాప సందేశంలో అదే విషయం పేర్కొన్నారు. జనసేనకు చెందిన ఒక ప్రముఖ నేత గత ఎన్నికల ముందు ఆయన ఇంటికి వస్తున్నట్లు ఆ పార్టీ నేతలు సమాచారం ఇచ్చారు. దాంతో ఆయన తగు ఏర్పాట్లు చేసుకున్నారు. కాని ఆయన ఇంటికి రాకపోవడంతో ముద్రగడ చాలా బాధపడ్డారు. మాటపై నిలబడడం కాని, పట్టుదలకు కాని ముద్రగడ పెట్టింది పేరు.గత ఎన్నికలలో వైఎస్సార్సీపీకి ఓటమి ఎదురుకాదని ఆయన విశ్వసించారు. అలా జరిగితే తన పేరు మార్చుకుంటానని శపథం చేశారు. సాధారణంగా రాజకీయాలలో ఇలాంటి సవాళ్లు జరుగుతుంటాయి. ఆ తర్వాత వాటిని విస్మరిస్తుంటారు. కాని ముద్రగడ మాత్రం అందుకు భిన్నంగా తన పేరును పద్మనాభరెడ్డి అని గెజిట్‌లో నమోదు చేయించుకోవడం విశేషం. తన కుమార్తె జనసేనలో చేరి తనపైనే విమర్శలు చేసిన తీరు ఆయనకు తీరని ఆవేదన మిగిల్చింది. తాను మరణిస్తే ఆమెను రానివ్వద్దని అన్నారంటే ఎంత బాధపడ్డారో అర్ధం చేసుకోవచ్చు.ముద్రగడ పార్ధీవదేహం చూడడానికి వచ్చిన ఆమెను కుటుంబ సభ్యులు అనుమతించలేదు. కూటమి ప్రభుత్వం ఆయన అంత్యక్రియలను అధికార లాంచనాలతో చేయడానికి ముందుకు వచ్చినా వారు అంగీకరించలేదు. జీవించి ఉన్నప్పుడు ముద్రగడను ఎన్నో బాధలుపెట్టిన కూటమి నేతలు ఇప్పుడు మొసలికన్నీరు కార్చుతున్నారని మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా ముద్రగడ ఏపీ చరిత్రలో తనకంటూ ఒక పేజీని ఏర్పాటు చేసుకున్నారు. గత ఏభై ఏళ్లలో కాపు సామాజికవర్గానికి ఇంతగా గుర్తింపు తెచ్చిన నేత ముద్రగడ తప్ప మరోకరు కాదని చెప్పాలి.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
చంద్రబాబు సిండికేట్ దోపిడీని కూకటివేళ్లతో పెకిలించేస్తాం
మీ అందరికీ నేను ఒకటే హామీ ఇస్తున్నా.. ‘మీ కష్టాలు నాకు తెలుసు.. నేను ఉన్నాను’ అని మీ అందరికీ చెబుతున్నా. చూస్తుండగానే రెండేళ్లు గడిచాయి. కళ్లు మూసుకొని కళ్లు తెరిచే సరికే మరో మూడేళ్లు గడుస్తాయి. ఆ తర్వాత రైతుల ప్రభుత్వం వస్తుందని గర్వంగా చెప్పగలుగుతా. ఈరోజు మీరు చూపిస్తున్న ఈ ఆదరణ, అభిమానానికి నిజంగా నోటి నుంచి మాట రానంతగా భావోద్వేగం కలుగుతోంది. ఇసుక వేసినా రాలనంతగా కంటి చూపు మేరలో ఎక్కడా ఖాళీ స్థలం కనిపించనంతగా ఈ అభిమాన తరంగాల మధ్య మీరు చూపిస్తున్న ప్రేమ, అభిమానానికి ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు. చంద్రబాబు ఈ సీట్లోకి వచ్చారంటే చాలు, ఆ సిండికేట్‌కు పండగే పండుగ. మన రైతన్నకు మాత్రం కన్నీళ్లే కన్నీళ్లు. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు మార్చాలని చెప్పి తపన, తాపత్రయ పడిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే.. అది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే అని గర్వంగా చెప్పగలను. మన హయాంలో ప్రతి రైతును అన్ని విధాలా చేయి పట్టుకుని నడిపించాం. ఈ రోజు రాష్ట్రంలో రైతు పరిస్థితి దయనీయంగా ఉంది. ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లేదు. ఆక్వా ఫీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లన్నీ చంద్రబాబు సానుభూతి పరులవే. దాంతో వాళ్లు ఎలా కావాలి అంటే అలా వ్యవహారం నడుపుతున్నారు. సీడ్ కొనేటప్పుడు రేటు ఎంతో వాళ్లే నిర్దేశిస్తారు. ఫీడ్ కొనేటప్పుడు కూడా ధర వాళ్లే నిర్దేశిస్తారు. ఆక్వా రైతన్నలు లక్షలు ఖర్చు చేసి ఆక్వా సాగు చేస్తే, తీరా ఆ పంట (రొయ్యలు) చేతికి వచ్చేసరికే వ్యాపారులంతా సిండికేట్‌గా ఏర్పడి, రేట్లు ఢమాల్ అని పడిపోయేలా చేస్తున్నారు. ఈ రోజు ఇలా చంద్రబాబు సానుభూతిపరుల సిండికేట్ రాష్ట్రంలో ఆక్వా రంగాన్ని నడిపిస్తోంది. ఫలితంగా ఆక్వా రైతుల బతుకులు ఆ సిండికేట్ చేతుల్లో నలిగి పోతున్నాయి. – వైఎస్ జగన్సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఆక్వా సిండికేట్‌ను కూకటి వేళ్లతో సహా పెకిలిస్తామని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు ఎప్పుడొచ్చినా ఆక్వాలో సిండికేట్‌దే పెత్తనమని మండిపడ్డారు. ఆయన అనుయాయ వర్గీయులే ఏవో కారణాలు, సాకులు చెప్పి అడ్డగోలుగా మేత ధరలు పెంచడంతోపాటు పంట ధరలను తగ్గించేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ పరిస్థితిలో ఆక్వా రైతులకు, రాష్ట్ర రైతాంగానికి తాను అండగా ఉంటానని స్పష్టం చేశారు. బుధవారం పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఆక్వా రైతులతో సమావేశంలో వైఎస్ జగన్ పాల్గొన్నారు. రాబోయేది తమ ప్రభుత్వమేనని, అధికారంలోకి రాగానే ఆక్వాలో ఇప్పుడున్న సిండికేట్‌ను కూకటి వేళ్లతో సహా పెకిలించేసి.. అప్సడాకు పూర్వ వైభవం తీసుకువస్తామని తెలిపారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. సభలో ప్రసంగిస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆక్వాతో 15 లక్షల మందికి ఉపాధి ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితి గమనిస్తే లక్షన్నరకు పైగా రైతులు 5 లక్షలకు పైగా ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తున్నారు. ఫలితంగా దాదాపు 15 లక్షల మందికి ఆక్వా రంగం ఉపాధి కల్పిస్తోంది. కానీ ఈ రంగంలో పరిస్థితులు చూస్తే, మానవత్వం ఉన్న ఏ ఒక్కరికైనా కన్నీళ్లు తెప్పిస్తాయి. అంత దయనీయమైన పరిస్థితిలో ఆక్వా రంగం ఉంది. ఇష్టానుసారంగా ఫీడ్ ధరలను పెంచుకుంటూ పోతున్నారు. నిజానికి «ఫీడ్ ధరల పెంపు అనేది రైతుల అంగీకారంతోనే జరగాలి కానీ, ఏకపక్షంగా కాదు. ఫీడ్ ధరలు పెంచాలంటే సమీక్ష నిర్వహించాలి. దానికి ఒక హేతుబద్ధత ఉండాలి. ధరల పెంపుపై సమీక్షించాలంటే.. ఫిష్ మీల్ సమృద్ధిగా ఉండే అక్టోబర్, నవంబర్ నెలల్లో హేతుబద్ధంగా ఒక నిర్ణయం తీసుకోవాలి. ఫీడ్ రేట్లపై ఇష్టానుసారం రివ్యూ చేయకూడదు. దీనిపై ఇటీవల ఆక్వా రైతాంగం తమ గోడు వెళ్లబోసుకుంది. అందుకే ఈ ప్రభుత్వానికి అప్పుడే అల్టిమేటం జారీ చేశాం. సిండికేట్ చేతుల్లో నలిగిపోతున్న రైతు చంద్రబాబు చర్మం కొంచెం మందం. మీ అందరికీ కూడా ఇది తెలిసిన విషయమే. దున్నపోతు మీద వర్షం పడితే ఎలా చలనం ఉండదో.. చంద్రబాబు ప్రభుత్వం కూడా అలాగే తయారైందని చెప్పడానికి బాధపడుతున్నాను. మన ఖర్మ ఏమిటని ఒక్కసారి గమనిస్తే, ఆశ్చర్యంగా ఆక్వా రైతులకు సప్లయి చేసే ఫీడ్ కానీ, ఆ పంట కొనుగోలులో కానీ, చివరకు ప్రాసెసింగ్ ప్లాంట్లన్నీ కూడా చంద్రబాబు సానుభూతి పరులవే. దాంతో వాళ్లు ఎలా కావాలి అంటే అలా వ్యవహారం నడుపుతున్నారు. సీడ్ కొనేటప్పుడు రేటు ఎంతో వాళ్లే నిర్దేశిస్తారు. ఫీడ్ కొనేటప్పుడు కూడా ధర వాళ్లే నిర్దేశిస్తారు. ఆక్వా రైతన్నలు లక్షలు ఖర్చు చేసి ఆక్వా సాగు చేస్తే, తీరా ఆ పంట (రొయ్యలు) చేతికి వచ్చేసరికే వ్యాపారులంతా మొత్తం సిండికేట్‌గా ఏర్పడి, రేట్లు ఢమాల్ అని పడిపోయేలా చేస్తున్నారు. అలా చంద్రబాబునాయుడు సానుభూతిపరుల సిండికేట్ ఈరోజు రాష్ట్రంలో ఆక్వా రంగాన్ని నడిపిస్తోంది. ఫలితంగా ఆక్వా రైతుల బతుకులు ఆ సిండికేట్ చేతుల్లో నలిగి పోతున్నాయి. చంద్రబాబు సీఎం సీట్లోకి వచ్చారంటే చాలు, ఆ సిండికేట్‌కు పండగే పండుగ. మన రైతన్నకు మాత్రం కన్నీళ్లే కన్నీళ్లు. ఇలాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. మొట్టమొదటిసారిగా ఇలాంటి పరిస్థితులు మార్చాలి అని చెప్పి తపన, తాపత్రయ పడిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది వైఎస్సార్సీపీ ప్రభుత్వం అని గర్వంగా చెప్పగలను. గతంలో ఎప్పుడూ జరగని విధంగా ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వా సాగు అభివృద్ధి సంస్థ’ (అప్సడా)ను ఏర్పాటు చేస్తూ 2020 ఆగస్టులో మన ప్రభుత్వం ఏకంగా చట్టమే తీసుకొచ్చింది. ఆ అప్సడాకు ముఖ్యమంత్రి చైర్మన్‌గా వ్యవహరించేలా ఆ చట్టంలో నిర్దేశించాం. ఆక్వా రంగంలో అలా ఒక రెగ్యులేటరీ బాడీ ద్వారా సీడ్ రేట్లు, ఫీడ్ రేట్లు, మందుల రేట్లు, ప్రాసెసింగ్ ప్రక్రియ, కొనుగోలు ధరలతో పాటు, మార్కెటింగ్‌లో ఎక్కడ ఏ సమస్య వచ్చినా, రైతాంగానికి నేరుగా తోడుగా ముఖ్యమంత్రి ఉండేలా ఆ రోజు ఒక చట్టాన్ని తీసుకువచ్చి రైతన్నలకు తోడుగా నిలబడ్డాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన ఆక్వా రైతులతో ముఖాముఖి కార్యక్రమానికి హాజరైన అశేష జనసందోహంలో ఓ భాగం ముష్టి వేసినట్లు రూ.2 తగ్గించారు మొన్న ఫిబ్రవరిలో ఒకసారి రేటు పెంచారు. ఆ తర్వాత మరోసారి జూన్ లో పెంచారు. అంటే నాలుగు నెలలు కూడా తిరక్కముందే రెండుసార్లు రేటు పెంచారు. ఏకంగా కేజీకి రూ.14 నుంచి రూ.16 వరకు ఫీడ్ రేట్లు ఎడాపెడా పెంచుకుంటూ పోయారు. రైతుల అంగీకారం లేకుండానే, వారి గోడు వినకుండానే ‘అప్సడా’ చట్టాన్ని ధిక్కరించి ఇష్టానుసారం రేట్లు పెంచేశారు. అలా దారుణంగా పెంచి, ఆ తర్వాత తూతూ మంత్రంగా చంద్రబాబు చెప్పారంటూ కేజీకి రూ.2 తగ్గించారు. నాలుగు నెలలు తిరక్కుండానే కేజీకి రూ.14 నుంచి రూ.16 వరకు పెంపు ఎక్కడ? ముష్టి వేసినట్లు కేవలం రూ.2 తగ్గించడం ఏమిటి? ఇది చంద్రబాబు భాషలో చెప్పాలంటే 100 కొరడా దెబ్బలు కాదు.. 