breaking news
-
బాబు ప్రైవేట్ పిపాసకు ఏపీలో వైద్యం బలి!
ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒట్టి అమాయకులన్న మాటలు ఒక్కోసారి నిజమే అనిపిస్తుంది. కొందరు నేతల చేతిలో పదే పదే మోసపోతూంటారు మరి. ఒకసారైతే ఏమో అనుకోవచ్చు కానీ.. పదే పదే మోసపోతూంటే అది ప్రజల తప్పే కదా? ప్రస్తుత ముఖ్యమంత్రి.. గతంలోనూ ఈ పదవిలో ఉన్న చంద్రబాబు నాయుడినే ఉదాహరణగా తీసుకోండి. రాజకీయ జీవితం మొదలైనప్పటి నుంచి ఈయన చెప్పేదొకటి. చేసేది ఇంకోటి. మూడుసార్లు సీఎంగా ఉన్నా ఇచ్చిన హామీలు నెరవేర్చిన రికార్డు మాత్రం లేదీయనకు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఉజ్వల భవిష్యత్తు కాంక్షించి వైఎస్ జగన్ నేతృత్వంలోని గత ప్రభుత్వం నిర్మించిన పది వైద్య కళాశాలలను అప్పనంగా ప్రైవేటు వారి చేతుల్లో పెట్టేందుకు సిద్ధమవుతోంది చంద్రబాబు ప్రభుత్వం. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా 17 వైద్య కళాశాలలకు అనుమతులు తీసుకొచ్చి ప్రభుత్వం ద్వారానే నడపాలని నిర్ణయించారు. మెరుపువేగంతో పలు కళాశాలల నిర్మాణమూ సాగింది. ఐదింటిని ప్రారంభించగా మిగిలిన వాటిని కూడా మొదలుపెట్టే క్రమంలో ఎన్నికలకొచ్చాయి. అధికారం జగన్ చేజారింది. చంద్రబాబు అధికారం చేపట్టింది మొదలు ఈ వైద్యకళాశాలలపై పగబట్టినట్టు వ్యవహరించారు. పులివెందుల మెడికల్ కాలేజీకి మంజూరైన 50 సీట్లు వద్దనేశారు. ప్రజల నిరసనలు, ప్రతిపక్షాల విమర్శలను బేఖాతరు చేస్తూ ఉత్తర్వులు కూడా ఇచ్చేశారు. ఫలితంగా వందల కోట్ల రాష్ట్ర ప్రభుత్వ సొమ్ము ప్రైవేటు పరం కానుంది. అయితే సంపద సృష్టించి సంక్షేమం అమలు చేస్తానని, తమది సంపద సృష్టించే పార్టీ అని ఎన్నికల సమయంలో ఊరంతా ఊదరగొట్టిన ఇదే చంద్రబాబు ఇప్పుడు సంపదను అప్పనంగా ఇంకొకరికి ధారాదత్తం చేస్తున్నారు. ఒక్కో మెడికల్ కాలేజీకి గత ప్రభుత్వం యాభై ఎకరాల భూమి కేటాయించింది. శాశ్వత నిర్మాణాలు చేపట్టింది. ఇప్పుడు ఇవన్నీ ప్రైవేట్! ఎకరాకు వంద రూపాయల లీజంట. కాకపోతే ఆయన సంపద సృష్టిస్తానన్నారే గానీ.. పేదల కోసమని చెప్పారా ఏంటి? చెప్పలేదు లెండి! ఇంకో విచిత్రమూ ఉందిక్కడ. చంద్రబాబు ఈ మధ్య పదే పదే వల్లెవేస్తున్న పీ-4కు ఈ వైద్య కళాశాలల అమ్మకానికి లింకు పెట్టడం! ప్రభుత్వం నుంచి చౌక ధరలకు ఆస్తులు ఆస్తులు పొందిన వారు లేదంటే ప్రైవేట్ కాంట్రాక్టర్లు పీ-4 కింద పేదలను దత్తత తీసుకుని వారిని ఉద్ధరిస్తారని బాబు చెబుతున్నారు. పైగా సంపన్నులు-పేదల మద్య లింక్ పెట్టడానికి పి-4 విధానం తెస్తానని అన్నారు. అదేమిటో తొలుత చాలామందికి అర్ధం కాలేదు. ప్రభుత్వంలోకి వచ్చాక తన స్కీములు కొన్నిటిని ముఖ్యంగా ఆడబిడ్డ నిధి బదులు పి-4 తో సరిపెట్టుకోవాలని ఆయన ప్రత్యక్షంగా,పరోక్షంగా చెప్పారు. అంటే ఆయన ప్రైవేటువారికి సంపద సృష్టిస్తారు.ఆ తర్వాత వారు దయతలచి పేదలకు ఏదో కొంత విదిలిస్తారన్నమాట. 2024లో అనూహ్యంగా ఎన్నికై ప్రభుత్వ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్ని విషయాలలో చంద్రబాబు యు-టర్న్ తీసుకున్నారో చెప్పనవసరం లేదు. బాబు ప్రైవేట్ పక్షపాతి అనేందుకు వైద్య కళాశాలల ఉదంతం తాజాది మాత్రమే. గతంలోనూ ఎన్నో కనిపిస్తాయి. అత్యంత విలువైన విశాఖ భూములను అణా, కాణికి తెగనమ్ముతూండటం గురించి చెప్పుకోవాలిక్కడ. గత ప్రభుత్వ హయాంలో ఐటీ పరిశ్రమ కోసం టాటా కన్సెల్టెన్సీ సంస్థ భూమి లీజుకు అడిగింది. వ్యవహారం ముందు నడుస్తూండగానే అధికార మార్పిడి జరిగింది. టీడీపీ ప్రభుత్వం లీజుమాటను పక్కకు పెట్టేసి చాలా ఉదారంగా సుమారు 200 కోట్ల రూపాయల విలువైన ఇరవై ఎకరాల భూమిని 99 పైసలకు ధారాదత్తం చేస్తామని ప్రకటించింది. అయితే న్యాయస్థానాలు, ప్రజాసంఘాల విమర్శల నేపథ్యంలో దీన్ని లీజుగా మార్చారేమో తెలియదు. పనిలో పనిగా తమకు కావాల్సిన మరో కంపెనీకి 60 ఎకరాలు ఇదే పద్ధతిలో ఇవ్వాలనుకున్నారు కానీ.. వివాదం కావడంతో ఎకరా అర కోటికి ఇస్తున్నట్లు చెబుతున్నారు. పరోక్షంగా రూ.వంద కోట్ల లాభం చేసి పెట్టారన్నమాట. 1995-2004 మధ్య కాలంలో చంద్రబాబు 54 ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేశారు. వాటిలోని ఉద్యోగులందరికి వీఆర్ఎస్ ఇచ్చి పంపేశారు. ఆ సంస్థలను పొందిన కొన్ని కంపెనీలు అక్కడి భూమితోనే సంపద సృష్టించుకోగలిగాయి. విశాఖ స్టీల్‌ను ఎట్టి పరిస్థితిలోను ప్రైవేట్ పరం కానివ్వమని ఎన్నికల సమయంలో ప్రకటించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు ఇప్పుడు 34 విభాగాల ప్రైవేటీకరణను ఖండించకపోగా తప్పేముందని ఎదురు ప్రశ్నిస్తున్నారు. కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణలను అమలు సందర్భంలోనూ బోలెడంత ఆదా అవుతుంందని, ఛార్జీలు తగ్గించవచ్చని, పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేయవచ్చని అనేవారు. కానీ వాస్తవానికి చేసింది సున్నా. మోపెడైన విద్యుత్తు ఛార్జీలను నిరసిస్తూ రైతులు ఆందోళనకు దిగితే బషీర్ బాగ్ కాల్పులు జరిపించిన చంద్రబాబు నలుగురు యువకుల మరణానికి కారణమయ్యారు. ఉచిత విద్యుత్తునిస్తే కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాలని విమర్శించిన ఘనుడు చంద్రబాబు. ఆ తర్వాత కాలంలో వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం అయ్యాక రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చి చూపారు. తదనంతర కాలంలో తన సంస్కరణల వల్లే ఉచిత విద్యుత్తు ఇవ్వడం సాధ్యమైందని ప్రచారం చేసుకోగలిగారు నిస్సిగ్గుగా! అంతెందుకు! గత జగన్ టర్మ్‌లో రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్తును లెక్కించడానికి స్మార్ట్ మీటర్లు పెడుతుంటే టీడీపీ పూర్తిగా వ్యతిరేకించింది. స్మార్ట్ మీటర్లను పగలగొట్టండని లోకేశ్ పిలుపు ఇచ్చారు. కూటమి ప్రభుత్వం రాగానే అవే స్మార్ట్ మీటర్లను ఇళ్లకు కూడా బిగిస్తున్నారు. ప్రభుత్వ ఆరోగ్యశ్రీని ప్రైవేటు బీమా కంపెనీల పరం చేస్తున్నారు. దీనివల్ల బీమా కంపెనీలకు ప్రభుత్వం సుమారు రూ.వెయ్యి కోట్ల నుంచి 1500 కోట్ల వరకు అదనంగా చెల్లించాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఆ మేరకు ఆ సంస్థలకు సంపద అంటే ప్రజల ధనం చేరుతుందన్నమాట. జగన్ ప్రభుత్వం ద్వారా మద్యం షాపులను ఊరుబయట నడిపిస్తే, చంద్రబాబు సీఎం కాగానే వాటన్నిటిని తీసేసి ప్రైవేటు వారికి, ముఖ్యంగా తన పార్టీ వారికి ఆదాయ వనరుగా మార్చారు. అది సంపద సృష్టి అన్నమాట.పలు రోడ్లను ప్రైవేటు పరం చేస్తారట. ఇప్పుడు మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడానికి కూడా ఎల్లో మీడియా అండతో సమర్థించుకోవడం ఆరంభమైంది. ప్రభుత్వం వద్ద డబ్బు లేదని, ప్రభుత్వ రంగంలో అయితే బాగా నడవవని కూడా ప్రచారం చేయిస్తారు. ప్రభుత్వ ప్రచారం కోసం రూ.2300 కోట్లతో ఫైబర్ నెట్ సంస్థను అభివృద్ది చేసి, నిర్వహణను ప్రైవేటు వారికి అప్పగిస్తారని ఎల్లో మీడియానే రాసింది. సూపర్ సిక్స్ వంటివాటి అమలుపై పలు రకాలుగా అభిప్రాయాలు వ్యక్తం చేశారు. సంపద సృష్టించిన తర్వాత సంక్షేమం అని కూడా చంద్రబాబు కొన్నిసార్లు అన్నారు. అయినా ప్రజల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకత నేపధ్యంలో కొన్ని హామీలనైనా కొంతమేరకైనా అమలు చేయక తప్పడం లేదు. వైద్య కాలేజీలపై ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్ ఒక ఘాటు ప్రకటన చేశారు. ‘‘కమిషన్ల కోసం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను మీ వాళ్లకు పందేరం చేస్తారా’’ అని ప్రశ్నించారు. 2019కి ముందు ఒక్క మెడికల్ కాలేజీ అయినా ప్రభుత్వరంగంలో తెచ్చారా అని ఆయన చంద్రబాబును అడిగారు. తాము అధికారంలోకి వచ్చాక ఈ వైద్య కళాశాలలను మళ్లీ ప్రభుత్వ రంగంలోకి తీసుకు వస్తామని స్పష్టం చేశారు.టీడీపీ మద్దతుదారుల్లోనూ చాలామందికి వైద్యకళాశాలల ప్రైవేటీకరణ నచ్చడం లేదు. ఈ మధ్య లోకేశ్ విజన్ అంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు. ఆయన కూడా అదే తరహా ఉపన్యాసాలు ఇస్తున్నారు. ఆ ప్రసంగం చూస్తే ఆయన ప్రస్తుత మంత్రి నారాయణ ద్వారా బ్రిడ్జి కోర్స్ చదివారట. మొత్తం ప్రైవేటు విద్యా సంస్థలలోనే ఆయన చదువు కొనసాగింది. ప్రైవేటు యూనివర్శిటేలే బెటర్ అని కూడా ఆయన అన్నారు. చంద్రబాబు బాటలోనే నడుస్తున్న ఆయన ప్రస్తుత విద్యా శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ఇవేవి పట్టవు కాబట్టి వీరికి ఇబ్బంది లేదు. ఎన్టీఆర్ టీడీపీని స్థాపించినప్పుడు పేదల సంక్షేమానికి పుట్టిన పార్టీగా చెప్పేవారు. చంద్రబాబు నాయకత్వంలోకి వచ్చాక అది కొంతమంది ప్రైవేటు వ్యక్తులకు సంపద సృష్టించే పార్టీగా గుర్తింపు పొందుతోంది. సినిమాల ద్వారా ధనికుడు అయిన ఎన్టీఆర్. పేదల సంక్షేమం గురించి స్కీములు తెచ్చారు. అలాగే సంపన్న కుటుంబంలో పుట్టిన వై.ఎస్.రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్ లు పేదల పక్షపాతులుగా పేరు తెచ్చుకున్నారు. పేదరికం నుంచే వచ్చిన చంద్రబాబు నాయుడు అందుకు భిన్నంగా ఉన్నారన్న విమర్శకు గురి అవుతున్నారు.. ప్రస్తుతం ఆయన దేశంలోనే అత్యంత సంపన్న సి.ఎమ్.గా రికార్డు సాధించారు. ఆయన ప్రైవేటు, కార్పొరేట్ సంస్థల డార్లింగ్ గా గుర్తింపు పొందారు. ఈ నేపధ్యంలో చంద్రబాబు వైద్య కళాశాలలను పిపిపి పేరుతో ప్రైవేటు పరం చేస్తున్నారు. ఇప్పుడు ఎవరిది తప్పు?ఆంధ్ర ప్రజలదా? లేక చంద్రబాబుదా?కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
చంద్రబాబువన్నీ మోసాలే.. వైఎస్ జగన్ ప్రెస్‌మీట్ హైలైట్స్