98 కొరడా దెబ్బలే అని చెప్పినట్లుగా ఉంది. చంద్రబాబును నేను ఒకటే అడుగుతున్నా. ఈ రోజు ఆక్వా పంట సాగులో 60 శాతం ఫీడ్ ఖర్చు ఉంటుంది. అలాంటిది ఇష్టానుసారం ఫీడ్ రేటు పెంచుకుంటూ పోతే రైతాంగం ఎలా బతుకుతుంది? ఇదే ఫీడ్ తయారు చేసే కంపెనీ వాళ్లు, అందుకోసం వాడే సోయా, ఫిష్ మీల్, ఇతర మినరల్ మిక్సర్ రేట్లు పెరిగాయి కాబట్టి మేము రేట్లు పెంచుతున్నామని, రేటు పెంచక తప్పడం లేదంటున్నారు. ఆ రేట్లు పెరిగినప్పుడు ఫీడ్ రేటు పెంచుతున్నప్పుడు మరి ఆ రేట్లు తగ్గినప్పుడు మీరు తగ్గించారా.. అని నేను అడుగుతున్నా. రేట్లు పెంచడానికైనా.. రేట్ల మీద నిర్ణయం తీసుకోవడానికైనా ఇదే చంద్రబాబు ప్రభుత్వానికి హేతుబద్ధత అనేది ఉండాలి కదా.. ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు. మార్కెట్లో తక్కువ రేటుకు వాళ్లు కొనుగోలు చేస్తారు. ఆ తర్వాత కొరత ఉందంటూ.. ఒక కారణం తర్వాత మరో కారణం చెప్పి, ఇష్టం వచ్చినట్లు రేట్ పెంచుకుంటూ పోతారు. ఇలా ఇప్పుడు సిండికేట్ రాజ్యం నడుస్తోంది. సభా వేదిక వద్ద అశేష జనవాహినికి చిరునవ్వుతో అభివాదం చేస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి మీ వైఖరి మార్చుకోండి నాడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ఐదేళ్లలో ఫీడ్ కంపెనీలు మూడుసార్లు ధరలు పెంచితే, అప్సడా ద్వారా ఆ రేట్లు పూర్తిగా తగ్గించామని నేను గర్వంగా చెప్పగలను. అది రైతులపై వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ఉన్న ప్రేమను చాటుతోంది. ఇంకా రొయ్యలకు గిట్టుబాటు ధర కల్పనలో కూడా అంతకు ముందు ఎన్నడూ లేని విధంగా మన ప్రభుత్వమే కృషి చేసింది. ప్రతి 15 రోజులకు ఒకసారి అంతర్జాతీయ మార్కెట్లో రొయ్యల రేట్లను సమీక్షిస్తూ, ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధర.. ఏ రైతుకు తగ్గకుండా ఆ ఐదేళ్లలో రైతాంగానికి తోడుగా నిలుచుంది. కరోనా లాంటి కష్ట సమయంలో కూడా రైతన్నలకు అండగా నిలబడి కనీస మద్దతు ధర 100 కౌంట్ రూ.230కి తగ్గకూడదని చెప్పి ఏకంగా చట్టం చేసి మరీ రైతన్నలకు అండగా నిలిచిన పరిస్థితి ఒక్క మన ప్రభుత్వంలోనే జరిగింది. అదే ఈరోజు ఆక్వా రైతుల పరిస్థితి ఏమిటని చూస్తే, ఉత్పత్తి ఖర్చు కేజీకి రూ.275కు పెరిగింది. ఎందుకంటే ఇష్టం వచ్చినట్లు సీడ్, ఫీడ్ రేట్లు పెంచుతున్నారు. కానీ, పంట కొనుగోలు రేటుకు వచ్చేసరికి రూ.230 దాటని పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో రైతాంగం ఎలా బతుకుతుందని చంద్రబాబును గట్టిగా నిలదీస్తూ అడుగుతున్నా. అయ్యా చంద్రబాబు గారూ.. ఈ సిండికేట్‌తో మీరు కుమ్మక్కై మీకు ఇంత, నాకు ఇంత అని చెప్పి మీరు చేస్తున్న వైఖరి మార్చుకోవాలని గట్టిగా కోరుతున్నా. చంద్రబాబు ప్రతి అడుగులో మోసం చంద్రబాబునాయుడు ప్రభుత్వం ప్రతి అడుగులోనూ మోసం, మోసం, మోసం అనే పదాలే వినిపిస్తాయి. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలు ఇచ్చి అమలు చేయకుండా మోసాలతో అడుగులు ముందుకు వేశాడు. ఎన్నికలప్పుడు ప్రతి ఇంటికి బాండ్లు పంపిణీ చేసి.. అధికారంలోకి రాగానే ప్రజలను మోసం చేశాడు. అదే మాదిరిగా ఆక్వా రైతులను కూడా ఆయన మోసం చేస్తూ వచ్చాడు. అవసరమైన జిల్లాల్లో 5 వేల టన్నుల సామర్థ్యంతో కోల్డ్ స్టోరేజ్‌లు అన్నాడు.. (చంద్రబాబు మేనిఫెస్టోలో ఏం చెప్పారో ప్రస్తావిస్తూ) మరి కట్టాడా? జోన్‌తో సంబంధం లేకుండా జోన్ వెలుపల ఉన్న చెరువులకు సబ్సిడీపై కరెంటు ఇస్తానని హామీ ఇచ్చాడు.. మరి ఇచ్చాడా? ట్రాన్స్ఫార్మర్ల ధరలు తగ్గిస్తానన్నాడు.. మరి తగ్గించాడా? ఏరియేటర్లకు సబ్సిడీ ఇస్తానన్నాడు.. మరి ఇచ్చాడా? (ఏవీ ఇవ్వలేదంటూ రైతులు పెద్దఎత్తున చేతులు ఊపారు) ఇవన్నీ ఇవ్వకపోగా, మనం అమలు చేసిన రూ.1.50కే యూనిట్ విద్యుత్‌ను కూడా చంద్రబాబు కత్తిరించే కార్యక్రమం మొదలు పెట్టాడు. అందుకోసం తాజాగా జీవో 169 జారీ చేశారు. దీని ప్రకారం ఆక్వా సాగులో ఉపయోగించే మోటార్లలో పవర్ ఫ్యాక్టర్ (పీఎఫ్) 0.90 నుంచి 0.95 మధ్య మెయింటైన్ చేయాలని చంద్రబాబు రైతులకు రూల్ పెట్టాడు. ఆక్వా రైతులు సాధారణంగా వాడే మోటార్లలో పీఎఫ్ 0.78 మాత్రమే ఉంటుంది. ఆ మోటార్లలో పవర్ ఫ్యాక్టర్ పెరగాలంటే మళ్లీ ఆ రైతులు కెపాసిటర్లు కొనాలి. అవి కొంటే తప్ప, పీఎఫ్ పెరగదు. 12 వేల కనెక్షన్లు పెండింగ్ కొత్తగా ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వడం మానేశారు. దీంతో కనెక్షన్లు కూడా ఇవ్వడం లేదు. అలా 12 వేల వరకు కనెక్షన్లు ఈరోజు పెండింగ్‌లో ఉన్నాయి. ట్రాన్స్ఫార్మర్లకు త్రీఫేస్ కరెంట్ కాకుండా, కేవలం సింగల్ ఫేస్ కరెంటు ఇచ్చి కోతల మీద కోతలు వేస్తూ రైతాంగం అల్లాడేలా చేస్తున్నాడు. దీంతో జనరేటర్లు పెట్టుకుని సాగు చేయాలంటే, ఆక్వా రైతులకు సాధ్యమయ్యే పనేనా చంద్రబాబూ? రైతుల గోడు పట్టని కూటమి ప్రభుత్వం నా పక్కనే పొగాకు రైతులు కనిపిస్తున్నారు. వారు తమ బాధలు చెప్పుకుంటూ, చూపిస్తున్నారు. వరుసగా రెండేళ్లు పొగాకు పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు రోడ్డెక్కుతున్నారు. రైతులు రోడ్ల మీద కనిపిస్తున్నా ఈ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. ఇలా ఒక్క పొగాకు రైతే కాదు.. ఏ పంటకు చూసినా రైతన్నలకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి కనిపిస్తోంది. ఆర్బీకేలు నిరీ్వర్యం.. ఉచిత పంటల బీమా లేదు.. సమయానికే ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ లేదు.. రైతు భరోసా అన్నది ఒక మోసంగా మిగిలిపోయిన పరిస్థితి. ఈ రోజు ఇటువంటి బాధాకరమైన పరిస్థితిలో ఉన్న ప్రతి రైతన్నకు వైఎస్సార్సీపీ తోడుగా ఉంటుంది’ అని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. మన ప్రభుత్వంలో రూ.1.50కే యూనిట్ విద్యుత్ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే ఆక్వా రైతాంగానికి అండగా నిలుస్తూ అడుగులు పడ్డాయి. అంతవరకు ఎప్పుడూ చూడని విధంగా, గతంలో ఎప్పుడూ జరగని విధంగా రూ.1.50కే యూనిట్ విద్యుత్ సరఫరా చేశాం. ఇందుకోసం మన ప్రభుత్వ హయాంలో 57 నెలల పాటు ఏకంగా రూ.3,306 కోట్లు సబ్సిడీ భారం భరించాం. అదే అంతకు ముందు 2014–19 మధ్య చంద్రబాబు పాలనలో ఏం జరిగిందని చూస్తే, ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్‌పై రూ.3.85 వసూలు చేసి బాదారు. ఆ తర్వాత నా పాదయాత్రలో అధికారంలోకి రాగానే ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ రూ.1.50కే ఇస్తామని చెప్పాము. ఆ వెంటనే 2019లో ఎన్నికలకు 4 నెలల ముందు చంద్రబాబునాయుడు, ఆక్వా రైతులకు సరఫరా చేసే యూనిట్ విద్యుత్ రేటు రూ.2కు తగ్గిస్తూ జీవో జారీ చేశారు. కానీ, ఆ సబ్సిడీ ఇవ్వలేదు. దాన్ని కూడా మన వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక భరించింది. అందుకోసం రూ.451 కోట్లు చెల్లించామని గర్వంగా చెబుతున్నా. 35 చోట్ల ఇంటిగ్రేటెడ్ ల్యాబ్‌లు నాడు మన హయాంలో ఆక్వా రైతన్నలకు తోడుగా ఉండేలా సీడ్, ఫీడ్.. వాటి నాణ్యత, వ్యాధి నిర్ధారణ.. వాటన్నింటి కోసం ఏకంగా 35 ఆక్వా సాగు ప్రాంతాల్లో ఇంటిగ్రేటెడ్ ల్యాబ్‌లు ఏర్పాటు చేశాం. ఆర్బీకేల్లో ఏకంగా 782 మంది ఫిషరీస్ అసిస్టెంట్లు అంటే.. ఫిషరీస్ డిగ్రీ పట్టభద్రులను నియమించి, వారితో పాటు ఆక్వా ల్యాబ్‌ల ద్వారా ప్రతి రైతును చేయి పట్టుకుని నడిపించాం. మన హయాంలో ఏకంగా 120 రోజులు, 150 రోజుల పాటు ఉండే సీడ్ తీసుకొచ్చాం. అదే ఈరోజు కేవలం 90 రోజులకు మించి బతకని పరిస్థితి ఉంది. వీటన్నింటి ద్వారా ఆక్వా రైతన్న అల్లాడిపోతున్నాడు. క్వాలిటీ మానిటరింగ్ అనేది పూర్తిగా పక్కకు తప్పుకున్న పరిస్థితి కనిపిస్తోంది. నరసాపురంలో ఫిషరీస్ యూనివర్సిటీని మనం స్టార్ట్ చేస్తే, అందులో క్లాసులు కూడా మొదలు పెడితే, ఇప్పుడు చంద్రబాబు అవసరమైన నిధులు ఇవ్వకుండా దాన్ని ఆపేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇదే ప్రాంతంలోనే మెడికల్ కాలేజీ పనులు కూడా ఆపేశారు. భీమవరంలో తనను చూడటానికి వచ్చిన వారికి అభివాదం చేస్తున్న వైఎస్ జగన్ 51 లక్షల టన్నులకు పెరిగిన ఉత్పత్తి చంద్రబాబు గత హయాంలో చేపలు, రొయ్యల ఉత్పత్తి 39 లక్షల టన్నులు కాగా, మన ప్రభుత్వంలో అది ఏకంగా 51 లక్షల టన్నులకు పెరిగింది. ఎగుమతులు కూడా గణనీయంగా పెరిగాయి. అంతకు ముందు చంద్రబాబు పాలనలో చివరి ఏడాది.. అంటే 2018–19లో రాష్ట్రం నుంచి ఎగుమతుల విలువ రూ.13,855 కోట్లు కాగా, మన ప్రభుత్వంలో 2023–24 నాటికి అది రూ.20 వేల కోట్లకు చేరిందని గర్వంగా చెప్పగలుగుతాను. చంద్రబాబు హయాంలో 86 శాతం ఉన్న యాంటీ బయోటిక్స్ అవశేషాలను మన ప్రభుత్వ హయాంలో ఏకంగా 20 శాతం లోపునకు తగ్గించామని కూడా గర్వంగా చెప్పగలను. అందుకే మన ప్రభుత్వ హయాంలో రెండుసార్లు.. 2021–22, 2023–24లో రాష్ట్రానికి బెస్ట్ మెరైన్ స్టేట్ అవార్డులు దక్కాయి. భీమవరంలో వైఎస్ జగన్‌కు ఆత్మీయ స్వాగతం పలుకుతున్న ప్రజలు ఆక్వా రైతుల సభలో ముద్రగడకు జగన్ ఘన నివాళిభీమవరంలో ఆక్వా రైతుల సమావేశంలో పాల్గొన్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తొలుత.. కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అంజలి ఘటించారు. అనంతరం ఆక్వా రైతులను ఉద్దేశించి మాట్లాడారు. మీ కష్టాలు నాకు తెలుసు మీ అందరికీ నేను ఒకటే హామీ ఇస్తున్నా.. ‘మీ కష్టాలు నాకు తెలుసు.. నేను ఉన్నాను’ అని మీ అందరికీ చెబుతున్నా. చూస్తుండగానే రెండేళ్లు గడిచాయి. కళ్లు మూసుకొని కళ్లు తెరిచే సరికే మరో మూడేళ్లు గడుస్తాయి. ఆ తర్వాత రైతుల ప్రభుత్వం వస్తుందని కూడా ఈ సందర్భంగా గర్వంగా చెప్పగలుగుతా. మళ్లీ ‘అప్సడా’ పూర్వ వైభవంలోకి వస్తుంది. ఆ సంస్థకు సీఎం చైర్మన్‌గా ఉంటాడు. ఇప్పుడున్న సిండికేట్‌ను కూకటి వేళ్లతో సహా పెకిలిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంత వరకు ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆక్వా రైతులకు, రాష్ట్ర రైతాంగానికి, ప్రతి పంటకు, పంట వేసిన ప్రతి రైతు చేయి పట్టుకుని నడిపిస్తూ.. వారికి తోడుగా ఉంటుందని ఈ సందర్భంగా చెబుతున్నా. -
రేపు వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం
సాక్షి, తాడేపల్లి: రేపు (గురువారం 16, జులై) ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పార్టీ ఎంపీలు పాల్గొననున్నారు.త్వరలో జరగనున్న పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఉభయ సభల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, ప్రస్తావించాల్సిన ప్రజా సమస్యలు, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. -
‘టీడీపీ నేతల తీరు మారకపోతే జనం తరిమికొడతారు’
సాక్షి, తాడేపల్లి: వేదిక ఏదైనా చంద్రబాబు, లోకేష్, కూటమి నేతల ధోరణి మారడం లేదని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికారంలో ఉన్నామనే అహంకారంతో పేట్రేగిపోతున్నారని.. వైఎస్ జగన్‌ను వ్యక్తిగతంగా తిట్టడమే పనిగా పెట్టుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘వైఎస్ జగన్ ఎక్కడికెళ్లినా వస్తున్న జనాన్ని చూసి తట్టుకోలేకపోతున్నారు. వైఎస్ జగన్‌ను వ్యక్తిగతంగా దూషిస్తూ తిడుతున్నారు. వ్యక్తిగత దూషణలు మా విధానం కాదు. రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు తానే కట్టానని చంద్రబాబు ప్రచారం చేసుకుంటన్నాడు. ప్రాజెక్టులు కట్టడం దండగ అన్న వ్యక్తి చంద్రబాబు. వెలిగొండ ప్రాజెక్టు శిలాఫలకానికి తప్ప చంద్రబాబు ఖర్చు చేసిందేమీ లేదు. వెలిగొండ ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించింది వైఎస్సార్...వైఎస్ జగన్ సీఎం అయ్యాక వెలిగొండ టన్నెల్స్ ప్రారంభమయ్యాయి. నీ హయాంలో వెలిగొండకు ఎంత ఖర్చు చేశావో లెక్కలు చెప్పగలవా?. పోలవరం కుడి, ఎడమ కాలువలు తవ్వించింది వైఎస్సార్. పోలవరం కుడి, ఎడమలకు పేర్లు పెట్టడం తప్ప చంద్రబాబు చేసిందేమీ లేదు. నాగార్జున సాగర్ నీరు రావడానికి కారణం బ్రహ్మనందరెడ్డి. ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఎక్కడికి చర్చకు రమ్మన్నా వస్తా మీరు రాగలరా?. నిధులు ఎంత ఖర్చు పెట్టావని అడిగితే చంద్రబాబు ఎదురుదాడి చేస్తున్నాడు’’ అంటూ శ్రీకాంత్‌రెడ్డి దుయ్యబట్టారు.‘‘పోలవరం ప్రాజెక్టు అవసరం లేదని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు నేనే పూర్తిచేశానని చెప్పుకుంటున్నాడు. వివేకా హత్య వైఎస్ జగన్ చేయించారని చెప్పడానికి లోకేష్‌కు కొంచెమైనా విజ్ఞత ఉందా? వివేకా హత్య జరిగింది మీ హయాంలో కేసు దర్యాప్తును సాగకుండా అడ్డుకున్నది మీరుకాదా?. నిందితుల తరపున న్యాయవాదులు మీవారేనా కాదా?. వాస్తవాలపై చర్చ జరగకుండా బూతులు తిడుతున్నారు. తిట్టడం కాదు ఎవరు చర్చకు వస్తారో రండి. మీరు ఇలాగే రోజూ వ్యక్తిగత దూషణలు చేస్తూ పోతే మిమ్మల్ని ప్రజలు తరిమికొడతారు’’ అంటూ గడికోట శ్రీకాంత్‌రెడ్డి హెచ్చరించారు. -
జగన్ అస్త్రాల పదును.. కూటమి సమాధానం సున్నా?
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగాలు, ప్రకటనలకు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసే వ్యాఖ్యలకు ఎంత తేడా ఉంటుందో గమనించండి. చంద్రబాబు నాయుడు ఎంతసేపు జగన్‌ను ఎలా దూషించాలా, వైఎస్సార్సీపీపై ఎలా ఆరోపణలు చేయాలా అన్నదానిపైనే కేంద్రీకరిస్తున్నట్లు అనిపిస్తుంది. అంతేకాక ఆయా టూర్ లలో ప్రజలను , అధికారులను కలిసి మాట్లాడుతున్నప్పుడు ఆయన తొట్రుపడుతున్న తీరును కూడా అంతా గమనిస్తున్నారు. చంద్రబాబు చేసే వ్యాఖ్యలకు ఎక్కడా ఆధారాలు ఉండవు. అదే జగన్ చాలా స్పష్టమైన ఆధారాలతో మాట్లాడతారు. ఈ మధ్య ఏపీలో జరిగిన లాకప్ డెత్ కేసులు, పోలీసుల వేధింపులు తాళలేక జరుగుతున్న ఆత్మహత్యల కేసులు చంద్రబాబు ప్రభుత్వ పరువును బాగా దిగజార్చుతున్నాయి. మానవ హక్కుల ఉల్లంఘన అన్నది సర్వసాధారణం అయిపోతోంది.ఈ విషయాలను జగన్ ప్రస్తావిస్తూ ఎక్కడా కులాలు,మతాల గురించి మాట్లాడకుండా స్పెసిఫిక్‌గా ఆయా ఘటనలను వివరించారు. అదే చంద్రబాబు మాత్రం కులాలు,మతాలు గురించి మాట్లాడుతుండడం, రౌడీయిజం అంటూ ఏవేవో ఆరోపణలు చేస్తుండడం కనిపిస్తుంది. చంద్రబాబు అంత సీనియర్ అయినప్పటికీ ఎందుకో బాలెన్స్ కోల్పోయి మాట్లాడుతున్నారా అన్న భావన కలుగుతుంది. అది వయసు ప్రభావం కావచ్చని కొన్ని రాజకీయ పక్షాలు అభిప్రాయపడుతుంటే, అదేమీ కాదని, కావాలనే ఆయన డైవర్షన్ రాజకీయాలలో భాగంగా అలా మాట్లాడుతుంటారని మరికొన్ని పక్షాలు వ్యాఖ్యానిస్తున్నాయి. కుప్పం టూర్ లో ఒక అధికారిని ఉద్దేశించి ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన తీరును ఉదహరిస్తున్నారు. ఏదో పని గురించి ఆయన అడగగా, ఆ అధికారి నిధుల ప్రస్తావన తేగానే ,వెంటనే ఆ మాటను తప్పించారు.మీకు అవకాశం ఇచ్చానని, ఎలా పనిచేయాలో నేర్చుకోవాలని అంటూ ఏదో మాట్లాడారు. మరో సందర్భంలో ఒక పౌరుడి ఇంటి వంటగదిలో ఆంగ్లంలో మాట్లాడిన వైనం కూడా ఎవరికి అర్దం కాలేదు. ఇలాంటి ప్రయోగాలను చంద్రబాబు చేయకుండా ఉంటే బెటరేమో అని టీడీపీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. జగన్ హే రామ్..సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ ట్వీట్ చేస్తూ,ఆయా ఘటనలను ప్రస్తావించారు. పోలీసుల పక్షపాత ధోరణి, రాష్ట్రంలో శాంతి భద్రతల లేమి ,సోషల్ మీడియా యాక్టివిస్టులపై దారుణమైన కేసులు పెట్టడం వంటి వాటిని ఆయన వివరిస్తూ ఏపీకి కావాల్సింది రౌడీ రాజ్యం కాదని, జింగిల్ రాజ్ కాదని అన్నారు. ప్రజలకు భద్రత,బాదితులకు న్యాయం చేసే వ్యవస్థ కావాలని జగన్ అభిప్రాయపడ్డారు. జగన్ లేవనెత్తిన అంశాలపై ఒక్కదానికి కూడా చంద్రబాబు బదులు ఇచ్చినట్లు అనిపించదు.పైగా తాను రౌడీలు, మాఫియాతో రాజకీయాలు చేయవలసి వస్తోందని అనడంలో అర్ధం ఉన్నట్లు కనిపించదు. ఆయన ఉద్దేశం వైసిపిని ప్రజలలో పలచన చేయడం కావచ్చు. కాని ఆయన ఆ మాట అనగానే జనానికి ఈ రెండేళ్లలో టీడీపీ,జనసేన నేతలు, కార్యకర్తలు పలువురు చేస్తున్న రౌడీయిజం,అరాచకాలు గుర్తుకు వస్తున్నాయి.గతంలో టీడీపీకి చెందిన కొందరు చేసిన హత్యలను జ్ఞప్తికి తెచ్చుకుంటున్నారు. ఈ నేపధ్యంలో చంద్రబాబు ప్రభుత్వ అసమర్ధత కూడా కొట్టొచ్చినట్లు కనపడుతోందన్న వ్యాఖ్యలు కూడా ఆయా వర్గాలు చేస్తున్నాయి. యూట్యూబర్ రావణ అరెస్టు జరిగిన తీరు, ఆ క్రమంలో జనసేనకు చెందిన కొందరు కార్యకర్తలు రౌడీయిజం చేసిన తీరేమిటి?పోలీస్ స్టేషన్ ల పైనే దాడులు చేయడం ఎప్పుడైనా గతంలో జరిగిందా?అది ప్రభుత్వ అసమర్ధత కాదా! దీని గురించి జవాబు చెప్పకుండా రౌడీ రాజకీయం అంటూ ఎవరిమీదో నెట్టాలని ఎందుకు చూస్తున్నారు?గాదె సాయికృష్ణ లాకప్ డెత్, క్రాంతికుమార్ ఆత్మహత్య ఘటనలలో జగన్ స్వయంగా రంగంలో దిగేవరకు చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేకపోయింది. అది కూడా అరకొరగా చేస్తూ పోలీసుల తప్పులను కప్పిపుచ్చే రీతిలో వ్యవహరించడం చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం కాదా?