సాక్షి, గుంటూరు: ఏపీలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ పాలనలో.. యూరియా కొరత, గిట్టుబాటు ధరలేక రైతులు పడుతున్న అవస్థలు, 10 కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం.. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసి వైద్య రంగాన్ని దెబ్బ తీయడం.. అలాగే సూపర్‌సిక్స్ హామీలు అమలు చేయకపోయినా, సూపర్‌హిట్ పేరుతో ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేసుకోవడం గురించి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మీడియా ద్వారా సుదీర్ఘంగా మాట్లాడారు. రైతులకు అందాల్సిన ఎరువులు, యూరియాను బ్లాక్ మార్కెట్ చేస్తూ స్కామ్‌కు పాల్పడుతున్నారు. దాన్ని నిరసిస్తూ మా పార్టీ నాయకులు, కార్యకర్తలు రైతులకు తోడుగా నిలబడుతూ, వారి పక్షాన వారితో కలిసి ఆర్డీఓలకు అర్జీ ఇచ్చే కార్యక్రమం చేశారు. దాన్ని కూడా అడ్డుకుంటూ, పోలీసుల ద్వారా అణగదొక్కే ప్రయత్నం చేశారు. మాజీ మంత్రులు, సీనియర్ నాయకులకు నోటీసులు ఇచ్చారు. (అంటూ, పోలీసులు ఇచ్చిన నోటీసులు మీడియాకు పీపీటీలో చూపారు) యూరియా కోసం రైతులతో కలిసి ఆర్డీఓకు అర్జీలు ఇవ్వడం తప్పా? రైతుల తరపున మాట్లాడొద్దా? ప్రజాస్వామ్యం ఖూనీ చేస్తున్నారు. అసలు మీరు అవసరమైన ఎరువులు అందిస్తే, ఏ రైతు కూడా రోడ్డెక్కడు కదా? ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరు స్కామ్‌లు చేశారు. అందుకే ఈ పరిస్థితి. ఏకంగా రెండు నెలల నుంచి రైతులు యూరియా కోసం నానా అగచాట్లు పడుతున్నారు. అది మీ దారుణ పాలనకు సాక్ష్యం కాదా?. మీ అవినీతి పాలనకు నిదర్శనం కాదా? (అంటూ.. యూరియా కోసం అనేక చోట్ల రైతులు బారులు తీరిన ఫోటోలు ప్రదర్శన. చివరకు కుప్పం, టెక్కలిలో కూడా అదే స్థితి).నేను ఒకటే అడుగుతున్నాను. ప్రజలంతా ఆలోచించాలి. మా పాలనలో 5 ఏళ్లలో ఎక్కడైనా, ఎప్పుడైనా రైతులు ఇలా ఎరువుల కోసం అగచాట్లు పడ్డారా? రోడ్డెక్కారా? అప్పులు ఆ పరిస్థితి ఎందుకు రాలేదు?. ఇప్పటి పరిస్థితికి కారణం.. జగన్ అనే వ్యక్తికి రైతుల మీద ఆపేక్ష. వారికి మంచి చేయాలన్న తపన, తాపత్రయం. నాటి సీఎంకు, ఇప్పటి సీఎంకూ అదే తేడా. ఎరువుల సరఫరాలో కూడా స్కామ్ చేస్తున్నారు. అందుకే ఈ దుస్థితి. ఇందుకు చంద్రబాబు సిగ్గుతో తల దించుకోవాలి.చంద్రబాబు నోట అబద్ధాలు..ఈనెల 3న మీడియాతో మాట్లాడిన సీఎం చంద్రబాబు, ఈ ఖరీఫ్‌లో 6.65 లక్షల మెట్రిక్ టన్నుల యూరియ సరఫరా చేశామని, గత ఏడాదితో పోలిస్తే 97 వేల టన్నులు ఎక్కువ సరఫరా చేశామని చెప్పారు. మరి చంద్రబాబుగారు చెబుతున్నట్లుగా ఎరువులు అంది ఉంటే, రైతులు రోడ్కెక్కే పరిస్థితి ఎందుకు వచ్చింది? వారికి యూరియా అందలేదు కాబట్టే, ఈ పరిస్థితి వచ్చింది కదా?. రాష్ట్రానికి వస్తున్న యూరియాను టీడీపీ నాయకులు దారి మళ్లించి ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. మరోవైపు ప్రైవేటు వ్యాపారులకు ఎక్కువగా ఇచ్చేశారు. వారు కొరత సృష్టించి బస్తాకు రూ.200 వరకు ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. ఇలా బ్లాక్మార్కెట్లో ఎరువులు అమ్ముతూ దాదాపు రూ.250 కోట్ల వరకు స్కామ్ చేస్తున్నారు. రైతులను పీడించి, స్కామ్‌లు చేసి అందరూ పంచుకుంటున్నారు.మరోవైపు, ఏ ఒక పంటకూ గిట్టుబాటు ధర లేదు. వరి, చీనీ.. ఏది చూసినా. ఇప్పుడు కూడా ఉల్లి, టమోటా పరిస్థితి కూడా అదే. ధరలు పడిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ, సీఎం చంద్రబాబు పట్టించుకోడు. తూతూ మంత్రంగా ప్రకటన చేస్తాడు. అసలు ముందు వాస్తవాలు ఒప్పుకోడు. తప్పదనుకుంటే, ఒక ప్రకటన చేస్తాడు. దాన్ని ఎల్లో మీడియా హైలైట్ చేస్తుంది. ఈరోజు ఉల్లి క్వింటాలు ధర రూ.200 నుంచి రూ.300 ఉంటే, బహిరంగ మార్కెట్లో కేజీ రూ.34. అంటే క్వింటాలుకు రూ.3400.మా ప్రభుత్వ హయాంలో రూ.7,802 కోట్లు ఖర్చు చేసి, మార్కెట్లో జోక్యం చేసుకున్నాం. ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతులను ఆదుకున్నాం. మార్కెట్లో పంటల ధరలు తగ్గితే.. సీఎం–యాప్ (కంటిన్యూయస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైజ్ అండ్ ప్రొక్యూర్మెంట్) ద్వారా ప్రభుత్వం రంగంలోకి దిగి, కొనుగోలు చేసేది. కానీ, ఇప్పుడవేవీ లేవు. మా ప్రభుత్వం అమలు చేసిన అనేక పథకాలకు మంగళం పాడేశారు.ప్రజారోగ్య రంగం నిర్వీర్యం.. సంపద సృష్టిస్తానని ఎన్నికల ముందు చెప్పి, ఇప్పుడు ప్రభుత్వ ఆస్తులను శనక్కాయలు, బెల్లానికి అమ్ముకంటున్నారు. తన మనుషులకు దోచి పెడుతున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ.. తారాస్థాయికి చేరిన చంద్రబాబు అవినీతి, స్కామ్‌లకు పరాకాష్ట. 2019 వరకు మన రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీలు 11. పద్మావతి వర్సిటీ కాలేజీ కూడా కలుపుకుంటే వాటి సంఖ్య 12. చంద్రబాబు తన అన్నేళ్ల పాలనలో కనీసం ఒక్కటంటే, ఒక్క మెడికల్ కాలేజీ అయినా కట్టాడా? కనీసం ఆ ఆలోచన అయినా చేశాడా?. అదే మా ప్రభుత్వంలో కేవలం 5 ఏళ్ల అతికొద్ది కాలంలోనే, ప్రతి జిల్లాకు ఒక టీచింగ్ హాస్పిటల్ తీసుకురావాలని, ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని చూశాం. జిల్లాలు 13 నుంచి 26కు పెంచి, ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశారు. ఎప్పుడైతే ఒక జిల్లాలో మెడికల్ కాలేజీలో భాగస్వామ్యంగా టీచింగ్ హాస్పిటల్ ఏర్పాటైతే, అక్కడ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుతాయి. ఆ స్థాయిలో వైద్యులు, వైద్య సిబ్బంది అందుబాటులోకి వస్తారు. మా హయాంలో 17 మెడికల్ కాలేజీల పనులు చేపట్టాం. ఒక్కో దానికి రూ.500 కోట్లు ఖర్చు చేశాం. ప్రతి కాలేజీని 50 ఎకరాల్లో చేపట్టాం. అన్ని హంగులతో వాటి నిర్మాణం చేపట్టాం. అంకితభావంతో పని చేశాం కాబట్టే.. 2023–24లో విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో మెడికల్ కాలేజీలు ప్రారంభించాం. తరగతులు మొదలయ్యాయి. అవే కాకుండా, గత ఏడాది ఎన్నికల నాటికి, పాడేరు, పులివెందుల మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తైంది. అడ్మిషన్లకు సిద్ధం చేశాం. పులివెందుల కాలేజీని ప్రారంభించాను. ఎన్నికలు ముగిశాక, పాడేరు మెడికల్ కాలేజీ మొదలైంది. అడ్మిషన్లు జరిగి, క్లాస్‌లు కూడా ప్రారంభం అయ్యాయి. అంటే, మా హయాంలో చేపట్టిన 17 మెడికల్ కాలేజీల్లో 7 పూర్తి చేసి, ప్రారంభించాం. మెడికల్ కాలేజీలే కాదు.. మా హయాంలో ఎంతో చేశాం. కానీ చేసింది చెప్పుకోలేకపోయాం.. అదే తప్పైంది మెడికల్ సీట్లు వద్దన్న చంద్రబాబుచంద్రబాబు ఎంత దుర్మార్గుడు అంటే, పులివెందుల మెడికల్ కాలేజీకి ఎన్ఎంసీ (జాతీయ వైద్య కమిషన్) 50 సీట్లు కేటాయించి, భర్తీ చేయడానికి అనుమతి ఇస్తే, ఆ సీట్లు వద్దంటూ చంద్రబాబు లేఖ రాశాడు. అలాంటి సీఎం దేశంలో ఎక్కడైనా ఉంటాడా?. చంద్రబాబు అసలు మనిషా? లేక రాక్షసుడా? ఆలోచించండి.మేము నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం, చంద్రబాబు చొరవ చూపి ఉంటే.. 2024–25లో మరో 4 కాలేజీలు.. అదోని, మదనపల్లె, మార్కాపురం, పిడుగురాళ్లలో క్లాస్‌లు మొదలై ఉండేవి. ఆ మేరకు నిర్మాణాలు కొనసాగించాం. (అంటూ ఆ కాలేజీల ఫోటోలు కూడా చూపారు). ఇంకా మా ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్లి ఉంటే, మరో 6 మెడికల్ కాలేజీలు.. అమలాపురం, బాపట్ల, నర్సీపట్నం, పార్వతీపురం, పాలకొల్లు, పెనుకొండలో మెడికల్ కాలేజీలు 2025–26 విద్యా సంవత్సరంలో మొదలై ఉండేవి. ఆ ప్రకారం మేము పనులు చేశాం. మా ప్రభుత్వం వచ్చే నాటికి ఉన్న మెడికల్ సీట్లు 2360. కొత్త కాలేజీల ద్వారా మరో 2550 మెడికల్ సీట్లు పెరిగేవి. మొత్తం 4,910కి మెడికల్ సీట్లు చేరుకునేవి. మా హయాంలో ప్రారంభమైన మెడికల్ కాలేజీల ద్వారా 800 సీట్లు భర్తీ అయ్యాయి. వైద్య విద్యలో ఇది అద్భుత ఘట్టం. నాకు క్రెడిట్ వస్తుందని, దెబ్బ తీయడం, రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం చేయడం ఎంత వరకు ధర్మం?మేం దిగిపోయే నాటికి దాదాపు రూ.3 వేల కోట్ల పనులు జరగ్గా, మిగిలిన రూ.5 వేల కోట్లకు కూడా నాబార్డుతో పాటు, కేంద్ర ప్రభుత్వ స్పెషల్ అసిస్టెన్స్ ద్వారా కానీ, ఇతర సంస్థల ద్వారా నిధులకు ఓకే అయింది. కొత్త కాలేజీల వల్ల భూమలు విలువ బాగా పెరిగింది. మొత్తం కాలేజీల విలువ కూడా పెరిగింది. భవిష్యత్తులో దాని విలువ లక్ష కోట్లు దాటుతుంది. కొన్ని కోట్ల మంది ప్రాణాలు కాపాడబడతాయి.ఇంకా చంద్రబాబునాయుడుగారి హయాంలో వైద్య రంగం నిర్వీర్యం అయింది. మా ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీలో 3,257 ప్రొసీజర్లు. రూ.25 లక్షల వరకు వ్యయ పరిమితి. వార్షికాదాయం రూ.5 లక్షలు ఉన్న వారికి కూడా పథకాన్ని వర్తింప చేయడం వల్ల 95 శాతం కవర్ అయ్యారు. దాని నిర్వహణకు నెలకు రూ.300 కోట్లు కావాలి. 15 నెలలకు రూ.4500 కోట్లు కావాల్సి ఉంటే, చంద్రబాబు ఇచ్చింది రూ.600 కోట్లు మాత్రమే. దాంతో కార్పొరేట్ ఆస్పత్రులు పథకంలో వైద్యం చేయడం లేదు. ఇన్ని చేసిన చంద్రబాబు, ఇంకా మరో మోసం. డ్రామా చేస్తున్నాడు. కొత్తగా ఇన్సూరెన్స్ తీసుకొచ్చాడు. దానిలో వైద్యం ఖర్చును కేవలం రూ.2.5 లక్షలకే పరిమితం చేయడంతో పాటు, ప్రొసీజర్లను 2500కు తగ్గించారు. చంద్రబాబు వైద్య రంగాన్ని నాశనం చేసిన తీరుకు.. తురకపాలెం ఉదాహరణ. 2 నెలల్లో 45 మంది చనిపోతే, ప్రభుత్వం గుర్తించలేని పరిస్థితి. ఇది సీఎం ఇంటికి చాలా చేరువ.సూపర్‌హిట్ ఫ్లాప్ సంబరాలు:చంద్రబాబుకు ఉన్న నైపుణ్యం. కళ్లార్పకుండా పచ్చి అబద్ధాలు చెప్పడం. అది ఆయనకు మాత్రమే తెలుసు. ఒకవైపు పథకాల అమలు లేదు. మరోవైపు మోసం. అయినా సూపర్‌సిక్స్ సూపర్‌హిట్ అంటూ వేడుక. ఇది అట్టర్‌ఫ్లాప్ అయిన సినిమాకు బలవంతంగా విజయోత్సవం చేసినట్లు ఉంది. చంద్రబాబు అబద్దాలు, మోసాలు ఏ స్థాయిలో ఉంటాయంటే.. ఒకసారి చూడండి. (అంటూ ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన అడ్వరై్జజ్మెంట్స్. సూపర్‌సిక్స్‌పై ప్రదర్శన). ఇంకా ఎన్నికల ముందు సూపర్‌సిక్స్ గురించి చంద్రబాబు ఏమన్నారనేది చూద్దాం. (అంటూ ఆ పత్రికా ప్రకటనలు. అప్పుడు ఇంటింటికీ పంపించిన బాండ్లు. వాటిలో ఏమేం చెప్పారు?. బాబు ష్యూరిటీ. భవిష్యత్తు గ్యారెంటీ. దీనిపై చంద్రబాబు, పవన్‌కళ్యాణ ఫోటోలు, సంతకాలు కూడా ఉన్నాయి. ఇంకా పథకాలపై చంద్రబాబు హామీల ప్రచార వీడియోల ప్రదర్శన).ఇప్పుడు నేను అడుగుతున్నాను.. ఇవన్నీ మోసాలు కావా?:18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు ఇచ్చావా?. ఆడబిడ్డ నిధి కింద రెండేళ్లకు రూ.36 వేలు బాకీ. ఈరోజు అనంతపురంలో సూపర్‌హిట్ పేరుతో సభ పెట్టావు. నిరుద్యోగ యువతకు ఉద్యోగం లేదా నెలకు రూ.3 వేల చొప్పున ఏడాదికి రూ.36 వేలు. రెండేళ్లకు రూ.72 వేలు బాకీ. అవి ఇవ్వనప్పుడు మోసం కాదా? అది నీ సూపర్‌సిక్స్ హామీ కాదా?.. 50 ఏళ్లకే పెన్షన్ నెలకు రూ.4 వేలు. ఏడాదికి రూ.48 వేలు. రెండేళ్లకు రూ.96 వేలు బాకీ. ఇది మోసం కాదా?. పెన్షన్ల సంఖ్య గత ఏడాది మార్చి నాటికి 66,34,742 ఉంటే, ఈనెలలో మీరు ఇచ్చిన పెన్షన్లు 61,92,864. అంటే దాదాపు 5 లక్షలు కోత. ఇది మోసం కాదా?. రాష్ట్రంలో మహిళలు ఎక్కడికి పోవాలన్నా మహిళలకు ఫ్రీ అన్నావు. కానీ పరిమిత బస్సుల్లోనే అనుమతి. ఇది మోసం కాదా?. ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అన్నావు. కానీ గత ఏడాది ఒక్కటే ఇచ్చావు. ఈ ఏడాది ఒక్కటి కూడా లేదు. అంటే 6 సిలిండర్లకు గానూ, కేవలం ఒక్కటే ఇవ్వడం మోసం కాదా?. పీఎం కిసాన్ కాకుండా రూ.20 వేలు అన్నదాత సుఖీభవ కింద ఇస్తానన్నావు. అలా రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా, కేవలం రూ.5 వేలు మాత్రమే ఇవ్వడం మోసం కాదా?. తల్లికి వందనం కింద రెండేళ్లకు రూ.30 వేలు ఇవ్వాల్సి ఉండగా, 30 లక్షల మందికి ఎగ్గొట్టి కేవలం రూ.13 వేలు మాత్రమే, ఇంకా చాలా మందికి రూ.8 వేలు మాత్రమే ఇవ్వడం మోసం కాదా?గత ప్రభుత్వంలో అమలైన పథకాలు రద్దు చేయడం మోసం కాదా? చేయూత, ఆసరా, సున్నా వడ్డీ, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, తోడు, చేదోడు, ఉచిత పంటల బీమా, విద్యాదీవెన, వసతిదీవెన, పిల్లలకు ట్యాబ్‌లు రద్దు చేశావు. ఇది మోసం కాదా?.. చంద్రబాబు చెప్పిన అబద్ధాలు, ఆయన చేసిన మోసంతో ప్రజల జీవితాలు తగలబడుతుంటే.. ఆయన సూపర్‌హిట్ పేరుతో బలవంతపు వేడుకలు. ఇది దారుణం.15 నెలల్లో రికార్డు స్థాయిలో అప్పులుఒక్కటే అడుగుతున్నాను. 