పైగా సాయికృష్ణ కాపు కులమేనని,సిఐ నాగరాజు అదే కులమని చెప్పడం ద్వారా చంద్రబాబు ఏపీ ప్రజలకు ఏమి చెప్పదలిచారు?దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే పచ్చి బూతులతో టీడీపీకే చెందిన మరో నాయకుడి ఇంటిపైకి వెళ్లి కూల్చివేయడానికి చేసిన ప్రయత్నం చంద్రబాబు దృష్టిలో రౌడీయిజం అవుతుందా?కాదా?రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఒక యువతిపై చేసిన దారుణాల గురించి ఎందుకు చర్య తీసుకోలేకపోయారు. రౌడీలు రాజకీయం చేయడం వల్లే వివేక హత్య జరిగిందట.ఆ కేసులో దస్తగిరి అనే నిందితుడికి ఎందుకు టీడీపీ మద్దతు ఇస్తోందన్నదానికి జవాబు దొరకదు. మరి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగాను ఏ రౌడీలు హత్య చేశారు? టీడీపీ వారినే కదా ఆ రోజుల్లో అరెస్టు చేసింది?ఆనాడు జరిగిన ఘటనలపై మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య ఏమి రాశారు?నేరస్తులతో సమాజానికి నష్టం అని అంటున్నారు.నిజమే!కాని 164 మంది కూటమి ఎమ్మెల్యేలలో 135 మంది పై క్రిమినల్ కేసులు ఉన్నాయి కదా!అందులో 80 మందిపై తీవ్రమైన అభియోగాలు ఉన్నాయని వచ్చిన లెక్కలపై ఎప్పుడైనా స్పందించారా?ఎల్లో మీడియాను అడ్డు పెట్టుకుని ఏదైనా ప్రచారం చేయవచ్చనుకుంటే రోజులు మారాయి. సోషల్ మీడియా విస్తారంగా అందుబాటులోకి వచ్చింది. అందులో వాస్తవాలు చెప్పి ప్రశ్నిస్తున్నవారిని అణచివేయడానికి చంద్రబాబు సర్కార్ ఎందుకు అంతగా తాపత్రయపడుతుంది అర్ధం కావడం లేదా?ఒకవైపు వైఎస్సార్సీపీ మహిళా నేతలపై నీచాతీనీచంగా మాట్లాడిన టీడీపీ నేతలు కొందరిని ఎమ్మెల్యేలుగా చేసేది ఆయనే. జగన్ కుటుంబ సభ్యులను దారుణంగా బూతులు తిట్టిన వారితో టీడీపీ మహానాడులో ఉపన్యాసాలు ఇప్పించేది ఆయనే ! మళ్లీ బహిరంగ సభలలో అదేదో వైఎస్సార్సీపీఇలాంటివి చేస్తున్నట్లు ప్రచారం చేసేది ఆయనే!ప్రభుత్వంపై బురద చల్లేందుకు వైఎస్సార్సీపీ ఫండింగ్ ఇస్తోందట. దానికి ఆధారం ఉంటే చూపించాలి కదా!అనేక యూట్యూబ్ చానళ్లను టీడీపీ పోషిస్తున్నదన్న అరోపణలు ఉన్నాయి కదా! ఈ చానళ్ళు ఎంత అసభ్యంగా ప్రచారం చేసిన చర్యలు ఉండవు.కాని అదే వైఎస్సార్సీపీపై మాత్రం విరుచుకుపడుతుంటారు. సోషల్ మీడియాలో ఎవరైనా అభ్యంతరకరంగా ప్రచారం చేస్తే చర్య తీసుకోవచ్చు. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా వారు వేసే ప్రశ్నలకు జవాబు లేక ఏదో రకంగా కేసులు పెడుతున్న వైనాన్ని సమర్దించుకోవడానికి ఎదురుదాడి చేస్తున్నారన్న అభిప్రాయమే కలుగుతుంది.ఐ టీడీపీ పేరుతో ఏమి చేసింది ఎవరికి తెలియదనుకుంటే ఎలా ? ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి తనకు రౌడీయిజం తెలియదని,తానెప్పుడు హత్యలు చేయలేదని అనవలసిన అవసరం ఏమిటో తెలియదు.ఇలాంటి మాటలు అన్నప్పుడే సమతుల్యత లేకుండా మాట్లాడుతున్నారన్న భావన కలుగుతుందని ఆయన అర్దం చేసుకోవాలి. మావిగన్ అని జగన్అంటే దానిని వాటికన్ తో పోల్చడం ఏమిటి?యధా ప్రకారం లడ్డూ కల్తీ అని స్పీచ్ ఇస్తున్నారు. ఆ కల్తీ ఫిర్యాదు తన హయాంలో వచ్చినా దానిని ఎదుటివారిపై రుద్దుతారు. అసలు ఆయన చేసిన జంతు కొవ్వు ఆరోపణ ఏమిటి?అలా మాట్లాడడం పాపం కాదా?ఇప్పటికీ భక్తుల సెంటిమెంట్లు దెబ్బతినేలా ఎందుకు మాటలు కొనసాగిస్తున్నారు.ఏది ఏమైనా చంద్రబాబు స్థాయికి తగ్గట్లు మాట్లాడలేకపోతున్నారన్న భావన జనంలో ఏర్పడుతోంది.జగన్ మాత్రం స్పష్టమైన ఆధారాలతో తన అభిప్రాయయాలు చెప్పడం ద్వారా తన విశ్వసనీయతను పెంచుకుంటున్నారు.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్టు, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
చంద్రబాబు సిండికేట్లను కూకటివేళ్లతో పెకలిస్తాం: వైఎస్ జగన్
సాక్షి, పశ్చిమ గోదావరి: కూటమి పాలనలో రైతాంగం తీవ్ర అవస్థలు పడుతోందని.. ఒక్క పంటకు గిట్టుబాటు ధర లేదని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం భీమవరంలో అక్వా రైతులతో ముఖాముఖి కార్యక్రమం సందర్బంగా ఆయన చంద్రబాబు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.అక్వా రంగం సమస్యల సుడిగుండంలో కూరుకుపోయింది. అక్వా రైతులు దీనావస్థలో ఉన్నారు. ధరల పెరుగుదల హేతుబద్ధంగా ఉండాలి. ఇష్టానుసారం ఫీడ్ ధరలు పెంచుకుంటూ పోతున్నారు. దున్నపోతు మీద వర్షం పడినట్లుగా ఉంది చంద్రబాబు ప్రభుత్వం తీరు అని జగన్ మండిపడ్డారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే సిండికేట్లకు పండగే పండగ.. రైతన్నలకు కన్నీరే. ఇప్పుడు అదే జరుగుతోంది. రాష్ట్రంలో చంద్రబాబు సానుభూతిపరులే సిండికేట్‌గా ఏర్పడ్డారు. ఫీడ్, సీడ్ రేట్లు చంద్రబాబు మనుషులే ఫైనల్ చేస్తారు. చంద్రబాబు సిండికేట్ రాష్ట్రాన్ని నడిపిస్తోంది. ఆ సిండికేట్ చేతుల్లో రైతులు నలిగిపోతున్నారు అని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.అక్వా రంగంలో ఐదు లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది. అందుకే మా ప్రభుత్వంలో రెగ్యులేటరీ బోర్ (అప్సడా) ఏర్పాటు చేశాం. సీడ్, ఫీడ్ మార్కెటింగ్‌లో సమస్యలు వస్తే పరిష్కరించాం. అక్వా రైతులకు యూనిట్‌కు రూ.1.50కే విద్యుత్ అందించాం. రొయ్యలకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకున్నాం. మద్దతు ధర తగ్గకుండా మానిటర్ చేశాం. ఐదేళ్లలో సబ్సీడీ కింద రూ.3,306 కోట్లు చెల్లించాం. ఇందులో చంద్రబాబు ఎగ్గొట్టిన రూ.401 కోట్ల బకాయిల్ని మేమే చెల్లించాం. ఫీడ్రేట్లు, ధరల విషయంలో ఎప్పటికప్పుడు మానిటర్ చేశాం. 35 అక్వా ప్రాంతాల్లో ఇంటిగ్రేటెడ్ ల్యాబ్‌లు పెట్టాం. ఆర్బీకేల పరిధిలో ఫిషరీస్ అసిస్టెంట్లను నియమించాం. మా హయాంలో అక్వా ఎగుమతుల విలువ రూ.20 వేల కోట్లు. బెస్ట్ మెరైన్ స్టేట్ అవార్డు కూడా అందుకున్నాం అని జగన్ గుర్తు చేశారు.కానీ, చంద్రబాబు మేం తెచ్చిన చట్టాన్ని నిర్వీర్యం చేశారు. ఇప్పుడు ఏపీలో అక్వా రైతులు పరిస్థితి దయనీయంగా మారింది. ఈ రోజు కేజీ రొయ్య కౌంట్ రూ.230 దాటని పరిస్థితి. నాలుగు నెలల్లో ఫీడ్‌పై కేజీకి 14-16 రూపాయలు ఎడా పెడా పెంచేశారు. ఏకపక్షంగా ధరలు పెంచొద్దని అనేకసార్లు చెప్పాం. ఇష్టానుసారం ఫీడ్ ధరలు పెంచుకుంటూ వచ్చారు. రేట్లు పెంచితే పెంచారు.. తగ్గినప్పుడు తగ్గించరా?. ముష్టి వేసినట్లు రూ.2 లు తగ్గిస్తే సరిపోతుందా?. చంద్రబాబు తీరు వంద కొరడా దెబ్బలు కాదు.. 98 కొరడా దెబ్బలే అన్నట్లు ఉంది అని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.పోనీ.. చంద్రబాబు అక్వా రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చారా?. చంద్రబాబు ప్రతీ అడుగు మోసం.. మోసం. నరసాపురంలో మేం తెచ్చిన ఫిషరీస్ వర్సిటీని నిలిపివేశారు. రూపాయిన్నర విద్యుత్‌కు కోత పెట్టారు. రైతులకు ఇవ్వాల్సిన 12 వేల విద్యుత్‌కనెక్షన్లు పెండింగ్‌లో ఉన్నాయి. అక్వా రైతులకు కొత్తగా ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వడం లేదు. ఫలితంగా.. జనరేటర్లు పెట్టుకుని సాగు చేసే పరిస్థితి ఏర్పడింది. ఆఖరికి.. భీమవరం మెడికల్ కాలేజీ పనులు కూడా నిలిపివేశారు అని జగన్ అన్నారు.అక్వా రైతుల కష్టాలు నాకు తెలుసు.. నేనున్నాను. రైతుల కోసం ఉద్యమబాట పడతాం. మూడేళ్ల తర్వాత మన రైతు ప్రభుత్వం వస్తుంది. అప్సడాకు పూర్వవైభవం తెస్తాం. చంద్రబాబు సిండికేట్‌ను కూకటి వేళ్లతో సహా పెలికిస్తాం’’ అని వైఎస్ జగన్ ఉద్ఘాటించారు. -
కూటమి పెద్దలకు షాక్.. ప్రభుత్వ లాంఛనాల్ని తిరస్కరించిన ముద్రగడ కుటుంబం