15 నెలల్లో దాదాపు రూ.2 లక్షల కోట్ల అప్పు చేశారు. ఎవరి జేబులోకి పోతోంది ఆ మొత్తం. ఇది రాష్ట్ర చరిత్రలోనే లేదు. రాష్ట్రం విభజించిన రోజు, మొత్తం అప్పులు కలిపి రూ.140,717 కోట్లు ఉంటే ఆయన దిగిపోయేనాటికి రూ,3,90,247. అంటే 22.63 శాతం సీఏజీఆర్. అది మా హయాంలో అది 13.57 శాతం మాత్రమే. ఇక మా ప్రభుత్వ హయాంలో అప్పు రూ.3,90,247 కోట్ల నుంచి రూ.7,21,918 కోట్లకు పెరిగింది. అంటే మా ప్రభుత్వం 5 ఏళ్లలో చేసిన మొత్తం అప్పు రూ.3,32,671 కోట్లు కాగా, చంద్రబాబు కేవలం 15 నెలల్లో చేసిన అప్పు ఏకంగా రూ.1,91,361 కోట్లు. మేము 5 ఏళ్లలో చేసిన అప్పులో 57.5 శాతం ఈ 15 నెలల్లోనే చేశారు.ఈ ప్రభుత్వంలో ఇసుక, మట్టి దోచేస్తున్నారు. ఉచితం లేనే లేదు. లిక్కర్ మాఫియా. పర్మిట్‌రూంలు, బెల్టు షాప్‌లు విచ్చలవిడిగా. అక్కడ ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు విక్రయాలు. ప్రభుత్వ ఆదాయం తగ్గుతోంది. మద్యం మాఫియా దోచేస్తోంది. సిలికా, క్వార్ట్జ్ దోపిడి. అమరావతిలో నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.10 వేలు. అదో దోపిడి. శనక్కాయలు, బెల్లానికి ఇష్టం వచ్చినట్లుగా.. ఉర్సా, లులూకు భూముల కేటాయింపు. రాష్ట్ర ఆదాయం తగ్గుతోంది. మీ ఆదాయం, మీ అనుయాయుల సంపద పెరుగుతోంది.మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అడ్డుకుంటాం స్కామ్‌ల్లో పరాకాష్ట. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ. దీన్ని అడ్డుకుంటాం. నిరసనలు, ర్యాలీలు చేస్తాం. నేనూ అక్కడక్కడా పాల్గొంటా. – రాష్ట్ర శ్రేయస్సు కోరే ప్రతి ఒక్కరిని, ప్రతి ఒక్క పార్టీని కోరుతున్నా. అందరూ కలిసి రండి. కొత్త మెడికల్ కాలేజీలు మన సంపద. రాష్ట్ర సంపద. అందరం కలిసి పోరాడుదాం. వాటిని కాపాడుకుంటాం. అయినా ఈ ప్రభుత్వం కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తే, రేపు మా ప్రభుత్వం రాగానే, వాటన్నింటినీ రద్దు చేస్తాం. ఆ కాలేజీలు వెనక్కు తీసుకుంటాం.మీడియాతో జగన్ చిట్‌చాట్ 👉స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈవీఎంలను ప్రవేశపెట్టబోతున్నారు? ఎలా స్పందిస్తారు? అనే ప్రశ్నకు.. పోలీసు వ్యవస్థ సక్రమంగా లేదు. పోలీసుల చేతనే రిగ్గింగ్ చేయిస్తున్నారు. అలాంటప్పుడు ఈవీఎంలు ఉంటే ఏంటి?.. పేపర్ బ్యాలెట్ పెడితే ఏంటి?. కేంద్ర బలగాలు వస్తేనే ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతాయి. సాధారణ ఎన్నికలప్పుడు సరైన నిర్ణయం తీసుకోవాలి. 👉ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు క్రాస్ ఓటింగ్ పాల్పడ్డారన్న ఆరోపణలకు స్పందిస్తూ.. అలాంటిదేం లేదు, అదంతా ఉత్త ప్రచారమే.. 👉18 నుంచి అసెంబ్లీ సెషన్ ప్రారంభం కానుందన్న ప్రశ్నకు.. ఇప్పుడు ఇంత సేపు మాట్లాడేందుకు సమయం దొరికింది?. మరి అక్కడ అంత సమయం ఇస్తారా?. ప్రధాన ప్రతిపక్ష హోదాతోనే ఆ అవకాశం ఉంటుంది. ప్రజా సమస్యలు ప్రస్తావనకు రాకూడదన్న రీతిలో సభను నడిపిస్తున్నారు. గతంలో చంద్రబాబు ఎన్నిరోజులు అసెంబ్లీకి వచ్చారు. జరగనిదాన్ని జరిగిందని రాద్ధాంతం చేశారు.👉సోషల్ మీడియా తప్పుడు ప్రచారం పేరిట ఏపీ ప్రభుత్వ తీసుకోబోయే కఠిన నిర్ణయంపై స్పందిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వానికి అలాంటి అధికారం ఉండదు. అది కేవలం కేంద్ర పభుత్వ పరిధిలో ఐటీ చట్టాల పరంగా జరగాలి. ఈ వ్యవహారంలో సుప్రీం కోర్టు తీర్పులు కూడా ఉన్నాయి. 👉వైఎస్సార్సీపీ మళ్లీ అధికారంలో ఎలా వస్తుందో చూస్తాం అంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్‌కు స్పందిస్తూ.. ‘‘ఈయనేంది చూసేది.. పైన దేవుడు చూస్తాడు’’ -
చంద్రబాబు సభ.. తాడిపత్రి టీడీపీలో పొలిటికల్ వార్
సాక్షి, అనంతపురం: ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సందర్భంగా తాడిపత్రి టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. టీడీపీ నేతలు జేసీ ప్రభాకర్ రెడ్డి, కాకర్ల రంగనాథ్ మధ్య పొలిటికల్ వార్ కొనసాగుతోంది. చంద్రబాబు పర్యటన సందర్భంగా తమ బల ప్రదర్శనకు ఇరు వర్గాల నేతలు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యం జేసీ వర్గం హెచ్చరికలతో తాడిపత్రిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.వివరాల ప్రకారం.. సీఎం చంద్రబాబు తాడిపత్రి పర్యటన నేపథ్యంలో టీడీపీలో వర్గపోరు పీక్ స్టేజ్‌కు చేరుకుంది. సొంత పార్టీ నేతల వాహనాలపై విధ్వంసానికి జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు సిద్దమయ్యారు. జేసీ ప్రభాకర్ రెడ్డి, కాకర్ల రంగనాథ్ మధ్య వర్గాల మధ్య రాజకీయం ఘర్షణలకు దారి తీస్తోంది. తాడిపత్రి నుంచి జేసీ ఫోటో ఉన్న వాహనాలే చంద్రబాబు సభ వద్దకు వెళ్లాలని హెచ్చరికలు జారీ అయ్యాయి. జేసీ ప్రభాకర్ రెడ్డి ఫోటో లేని వాహనాలు ధ్వంసం చేస్తామని వార్నింగ్ ఇవ్వడం సంచలనంగా మారింది. ఈ క్రమంలో జేసీ వర్గం.. నిర్దేశిత ఫార్మాట్, ఆడియోను విడుదల చేసింది. దీనికి సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.మరోవైపు.. సుమారు వంద వాహనాల్లో చంద్రబాబు సభకు వెళ్లాలని టీడీపీ నేత కాకర్ల రంగనాథ్ ఏర్పాట్లు చేశారు. జేసీ వర్గానికి కౌంటర్ ఇస్తూ వాహనాలపై స్టిక్కర్లు వేసినట్టు సమాచారం. ఇక, జేసీ వర్గం హెచ్చరికలతో తాడిపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. ఇదిలా ఉండగా.. ఇటీవల వినాయక నిమజ్జనం సందర్భంగా రాళ్లు జేసీ ప్రభాకర్-కాకర్ల రంగనాథ్ వర్గీయులు రాళ్లతో దాడులు చేసుకున్న విషయం తెలిసిందే. -
వినండహో.. చంద్రబాబు సభకు వస్తేనే సంక్షేమ పథకాలు..!
అనంతపురం: ఏపీలోని ప్రజల సమస్యలను గాలి కొదిలేసిన కూటమి ప్రభుత్వంపై అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. తాజాగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘అన్నదాత పోరు’ గ్రాండ్ సక్సెస్ కావడమే ఇందుకు ఉదాహరణ. ఇక చంద్రబాబు చేపడుతున్న సభలకు స్పందన పెద్దగా లేకపోవడంతో జన సమీకరణ కోసం సరికొత్త డ్రామాలకు తెరలేపారు. చంద్రబాబు సభలకు జనాన్ని రప్పించాలనే ఉద్దేశంతో సంక్షేమ పథకాల్ని ముడిపెడుతున్నారు. సంక్షేమ పథకాలకు, ముఖ్యమంత్రి సభలకు అసలు సంబంధం లేకపోయినా చంద్రబాబు చేపట్టే సభలకు సంక్షేమాన్ని జత చేశారు. అనంతపురం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన నేపథ్యంలో టీడీపీ నేతలు అత్సుత్సాహం ప్రదర్శిస్తున్నారు. సంక్షేమ పథకాలు తీసుకునేవారు సీఎం చంద్రబాబు సభలకు వస్తేనే ఆ పథకాలు వర్తిస్తాయంటూ చాటింపు వేయించి మరీ చెబుతున్నారు. ఇది కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరు మండలం అచ్చం పల్లిలో చోటు చేసుకుంది. ఇది విన్న స్థానిక ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ‘చాటింపు’ ఇలా కూడా వేయోచ్చా అని నవ్వుకుంటున్నారు. చంద్రబాబు వస్తున్నారంటే ఏదో హడావుడి చేయాలనే పార్టీ నేతలకు వేరే మార్గం లేక దీన్ని ఎంచుకున్నట్లున్నారు. జన సమీకరణ చేయాలని పార్టీ పెద్దల ఆదేశాల నేపథ్యంలోనే స్థానిక నేతలు ఇలా చేస్తున్నారని ఊరూ-వాడా అనుకుంటున్నారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు కావాలంటే సీఎం చంద్రబాబు కార్యక్రమంలో పాల్గొనాలని, లేకపోతే అవి రావని చాటింపు వేయించారు. వచ్చే దీపావళి నుంచి ఆడబిడ్డ నిధి ఇస్తారని,.. చంద్రబాబు సభలో పాల్గొన్న వారికి చేస్తామంటూ దండోరా వేశారు. ఈ చాటింపు వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రేపు(బుధవారం, సెప్టెంబర్ 10వ తేదీ) అనంతపురంలో సూపర్ సిక్స్ - సూపర్ హిట్ సభను నిర్వహించనున్నారు. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లు హాజరు కానున్న నేపథ్యంలో చాటింపు వేయించి మరీ జనాల్ని భయపెడుతున్నారు. -
‘అన్నదాతల ఆగ్రహంలో కూటమి ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయం’
తాడేపల్లి: అన్నదాతల ఆగ్రహంలో కూటమి ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయమని హెచ్చరించారు వైఎస్సార్సీపీ నేత, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి,. కూటమి ప్రభుత్వంపై అన్నదాతలు మండిపోతున్నారని స్పష్టం చేశారు. ఈరోజు(మంగళవారం, సెప్టెంబర్ 9వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన లేళ్ల అప్పిరెడ్డి.. ‘రైతులకు ఉపయోగపడే ఒక మంచి పని కూడా చంద్రబాబు చేయలేదు. సమాజానికి అన్నం పెట్టే రైతన్న సంతోషంగా లేడు. రైతులు ఉసురు తగిలిన ప్రభుత్వాలు ఉండవు. కూటమి ప్రభుత్వం కుట్రలు, నోటీసులు రైతన్నలను ఆపలేవు. కూటమి ప్రభుత్వ సమీక్షలు ఎవరి ప్రయోజనాల కోసం?, లక్షలాది మంది రైతన్నలు రోడ్డెక్కారు. టీడీపీ నేతలు బ్లాక్ మార్కెట్లో యూరియా అమ్ముకుంటున్నారు. అన్నదాత పోరు సక్సెస్ అయింది. ఇది అంతం కాదు ఆరంభం మాత్రమే. రాష్ట్రంలో 74 ప్రాంతాల్లో చేసిన నిరసన కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. చంద్రబాబు రైతు వ్యతిరేకి. ఆయనకు రైతులంటే ఎప్పుడూ చిన్నచూపే. అందుకే వ్యవసాయం దండుగ అని నిస్సిగ్గుగా మాట్లాడారు. రోడ్డు మీదకు వస్తే రైతుల కష్టాలు కనడతాయి నిజంగా రైతులకు కష్టాలు లేకపోతే కేంద్రంతో ఎందుకు మాట్లాడలేదు?, 4 సార్లు సీఎం అని చెప్పుకునే చంద్రబాబు ఏనాడైనా రైతుల మేలు కోసం పని చేశారా?, ఈ 15 నెలుగా రాష్ట్రంలో ఏ పంట సాగు చేసిన రైతయినా ప్రశాంతంగా ఉన్నాడా?, చంద్రబాబు వలన రైతులకు రూపాయి ప్రయోజనం కూడా లేదు. గంటల తరపడి యూరియా కోసం నిత్యం క్యూలో నిలపడుతున్నా చంద్రబాబుకు కనపడటం లేదు. రైతులు ఏడ్చిన రాజ్యాలు ఏనాడూ నిలపడలేదు. ఇది చరిత్ర చెప్తున్న వాస్తవం. కూటమి ప్రభుత్వం రైతుల ఆగ్రహంలో కొట్టుకుపోక తప్పదు. వైఎస్సార్ సీపీ నిరసనల ప్రకటన తర్వాతనే చంద్రబాబు హడావుడి చేస్తున్నారు. యూరియా మొత్తం టీడీపీ నేతలు బ్లాక్ మార్కెట్ కి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అన్నదాత పోరులో పాల్గొంటే కేసులు పెడతామని బెదిరిస్తారా?, అరెస్టులు చేస్తామని హెచ్చరిస్తారా?, ఇలాంటి బెదిరింపులను లెక్క చేయకుండా రైతులు రోడ్డు మీదకు వచ్చారు. ధర్మాన, రామసుబ్బారెడ్డి, జోగి రమేష్, జక్కంపూడి రాజా, పిన్నెళ్లి లాంటి అనేకమంది నేతలను హౌస్ అరెస్టు చేశారు. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే?, ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు ఏం చేయదలచుకున్నారు?, జగన్ హయాంలో ఏనాడైనా ఏ రైతైనా రోడ్డు ఎక్కాడా?, ఇప్పుడే ఎందుకు ఇలాంటి పరిస్థితి తలెత్తింది?, సమస్యలు రాకముందే జగన్ ముందుగానే పసిగట్టి పాలన చేశారు. అందుకే రైతులు సంతోషంగా ఉన్నారు. చంద్రబాబు పట్టించుకోనందునే రైతులు రోడ్ల మీద ఆందోళనకు దిగుతున్నారు. ఈరోజు 74 చోట్ల చేసిన నిరసనలు సక్సెస్ అయ్యాయి. రైతులు కదం తొక్కటం చూసి డీజీపి మాట మార్చారు. నిరసనలకు అనుమతి లేదని మొదట నోటీసులు ఇచ్చి మధ్యాహ్నం తర్వాత అనుమతులు ఇస్తున్నామని ఎందుకు ప్రకటించారు?, అంటే రైతుల ఆందోళనలు చూసి చంద్రబాబు ప్రభుత్వం భయపడింది’ అని పేర్కొన్నారు.కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎరువుల బ్లాక్ మార్కెటింగ్, కృత్రిమ కొరత.. అధిక ధరలతో రైతన్నలను దగా చేయటాన్ని నిరసిస్తూ ‘అన్నదాత పోరు’ పేరుతో వైఎస్సార్ సీపీ రణభేరి మోగించింది. పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని ఆర్డీవో కార్యాలయాల ఎదుట రైతులతో కలిసి వైఎస్సార్ సీపీ శ్రేణులు, రైతు సంఘాలు పెద్ద ఎత్తున శాంతియుత నిరసన చేపట్టాయి. వైఎస్సార్సీపీ తలపెట్టిన అన్నదాత పోరు కార్యక్రమానికి రాష్ట్రంలోని రైతులు కదం తొక్కారు. -
అప్పటిదాకా మీకు నడ్డా నెంబర్ గుర్తుకు రాలేదా?: పేర్ని నాని
సాక్షి, కృష్ణా జిల్లా: రైతు కన్నీరు కారిస్తే రాష్ట్రానికి అరిష్టం అని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతాంగం పడుతున్న అవస్థలు వర్ణనాతీతమన్నారు. రైతుల కష్టాలు పగవాడికి కూడా రాకూడదనట్లుగా ఉన్నాయన్న పేర్ని నాని.. రైతుకు విత్తనం, ఎరువులు, గిట్టుబాటు ధరలు దక్కడం లేదన్నారు. ‘‘కూటమి ప్రభుత్వంలో రైతు కంట కన్నీరు ఆగటం లేదు. మోదీ త్వరగా జమిలీ ఎన్నికలు పెడితే కానీ ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం పోయేలా లేదు. చంద్రబాబు నాది నలభై ఏళ్ల అనుభవం.. నాకన్నా పోటుగాడు లేడంటాడు. జగన్ నిరసనలకు పిలుపునిచ్చే వరకు చంద్రబాబు స్పందించలేదు. వ్యవసాయ శాఖ మంత్రి అన్నీ బాగానే ఉన్నాయంటారు. రైతులు యూరియా దాచుకున్నారని మొన్న అన్నాడు. రైతులు మూడుసార్లకు కలిపి ఒకేసారి 75 కేజీలు యూరియా తీసుకుని దాచుకున్నారు అని నిన్న అంటాడు. వ్యవసాయ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి బాధ్యత ఏమైంది?’’ అంటూ పేర్ని నాని ప్రశ్నించారు.‘‘కనీసం రైతులకు ఎంత యూరియా అవసరమో తెలుసుకోండి. మా లెక్క ప్రకారం 100 నుంచి 125 కేజీల యూరియా అవసరం ఉంటుంది. మీ లెక్క ప్రకారమైనా 75 కేజీలు ముందే తెచ్చుకోవటం తెలియదా?. యూరియా విషయంలో డ్రామాలు ఆడుతున్నారు. నడ్డాతో మాట్లాడేశారు.. యూరియా పార్సిల్ చేస్తున్నారు.. వచ్చేస్తుంది అన్నారు మోతమోగిస్తున్నారు. రైతు సమస్యలపై వైఎస్ జగన్ నిరసన అనేంత వరకు నడ్డా నెంబర్ మీకు గుర్తుకు రాలేదా?. ఎరువులు తెప్పించుకోవాల్సింది మే, జూన్‌లో కదా....రైతులు రోడ్డెక్కి అల్లాడుతుంటే మీకు కళ్ళు పోయాయా?. రైతులు ఎండలో నిలబడలేక క్యూలైన్లలో చెప్పులు పెట్టి పడిగాపులు కాస్తుంటే వైఎస్సార్సీపీ వాళ్ళు గ్రాఫిక్స్ చేస్తున్నారంటున్నారు. ఎవరిని మోసం చేయాలని మీరు ఇదంతా చేస్తున్నారు. వైఎస్సార్సీపీ వాళ్లను రోడ్డెక్కనివ్వరు.. ధర్నాలు చేయనివ్వరు. కానీ రైతులకు యూరియా అందుతుందా?. వైఎస్సార్సీపీ వాళ్లను పోలీసులను పెట్టి కట్టడి చేసే బదులు.. ఏ ఇంట్లో యూరియా దాచుకున్నారో బయటకు తెచ్చేందుకు వాడొచ్చు కదారాష్ట్రంలో దుర్మార్గమైన పాలన సాగుతుంది. రైతు కష్టాలు చూపించటానికి ప్రజల దగ్గర ఉన్న ఫోన్లు చాలు. వైఎస్సార్సీపీ వాళ్లను, సోషల్ మీడియా వాళ్లను బొక్కలో వేయాలి అంటున్నారు...రేపు మీరు ఓట్ల కోసం వెళ్తే రైతులు, మిమ్మల్ని ఎందులో వేస్తారు?. ఈ రాష్ట్రంలో.. ఈ ప్రభుత్వం వల్ల ఎవరు సుఖంగా ఉన్నారు? కనీసం మీ పార్టీ నేతలైన సుఖంగా ఉన్నారా?. ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారని కార్యకర్తలు అంటున్నారు. మంత్రులు దోచుకుంటున్నారు అని ఎమ్మెల్యేలు అంటున్నారు. మంత్రులను అడిగితే మాదేముంది బాబు, కొడుకులు దోచుకుంటున్నారు అంటున్నారు. ఎమ్మెల్యేలకు క్లాస్ పీకాడు అని మీ అనుకూల మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. మీకు మూటలు మూటలు డబ్బులు చందాలు ఇచ్చిన వాళ్లు కూడా ఏడుస్తున్నారుఈ ప్రభుత్వం మాది అని భావిస్తున్న రెండు కులాలు ఏడుస్తున్నారు. కమ్మలు, కాపులు కనీసం అపాయింట్మెంట్లు కూడా దొరకటం లేదంటున్నారు. దేశ విదేశాలు తిరిగి చందాలు పోగేశారు. ఇప్పుడు వాళ్ల పొలాలేమో ఎమ్మెల్యేలు ఆక్రమించుకుంటున్నారు. ఇవాళ ఇంటి పన్ను మారాలన్నా కూడా టీడీపీ వార్డ్ ఇంచార్జీకి 25 వేలు కప్పం కట్టాలి. బెజవాడలో పరిస్థితి ఎలా ఉందో మీకు చందాలు ఇచ్చినవాళ్లను అడిగితే చెప్తారు’’ అని పేర్ని నాని వ్యాఖ్యాదనించారు. -
రైతుల కోసం చంద్రబాబు ఒక్క మంచైనా చేశారా?: వైఎస్సార్సీపీ
సాక్షి, వైఎస్సార్ జిల్లా: రైతులంటే చంద్రబాబుకు చులకన అంటూ వైఎస్సార్సీపీ నేత ఎస్వీ సతీష్‌రెడ్డి మండిపడ్డారు. కూటమి పాలనలో రైతులు అధ్వాన్న పరిస్థితుల్లో ఉన్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనలో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వైఎస్జగన్ హయాంలో రైతుల ఇంటి వద్దకే ఎరువులు వచ్చేవి. రైతుల పట్ల చంద్రబాబు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు’’ అని ఆయన దుయ్యబట్టారు.అనకాపల్లి జిల్లా: మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. అనకాపల్లి నర్సీపట్నం ఆర్టీవో కార్యాలయాల్లో వినతి పత్రాలను సమర్పించామన్నారు. రైతాంగ సమస్యలపై కూటమి ప్రభుత్వానికి ముందు చూపులేదని మండిపడ్డారు. వైఎస్ జగన్ పాలనలో ఏనాడు రైతు ఇబ్బంది పడలేదు. ఆర్బికేలు ద్వారా సమయానికి యూరియా విత్తనాలు అందించాము. రైతులకు డోర్ డెలివరీ చేసి యూరియా విత్తనాలు అందించిన చరిత్ర వైఎస్సార్సీపీది.. ఎకరా ఉన్నా.. అర ఎకర ఉన్నా.. 5 ఎకరాలు ఉన్నా 10 ఎకరాలు ఉన్న ఒక బస్తా యురియా మాత్రమే ఇస్తున్నారు. కుటమి పాలనలో రైతులకు గిట్టుబాటు ధర లేదు.ఏలూరు జిల్లా: మాజీ మంత్రి కారూమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. రైతులను ప్రభుత్వం హేళనగా మాట్లాడం దారుణమన్నారు. దళారీ వ్యవస్థ పెరిగిపోయింది. పండించిన రైతుకి గిట్టుబాటు ధర మాత్రం దక్కడం లేదు. ప్రజలకు ధరలు అందడం లేదుజ రైతులు లాభపడింది లేదు. ప్రజలు కూడా నష్టపోతున్నారు. మరి ఆ డబ్బు అంతా ఎక్కడికి పోతుంది.? రైతులను నడ్డి విరిచే విధంగా ఈ కూటమి ప్రభుత్వం తీరు ఉంది.మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ.. వైఎస్ జగన్ ప్రభుత్వంలో రైతులకు స్వర్ణయుగంగా ఉండేది. వెన్నుముక అయినా రైతులను నట్టేట ముంచిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఏడాదిన్నర అయినా కూడా పూర్తి స్థాయిలో ఇన్‌ఫుట్ సబ్సిడీ ఇవ్వలేని పరిస్థితి. రైతు పక్షాన పోరాటం చేస్తుంటే కూటమి ప్రభుత్వం ఆంక్షల పేరుతో నిర్బంధించడం దురదృష్టకరం. యూరియా సహా రైతులుకు అవసరమైన ఎరువులను వెంటనే పంపణీ చేయాలి. బ్లాక్ మార్కెట్‌ను నియత్రించాలి. ఎరువులు పక్కదోవ పట్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి. పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి. ఉచిత పంటల బీమాను పునరుదించి అందరికి వర్తింపజేయాలి. వర్షాల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల రైతులకు వెంటనే ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వాలి.తిరుపతి: అభినయ్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉంది. వ్యవసాయ శాఖ మంత్రి యూరియా కొరతను బఫేలా చూడటం దారుణం. యురియా బ్లాక్‌లో అమ్ముకొంటున్నారు. యూరియా ద్వారా రూ.300 కోట్లు బ్లాక్ మార్కెట్ దోచుకున్నారు. రైతుల సమస్యలు యురియా కొరతపై ఆర్డీవో వినతి పత్రం సమర్పించాము. కరోనా సమయంలో కూడా రైతులకు అండగా వైఎస్ జగన్ నిలిచారు. రైతుల పంటకు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నారు.చెవిరెడ్డి అక్షిత్‌రెడ్డి మాట్లాడుతూ.. యురియా కొరతపై రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. రైతులు యురియా కోసం నిలబడితే బఫే కోసం క్యూలో నిలబడ్డారని వ్యవసాయ శాఖ మంత్రి అనడం చాలా దారుణమన్నారు. యూరియా కొరత లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారుఎన్టీఆర్ జిల్లా: వైఎస్సార్సీపీ నేత దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. యూరిచాపై మాట్లాడితే కేసులు పెట్టమని చంద్రబాబు చెప్పాడు.. రైతులు ర్యాలీ చేస్తే దాన్ని అడ్డుకొనే ప్రయత్నం చేశారు. రైతులను ఎక్కడికక్కడ అడ్డుకున్నా కానీ ముందుకు వచ్చాం.. ఆర్డీవోకి వినతి పత్రం ఇచ్చాం. -
నందిగామలో ఉద్రిక్తత.. ‘అన్నదాత పోరు’ను అడ్డుకున్న పోలీసులు
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: నందిగామలో ఉద్రిక్తత నెలకొంది. నందిగామలో ‘అన్నదాత పోరు’ను పోలీసులు అడ్డుకున్నారు. రైతులతో కలిసి ఆర్డీవో కార్యాలయానికి బయల్దేరిన వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. రైతులు, వైఎస్సార్సీపీ నేతలపై పోలీసుల దౌర్జన్యానికి దిగారు. గంపలగూడెం మండలం రాజవరం గ్రామ శివారులో వైఎస్సార్సీపీ శ్రేణుల వాహనాలను పోలీసులు అడ్డుకున్నాఉ. నందిగామలో జరిగే అన్నదాత పోరు కార్యక్రమానికి వెళ్లకుండా అడ్డుకున్నారు. పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ నేతలు రోడ్డుపై బైఠాయించారు.వైఎస్సార్సీపీ 'అన్నదాత పోరు'పై చంద్రబాబు సర్కార్ కుట్రలకు తెరలేపింది. ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా నిరసనలు ఆపేది లేదని రైతులు తేల్చి చెప్పారు. రైతులు, పార్టీ నేతలను కట్టడి చేసేందుకు పోలీసులతో బెదిరింపుకు దిగుతూ.. నోటీసులు ఇస్తూ అరెస్టు చేస్తామంటూ కూటమి ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని చోట్ల పదిమంది, 15 మందితోనే నిరసనలు చేయాలని ఆంక్షలు విధించింది.ఆంక్షలతో ఉద్యమాలను కట్టడి చేయలేరని.. రైతులు, రైతు నేతలు స్పష్టం చేశారు. యూరియా కొరత, ఇతర సమస్యలపై ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఆర్డీవో కార్యాలయాల సమీప ప్రాంతాలకు చేరుకున్న రైతులు.. పోలీసులు, కూటమి ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నారు.వైఎస్సార్సీపీ చేపట్టిన అన్నదాత పోరు కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో రైతులు తరలివస్తున్నారు. చంద్రబాబు సర్కార్ విధించిన ఆంక్షలను చేధించుకుని రైతులు ఉద్యమిస్తున్నారు. యూరియా సరఫరాలో సీఎం చంద్రబాబు ఘెరంగా విఫలమయ్యారని... పోలీసుల ద్వారా ఎన్ని ఆంక్షలు విధించినా ఆందోళన ఆపేది లేదని రైతులు అంటున్నారు.ఎరువుల బ్లాక్ మార్కెటింగ్, కృత్రిమ కొరత.. అధిక ధరలతో రైతన్నలను దగా చేయటాన్ని నిరసిస్తూ ‘అన్నదాత పోరు’ పేరుతో కూటమి సర్కారుపై వైఎస్సార్ సీపీ రణభేరి మోగిస్తోంది. పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని ఆర్డీవో కార్యాలయాల ఎదుట రైతులతో కలిసి వైఎస్సార్ సీపీ శ్రేణులు, రైతు సంఘాలు.. శాంతియుత ఆందోళనలకు తరలివస్తున్నాయి. -
రాజా సాబ్.. స్థాయికి తగ్గ మాటలాడండి సార్!