సాక్షి, కాకినాడ: కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన కుటుంబ సభ్యులు తిరస్కరించారు. బతికున్న సమయంలో ముద్రగడను అనేక విధాలుగా అవమానించారని.. ఇప్పుడు అధికారిక గౌరవాలు, సానుభూతి అవసరం లేదని స్పష్టం చేశారు.కాకినాడ జిల్లా కిర్లంపూడిలో బుధవారం మీడియాతో మాట్లాడిన వైఎస్సార్సీపీ నేత జక్కంపూడి రాజా.. ముద్రగడ పద్మనాభం ఏనాడూ అధికారం కోసం పాకులాడిన వ్యక్తి కాదని అన్నారు. ఆయన అంత్యక్రియలకు ప్రభుత్వ లాంఛనాలు అవసరం లేదని కుటుంబ సభ్యులు నిర్ణయించినట్లు తెలిపారు. నివాస ఆవరణలోనే హిందూ సంప్రదాయాల ప్రకారం ఆయనకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం.‘బతికున్నప్పుడు వేధించారు’ముద్రగడ పద్మనాభంను గతంలో అనేక రకాలుగా వేధించి, అవమానించారని జక్కంపూడి రాజా అన్నారు. ఆయన కుటుంబ సమస్యల విషయంలోనూ అసభ్యంగా ప్రవర్తించారని విమర్శించారు. “ముద్రగడ అధికారం వెంట పరిగెత్తిన వ్యక్తి కాదు. ప్రజా సమస్యలపై పోరాడిన నాయకుడు. ఆయన బతికున్నప్పుడు ఇబ్బందులకు గురిచేసి.. ఇప్పుడు మృతి తర్వాత మొసలి కన్నీరు కార్చాల్సిన అవసరం లేదు” అని జక్కంపూడి రాజా వ్యాఖ్యానించారు.ప్రభుత్వ నిర్ణయం.. కుటుంబం తిరస్కరణముద్రగడ పద్మనాభం ఇటీవల కన్నుమూయడంతో.. ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ముద్రగడ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి లోక్‌సభ సభ్యుడిగా, మంత్రిగా పనిచేసిన సేవలను గుర్తిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో మాట్లాడిన అనంతరం సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే.. ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని ముద్రగడ కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. తమకు ప్రభుత్వ లాంఛనాలు అవసరం లేదని స్పష్టం చేశారు.కాపు ఉద్యమంలో కీలక పాత్రముద్రగడ పద్మనాభం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక నేతగా గుర్తింపు పొందారు. కాపు రిజర్వేషన్ల ఉద్యమంతో రాష్ట్రవ్యాప్తంగా ఆయన పేరు చర్చకు వచ్చింది. ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా పనిచేసిన ఆయన రాజకీయ జీవితంలో పలు కీలక పరిణామాలకు కేంద్రబిందువుగా నిలిచారు. ప్రస్తుతం ముద్రగడ కుటుంబం ప్రభుత్వ లాంఛనాలను తిరస్కరించడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
ముద్రగడ మృతిపైనా ట్రోల్స్.. టీడీపీ, జనసేన నీచ రాజకీయం!
సాక్షి, విజయవాడ: రాజకీయ విభేదాలు సహజమే.. కానీ మరణించిన నేతలపై వ్యక్తిగత విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసం? అనే చర్చ ఇప్పుడు తెరపైకి వచ్చింది. మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మృతిపై సోషల్ మీడియాలో ట్రోల్స్‌పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన్ని కించపరిచేలా టీడీపీ, జనసేన సోషల్ మీడియా ఖాతాల నుంచి పోస్టులు చేస్తున్నారు. ఈ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.ప్రజా జీవితంలో దశాబ్దాల పాటు కొనసాగిన ముద్రగడ పద్మనాభం.. కేవలం ఒక రాజకీయ నాయకుడిగానే కాకుండా, ఉద్యమ నేతగానూ గుర్తింపు పొందారు. ఎమ్మెల్యేగా పలుమార్లు ఎన్నికైన ఆయన.. రెండు ప్రభుత్వాల్లో మంత్రిగా, ఒకసారి ఎంపీగా బాధ్యతలు నిర్వహించారు. రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేశారు.ముఖ్యంగా కాపు సామాజిక వర్గ సమస్యలపై ఆయన చేసిన పోరాటాలు, ఉద్యమాలు ఆయన రాజకీయ ప్రస్థానంలో కీలక ఘట్టాలుగా నిలిచాయి.తన రాజకీయ జీవితంలో పలు సందర్భాల్లో ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చేలా ఉద్యమాలు చేపట్టారు. అరెస్టులు, నిరసనలు, దీక్షలు ఎదురైనా వెనక్కి తగ్గకుండా పోరాడిన నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. అందుకే ఆయన మరణం తర్వాత కూడా ఆయన రాజకీయ ప్రస్థానం, ఉద్యమాలపై చర్చ కొనసాగుతోంది.అయితే.. ఆయన రాజకీయ నిర్ణయాలు, కొన్ని పార్టీలతో ఉన్న అనుబంధంపై భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైఎస్సార్సీపీలో చేరడం, ఆ తర్వాతి రాజకీయ పరిణామాలు అప్పట్లో చర్చనీయాంశమయ్యాయి. కానీ రాజకీయ వైఖరిని విమర్శించడం వేరు.. ఒక వ్యక్తి మరణించిన తర్వాత వ్యక్తిగతంగా కించపరిచే వ్యాఖ్యలు చేయడం వేరు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.హద్దులు దాటేసి..ముద్రగడ పద్మనాభం జీవించి ఉన్న సమయంలోనే కాకుండా.. మరణం తర్వాత కూడా సోషల్ మీడియాలో ఆయనపై దుష్ప్రచారం నడుస్తోంది. ముఖ్యంగా టీడీపీ, జనసేన అనుబంధ పేజీల పోస్టులు, వ్యాఖ్యలపై అభిమానులు, అనుచరులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేయడం ప్రజాస్వామ్యంలో భాగమే అయినప్పటికీ.. మరణించిన వ్యక్తిపై వ్యక్తిగత దాడులు చేయడం రాజకీయ సంస్కృతికి మంచిది కాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.రాజకీయాలకు అతీతంగా గౌరవం అవసరంఒక నాయకుడి విధానాలను, నిర్ణయాలను విమర్శించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ ప్రజా జీవితంలో ఆయన చేసిన సేవలు, పోరాటాలను పూర్తిగా విస్మరించి.. కేవలం రాజకీయ అనుబంధాల ఆధారంగా అవమానకర వ్యాఖ్యలు చేయడం సరికాదని పలువురు పేర్కొంటున్నారు.ముద్రగడ పద్మనాభం జీవితంలో ఎన్నో రాజకీయ ఒడిదుడుకులు ఎదురయ్యాయి. ప్రభుత్వాలను ఎదురించి ఉద్యమాలు చేశారు. తన నమ్మిన అంశాల కోసం పోరాడారు. ఆయనతో విభేదించిన వారూ ఉన్నారు.. ఆయనను సమర్థించిన వారూ ఉన్నారు. అయితే ప్రజా జీవితంలో ఉన్న ఒక నేత మరణించిన సమయంలో కనీస గౌరవం పాటించాలనే చర్చ.. తాజాగా సోషల్ మీడియా పోస్టుల నేపథ్యంలో మరోసారి మొదలైంది. -
మత్స్యకారులను బలిగొన్నది ప్రభుత్వ నిర్లక్ష్యమే
ఘటన జరిగిన వెంటనే స్పందించాల్సిన కలెక్టర్, ప్రభుత్వం, కమిషనర్.. ఎవ్వరూ స్పందించలేదు. ఎవరూ కో ఆర్డినేట్ చేయలేదు. ప్రభుత్వంలో ఏ పెద్దలూ స్పందించలేదు. ఇలాంటప్పుడు తప్పు జరిగిందని ఒప్పుకోకుండా.. త్రిసభ్య కమిటీ నివేదికలో దొంగ మాటలు చెప్పారు. బాధిత కుటుంబ సభ్యులు జూలై 5వ తేదీ ఉదయం 5 గంటల వరకు తమకు సమాచారం అందించలేదని ఆ నివేదికలో పేర్కొన్నారు. సరైన సమయంలో స్పందించకపోవడం తప్పు అయితే, ఆ తప్పును కప్పిపుచ్చుకునేందుకు త్రిసభ్య కమిటీ నివేదికలో తప్పులు రాస్తున్నారు. బాధిత కుటుంబంతో కలిసి మొత్తం ఏడుగురికి రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలి. కొత్త బోటు ఇవ్వాలి. కనీసం వీరిని చూసేందుకు కూడా ఎవరూ ఇంటికి రాలేదు. మానవత్వం లేని ప్రభుత్వం. వీరి కుటుంబ సభ్యులకు అందరికీ చెబుతున్నా.. ఈ ప్రభుత్వం స్పందించకపోతే ఎవ్వరూ భయపడొద్దు.. బాధపడొద్దు. కళ్లు మూసి కళ్లు తెరిచేలోగా మూడేళ్లు గడుస్తాయి. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే జగనన్న ప్రభుత్వం ఈ కుటుంబాలకు తోడుగా ఉంటుంది. ఒక్క నెల రోజుల్లోగా మేలు చేస్తుందని మాట ఇస్తున్నా. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చి ఉంటే ఫిషింగ్ హార్బర్లు కళకళలాడుతుండేవి. సబ్సిడీతో బోట్లు కొనివ్వాలని భావించాం. తద్వారా ఒక్కో ఫిషింగ్ హార్బర్లో 10 వేల బోట్లు తిరుగుతుండేవి. ఏకంగా 50 శాతం రాష్ట్ర ప్రభుత్వం గ్రాంటు ఇచ్చి, మరో 50 శాతం రుణం ఇప్పించి వీళ్లందరికీ మంచి చేయాలని భావించాం. ఒక్కో బోటుకు 7-8 మందిని ఓనర్లు చేసే వాళ్లం. తద్వారా మత్స్యకార కుటుంబాల్లో గొప్ప అడుగు ముందుకు పడి ఉండేది. ప్రభుత్వం మారడంతో ఫిషింగ్ హార్బర్లను అడ్డుపెట్టుకుని స్కామ్‌లు చేస్తోంది. -వైఎస్ జగన్సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: బోటు ప్రమాద ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఆరుగురు మత్స్యకారులు గల్లంతయ్యారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. జూలై 4వ తేదీ మధ్యాహ్నం ప్రమాదం జరిగితే.. రాత్రి 7 గంటలకే సమాచారం అందించినప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా 5వ తేదీ ఉదయం 5 గంటల వరకు తమకు సమాచారం లేదంటూ త్రిసభ్య కమిటీ నివేదికలో పేర్కొనడం ద్వారా చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వం మరో తప్పు చేస్తోందని ధ్వజమెత్తారు. ప్రమాదానికి గురైన మత్స్యకార కుటుంబాలను సీఎంకానీ, సంబంధిత మంత్రులు అనిత, అచ్చెన్నాయుడు కానీ పరామర్శించలేదని ఎత్తి చూపారు. బాధిత ఏడు కుటుంబాలకు ఒక్కొక్కరికి వెంటనే రూ.కోటి నష్టపరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రమాదానికి గురైన బోటు స్థానంలో కొత్త బోటు కొనివ్వాలని, ప్రభుత్వం స్పందించకపోతే వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోగా ఒక్కో కుటుంబానికి రూ.కోటి చొప్పున పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి చేపల వేటకు వెళ్లి గంగవరం పోర్టుకు కేవలం 10 నాటికల్ మైళ్ల దూరంలో జరిగిన బోటు ప్రమాదంలో గల్లంతైన ఆరుగురి కుటుంబాలతోపాటు, ప్రమాదం నుంచి బయటపడ్డ చిన్నా కుటుంబాన్ని వైఎస్ జగన్ మంగళవారం పరామర్శించారు. ఆ కుటుంబాలకు తోడుగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం విశాఖలోని జబ్బర్‌తోట జంక్షన్ వద్ద మీడియాతో మాటా్లడారు. వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..