గోవా గవర్నర్‌గా నియమితులైన పూసపాటి అశోక్ గజపతి రాజు గారికి వయసైపోయినట్టు ఉంది. మంచి మాటతీరు, మర్యాదలతో ఒకప్పుడు అన్ని పార్టీల మన్ననలు పొందిన ఆయన.. ఇటీవల చేసిన ఒక ఉపన్యాసాన్ని గమనిస్తే ఈ అనుమానం రాకమానదు. విశాఖపట్నంలోని రిషికొండపై వైఎస్ జగన్ నేతృత్వంలోని గత ప్రభుత్వం నిర్మించిన భవంతుల్లో పిచ్చాసుపత్రి పెట్టాలని ఆయన తన గౌరవాన్ని దిగజార్చుకున్నట్లు అయ్యింది. క్షత్రియ సంక్షేమ సమితి సభ్యుల సన్మానం సందర్భంగా ఆయన నాలుగు మంచి ముక్కలు మాట్లాడి వెళ్లకుండా రిషికొండ భవనాల్లో బస చేయమన్నా నిద్రపట్టదట. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన సైకో ముఖ్యమంత్రికి తప్పకుండా సముద్రపు గాలి తగులుతుందని వ్యాఖ్యానించారు. అక్కడికి రిషికొండపై ఇప్పుడే భవనాలేవో నిర్మించినట్టు ఆయన వ్యాఖ్యలున్నాయి. టూరిజం శాఖ భవనాల స్థానంలో చూడముచ్చటైన నిర్మాణాన్ని చేసినందుకు హర్షించాల్సింది పోయి ఇలాంటి పిచ్చి వ్యాఖ్యలు చేశారు. పైగా ఇదో ఉచిత సలహా అంటూ వ్యాఖ్యానించడం ఆయన స్థాయికి తగింది మాత్రం కాదు. ఆయనలో రాచరికం వాసనలు ఇంకా పోనట్టు ఉంది. తమ కోటలను మించిన అద్భుతమైన భవనాలు ఇంకెక్కడ ఉండకూడదన్న అక్కసుతో రిషికొండ భవనాలపై ఈ ఆరోపణలు చేశారేమో అనుకోవలి. చిత్రంగా ఎల్లోమీడియా ఇవే వ్యాఖ్యలను ప్రముఖంగా ప్రచురించి చంకలు గుద్దుకుంది. అయితే..ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తాత్కాలిక నిర్మాణాల పేరుతో పెట్టిన విపరీత ఖర్చులపై ఏనాడూ ఆక్షేపణ చెప్పని అశోక్ గజపతి రాజుకు మూడు వేల మంది కూడా లేని సచివాలయ సిబ్బంది కోసం యాభై అంతస్తుల భవనం నిర్మిస్తున్నప్పుడూ పల్లెత్తు మాట అనలేదు. ప్రతిపక్షాలపై విచ్చలవిడిగా అక్రమ కేసులు పెడుతూ నిర్బంధిస్తున్నా ఆయనకు పాలకుల సైకోతత్వం అవగతం కాలేదు. రిషికొండ భవనాలను ఎలా వాడుకోవాలన్న విషయంపై అధ్యయనం జరుగుతోందని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇటీవలే చెప్పిన విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. అయితే పవన్ అక్కడకు వెళ్లినప్పుడు ఇంకో రకం డ్రామా జరిగింది. ఫాల్స్ సీలింగ్‌ను ఎవరో కొద్దిగా కోసినట్లు కనిపించింది. ఆ ముక్క గచ్చుమీద కనిపించింది. ఉప ముఖ్యమంత్రి వస్తున్నా.. అక్కడి సిబ్బంది దాన్ని తొలగించలేదు. అంటే నిర్మాణంలో ఏదో లోపం జరిగిందన్న సందేహం ప్రజలలో కలిగించడానికి కుట్ర చేశారని సోషల్ మీడియాలో ఆధారసహితంగా వార్తలు వచ్చాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా గతంలో అదేదో జగన్ సొంత భవనం అన్నట్లుగా అబద్దపు ప్రచారం చేశారు. అమరావతిలో అనవసరంగా వేల కోట్లు వ్యయం చేస్తూ, విశాఖలో రూ.450 కోట్లతో ఏడు భవనాలు నిర్మించి అందంగా తీర్చిదిద్దితే దానిని వాడుకోవడం చాతకాని ప్రభుత్వంగా మారింది. ఈ తరుణంలో అశోక్ గజపతిరాజు వచ్చి తన వంతు పాత్ర పోషించారనిపిస్తుంది. ఒకప్పుడు అశోక్ కు అంతగా పదవీ వ్యామోహం లేదని భావించే వారు. కాని తన స్థాయికి తగని గోవా గవర్నర్ పదవిని అంగీకరించినప్పుడు ఆయనకు పదవి పిచ్చి పట్టిందన్న అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రంతో మాట్లాడి ఈ పదవి ఇప్పించారో, లేక స్వయంగా పైరవీ చేసుకున్నారో కాని, ఈ చిన్న పదవి తీసుకోవడం ద్వారా ఆయన తన స్థాయిని తానే తగ్గించుకున్నారని కొంతమంది విమర్శించారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలుపొంది.. రాష్ట్రంలోను, కేంద్రంలోను మంత్రిగా పనిచేసిన ఈయనకు అతి చిన్న రాష్ట్రాలలో ఒకటైన గోవాకు గవర్నర్ పదవి ఇవ్వడం అంటేనే పరువు తక్కువ అనే అభిప్రాయం పలువురిలో ఉంది. బీజేపీ నేతలు విద్యాసాగరరావు, బండారు దత్తాత్రేయ, ఇంద్రసేనారెడ్డి, కె.హరిబాబు వంటివారు ఇంతకన్నా పెద్ద రాష్ట్రాల గవర్నర్లుగా నియమితులయ్యారు. కాని వీరందరికన్నా రాజకీయంగా ఎన్నో పదవులు చేసి, సీనియర్ నేతగా ఉన్న అశోక్ కు మొక్కుబడిగా గోవా గవర్నర్ పదవి ఇస్తే పరమానందంగా స్వీకరించారని, దీనిని ఏమంటారని రాజకీయ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. గవర్నర్ పదవిలో హుందాగా ఉండవలసిన ఈయన రాజకీయ విమర్శలు చేయడం, మాజీ సీఎంను సైకో అని అనడం బహుశా వయసు మీద పడడం వల్ల వచ్చిన సమస్య కావచ్చేమో అన్నది కొందరి అనుమానం. విశేషం ఏమిటంటే ఇదే సభలో ఆయన ప్రతి ఒక్కరు అహం నియంత్రించుకోవాలని హితబోధ చేశారు.అయితే ఆయన మాత్రం అహంకార పూరితంగా వ్యాఖ్యలు చేసి విమర్శలకు గురయ్యారు. అశోక్ గజపతి రాజే కాదు.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కొన్నిసార్లు అసందర్భ వ్యాఖ్యలు చేస్తూంటారు. ఈ మధ్య ఆయన ఒక సభలో మాట్లాడుతూ కనీసం 120 ఏళ్లు జీవించవచ్చని, తాను సంజీవని అనే స్కీమ్ తీసుకు వస్తున్నానని అన్నప్పుడు సభికులంతా ఆశ్చర్యానికి గురయ్యారు. బహుశా ఆయన మనసులోని కోరికను ఇలా బయటపెట్టారేమో అని కొందరు వ్యాఖ్యానించారు. ఇదే కాదు.. గతంలో హుద్ హుద్ తుపాను వచ్చిన తర్వాత, సముద్రాన్ని కంట్రోల్ చేశామని అనడం చిత్రం అనిపించింది. అమరావతిలో పది డిగ్రీల వేడి తగ్గించడానికి ఆదేశాలు ఇచ్చానని ఒకసారి, అమరావతిలో ఒలిపింక్స్ నిర్వహిస్తామని ఇంకోసారి ..ఇలా పలురకాలుగా విచిత్రమైన వ్యాఖ్యలు చేస్తూ ప్రజలకు తమ వయసును గుర్తు చేస్తున్నారన్నఅభిప్రాయం కలుగుతుంది. ‘‘వందల కోట్ల ఖర్చుతో నిర్మించిన భవనం వల్ల ఆదాయం ఏమీ రాదని, దానిని పిచ్చాసుపత్రి చేస్తే మంచిది’’ అన్న గజపతిరాజు వ్యాఖ్యలకు ఒక పౌరుడి స్పందన ఏమిటంటే... ‘‘అవును నిజమే! 15 నెలల టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పాలన కారణంగా ఏపీ ప్రజలు చాలామందికి పిచ్చి ఎక్కిన పరిస్థితి ఉంది, నయం చేసుకోవాలంటే విశాఖలోనే కాదు... రాష్ట్రమంతా పిచ్చి ఆస్పత్రులు పెట్టాలి. మొట్టమొదటగా విజయనగరంలో అలాంటి ఆస్పత్రి ఏర్పాటు చేస్తే మేలు’’ అని!:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
Annadata Poru: గతంలో ఇలాంటి పరిస్థితి కనిపించిందా?
సాక్షి, తాడేపల్లి: రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం (9వ తేదీన) రైతన్నకు బాసటగా వైఎస్సార్సీపీ ఎరువుల బ్లాక్ మార్కెట్‌పై 'అన్నదాత పోరు' కార్యక్రమాన్ని చేపడుతోంది. ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఇచ్చిన పిలుపులో భాగంగా రాష్ట్రం లోని అన్ని ఆర్డీఓ కార్యాలయాల ముందు వైఎస్సార్సీపీ శ్రేణులు, రైతుసంఘాలు శాంతియుత ఆందోళనలు నిర్వహించనున్నాయి. అనంతరం అధికారులకు వినతిపత్రాలను సమర్పిస్తాయి. రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా రైతాంగాన్ని పట్టి పీడిస్తోంది. బస్తా యూరియా కోసం గంటల తరబడి రైతులు ప్రైవేటు దుకాణాలు, ఆర్బీకేలు, పీఎసీఎస్‌ల ముందు వేచి ఉండాల్సిన దుస్థితి సర్వత్రా కనిపిస్తోంది. మరోవైపు కూటమి నేతల కనుసన్నల్లోనే యరియా పెద్ద ఎత్తున బ్లాక్ మార్కెట్‌కు చేరుతోంది. నల్లబజార్లో రూ.200 అధికంగా చెల్లిస్తే తప్ప యూరియా లభించడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితిని అడ్డం పెట్టుకుని పురుగుమందులు కొనుగోలు చేస్తేనే ఎరువులు విక్రయిస్తామంటూ వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు కృత్రిమంగా సృష్టించిన యూరియా కొరతను అడ్డం పెట్టుకుని కూటమి పార్టీలకు చెందిన పెద్దలే యూరియాను నల్లబజార్‌కు తరలిస్తూ, కోట్లు దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఒక్క యూరియా ద్వారానే దాదాపు రూ.200 కోట్ల మేరకు అక్రమంగా రైతుల నుంచి కాజేసేందుకు కుట్ర జరుగుతోందని ఇప్పటికే వైఎస్సార్సీపీ తీవ్ర స్థాయిలో ఆరోపించింది. దీనికి రుజువుగా పలుచోట్ల యూరియా అక్రమంగా తరలిస్తుండటం, రైతులే దానిని పట్టుకుని పోలీసులకు అప్పగించినా కనీసం కారకులైన వారిపై ఎటువంటి చర్యలు లేవు. కృష్ణాజిల్లాలో పట్టుబడిన యూరియాను రాత్రికి రాత్రే పోలీస్ స్టేషన్లోనే మార్చేసిన ఘటనలు ఈ ప్రభుత్వ నిర్వాకాన్ని ఎత్తి చూపుతున్నాయి.ప్రభుత్వం స్పందించి రైతాంగ డిమాండ్లపై దిగి వచ్చేలా అన్నదాత పోరును రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. యూరియా బ్లాక్ మార్కెటింగ్‌ని అరికట్టి ఎమ్మార్పీ ధరలకే రైతులందరికీ సక్రమంగా పంపిణీ చేయాలి. ఇన్పుట్ సబ్సిడీ, క్రాప్ ఇన్సూరెన్స్ చెల్లించాలి. టమాట, ఉల్లి, చీనీ, బొప్పాయితో పాటు రైతులు పండించే అన్ని పంటలకు మద్దతు ధర చెల్లించాలి. గత వైఎస్సార్సీపీ హయాంలో మాదిరిగా ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి మార్కెట్లో పోటీ పెంచాలి. ప్రైవేటు వ్యాపారులతో సమావేశాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకు ఒప్పించి రైతులకు అండగా నిలబడాలి. తదితర రైతాంగ డిమాండ్లపై బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రైతు పోరును ముందకు తీసుకువెళుతున్నారు. ఇప్పటికే దీనిపై రైతుల్లో విస్తృతమైన అవగాహన కల్పించేందుకు ఈనెల 6న తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పోస్టర్‌ను ఆవిష్కరించారు. అలాగే 7వ తేదీన అన్ని నియోజకర్గ కేంద్రాల్లోనూ, 8న అన్ని మండల కేంద్రాల్లోనూ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాలను నిర్వహించారు.యూరియా సమస్యతో రైతులు సతమతం అవుతుంటే సీఎం చంద్రబాబు స్పందించిన తీరు అత్యంత దారుణంగా ఉంది. ముఖ్యమంత్రి ఈ సమస్యపై స్పందించిన తీరు, బెదిరిస్తూ మాట్లాడటం, సమస్యే లేదని చెప్పడం పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతగా క్యూలైన్లు ఉన్నా కూడా రైతుల్ని బెదిరించేలా మాట్లాడటంపై రైతులు మండిపడుతున్నారు. అసలు రాష్ట్రంలో సమస్యే లేదని దబాయించి మాట్లాడుతున్న వైనంపై సమస్య లేదని, వైఎస్సార్ సీపీ సమస్య క్రియేట్ చేస్తోందన్నట్లు రైతు సమస్యలను కూడా రాజకీయం చేస్తున్న కూటమి సర్కార్‌పై రైతుల్లో తీవ్ర అసహనం కనిపిస్తోంది. మరోవైపు ఈ సీజన్లో కేవలం అరవై శాతం మాత్రమే పంటలు సాగవుతుంటే, ఇంతగా యూరియా కొరత ఎలా ఏర్పడిందనే దానిపై ప్రభుత్వంలోనే సరైన సమాధానం లేదు. సీజన్‌కు సంబంధించి ముందుగా పంటల సాగు, ఎరువుల అవసరంపై ఎందుకు ప్రణాళికలను సిద్దం చేసుకోలేకపోయారు, ముందస్తుగా సమీక్షా సమావేశాలను నిర్వహించలేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతున్నాయి.ప్రభుత్వంలో కలవరం!అన్నదాత పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతూ వైఎస్సార్సీపీ ఆందోళనలకు సిద్దం కావడంతో కూటమి సర్కార్‌లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే రైతుల విషయంలో ఇదొక విఫల ప్రభుత్వం, పాలన చేతగాని ప్రభుత్వంగా ప్రజల నుంచి ఈసడింపులు ఎదుర్కొంటోంది. కూటమి పాలనకు ముందు.. గత అయిదేళ్ళ వైఎస్సార్సీపీ ప్రభుత్వంతో రైతులు పోల్చి చూస్తున్నారు. పంటల బీమా పథకాన్ని అమలు చేయడం, పంట దెబ్బతిన్న ప్రాంతాల్లో ఇన్పుట్ సబ్సిడీనీ సకాలంలో అందించడం, సీజన్ ప్రారంభంలోనే అవసరమైన మేరకు ఆర్బీకేలు, పీఎసీఎస్‌ల ద్వారా ఎరువులను రైతు ముంగిట్లోనే అందుబాటులో ఉంచడం, రైతుభరోసా ద్వారా పెట్టుబడి సాయానిన్ని అందించడం ద్వారా అప్పుల పాలు కాకుండా రైతులకు అండగా నిలవడం, ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసిన అన్ని రకాల పంటలకు మార్కెట్లో ధరలు లేని సమయంలో ప్రభుత్వమే జోక్యం చేసుకుని కొనుగోలు చేయడం ఇలా అనేక అంశాల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన మంచిని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. తాజాగా ఉల్లి, మినుము, చీనీ, అరటి తదితర పంటలకు మార్కెట్లో రేటు లేని పరిస్థితుల్లో రైతులను పట్టించుకోకుండా వదిలేసిన కూటమి సర్కార్ నిర్వాకాన్ని రైతులు పోల్చి చూస్తున్నారు. వైఎస్సార్సీపీతో కలిసి తమ ఆగ్రహాన్ని ఈ ప్రభుత్వానికి చూపించేందుకు అన్నదాత పోరులో పెద్ద ఎత్తున రైతాంగం పాల్గొనేందుకు సిద్దమైంది.రైతులకు అండగా వైఎస్సార్సీపీ.. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్అన్నదాత పోరు కార్యక్రమంతో.. రైతుల సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధిలేని కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీత సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై గళమెత్తడం రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు విత్తనం నుంచి విక్రయం ద్వారా అడుగడుగునా అండగా నిలబడ్డ జగన్ ప్రభుత్వంగత 15 నెలల పాలనలోనే రైతు వ్యతిరేక ప్రభుత్వంగా పేరు తెచ్చుకున్న కూటమి. యూరియా పంపిణీ కేంద్రాల వద్ద ఉదయం నుంచి సాయంత్రం దాకా రైతులు పడిగాపులు పడ్డా ఉత్త చేతులేరైతులకు పార్టీ ముద్ర వేస్తూ.. యూరియా కొరత లేదని చెబుతున్న చంద్రబాబు యూరియా కోసం క్యూ లైన్లలో నిలబడిన రైతులను హేళన చేస్తున్న వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు గత వైఎస్సార్సీపీ హయాంలో ఎక్కడా ఆర్బీకే సెంటర్ల ముందు క్యూలైన్లు కనిపించిన ఫొటో ఒక్కటైనా చూపించగలరా?ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేని స్థితిలో చంద్రబాబు -
‘చంద్రబాబు మద్యం విధానానికి మేం వ్యతిరేకం’
తాడేపల్లి: చంద్రబాబును రాజకీయంగా ఎదుర్కోవడానికి తమకు భయం లేదని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు స్పష్టం చేశారు. చంద్రబాబుకు సిట్ అనేది జేబు సంస్థగా మారిపోయిందని విమర్శించారు. ఈరోజు(సోమవారం, సెప్టెంబర్ 8వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన టీజేఆర్.. ‘ చంద్రబాబు మద్యం విధానానికి మేం వ్యతిరేకం. చంద్రబాబు హయాంలో మంచి నీళ్లు దొరకవు. మద్యం దొరుకుతుంది. చంద్రబాబు వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానాకి లిక్కర్ కేసు పెట్టారు. ఇది కుట్ర పూరిత లిక్కర్ కేసు. లేని అభూతకల్పనను సృష్టించి జగన్‌కి సన్నిహితులుగా ఉన్నవాళ్లను, ప్రభుత్వంలో పనిచేసిన వారిపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారు.. చంద్రబాబు, లోకేష్ ఆడిస్తున్న కట్టు కధ లిక్కర్ కేసు. ఏం లేదు కాబట్టే నెమ్మదిగా ఎదుర్కొంటున్నాం..అమాయకులు అయిన వారితో స్టేట్మెంట్స్ ఇప్పించి మద్యం కేసుల్లో ఇరికిస్తున్నారు. వాసుదేవరెడ్డి కూడా చంద్రబాబు కుట్రలో పడ్డారు. చంద్రబాబుకు అనుకులంగా వాగ్మూలం ఇచ్చారు కాబట్టే కేంద్ర సర్వీస్‌లోకి పంపారు. సిట్ దర్యాప్తు లోప భూయిష్టంగా మారిపోయింది. ఎందుకు సిట్ చంద్రబాబు నాయుడుకి జేబు సంస్ధగా మారిపోయింది?, 90 రోజులు పాటు చిత్ర హింసలకు గురిచేశారు. డ్రోన్ కెమెరాలు పెట్టి ఇబ్బందులు పెట్టారు. జగన్ అధికారంలోకి వచ్చాకా బెల్ట్ షాపులను లేకుండా చేశారు. మద్యాన్ని తాగుతున్న వాళ్లను కంట్రోల్ చేయడం కోసం ప్రభుత్వమే అమ్మింది. ధర పెంచింది. మద్యా న్ని అందని ద్రాక్షగా జగన్ చేస్తే.. చంద్రబాబు చదువును, ఉపాధిని అందని ద్రాక్షగా చేశారుఉ. కిల్లీ షాపుల్లో కూడా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు. టీనిపై టీడీపీ సవాల్‌కి సిద్ధం. గత ప్రభుత్వ హయంలో డిస్కరీలు అన్నింటికి చంద్రబాబు పర్మిషన్లు ఇచ్చినవే.. చర్చకు సిద్దం. కోర్టు అడిగినా ప్రభుత్వానికి సిగ్గులేదు. చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు బ్యారెక్ మొత్తం ఇచ్చాం. దోమలు కుడుతున్నాయని ఒకసారి, డెంగ్యూ అని ఒకసారి , దద్దుర్లు వస్తున్నాయని బెయిల్ కావాలని అడిగారు. అన్ని రోగాలకు బెయిల్ మందు అని చంద్రబాబు అడిగారు. రాజమండ్రి నుండి భారీ ర్యాలీ చేశారు. ఇన్ని రోగాలు ఉన్నవాడు ర్యాలీ చేస్తారా?, ఎంతమందిని అరెస్ట్ చేసినా రాష్ట్ర ప్రజలకోసం జగన్ చేసే యుద్దన్ని ఒక్క క్షణం కూడా ఆపలేరు. ప్రజల తరపున జగన్ వాయిస్ వినిపిస్తూనే ఉంటుంది. చంద్రబాబుకు ఒక న్యాయం ఇతరులకు ఒక న్యాయమా?, ఎప్పటికైనా సత్యం గెలుస్తుంది.. న్యాయం నిలబడుతుంది.. వంద మద్యం కేసులు పెట్టినా మా గుండె ధైర్యాన్ని తగ్గించలేరు’ అని టీజేఆర్ స్పష్టం చేశారు. -
‘పదోతేదీ వరకూ తాడిపత్రి రాకండి..ఆరోజు బాబుగారొస్తున్నారు..’