అడుగడుగునా ప్రభుత్వ నిర్లక్ష్యంప్రభుత్వం ఎంత అన్యాయంగా, మానవత్వం లేకుండా ప్రవర్తించిందనే దానికి బోటు ప్రమాదం ఘటన అద్దం పడుతోంది. జూలై 1న చిన్నాతో పాటు మరో ఆరుగురు.. మొత్తం ఏడుగురు వేటకు బయలుదేరారు. జూలై 4న అంటే మూడు రోజుల తర్వాత చిన్న.. తన ఫోన్ నుంచి తన మేనల్లుడు గురునాథ్‌కు 2.31 గంటలకు (కాల్ డేటా చూపిస్తూ) ఫోన్ చేసి మరో గంటలో ఇంటికి వస్తున్నాం.. అని చెప్పాడు. దురదృష్టవశాత్తు ఫోన్ చేసిన గంటకే తీవ్రమైన అలలతో బోటు మునిగింది. వీళ్లంతా కూడా బోటుపైకి ఎక్కారు. ఫోన్లు సముద్రంలో పడిపోయాయి. అక్కడి నుంచి వీరి హృదయ విదారక గాధ ప్రారంభమైంది. పట్టించుకునే వారు లేరు. 10 నాటికల్ మైళ్లు ఈత కొడితే తప్ప ఒడ్డుకు రారు. గంట గంటకు బోటు మునిగిపోతోంది. అలాంటి పరిస్థితుల్లో బోటు కింది భాగంలో ఒక మనిషి చనిపోయాడు. మిగతా వారు అక్కడి నుంచి ఈత కొట్టడం మొదలు పెట్టారు. గంటలో ఇంటికి వస్తానన్న మనిషి 3 గంటలైనా రాకపోయే సరికి.. వీరి మేనల్లుడు తిరిగి ఫోన్లు చేయడం మొదలుపెట్టాడు. ఆ పక్కన ఫోన్లు రిసీవ్ చేసుకునే పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో వారి కుటుంబీకులు అధికారులకు విన్నవించే ప్రయత్నం చేశారు. రాత్రి 7 గంటలకు మత్స్యశాఖ అధికారులను కలిసి విన్నవించినా ఎవరూ స్పందించ లేదు. ఏడుగురు కలిసి వేటకు వెళితే ప్రమాదానికి గురై 20 గంటల పైచిలుకు సముద్రంతో యుద్ధం చేసి ఒక్కడే తిరిగొచ్చారు. ఆదుకోవాలని సమాచారమిచ్చినా ప్రభుత్వం స్పందించలేదు. ఆదుకున్న పాపాన పోలేదు. సకాలంలో స్పందించి ఉంటే ఐదారుగురు బతికి ఉండేవాళ్లు. అసలు ఈ ప్రభుత్వానికి మానవత్వం ఉందా? తోడుగా ఉన్నామన్న భరోసా ఏదీ?ఇంత ఘటన జరిగితే సీఎం పట్టించుకోరు. డిజాస్టర్ మేనేజ్మెంట్ చూసే ఈ జిల్లా వాసి అయిన మంత్రి కనీసం రాలేదు. ఇదే ఉత్తరాంధ్రకు చెందిన మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు కనీసం ఇంటికి కూడా రాలేదు. పైగా ఏమంటారో తెలుసా? వీడియో కాల్లో వీరి కుటుంబాలను పరామర్శించామని హోం మంత్రి అనితమ్మ అంటోంది. ఒక్కరంటే ఒక్కరు బాధ్యత గల స్థానాల్లో ఉన్న వారు పట్టించుకోలేదు. ఘటన జరిగిన వెంటనే స్పందించలేదని, ఇది మా తప్పే అని.. దానికి క్షమాపణ చెబుతున్నామని ఏ ఒక్కరూ అనలేదు. మనిషిని తీసుకురాలేక పోయినా.. మీకు తోడుగా ఉంటామని వారి కుటుంబ సభ్యులకు ఈ ముఖ్యమంత్రి, మంత్రులు చెప్పే పని చేయలేదు. ఇది ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి. పైగా ముష్టి వేసినట్టు ఎక్స్‌గ్రేషియా కింద రూ.5–10 లక్షలు ఇచ్చి సంకలు గుద్దుకుంటున్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మత్స్యకారులు చనిపోతే నష్ట పరిహారం కింద రూ.5 లక్షలు ఇచ్చేవారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాం. అంటే వేటకు వెళ్లి ఎవరు చనిపోయినా వారి కుటుంబాలను ఆదుకునే ఉద్దేశంతో రూ.10 లక్షలకు పెంచాం. ప్రభుత్వం ఏ తప్పు చేయకపోయినా దుర్ఘటన జరిగితే రూ.10 లక్షలు నష్టపరిహారం ఇచ్చేవారం. ఇప్పుడు ప్రభుత్వం సకాలంలో స్పందించకుండా తప్పు చేసిన సమయంలో రూ.5 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటామంటే ఇది న్యాయమేనా? ధర్మమేనా? విశాఖపట్నం విమానాశ్రయం వద్ద ప్రజలకు అభివాదం చేస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతి కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలిమరోసారి ఇటువంటివి జరగకుండా ఉండాలంటే.. ఫిర్యాదు వచ్చిన వెంటనే స్పందించాలంటే.. అధికారులకు ఒక షాక్ తగిలితే తప్ప స్పందన అనేది రాదు. సీరియస్‌గా చర్యలు ఉంటాయనేది ప్రభుత్వం చేయాలి. ప్రభుత్వం అనేది రోల్‌మోడల్‌గా ఉండాలి. తప్పుచేసే ప్రభుత్వం ఉండకూడదు. చనిపోయిన ఆరుగురు మత్స్యకారుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున నష్టపరిహారమివ్వాలి. బాధిత కుటుంబంతో కలిసి మొత్తం ఏడుగురికి ప్రతి ఒక్కరికీ రూ.కోటి ఇవ్వాలి. కొత్త బోటు ఇవ్వాలి. కనీసం వీరిని చూసేందుకు కూడా ఇంటికి రాలేదు. కనీసం మానవత్వం లేని ప్రభుత్వం. వీరి కుటుంబ సభ్యులకు అందరికీ చెబుతున్నా.. ఈ ప్రభుత్వం స్పందించకపోతే ఎవ్వరూ భయపడొద్దు. బాధపడొద్దు. కళ్లు మూసి కళ్లు తెరిచేలోగా మూడేళ్లు గడుస్తాయి. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే జగనన్న ప్రభుత్వం ఈ కుటుంబాలకు తోడుగా ఉంటుంది. ఒక్క నెల రోజుల్లోగా మేలు చేస్తుంది. నాదీ బాధ్యత. కచ్చితంగా చేయిస్తామని మాట ఇస్తున్నా. సొంత కాళ్లపై నిలబడేందుకు...మత్స్యకారులు ఎక్కడెక్కడికో వెళ్లి నిర్బంధాలకు గురికాకూడదని, ఇటువంటి వాటికి ఫుల్స్టాప్ పెట్టాలని మన హయాంలో మత్స్యకారుల కోసం ఏకంగా 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం ప్రారంభించాం. నెల్లూరు జిల్లాలో జువ్వలదిన్నె, గుంటూరు జిల్లాలో నిజాంపట్నం, కృష్ణా జిల్లాలో మచిలీపట్నం, తూర్పుగోదావరి జిల్లాలో ఉప్పాడ, శ్రీకాకుళం జిల్లాలో బుడగట్ల పాలెం, మంచినీళ్ల పేట, అనకాపల్లి జిల్లాలో పూడిమడక, ప్రకాశం జిల్లాలో కొత్తపట్నం, ఓడరేవు, పశ్చిమగోదావరి జిల్లాలో బియ్యపుతిప్ప.. ఇలా 10 ఫిషింగ్ హార్బర్లకు శ్రీకారం చుట్టి వేగంగా పనులు చేయడం మొదలుపెట్టాం. ఇవి కాకుండా 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు చింతపల్లి, భీమిలి, రాజయ్యపేట, దొండవాక, ఉప్పల్లంక, రాయదరువు ప్రాంతాల్లో పనులు చేయించడానికి శ్రీకారం చుట్టాం. మనవాళ్లకు ఫిషింగ్ హార్బర్లు అందుబాటులోకి వస్తున్నందున సబ్సిడీతో బోట్లు కొనివ్వాలని భావించాం. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చి ఉంటే ఒక్కో ఫిషింగ్ హార్బర్లో 10 వేల బోట్లు తిరుగుతుండేవి. ఒక్కో బోటుకు 7–8 మందిని ఓనర్లు చేసి.. ఏకంగా 50% రాష్ట్ర ప్రభుత్వం గ్రాంటు ఇచ్చి, మరో 50% రుణం ఇప్పించి వీళ్లందరికీ మంచి చేయాలని భావించాం. దీంతో మత్స్యకార కుటుంబాల్లో గొప్ప అడుగు ముందుకు పడి ఉండేది. మత్స్యకారులను పరామర్శించిన అనంతరం విశాఖలోని జబ్బర్ తోట జంక్షన్ వద్ద మీడియాతో మాట్లాడుతున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మారింది.. స్కామ్‌లు జరుగుతున్నాయిరాష్ట్ర ప్రభుత్వం మారడంతో ఈ రోజు ఏం జరుగుతోందంటే.. ఆ ఫిషింగ్ హార్బర్లను స్కామ్‌లుగా మారుస్తూ అమ్ముతున్నారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బరు ద్వారా చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు బోట్లు కొనిచ్చి, ఆ బోట్ల పార్కింగ్ కోసం వాడాల్సిన ప్రాంతాన్ని ప్రైవేటుకు కట్టబెట్టడం ద్వారా స్కామ్‌లు చేస్తూ చంద్రబాబు అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. దీని గురించి రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడు ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. మత్స్యకారులకు వేధింపులుమన ప్రభుత్వంలో పలాస ఎమ్మెల్యే, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు ఘటన చూస్తే.. మత్స్యకారులను ఎంత దారుణంగా ఈ ప్రభుత్వం హింసిస్తోందో తెలుస్తుంది. సీదిరి అప్పలరాజు 18 ఏళ్ల కొడుకు బైకు నడుపుతూ దురదృష్టవశాత్తు ఢీకొట్టడంతో ఒక మనిషి చనిపోయారు. చేసింది కరెక్ట్ అని నేను చెప్పను. అయితే ప్రభుత్వం ఏకంగా మర్డరు కేసులు పెట్టి ఇరికించే ప్రయత్నం చేసింది. చివరకు జడ్జి జోక్యం చేసుకుని మర్డర్ కేసు ఎలా పెడతారయ్యా..అని తిట్టి సెక్షన్లు మార్పించారు. ఎంత దారుణంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందో ఆలోచించాలని కోరుతున్నా. జువ్వలదిన్నెలో తమిళనాడు నుంచి బోటు వచ్చి మన మత్స్యకారులను ఇబ్బంది పెడుతుంటే.. ఆ బోటును పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఆ బోటును విడిపించింది ఎవరో తెలుసా టీడీపీకి చెందిన వీళ్లే. నెల్లూరు జిల్లాకు లోకేశ్ వెళతారు. ఆ మరుసటి రోజు బోటు రిలీజ్. పోలీస్‌స్టేషన్‌లో పెట్టిన బంగారం దొంగతనం అయినట్టుగా బోటు మాయమైపోతుంది. దానికి కారణం ఎవ్వరయ్యా అంటే లోకేశ్, అదే టీడీపీకి చెందిన ఓ రాజ్యసభ ఎంపీ.ప్రమాదం జరిగిన జూలై 4న రాత్రి 10:30 గంటలకే మత్స్యకార సంఘం నేత వాసుపల్లి జానకీరామ్ కలెక్టర్‌కు మెసేజ్ పంపగా..‘వెంటనే పరిశీలిస్తాం’ అంటూ కలెక్టర్ స్పందన తప్పు చేసి.. ఆపై తప్పించుకునే యత్నంరాత్రి 10.30 గంటలకు అసోసియేషన్ అధ్యక్షుడు జానకీరాం.. కలెక్టర్‌కు, మెరైన్ సీఐకి మెసేజ్ (మెసేజ్ చూపిస్తూ) పెట్టారు. గంగవరం పోర్టుకు సమీపంలో బోటు ప్రమాదం జరిగిందని తెలుపుతూ సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. విశాఖలో తూర్పు నావికాదళం ప్రధాన కేంద్రం ఉంది. అంటే ఇక్కడే నేవీ ఉంది. కోస్ట్‌గార్డు ఉంది. విశాఖలో హెలికాప్టర్లు ఉన్నాయి. కలెక్టర్లు, కమిషనర్లు ఉన్నారు. ఇంత మంది ఇక్కడే ఉండీ.. కేవలం 10 నాటికల్ మైళ్ల దూరం వెళితే వీళ్లను కాపాడుకునే పరిస్థితి ఉండేది. కనీసం 5వ తేదీ ఉదయం 7 గంటలకు మనుషులు వచ్చి ఉంటే కనీసం 5–6 మంది బతికి ఉండేవాళ్లం అని చిన్నా చెబుతున్నారు. అంటే ఎవ్వరూ రాలేదు. చివరకు దేవుడి దయతో చిన్నాను చైనీస్ బోటు వాళ్లు చూసి పొద్దున 8.30 గంటలకు రక్షించారు. ఇక్కడ స్పందించాల్సిన కలెక్టర్, ప్రభుత్వం, కమిషనర్.. ఎవ్వరూ స్పందించలేదు. ఎవరూ కో ఆర్డినేట్ చేయలేదు. ప్రభుత్వంలో ఏ పెద్దలూ స్పందించలేదు. తప్పు జరిగిందని ఒప్పుకోకుండా.. త్రిసభ్య కమిటీ నివేదికలో దొంగ మాటలు చెప్పారు. బాధిత కుటుంబ సభ్యులు జూలై 5న ఉదయం 5 గంటల వరకు తమకు సమాచారం అందించలేదని ఆ నివేదికలో పేర్కొన్నారు. సరైన సమయంలో స్పందించకపోవడం తప్పు అయితే, ఆ తప్పును కప్పిపుచ్చుకునేందుకు త్రిసభ్య కమిటీ నివేదికలోనూ తప్పులు రాస్తున్నారు.గల్లంతైన ఘటనపై మత్స్యకారుల కుటుంబాలకు జూలై 5న ఉదయం 5గంటలకు సమాచారం అందినట్లు పేర్కొన్న త్రిసభ్య కమిటీ నివేదిక వైఎస్సార్సీపీ, చంద్రబాబు ప్రభుత్వానికి తేడా ఇదీఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత దారుణంగా ఉందనేందుకు కొన్ని ఉదాహరణలు చెబుతాను. 2023 నవంబర్‌లో విశాఖ ఫిషింగ్ హార్బర్లో 49 బోట్లు కాలిపోతే ఏకంగా బోటు విలువలో 80 శాతం విలువ కట్టి.. రూ.7.11 కోట్లు వెంటనే విడుదల చేశాం. సుమారు 400 మంది మత్స్యకార హమాలీలు, కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున సహాయం అందించాం. 2018లో నా పాదయాత్ర జరుగుతున్నప్పుడు 22 మంది మత్స్యకారులు పాకిస్తాన్లో చిక్కుకున్నారు. వారి కుటుంబాల వారు వచ్చి నన్ను కలిశారు. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే మన చొరవతో కేంద్ర ప్రభుత్వం దౌత్యం జరిపింది. ఫలితంగా 2020 జనవరి 5వ తేదీన ఆ 22 మంది మత్స్యకారులను తీసుకు రావడమే కాకుండా ప్రతి కుటుంబానికి రూ.5 లక్షలు వారి చేతిలో పెట్టి జీవనాధారం చూపించింది. 2019లో మత్స్యకారులు వేటకు వెళ్లి బంగ్లాదేశ్ నిర్బంధానికి లోనైతే కేంద్రం ద్వారా దౌత్యం చేసి తొమ్మిది మందిని సురక్షితంగా ఇళ్లకు చేర్చింది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే.ఎవరూ సంతోషంగా లేరు రాష్ట్రంలో ప్రతిదీ ఇలాగే ఉంది. రాష్ట్రంలో ఈ రోజు పిల్లలకు ఫీజు రీ యింబర్స్‌మెంట్ అందడం లేదు. స్కూళ్లు అన్యాయంగా తయారయ్యాయి. గోరుముద్ద కూడా సరిగా ఇవ్వని పరిస్థితి. పిల్లలకు కనీసం బ్యాగులు, బూట్లు, పుస్తకాలు కూడా సరిగా ఇవ్వని పరిస్థితి. ఆరోగ్యశ్రీ దారుణంగా తయారైంది. పేదవాడికి వైద్యం అందడం లేదు. రైతులకు ఏ పంటకూ మద్దతు ధర అందక రోడ్డు ఎక్కే పరిస్థితి. ఉచిత పంటల బీమా, ఆర్బీకేలు ఎగిరిపోయాయి. సూపర్ సిక్స్‌లు, సూపర్ సెవెన్లు అంటూ ఎన్నికల ముందు ప్రతి ఇంటికి వచ్చి సంతకాలు పెట్టి, బాండ్లు ఇచ్చి.. ఆపై మోసాలుగా మార్చి రాష్ట్ర ప్రజల జీవితాలతో చంద్రబాబు ఆటలాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో బాధిత ప్రజలందరికీ మేము అన్ని రకాలుగా తోడుంటాం. పార్టీ పరంగా చేయగలిగిన సహాయం చేస్తాం’ అని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు, మాజీ స్పీకరు తమ్మినేని సీతారాం, మాజీ మంత్రులు అమర్నాథ్, బూడి ముత్యాలనాయుడు, ఎంపీ తనూజ రాణి, జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్, ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి తదితరులు పాల్గొన్నారు. -
ముద్రగడ పద్మనాభం మృతి పట్ల వైఎస్సార్సీపీ నేతల దిగ్భ్రాంతి
వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం మృతిపై వైఎస్సార్సీపీ నేతలు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ముద్రగడ మృతి పట్ల బొత్స సత్యనారాయణ సంతాపం వ్యక్తం చేశారు. కాపు ఉద్యమ నేతగా ముద్రగడ పోరాటం అద్భుతమని చెప్పారు. కాపుల కోసం ఆయన చేసిన ఉద్యమాలు స్ఫూర్తిదాయకమని అన్నారు.వైవీ సుబ్బారెడ్డి సంతాపం వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభ మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేసిన నాయకుడిగా, కాపు సమాజ హక్కుల కోసం జీవితాంతం అంకితభావంతో పనిచేసిన వ్యక్తిగా ముద్రగడ పద్మనాభం చిరస్మరణీయులని అన్నారు. ప్రజా జీవితంలో ఆయన ప్రదర్శించిన నిబద్ధత, ఉద్యమ స్ఫూర్తి, సామాజిక న్యాయం కోసం చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. ముద్రగడ పద్మనాభం మరణం రాష్ట్ర రాజకీయాలకు, ముఖ్యంగా కాపు సమాజానికి తీరని లోటని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు, అభిమానులకు, అనుచరులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారుజూపూడి ప్రభాకరరావు దిగ్భ్రాంతిముద్రగడ పద్మనాభం మృతిపై దళిత ఉద్యమ నేత, మాజీ ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకరరావు ప్రగాఢ సంతాపం తెలిపారు. కాపు ఉద్యమానికి జీవితాంతం అంకితభావంతో సేవలందించిన ప్రముఖ ప్రజానేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ సారథి ముద్రగడ పద్మనాభం ఆకస్మిక మరణవార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం చేసిన ధీశాలి నాయకుడిగా, కాపు సమాజ హక్కులు, ఆత్మగౌరవం కోసం నిరంతరం కృషి చేసిన మహోన్నత వ్యక్తిగా ముద్రగడ పద్మనాభం చిరస్థాయిగా ప్రజల హృదయాలలో నిలిచిపోతారని అన్నారు.వెలంపల్లి శ్రీనివాసరావు తీవ్ర సంతాపంకాపు ఉద్యమ నేత,మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గారి హఠాన్మరణం పట్ల మాజీ మంత్రి,వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు తీవ్ర దిగ్భ్రాంతిని,సంతాపాన్ని వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వెలంపల్లి శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ ముద్రగడ పద్మనాభం గారు తన జీవితాంతం ప్రజల కోసం,ప్రత్యేకించి కాపు సామాజికవర్గ హక్కుల సాధన కోసం అలుపెరగని పోరాటం చేశారని కొనియాడారు.రాజకీయాల్లో ఆయన నిబద్ధత,నిష్కల్మషమైన వ్యక్తిత్వం అందరికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.ఆయన మరణం రాష్ట్ర రాజకీయాలకే కాకుండా,ప్రజా ఉద్యమాలకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.ముద్రగడ పద్మనాభం గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ,వారి కుటుంబ సభ్యులకు,అభిమానులకు వెలంపల్లి శ్రీనివాసరావు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారుముద్రగడ మృతి తీరని లోటు: మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుముద్రగడ్డ పద్మనాభం మరణవార్త తనను ఎంతో కలచివేసిందని, ఆయన మృతి ప్రజా ఉద్యమాలకు, నగర రాజకీయాలకు తీరని లోటని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. విజయవాడ నగరంతో ముద్రగడ్డ పద్మనాభంకు దశాబ్దాల కాలంగా ఎంతో విడదీయరాని, ప్రత్యేకమైన అనుబంధం ఉందని గుర్తుచేశారు. ప్రస్తుత తరం నాయకుల్లో ఆయనలాంటి నిబద్ధత, నీతి, నిజాయితీ కలిగిన వ్యక్తిని చూడటం చాలా అరుదు అని మల్లాది విష్ణు వ్యాఖ్యానించారు. కాపు సామాజిక వర్గానికి తిరుగులేని ఉద్యమ నేతగా ముద్రగడ చరిత్రలో నిలిచిపోయారన్నారు. విలువలతో కూడిన రాజకీయాన్ని నమ్మి, దానికి కట్టుబడి జీవించిన ధీరుడు ముద్రగడ్డ పద్మనాభం అని ఆయన నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు మల్లాది విష్ణు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కష్టసమయంలో ఆ కుటుంబానికి కొండంత ధైర్యం కలగాలని ఆకాంక్షించారు.అనిల్ కుమార్ యాదవ్ దిగ్భ్రాంతి ముద్రగడ పద్మనాభం మృతి వైఎస్సార్సీపీకితీరని లోటని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఒక మంచి ఉద్యకారుడిని కోల్పోవడం చాలా బాధాకరమని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని చెప్పారు. కేకే రాజు సంతాపంముద్రగడ పద్మనాభం మృతిపై విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు కేకే రాజు సంతాపం తెలిపారు. రాష్ట్రం అనుభవజ్ఞుడైన నేతను కోల్పోయిందని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ముద్రగడ జీవిత కాలం కృషి చేశారని తెలిపారు. ముద్రగడ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు.-- -
‘రైతుల్ని గాలికొదిలేసి అమరావతి దోపిడీకి ప్రాధాన్యం’