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి రావడానికి సుప్రీంకోర్టు అనుమతించి.. భద్రతా కల్పించాలని పోలీసులను ఆదేశించినా పోలీసులు మాత్రం ఇంకా తెలుగుదేశం ప్రభుత్వానికి అనుకూలంగానే మాట్లాడుతున్నారు.. రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు.. స్థానిక ఎమ్మెల్యే జేసీ ప్రభాకరరెడ్డి ఎన్ని అడ్డంకులు కల్పించినా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తన పంతం వీడక సుప్రీం కోర్టు వరకూ వెళ్లి పోరాడి తన హక్కులు సాధించుకున్నారు.. ఎలాగైనా సరే భీష్మించుకుని తాడిపత్రిలో అడుగుపెట్టారు.. అయితే ఇప్పుడు మళ్ళీ పోలీసులు కొత్త రాగం తీస్తున్నారు.వాస్తవానికి గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన తాడిపత్రిలో అడుగిడేందుకు ఆయనకు దాదాపు 15 నెలల సమయం పట్టింది.. పెద్దారెడ్డి తాడిపత్రి ఎలా వస్తాడో. ఎలా తిరిగివెళ్లాడో చూస్తాను అంటూ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి చేసిన హెచ్చరికలు ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు రేపగా ఆయన్ను తాడిపత్రి రావద్దని పోలీసులు కూడా సూచించారు. దీనిమీద అయన హైకోర్టుకు వెళ్లారు.. అక్కడ ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చినట్లే వచ్చి మళ్ళీ అడ్డంకులు వచ్చాయి. దీంతో అయన సుప్రీం కోర్టుకు వెళ్లారు. అక్కడ ఆయనకు పూర్తి సానుకూలమైన తీర్పు వచ్చింది.అయన సొంత నియోజకవర్గానికి వెళ్ళడానికి ఎవరు అడ్డంకి.. వెళ్లనీయండి.. కాకుంటే ఆయనకు భారీ భద్రతా కల్పిస్తూ పోలీసుల సమక్షంలో ఆ పర్యటన జరగాలి.. ఆ భద్రతకు అయ్యే ఖర్చు మొత్తం పెద్దారెడ్డి భరించాలి అని కోర్టు చెప్పింది.. దీంతో ఇక పోలీసులు.. ఏపీ ప్రభుత్వం కూడా అయన రాకను అడ్డుకోలేని పరిస్థితి వచ్చింది. దీంతో అయన సెప్టెంబర్ ఆరున తాడిపత్రి వెళ్లారు.. దీనికి భారీ భద్రత కల్పించారు.. అయితే అంతలోనే మళ్ళీ పోలీసులు ఆయన్ను నియంత్రిస్తున్నారు.. మీరు పదోతేదీన ఇక్కడ ఉక్కడ ఉండకూడదు.. ముఖ్యమంత్రి చంద్రబాబు వస్తున్నారు కాబట్టి.. మేమంతా అయన భద్రతా చర్యల్లో ఉంటాం.. మీకు సరైన భద్రత కల్పించలేం.. మళ్ళీ జరగరానిది జరిగితే మీకు మాకు కూడా ఇబ్బంది.. ఎందుకొచ్చిన గొడవ.. ఆ తరువాత మీరు రావచ్చు.. ఇప్పుడైతే మీ సొంత ఊరు వెళ్లిపోండి.. తరువాత వద్దురుగాని అని చెబుతున్నారు.. చంద్రబాబు పర్యటన సమయంలో వైఎస్సార్సీపీ అభిమానులు.. పెద్దారెడ్డి అనుచరులు ఏమైనా హడావుడి చేస్తే ప్రభుత్వానికి చికాకు కదా జాగ్రత్తతో ఇలా చెబుతున్నారని తెలుస్తోంది.. చంద్రబాబు భద్రతకు మూణ్ణాలుగు జిల్లాల నుంచి పోలీసులను రప్పించే ప్రభుత్వం పెద్దారెడ్డికి మాత్రమే రక్షణ కల్పించలేకపోవడం చేతగాని రాజకీయం అని అయన అభిమానులు అంటున్నారు.::సిమ్మాదిరప్పన్న -
‘రైతుల ఆత్మహత్యలు.. మంత్రుల హేళన వ్యాఖ్యలేంటి?’
సాక్షి, ప్రకాశం: ఏపీలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని ఆరోపించారు మాజీ మంత్రి మేరుగ నాగార్జున. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వ్యవసాయం పండగలా చేసాం. కానీ, కూటమి ప్రభుత్వంలో వ్యవసాయం తాకట్టు వ్యాపారంలా మారింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.మాజీ మంత్రి మేరుగ నాగార్జున తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో యూరియా అడుగుతున్న రైతులపై మంత్రులు హేళనగా మాట్లాడుతుంటే.. ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవసాయం మానుకోమంటున్నారు. 280 రూపాయల యూరియా బస్తా బ్లాక్ మార్కెట్లో 600 రూపాయలకు అమ్ముతున్నారు. ఏపీలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది.రైతు భరోసా 40వేల రూపాయలు ఇవ్వాల్సి ఉంటే ఐదు వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వ్యవసాయం పండగలా చేసాం.. చంద్రబాబు ప్రభుత్వంలో వ్యవసాయం తాకట్టు వ్యాపారంలా మారింది. రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు.. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మీ ప్రజా వ్యతిరేక విధానాలపై వైఎస్సార్సీపీ పోరాడుతూనే ఉంటుంది. కూటమి ప్రభుత్వంలో అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదు’ అని హెచ్చరించారు. -
పెనమలూరులో టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అరాచకం
సాక్షి, కృష్ణా జిల్లా: పెనమలూరు మండలం పోరంకిలో టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అరాచకానికి దిగారు. వృద్ధ దంపతుల స్థలంపై ఎమ్మెల్యే కన్నేశారు. వృద్ద దంపతులకు నాదెళ్ల భానుతో కొంతకాలం సరిహద్దు వివాదం సాగుతోంది. సంబంధం లేకపోయినా స్థల వివాదంలో ఎమ్మెల్యే తలదూర్చారు. బోడె ప్రసాద్ తీరుపై వృద్ధ దంపతులు మండిపడుతున్నారు. పోలీసుల అండతో ఎమ్మెల్యే అనుచరులు.. అక్రమంగా గోడకట్టించారు. 10 రోజుల క్రితం స్థలంలో ఎమ్మెల్యే అనుచరులు మొక్కలు నాటారు.‘‘పోరంకిలో మేం ఎన్నో ఏళ్ల నుంచి నివాసముంటున్నాం. నాదెళ్ల భాను అనే వ్యక్తికి, తమకు సరిహద్దు వివాదాలున్నాయి.. కోర్టులో కేసులు కూడా నడుస్తున్నాయి. ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌కు మా స్థలంతో ఎలాంటి సంబంధం లేదు. అన్యాయంగా మా స్థలంలోకి ఎమ్మెల్యే మనుషులు చొరబడ్డారు. పది రోజుల క్రితం మా స్థలంలో ఎమ్మెల్యే పూలమొక్కలు పెట్టించారు. నిన్న ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అనుచరులు మా స్థలంలో గోడ కట్టారు’’ అంటూ ఆ వృద్ధ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు.‘‘పోలీసులే దగ్గరుండి మరీ గోడ కట్టించారు. గోడ ఎలా కడతారని ప్రశ్నించినందుకు బోడే ప్రసాద్ మనుషులు నా భర్త పై దాడి చేశారు. వృద్ధుడని కూడా చూడకుండా లాగి పడేశారు. మాకు న్యాయం చేయాలి’’ అంటూ బాధితురాలు వేడుకుంటున్నారు. -
ఇదేనా పాలనంటే?.. చంద్రబాబు సర్కార్‌పై బొత్స ఫైర్
సాక్షి, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వ పాలనపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శనాస్త్రాలు సంధించారు. మెడికల్ కాలేజీలను చంద్రబాబు సర్కార్ ప్రైవేట్‌పరం చేయడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. వైఎస్ జగన్ హయాంలో కోవిడ్ సమయంలో కూడా రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు. మెడికల్ సీట్లు వద్దని కేంద్రానికి చంద్రబాబు లేఖ రాయడం దురదృష్టకరమంటూ బొత్స దుయ్యబట్టారు.పేద ప్రజల ఆరోగ్యం కోసం దివంగత మహానేత వైఎస్సార్ ఆరోగ్యశ్రీని తీసుకొచ్చారని.. కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసిందంటూ బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీ బకాయిలను వైఎస్సార్పీ ప్రభుత్వం చెల్లించిందని ఆయన గుర్తు చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆలోచనను చంద్రబాబు సర్కార్ విరమించుకోవాలన్నారు.మెడికల్ కాలేజీలప్రైవేటీకరణను వైఎస్సార్సీపీ తీవ్రంగా ఖండిస్తోందని బొత్స అన్నారు. కూటమి పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టీడీపీ బెదిరింపులకు వైఎస్సార్సీపీ భయపడదు. కూటమి పాలనలో పంటల సాగు తగ్గిపోయింది. వైఎస్సార్సీపీ హయాంలో ఎప్పుడూ యూరియా సమస్య రాలేదు. కూటమి పాలనలో యూరియా కోసం రైతులు అవస్థలుపడుతున్నారు’’ అని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.‘‘దోపిడీ కోసం ప్రభుత్వ వైద్యాన్ని ప్రైవేటు వారికి కట్టబెట్టడం దుర్మార్గం. చంద్రబాబు ఎప్పుడూ ప్రైవేట్ మనిషే.. గతంలో కూడా ఇలాంటి నిర్ణయాలు చేశారు. కట్టిన కాలేజీలను కూడా ప్రైవేట్‌కు ఇవ్వడం.. మెడికల్ సీట్లు తిరస్కరించిన ప్రభుత్వం ఇదే. పేద ప్రజల కోసం కార్పొరేట్ వైద్యం ఉండాలని ఆరోగ్యశ్రీ తీసుకొచ్చిన మహానుభావుడు వైఎస్సార్.. ఈ ప్రభుత్వం వచ్చాక ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు...చంద్రబాబు ప్రభుత్వంలో మాటలు తప్ప చేతలు లేవు. నిధులు విడుదల చేయకపోవడంతో నెట్వర్క్ ఆసుప్రతుల్లో పేద వాడికి వైద్యం అందడం లేదు. రూ. 2 లక్షల కోట్లు అప్పు చేశారు. అందులో రూ. 6 వేల కోట్లు ప్రజా ఆరోగ్యానికి వెచ్చించలేరా?. యూరియా సమస్య కోసం మాట్లాడుతుంటే చంద్రబాబు బెదిరిస్తున్నారు. మీ బెదిరింపులకు ఇక్కడ ఎవరూ భయపడరు. యూరియా సమస్య ఎందుకు వచ్చిందని సీఎం ఆలోచన చేయాలి. అది మానేసి తిరిగి అడిగిన వారిపై చర్యలు తీసుంటారట. ఎవరి మీద చర్యలు తీసుకుంటావ్?..మంత్రులు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. యూరియా కోసం లైన్లో నిలబడితే బఫె భోజనంతో పోల్చుతున్నారు. మీ మాటలు ప్రజలు గమనిస్తున్నారు. యూరియా సమస్యకు పరిష్కారం చూపించండి. 9న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్డీఓ కార్యాలయాల వద్ద నిరసన తెలిపి వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించాం. ఇప్పటికే నెల రోజులుగా సమస్య చూస్తున్నాం. యూరియా వినియోగం, డిమాండ్, అందుబాటులో ఉన్న లెక్కలపై స్పష్టత ఇవ్వండి. రైతులకు భరోసా ఇవ్వండి. అది మానేసి ఎదురుదాడి చేయడం ఏంటి..?..అడిగితే జైల్లో పెడతాం అంటున్నారు.. రేపనే రోజు ఉండదా..?. తప్పు చేసిన వారిని క్షమించాల్సిన పనిలేదు. రుషికొండ భవనాల్లో నిజంగా పెచ్చులు ఊడిపోతే కాంట్రాక్టర్ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు. రుషికొండ కాంట్రాక్టర్‌కు డబ్బులు ఎవరు ఇచ్చారు?. సంపద సృష్టి అంటే మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడమా..?. ఏ కాలేజీ ఎవరికీ ఇవ్వాలని అనుకున్నారో పేర్లతో సహా త్వరలో చెప్తా. దేశంలోని బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎక్కడైనా యూరియా సమస్య ఉందా?. ఇక్కడే ఎందుకు వస్తుంది..?. ఏపీలో కూడా బీజేపీ భాగస్వామ్య ప్రభుత్వమే కదా ఇక్కడి ప్రజలు ఏం పాపం చేశారు. ఎందుకు యూరియా అందుబాటులో లేదు....స్టీల్ ప్లాంట్‌పై ప్రభుత్వం నిర్వాకం వలన పోరాటం తప్పడం లేదు. ప్లాంట్ రక్షణ కోసం గత్యంతరం లేక ప్రజా సంఘాలతో పోరాటం చేస్తున్నాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేదని ప్రధాని, లేదా ఉక్కు మంత్రితో చెప్పించండి. మీకు జై కొడతాం.. పార్లమెంట్లో అయినా చెప్పించండి. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ అందరి సమస్య. ఈనెల 12న రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారు.. నేను వెళ్తున్నా.. టీడీపీ వాళ్ళు అక్కడికి వచ్చి ప్రైవేటీకరణ జరగదని చెప్పాలి. ప్రభుత్వ నియంత నిర్ణయాలపై శాసన మండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా’’ అని బొత్స చెప్పారు.అశోక్ గజపతి వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ..రుషికొండ భవనాలపై అశోక్ గజపతి వ్యాఖ్యలకు బొత్స కౌంటర్ ఇస్తూ.. రుషికొండ భవనాలను మెంటల్ హాస్పిటల్ చేయాలని అన్నారంటే.. అశోక్ గజపతి రాజు మానసిక పరిస్థితి ఏమిటో అర్ధమవుతుందన్నారు. అలాంటి వాళ్లను మెంటల్ హాస్పటల్ లో పెట్టాలన్న బొత్స.. ఆయనకు అహంకారం పుట్టుకతో వచ్చిందన్నారు. -
చంద్రబాబుకు న్యాయస్థానాలంటే లెక్కలేదు: అంబటి