తాడేపల్లి: తీవ్రమైన వర్షాభావ పరిస్థితులతోపాటు ఎరువుల కొరతతో రైతాంగం అల్లాడిపోతుంటే కనీసం రివ్యూ కూడా నిర్వహించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందా అని వైఎస్సార్సీపీ జనరల్ సెక్రటరీ గడికోట శ్రీకాంత్‌రెడ్డి నిలదీశారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. డెల్టా ప్రాంతాల్లో కొద్దిపాటి పంటలు వేసుకున్న రైతులకు కనీసం ఎరువులు కూడా సప్లై చేయలేని చేతకాని స్థితిలో ఈ ప్రభుత్వం ఉందని విమర్శించారు. ఈ ప్రభుత్వ పనితీరు ఎంత అధ్వాన్నంగా ఉందో చెప్పడానికి యూరియా కోసం వెళ్లి రైతులు అసువులు బాసిన రైతుల మరణాలే నిదర్శనమని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కష్టాల్లో ఉన్న రైతులను గాలికొదిలేసి, రాజధాని నిర్మాణం పేరుతో ప్రజాధనాన్ని లూఠీ చేయడంలో నిమగ్నమయ్యారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రెండేళ్లలో ఏం రంగం చూసినా వెనుకబాటుతనమే కనిపిస్తోందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిపై ప్రశ్నిస్తుంటే తట్టుకోలేక తప్పుడు కేసులు పెట్టి వేధించడం, ప్రశ్నించే గొంతులను నొక్కడమే ధ్యేయంగా సోషల్ మీడియాని కట్టడి చేయాలని చూడటం సిగ్గుచేటని మండిపడ్డారు.ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్.. ముఖ్యమంత్రి చంద్రబాబుని ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పే ధైర్యం లేక వ్యక్తిగత దూషణలకు దిగుతున్నాడని ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలపై చర్చను పక్కదారి పట్టించే చంద్రబాబు కుట్రను అర్థం చేసుకున్నాం కాబట్టే వీటన్నింటినీ సంస్కారంతో భరిస్తున్నామని చెప్పారు. కానీ తప్పుడు కేసులకు భయపడి ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని గడికోట శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు.వర్షాభావ పరిస్థితులపై ముందస్తు ప్రణాళిక లేదురాష్ట్రంలో ఎలినినో ఎఫెక్ట్ వల్ల జూన్ నుండి సెప్టెంబర్ వరకు తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయని వాతావరణ శాఖ 6 నెలల ముందే హెచ్చరించింది. అయినా ఈ ప్రభుత్వం కనీసం ముందస్తు ప్రణాళిక రూపొందించుకోకుండా రైతులను గాలికి వదిలేసింది. ఖరీఫ్ సీజన్ మొదలై ఒకటిన్నర నెల గడుస్తున్నా.. ఇంతవరకు విత్తన సాగు లేక రైతులు దయనీయ స్థితిలో ఉన్నారు. మే నెలలోనే విత్తన సరఫరా జరగాల్సి ఉన్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. డెల్టా ప్రాంతాల్లో కొద్దిపాటి పంటలు వేసుకున్న రైతులకు కనీసం ఎరువులు కూడా సప్లై చేయలేని చేతకాని స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. శ్రీకాకుళంలో ఎరువుల కోసం వెళ్లిన మహిళ చనిపోవడం అత్యంత విచారకరం. ఇంత జరుగుతున్నా ఈ ప్రభుత్వానికి కనీసం చలనం లేదు. రాష్ట్రంలో పశుగ్రాస కొరత తీవ్రమవుతోంది. రైతులకు అందాల్సిన ఉంచిత పంటల బీమా, సున్నా వడ్డీ రుణాలు, పెట్టుబడి సాయంపై ఈ ప్రభుత్వం కనీసం అధికారులతో ఒక్క రివ్యూ కూడా నిర్వహించలేదు. వ్యవసాయ శాఖ మంత్రి గానీ, ముఖ్యమంత్రి గానీ రైతులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేయకపోవడం దురదృష్టకరం.రాజధాని నిర్మాణాల పేరిట వేల కోట్ల దోపిడీరాజధాని పేరుతో రూ.50వేల కోట్లు అప్పులు తెచ్చి, ప్రజల నెత్తిన భారం వేస్తూ మొబిలైజేషన్ అడ్వాన్స్‌ల పేరిట దోపిడీ చేస్తున్నారు. పక్కనే ఉన్న తెలంగాణలో కేవలం 10 లక్షల చదరపు అడుగులతో రూ. 670 కోట్లలో అద్భుతమైన సచివాలయం నిర్మించుకున్నారు. కానీ ఇక్కడ 52 లక్షల చదరపు అడుగులతో సచివాలయం ఎందుకు కడుతున్నారు? ప్రస్తుతం ఉన్న తాత్కాలిక సచివాలయమే 6.8 లక్షల చదరపు అడుగులు ఉంది. అది సరిపోవడం లేదా? చదరపు అడుగుకు రూ. 20వేల చొప్పున ఖర్చు చేస్తూ ప్రజాధనాన్ని కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారు. సంవత్సరానికి కేవలం 40 రోజులు జరిగే అసెంబ్లీ సమావేశాల కోసం వేలాది కోట్లు ఖర్చు పెట్టి నిర్మించాల్సిన అవసరం ఏముంది? కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలోని ఆంధ్ర భవన్‌ను చదరపు అడుగుకు రూ. 4,500 ఖర్చుతో నిర్మిస్తుంటే, ఇక్కడ అన్ని వనరులు ఉచితంగా ఉన్నా రూ. 20వేలు ఎందుకు ఖర్చు చేస్తున్నారు? మేము అడిగే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, వైఎస్సార్సీపీ రాజధానికి వ్యతిరేకం అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు.వైఎస్సార్సీపీ హయాంలోనే వాస్తవ అభివృద్ధిదివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన జలయజ్ఞం వల్లే ఇవాళ గ్రామాలు పచ్చగా ఉన్నాయి. పోలవరం సహా ఏ ప్రాజెక్టు చూసినా వైఎస్సార్ పేరే వినిపిస్తుంది. వైఎస్ జగన్ రెడ్డి గారి హయాంలోనే గ్రామ సచివాలయాలు వచ్చాయి, 17 నూతన మెడికల్ కాలేజీల నిర్మాణం జరిగింది. నిన్న పిడుగురాళ్ల మెడికల్ కాలేజీకి కేంద్రం నుండి 100 సీట్లు మంజూరు కావడం జగన్ దూరదృష్టికి నిదర్శనం. నూతన పోర్టుల నిర్మాణం కూడా ఆయన వల్లే సాధ్యమైంది. గతంలో జగన్ గారు సంక్షేమ పథకాలు ఇస్తుంటే ఫ్రీబీస్ అంటూ విమర్శించారు. జగన్ పేద ప్రజల చదువు, ఆరోగ్యం, మహిళల ఆర్థిక స్థితిగతుల కోసం నేరుగా వారి ఖాతాల్లో డబ్బులు వేశారు. కానీ ఇవాళ కూటమి ప్రభుత్వం ఎకరా 99 పైసల చొప్పున భూములను ధనవంతులకు దోచిపెడుతోంది. మీవి అవినీతి ఫ్రీబీస్ అయితే, జగన్ సామాన్యుడికి చేసిన సహాయం.ముఖ్యమంత్రి స్థాయికి తగని బూతుల పురాణందేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా మాట్లాడనంతటి అసభ్యకరమైన భాషను, బూతులను చంద్రబాబు వేదికలపై మాట్లాడుతున్నారు. వయసులో తన కొడుకు సమానమైన వైఎస్ జగన్ గారు ఇప్పటికీ చంద్రబాబు గారిని 'పెద్దమనిషి' అని, 'గౌరవ ముఖ్యమంత్రి' అని సంబోధిస్తారు. కానీ చంద్రబాబు గారు కింది స్థాయి నేతలకు కూడా బూతులు నేర్పిస్తూ వ్యవస్థలను దిగజారుస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో రూ. 3.36 లక్షల కోట్ల అప్పులు చేస్తే, కేవలం రెండుళ్లలోనే చంద్రబాబు రూ. 3.5 లక్షల కోట్ల అప్పులు చేశారు. అవినీతిని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే సమాధానం చెప్పే ధైర్యం లేకనే ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారు. ఈ ప్రభుత్వ అవినీతిపై సొంత పార్టీ ఎమ్మెల్యేలే తిరుగుబాటు చేస్తున్నారా లేదా? ప్రజాస్వామ్య విధ్వంసం - సోషల్ మీడియాపై ఉక్కుపాదంనిన్న గంట సేపు క్యాబినెట్ మీటింగ్ జరిగితే.. అందులో 90శాతం సమయం కేవలం సోషల్ మీడియాను ఎలా అణచివేయాలి, ప్రశ్నించే వారిపై ఎలాంటి కేసులు పెట్టాలి అనేదానిపైనే చర్చించారు. మిగిలిన 10 నిమిషాలు భూములు ఎలా పంచుకోవాలనే దానికి కేటాయించారు. ప్రశ్నించిన వారిని హింసించడం, యూట్యూబర్స్ ఇళ్లకు పోలీసులను పంపి భయభ్రాంతులకు గురి చేయడం చూస్తుంటే తాలిబాన్ల పరిపాలన మేలనేలా ఉంది. నాగార్జున యాదవ్ ఎప్పుడో రెండేళ్ల క్రితం మాట్లాడిన మాటలకు ఇప్పుడు చట్టవిరుద్ధంగా అరెస్ట్ చేశారు. క్రాంతి అనే దళిత యువకుడు పోలీసుల వేధింపులు తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నాడు. జ్ఞానేశ్వరి అనే చిన్నారి అదృశ్యమై 30 రోజులు దాటినా ఇంతవరకు ఆచూకీ లభించలేదు. లాకప్‌లో మరణించిన సాయికృష్ణ కేసు ఈ ప్రభుత్వం మెడకి చుట్టుకుంది. వీటన్నింటికీ సమాధానం చెప్పలేక ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. వాటిని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారనే కోపంతో అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, వ్యక్తిగత దూషణలు చేసినా సంస్కారంతో భరిస్తాం. కానీ, ప్రజా సమస్యలపై వైఎస్సార్సీపీ ఎప్పటికీ ఆపదని గడికోట శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు. -
తూర్పుగోదావరి: రామవరంలో ఉద్రిక్తత
సాక్షి, తూర్పుగోదావరి: అనపర్తి మండలం రామవరంలో కూటమినేతల అరాచకం సృష్టించారు. వైఎస్సార్సీపీ నేతల ఇళ్లపై కూటమి నేతలు దాడులకు పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ నేత కృష్ణారెడ్డి ఇంటిపై కూటమి నేతలు దాడి చేశారు. కూటమి నేతల ఆగడాలను అదుపు చేయాలంటూ వైఎస్ఆర్సిపి కోఆర్డినేటర్ డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి రామవరంలో రోడ్డుపై బైఠాయించారు.సూర్యనారాయణ రెడ్డిని బలవంతంగా ఈడ్చుకెళ్లిన పోలీసులు.. వైఎస్సార్సీపీ కార్యకర్తల కోసం ఏర్పాటు చేసిన టెంట్లను కూడా పీకేశారు. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రోద్బలంతోనే ఈ దారుణానికి టీడీపీ నేతలు ఒడిగట్టారంటూ వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. ఘటనపై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని వైఎస్సార్సీపీ నేతలు తెలిపారు.