సాక్షి, విజయవాడ: చంద్రబాబుకు కోర్టులంటే లెక్కలేదని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. కోర్టు ఆర్డర్స్‌ను కూడా జైలు అధికారులు పట్టించుకోరా? అంటూ ప్రశ్నించారు. 1989 నుండి రాజకీయాల్లో ఉన్నానని.. ఇంత దారుణమైన ఘటన ఇప్పటివరకు చూడలేదన్నారు.‘‘రిటైర్డ్ అధికారులు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పలకు నిన్న(శనివారం) సాయంత్రం బెయిల్ వచ్చింది. వారిని నిన్ననే విడుదల చేయాలి. ఇవాళ(ఆదివారం) ఉదయం 6.30 గంటలకు విడుదల చేస్తామని చెప్పారు. జైలర్ మచిలీపట్నం నుంచి బస్‌లో బయల్దేరి దిగకుండా ఉండాలని చంద్రబాబు, లోకేష్ చెప్పారు. జైలు నుంచి బయటకి రాకుండా లంచ్ మోషన్ వేయాలని ఆలస్యం చేశారు’’ అంటూ అంబటి దుయ్యబట్టారు‘‘వంశీ కేసులో కూడా బెయిల్ వచ్చినా పట్టించుకోలేదు. లిక్కర్ కేసు ఛార్జ్‌షీట్ అంతా తప్పుల తడక. చంద్రబాబు చెప్పినట్టు సిట్ అధికారులు నడుస్తున్నారు. లేని స్కామ్‌ను సృష్టించి వైఎస్సార్సీపీని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు కక్ష సాధింపు ధోరణిని ప్రజలు గమనిస్తున్నారు’’ అని అంబటి పేర్కొన్నారు. -
జైలు నుంచి ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్, బాలాజీ విడుదల
సాక్షి, విజయవాడ: మద్యం అక్రమ కేసులో అరెస్టయిన రిటైర్డ్ అధికారులు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప ఇవాళ(ఆదివారం) జైలు నుంచి విడుదలయ్యారు. కాగా, వారి విడుదలపై జైలు అధికారులు తాత్సారం చేశారు. ముగ్గురి విడుదల ప్రక్రియను అధికారులు ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. నిన్న(శనివారం) సాయంత్రమే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ ఇవాళ(ఆదివారం) వారిని ఆలస్యంగా విడుదల చేశారు. ఈ క్రమంలో విజయవాడ జైలు సూపరిటెండెంట్ తీరుపై న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు.బెయిల్ వచ్చిన మమ్మల్ని జైల్లో బంధించారని ధనుంజయరెడ్డి మండిపడ్డారు. కోర్టులంటే ప్రభుత్వానికి గౌరవం లేదని.. మళ్లీ ఏదో కేసు పెట్టి జైల్లో బంధించాలని చూశారంటూ ధనుంజయరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం అక్రమ కేసులో విజయవాడ ఏసీబీ కోర్టు శనివారం రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు బెయిల్ రాకుండా అడ్డుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సాగించిన ప్రయత్నాలను పటాపంచాలు చేసింది. ఈ ముగ్గురికీ బెయిల్ ఇచ్చింది. చార్జిషీట్ దాఖలు చేసిన నేపథ్యంలో వీరికి ఏసీబీ కోర్టు డీఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా పలు షరతులు విధించింది.పాస్‌పోర్టులను ఇప్పటికే జప్తు చేయకుంటే, విడుదలైన మూడు రోజుల్లో వాటిని స్వాధీనం చేయాలని ఆదేశించింది. ముగ్గురూ రూ.లక్ష చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని సూచించింది. కోర్టు అనుమతి లేకుండా దేశం దాటి వెళ్లొద్దని, తమ నియంత్రణలోని లేని పరిస్థితుల్లో తప్ప మిగిలిన అన్నివేళల్లో కోర్టు విచారణలకు హాజరై తీరాలని స్పష్టం చేసింది.తదుపరి పర్యవేక్షణ నిమిత్తం మొబైల్ ఫోన్‌ను యాక్టివ్‌లో ఉంచాలని పేర్కొంది. సాక్షులను గాని, సహ నిందితులను కలవడానికి వీల్లేదని ఆదేశించింది. ఎలాంటి నేరపూరిత చర్యలకు పాల్పడరాదని, షరతులను ఉల్లంఘిస్తే వెంటనే బెయిల్ రద్దవుతుందని వెల్లడించింది. ఈ మేరకు న్యాయాధికారి పి.భాస్కరరావు శనివారం తీర్పు వెలువరించారు. -
తాడిపత్రిలో పోలీసుల హైడ్రామా.. పెద్దారెడ్డి విషయంలో మరో ట్విస్ట్!
సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో పోలీసులు మరోసారి హై డ్రామాకు తెరలేపారు. తాజాగా తాడిపత్రి వదిలి వెళ్లాలని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఈనెల పదో తేదీన అనంతపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన నేపథ్యంలో కేతిరెడ్డిని తాడిపత్రి నుంచి వెళ్లిపోవాలని సూచించడం గమనార్హం.వివరాల ప్రకారం.. తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి విషయంలో పోలీసులు మరో ట్విస్ట్ ఇచ్చారు. ఈనెల పదో తేదీన అనంతపురంలో సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో పోలీసు బలగాలు ఆ కార్యక్రమంలో పాల్గొంటారని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి.. తాడిపత్రి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన అనంతరం తాడిపత్రికి రావాలని పెద్దారెడ్డికి పోలీసులు చెప్పారు.ఈ నేపథ్యంలో పెద్దారెడ్డి స్పందిస్తూ.. దీనికి సంబంధించి లిఖితపూర్వకంగా లేఖ ఇవ్వాలని కోరారు. కానీ, లేఖ ఇవ్వడానికి పోలీసులు నిరాకరించారు. ఈ నేపథ్యంలో పోలీసుల అనుమానాస్పద వైఖరిని పెద్దారెడ్డి ప్రశ్నించారు. అనంతరం, అనంతపురం ఎస్పీ జగదీష్‌కు కేతిరెడ్డి మెయిల్ పంపించారు. సీఎం పర్యటన అనంతరం తాడిపత్రి వస్తానని లేఖలో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తాడిపత్రిలో ఉండేందుకు ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో పెద్దారెడ్డి.. శనివారం ఉదయం తాడిపత్రిలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. -
వైఎస్సార్సీపీలో నూతన నియామకాలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టారు. ఆయన ఆదేశాల మేరకు నూతనంగా రాష్ట్ర రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమిస్తూ.. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.జోన్-1 వర్కింగ్ ప్రెసిడెంట్‌గా గొంటు రఘురామ్ (శ్రీకాకుళం), జోన్-2 వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బూరుగుపల్లి సుబ్బారావు (తూర్పుగోదావరి), జోన్-3 వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సింహాద్రి రమేష్ బాబు (కృష్ణాజిల్లా), జోన్-4 వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎనుముల మారుతి ప్రసాద్‌రెడ్డి (ప్రకాశం), జోన్-5 వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వంగల భరత్ కుమార్‌రెడ్డి (కర్నూలు), ఆక్వా కల్చర్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వడ్డి రఘురామ్ (పశ్చిమ గోదావరి) నియమితులయ్యారు. -
‘ఈ ప్రభుత్వం రైతుల్ని చిన్నచూపు చూస్తుంది’
పశ్చిమగోదావరి జిల్లా : చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రైతుల్ని చిన్నచూపు చూస్తోందని జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు ముదునూరి ప్రసాద్‌రాజు ధ్వజమెత్తారు. గత ప్రభుత్వంతో రైతు భరోసా కేంద్రాలు నిర్మిస్తే, ఇప్పుడు వాటిన్నంటికీ తాళాలు వేశారని మండిపడ్డారు. రైతులకు విత్తనం మొదలు అమ్మేవరకూ పూర్తి భరోసా ప్రభుత్వానిదేనని, ఇప్పుడు యూరియా కోసం రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం క్యూలైన్లో ఉండి ఇబ్బంది పడటం చూస్తున్నామన్నారు.ప్రభుత్వ తరుపున కట్టే ఇన్సురెన్స్ ఈ ప్రభుత్వం కట్టడం లేదన్నారు.రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై 9వ తేదీన ఆర్డీవో కార్యాలయాలో రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లాలోని నర్సాపురం, తాడేపల్లిగూడెం, భీమవరం ఆర్డివో కార్యలయంలో ఈ కార్యక్రమం చేపడతామన్నారు.వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు ఈనెల తొమ్మిదో తారీఖున ప్రతి ఆర్డీవో కార్యాలయం వద్ద రైతులందరితో కలిపి రైతు సమస్యల పైన వినత పత్రాన్ని అందజస్తామన్నారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో రైతుల్ని అన్ని విధాలా ఆదుకుంటే, కూటమి ప్రభుత్వం మాత్రం రైతు సమస్యలపై మొద్దు నిద్ర వహిస్తుందన్నారు. -
సిట్ భేతాళ కథలు ఇక చెల్లవు: మనోహర్‌రెడ్డి
సాక్షి, తాడేపల్లి: సిట్ భేతాళ కథలు ఇక చెల్లవని.. కోర్టులో న్యాయమే జరుగుతుందని వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లేని లిక్కర్ స్కాంని ఉన్నట్టు చూపించే ప్రయత్నం సిట్ చేసిందన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం వాంగ్మూలాలతో కేసు నడిపించాలని చూస్తున్నారని మండిపడ్డారు. అరెస్టు అయినవారెవరి మీదా సిట్ సాక్ష్యాలు చూపించలేకపోయిందన్నారు.‘‘కేవలం భేతాళ కథలతోనే ఇప్పటిదాకా కేసును నడిపారు. లేని లిక్కర్ స్కాంని ఉన్నట్టు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కోర్టును కూడా పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. సిట్ అధికారులు చాలామందిని బెదిరించి వాంగ్మూలాలు తీసుకున్నారు. వైఎస్ జగన్ చుట్టూ ఉన్న నాయకుల అరెస్టే లక్ష్యంగా లిక్కర్ కేసును నడిపిస్తున్నారు. ఇలాంటి అక్రమ కేసులు కోర్టు ముందు నిలపడవు. తాత్కాలికంగా మా నాయకులను వేధించవచ్చునేమోగానీ న్యాయ పరీక్షకు కేసు నిలపడదు’’ అని మనోహర్‌రెడ్డి తేల్చి చెప్పారు.మా పార్టీ ముఖ్య నేతలను కేసులో ఇరికించటానికే కేసును నడుపుతున్నారు. సిట్ ఓవరాక్షన్ చేస్తోంది. సిట్ బెదిరింపులపై కొందరు కోర్టుకు కూడా వెళ్లారు. రూ.11 కోట్లు చూపించి లిక్కర్ కేసులోని డబ్బంటూ నమ్మించే ప్రయత్నం చేశారు. నిజం నిలకడగా తెలుస్తుందని జగన్ నమ్ముతారు. అన్యాయం మీద న్యాయం జరుగుతుందని నమ్మకం మాకుంది. మా నాయకులకు బెయిల్ రానీయకుండా ఉండేందుకు ఛార్జిషీటు వేయకుండా ఆలస్యం చేశారు. బాలాజీగోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయరెడ్డిలకు ఈరోజు బెయిల్ వచ్చింది. సహ నిందితుల వాంగ్మూలాలతోనే అరెస్టులు జరుగుతున్నాయి. ఇది సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధం’’ అని మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు.‘‘సిట్ దర్యాప్తు అంతా బెదిరింపులతోనే సాగుతోంది. తాజాగా సజ్జల భార్గవ, అనిల్ రెడ్డిల పేర్లను కూడా ఇరికించే ప్రయత్నం సిట్ చేస్తోంది. అసలు బ్యాంకు ఖాతాలు కూడా లేని భార్గవ మనీరూటింగ్ ఎలా చేస్తారు?. సిట్ చెప్పే భేతాల కథలు ఏవీ కోర్టు ముందు నిలపడవు’’ అని మనోహర్‌రెడ్డి చెప్పారు. -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెనుక పెద్ద స్కాం: విడదల రజిని
సాక్షి, తాడేపల్లి: వైఎస్ జగన్ తెచ్చిన మెడికల్ కాలేజీలను చంద్రబాబు చంపేశారంటూ మాజీ మంత్రి విడదల రజిని మండిపడ్డారు. ఒక్కో మెడికల్ కాలేజీని తీసుకు రావటానికి ఎంత కష్టమో చంద్రబాబుకు తెలియదు.. ప్రతి జిల్లాలోనూ మెడికల్ కాలేజీ, ఆస్పత్రి ఉంటే ప్రజలకు మంచి వైద్యం అందుతుందని వైఎస్ జగన్ ఊహించారు. వైద్యం, టెస్టులు అన్నీ ఫ్రీగా అందించాలన్నదే వైఎస్ జగన్ ఆలోచన. చంద్రబాబు మెడికల్ కాలేజీలను అమ్మకానికి పెడితే ఇక పేదోడి పరిస్థితి ఏంటి?’’ అంటూ విడుదల రజిని ప్రశ్నించారు.శనివారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పేద, మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులకు వైద్యవిద్యను దూరం చేశారని.. కోట్లు ఖర్చు చేసి ఆ కుటుంబాలు వైద్య విద్య చదవగలరా? అంటూ నిలదీశారు. మెడికల్ కాలేజీల కోసం సేకరించిన భూమిని కూడా ప్రైవేటుపరం అవుతోంది. దీని వెనుక పెద్ద స్కాం ఉంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాం. మేము అధికారంలోకి రాగానే మెడికల్ కాలేజీలను తిరిగి ప్రభుత్వ పరం చేస్తాం. ఈ స్కాం వెనుక ఎవరున్నారో విచారణ చేస్తాం’’ అని విడదల రజిని పేర్కొన్నారు.‘‘ఆరోగ్యశ్రీని దివంగత మహానేత వైఎస్సార్ తీసుకు వచ్చారు. కొన్ని లక్షలమందికి ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు అందించారు. అలాంటి సంజీవిని లాంటి ఆరోగ్యశ్రీని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. నెట్ వర్క్ ఆస్పత్రులకు రూ.4 వేల కోట్లకు పైగా బకాయిలు పడ్డారు. ప్రజల ప్రాణాలతో చంద్రబాబు ఆడుకుంటున్నారు. ఆరోగ్యశ్రీని కూడా ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీల చేతిలో పెట్టడం వెనుక స్కాం ఉంది. వైఎస్సార్, జగన్ పేరును ప్రజల్లో లేకుండా చేసే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలను 120 సంవత్సరాలు బతికిస్తానని చంద్రబాబు డబ్బా కొడుతున్నారు. ముందుగా తురకపాలెంలో జరుగుతున్న మరణాలను ఆపండి. మాటలు ఆపి ప్రజల ప్రాణాలను కాపాడాలి’’ అంటూ విడదల రజిని డిమాండ్ చేశారు. -
ఈనెల 9న వైఎస్సార్సీపీ ‘అన్నదాత పోరు’
సాక్షి, తాడేపల్లి: ఏపీలో చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం కారణంగా రైతులకు యూరియా కొరత, రైతాంగ సమస్యలపై వైఎస్సార్సీపీ నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో ఈనెల 9న వైఎస్సార్సీపీ ‘అన్నదాత పోరు’ కార్యక్రమం చేపట్టనుంది. ఇందులో భాగంగా ఆర్డీవో కార్యాలయాల ఎదుట శాంతియుత నిరసనలు చేపట్టాలని పార్టీ నిర్ణయం తీసుకుంది.ఈ సందర్భంగా ‘అన్నదాత పోరు’ పోస్టర్ని వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, నందిగం సురేష్, వెల్లంపల్లి శ్రీనివాస్, టీజేఆర్ సుధాకర్ బాబు, రాయన భాగ్యలక్ష్మి, మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ..‘రాష్ట్రంలో నియంతృత్వ పాలన నడుస్తోంది. రైతులు యూరియా అడిగితే బొక్కలో తోస్తానంటూ సీఎం మాట్లాడతారా?. రైతులను బెదిరించటం, తొక్కుతాం, నారతీస్తాం అంటారా?. రైతులంటే అంత చిన్న చూపేంటి?. ఈ ప్రభుత్వ మెడలు వంచేంత వరకు వైఎస్సార్సీపీ పార్టీ వెనుకడుగు వేయదు. రైతులకు యూరియా సరఫరా చేసే వరకు పోరాటం చేస్తాం. ఈనెల 9న ఆర్డీవో కార్యాలయాల ఎదుట శాంతియుత నిరసనలు చేపడతాం. రాష్ట్రంలో ఇప్పటికి 60 శాతం సాగు కూడా కాలేదు. కానీ, ఎక్కడా యూరియా మాత్రం అందటం లేదు. యూరియాను టీడీపీ నేతలే బ్లాక్ మార్కెట్‌కు తరలించుకున్నారు. సమస్యను సృష్టించి, అందులో నుంచి దోపిడీ చేయటం టీడీపీ నేతలకు బాగా తెలుసు. రైతులకు విత్తనాలు, ఎరువులు ఏవీ అందటం లేదు. ఎరువుల కొరత లేదంటున్న చంద్రబాబుకు రైతుల క్యూలు కనపడటం లేదా?. కాళ్లు అరిగేలా తిరుగుతున్న రైతులు కనపడటం లేదా?. మిర్చి, పొగాకు, మామిడి రైతులు కష్టపడుతుంటే చంద్రబాబు చోద్యం చూశారు. వైఎస్ జగన్ వెళ్తే హడావుడిగా కేంద్రానికి లేఖలు రాశారు. ఉల్లికి ధర లేదని వైఎస్సార్సీపీ నేతలు వెళ్తే మళ్ళీ హడావుడి చేశారు. ఇదేమైనా నియంతృత్వ పాలనా?. యూరియా అడిగితే బెదిరించే సీఎంని ఇప్పుడే చూస్తున్నాం’ అని వ్యాఖ్యలు చేశారు. -
చంద్రబాబు అనుకున్నంత పనీ చేశారు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు సర్కార్ నిర్ణయాన్ని ఆయన తప్పుపట్టారు. తాము అధికారంలోకి రాగానే మెడికల్ కాలేజీలను మళ్ళీ ప్రభుత్వ పరం చేస్తామని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.‘‘చంద్రబాబు అనుకున్నంత పనీచేశారు. సంపద సృష్టిస్తానని ఎన్నికలకు ముందు కల్లబొల్లి కబుర్లు చెప్పి, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఆస్తులను పప్పుబెల్లాల మాదిరిగా మీవాళ్లకు కమీషన్ల కొరకు దోచిపెడుతున్నారు. మేం పెట్టిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నిన్న కేబినెట్లో స్కాంల కోసం ప్రైవేటు పరం చేయడం అవినీతిలో మీ బరితెగింపునకు నిదర్శనం. రాష్ట్రానికి శాశ్వతంగా చేస్తున్న అన్యాయం.’’ అంటూ వైఎస్ జగన్ దుయ్యబట్టారు.‘‘ప్రజల ఆస్తులను దోచుకున్న వ్యక్తిగా ఇదివరకే మీకు పేరు ఉంది. దీనితో చరిత్రహీనుడిగా మీరు నిలిచిపోతారు చంద్రబాబు. ప్రజలకోసం కాకుండా దోపిడీకోసం నిర్ణయాలు తీసుకోవడానికే మీరు మంత్రివర్గ సమావేశాలు పెట్టుకుంటున్నట్టుగా మీ తీరు ఉంది. 1923 నుంచి 2019 వరకూ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య 11. పద్మావతి అటానమస్ కాలేజీతో కలుపుకుంటే మొత్తం 12. 2019కి ముందు 3 దఫాలుగా ఉన్న సీఎంగా ఉన్న మీరు, ప్రభుత్వ రంగంలో ఒక్క మెడికల్ కాలేజీ అయినా పెట్టారా?’’ అంటూ వైఎస్ జగన్ నిలదీశారు.‘‘కనీసం ఆ ఆలోచన చేశారా? మీరెలాగూ చేయలేదు. కనీసం మా 5 ఏళ్ల అతికొద్ది కాలంలో మేము పెట్టిన 17 కాలేజీల్లో 5 చోట్ల కాలేజీలు పూర్తై, క్లాసులు కూడా ప్రారంభం అయ్యాయి. ఎన్నికలు ముగిశాక మరోచోట అడ్మిషన్లు కూడా జరిగాయి. మిగిలిన పనులు మీరు బాధ్యతగా ముందుకు తీసుకెళ్లి ఉంటే, గత ఏడాది మరో 5, ఈ ఏడాది మరో 7 కాలేజీల్లో కూడా క్లాసులు స్టార్ట్ అయ్యేవి కదా?. మరి వాటిని ముందుకు తీసుకెళ్లకుండా ఈ రాష్ట్రానికి ఎందుకు ద్రోహం చేస్తున్నారు?. ప్రస్తుతం ఈ కాలేజీలు అక్కడ రావడంతో అమాంతంగా విలువ పెరిగిన ఆ కాలేజీల భవనాలు, భూములు కొట్టేయడానికి మీరు వేసిన ప్లానే కదా ఇది?. అవినీతికోసం ఇంతగా తెగిస్తారా?’’ అంటూ వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.1.@ncbn గారూ అనుకున్నంత పనీచేశారు. సంపద సృష్టిస్తానని ఎన్నికలకు ముందు కల్లబొల్లి కబుర్లు చెప్పి, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఆస్తులను పప్పుబెల్లాల మాదిరిగా మీవాళ్లకు కమీషన్ల కొరకు దోచిపెడుతున్నారు. మేం పెట్టిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నిన్న కేబినెట్లో స్కాంలకోసం… pic.twitter.com/oBXj40vmOP— YS Jagan Mohan Reddy (@ysjagan) September 5, 2025‘‘మా ప్రభుత్వం వచ్చేనాటికి రాష్ట్రంలో ఉన్న ఎంబీబీఎస్ సీట్లు 2,360. ఈ కొత్త మెడికల్ కాలేజీల ద్వారా సీట్లు మరో 2,550 పెరిగి, 4,910కి చేరుకుంటాయి. మేం పూర్తిచేసి, క్లాసులు ప్రారంభించడంతో కొత్తగా సుమారు 800 సీట్లు భర్తీ కూడా అయ్యాయి. వైద్య విద్యలో ఇదొక అద్భతమైన కార్యక్రమం అయినప్పుడు దీన్ని దెబ్బతీయడం ఎంతవరకు సమంజసం?. రాష్ట్రంలో అభివృద్ధికి, అత్యాధునిక వైద్యానికి చిరునామాగా నిలిచిన కాలేజీల్లో సగం సీట్లు ఉచితంగానూ, మరో సగం సీట్లు ప్రైవేటు వాళ్లతో పోలిస్తే తక్కువ ఫీజుతోనూ విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి కదా?. కళ్లముందే ఫలితాలు కనిపిస్తున్నా, ఈ కాలేజీలను ఎందుకు నాశనం చేస్తున్నారు?’’ అని వైఎస్ జగన్ ప్రశ్నించారు.‘‘ఇక్కడ సరిపడా మెడికల్ సీట్ల లేకపోవడంతో తమ పిల్లలను డాక్టర్లుగా చూడాలనుకుంటున్న తల్లిదండ్రులు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి, ఇక్కడ ప్రయివేటు మెడికల్ సీట్లు కొనే స్తోమత లేక, ఉన్న కొద్దిపాటి ఆస్తులు అమ్మి ఇతర రాష్ట్రాలకు, జార్జియా, ఉక్రెయిన్, రష్యా, పిలిప్ఫైన్స్ లాంటి ఇతర దేశాలకూ పంపిస్తున్న మాట వాస్తవం కాదా?. ఇలాంటి పరిస్థితుల్లో కూడా పులివెందుల కాలేజీకి NMC మెడికల్ సీట్లు ఇస్తే, వద్దంటూ మీరు లేఖ రాసినప్పుడే మీ కుట్ర ఏంటో బయటపడింది చంద్రబాబూ?. పేదలకు ఆ జిల్లాలోనే ఉచితంగా సూపర్ స్పెషాల్టీ సేవలు అందాలన్న గొప్ప ఉద్దేశాన్ని నిలువునా దెబ్బకొడుతున్నారు కదా చంద్రబాబూ?..ప్రతి జిల్లాలోనూ వైద్య ఆరోగ్య రంగంలో, ప్రైవేటు ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వరంగం కూడా ఉండాలని, అప్పుడే, అక్కడే ఈ కొత్త కాలేజీల వల్ల అందుబాటులోకి వచ్చే ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, పీజీ స్టూడెంట్లు, వివిధ రంగాల్లో ఫ్యాకల్టీలు, సూపర్ స్పెషాల్టీ సేవల కారణంగా మంచి మెడికల్ విద్యతోపాటు, ప్రజలకు కూడా వైద్యం ఉచితంగా అందుబాటులో ఉంటుందని, అంతేకాకుండా ప్రభుత్వ రంగం, ప్రైవేటు ఆస్పత్రులు, ఈ రెండూ సమతుల్యతతో, స్వయం సమృద్ధితో పనిచేస్తాయన్న కనీస జ్ఞానం లేకుండా, లంచాలకోసం, కమీషన్ల కోసం కక్కుర్తితో ప్రజల ఆస్తులను ఇలా మీ వాళ్లకు పందేరం చేస్తారా?ఈ రాష్ట్రం మీ జాగీరు అనుకుంటున్నారా? ఎప్పటికీ మీరే కుర్చీలో ఉంటారని కలలు కంటున్నారా?. రాష్ట్ర ప్రజలకు సంజీవని లాంటి ఆరోగ్యశ్రీని కూడా మీరు బతకనివ్వలేదు కదా చంద్రబాబూ?. ఈ 15 నెలల కాలంలో నెట్వర్క్ ఆస్పత్రులకు ఇవ్వాల్సిన, దాదాపు రూ. 300 కోట్లు, అంటే 15 నెలల్లో రూ.4,500 కోట్లకు గాను, కేవలం రూ.600 కోట్లు మాత్రమే ఇచ్చి, దాదాపు రూ.4,000 కోట్లు ఎగ్గొట్టి, పేదవాడి ఆరోగ్య భద్రతను భ్రష్టు పట్టించారు. వైద్యం ఖర్చు రూ.వేయి దాటితే, 3,257 ప్రొసీజర్లకు ఉచిత వైద్యం అందించేలా, రూ.25 లక్షల వరకూ ప్రభుత్వమే ఉచితంగా భరించేలా ప్రజలకోసం తీసుకు వచ్చిన గొప్ప ఆరోగ్యశ్రీని నాశనం చేశారు...చివరకు ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తికి ఆ విశ్రాంతి సమయంలో నెలకు రూ.5వేలు అందించే “ఆరోగ్య ఆసరా’’ను కూడా సమాధిచేశారు. దీనికి సంవత్సరానికి ఇవ్వాల్సిన రూ.450 కోట్లు, ఈ 15 నెలలకుగానూ దాదాపుగా రూ.600 కోట్లు పూర్తిగా ఎగ్గొట్టేశారు. ఆరోగ్యశ్రీ బాధ్యత నుంచి మీరు తప్పుకుని ప్రైవేటుకు ఇవ్వడం, అదో ఘనకార్యంగా ప్రచారం చేయించుకోవడం సిగ్గుగా లేదా?. మా ప్రభుత్వ హయాంలోనే సంవత్సరాదాయం రూ.5లక్షల లోపు ఉన్నవారందరికీ వర్తింపు చేయడం ద్వారా మొత్తంగా రాష్ట్రంలో 95% కుటుంబాలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావడం జరిగింది. ఇది వాస్తవం కాదా?...ఇక మీరు కొత్తగా చేసేది ఏముంది? మీ ఎల్లో మీడియాలో మోసం చేయడానికి డబ్బా కొట్టుకోవడం ఏంటి?. ఒక్కోచోట, ఒక్కోమాదిరిగా మోసం చేసేందుకు ప్రచారం చేస్తున్నారు. అసలు మీ ఇన్సూరెన్స్ పథకం పరిధి రూ.2.5 లక్షలకేనా లేక రూ.25 లక్షలకా?. అసలు ఈ 3257 ప్రొసీజర్లు అంటే, ఆపరేషన్ల ఖర్చు రూ.25 లక్షలదాకా ఉచితం అంటే అప్పుడు ప్రభుత్వం కట్టాల్సిన ప్రీమియం ఏ రూ.5వేల కోట్లో దాటుతుంది. ఇక్కడ ఆరోగ్యశ్రీ కింద రూ.3,600 కోట్లు ఖర్చు చేయడానికే మనసు లేనివారు, ఇక రూ.5వేల కోట్లు ప్రీమియంగా ఖర్చు చేస్తారా?. ఇది నమ్మదగ్గ విషయమేనా? అంటే దీని అర్థం మళ్లీ మోసం...ఒక బాధ్యతగా ప్రభుత్వం చేసే పనికీ, ప్రైవేటు కంపెనీలు చేసే పనికీ తేడా ఉంటుంది కదా చంద్రబాబూ. దేశంలో అనేక ఆరోగ్య బీమా సంస్థల నుంచి క్లెయిముల పరిష్కారంలో వస్తున్న ఇబ్బందులు తెలియనివా?. లాభాలు లేకుండా వారు ఇన్సూరెన్స్ వ్యాపారం చేస్తారా?. కోవిడ్ లాంటి మహమ్మారి వచ్చినప్పుడు అన్ని ఆరోగ్య బీమా కంపెనీలు, ప్రైవేటు ఆస్పత్రులు చేతులెత్తేస్తే, రాష్ట్ర ప్రభుత్వమే ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స అందించింది. ఇప్పుడు అలాంటి వెసులుబాటు ఉంటుందా?. చికిత్సల జాబితాలో లేకపోయినా, ఏ కొత్త వ్యాధి అయినా ప్రభుత్వం తన విచక్షణాధికారాన్ని వినియోగించుకుని వెంటనే ఆరోగ్యశ్రీ కింద చికిత్సలు అందించే అవకాశాన్ని ప్రజలు ఇప్పుడు కోల్పోతారు కదా?..కేవలం ప్రీమియం పేరిట మీ మనుషులకు చెందిన కంపెనీలకు దోచిపెట్టడానికి మీ ఈ నిర్ణయాలంటున్న ఆరోపణలకు, మీ సమాధానం ఏంటి? ఇన్ని పాపాలు చేస్తున్న మిమ్మల్ని ప్రజలు క్షమించరు చంద్రబాబూ. ఇప్పటికే మీ పట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. మేం అధికారంలోకి రాగానే ఈ నిర్ణయాలను రద్దుచేస్తాం. ఈ కాలేజీలను తిరిగి ప్రభుత్వ రంగంలోకి తెచ్చుకుంటాం’’ అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. -
‘మెడికల్ కాలేజీలు ప్రయివేటు పరం చేయడం దుర్మార్గం’
తాడేపల్లి : ఏపీలో పలు మెడికల్ కాలేజీలను ప్రయివేటు పరం చేస్తూ చంద్రబాబు కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. మెడికల్ కాలేజీలను ప్రయివేటు పరం చేసి తన తాబేదారులుకు దోచి పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మెడికల్ కాలేజీ లను ప్రయివేటు పరం చేయటం దుర్మార్గమైన చర్య అంటూ విమర్శించారు.తాను అవినీతి చేసినట్లు ఎల్లో మీడియా వార్తలు రాసిందని, ఆంబోతులకు ఆవులను సరఫరా చేసే బ్యాచ్ బీఆర్ నాయుడు, రాధాకృష్ణ, ఈనాడు కిరణ్ అని ఆరోపించారు. ఈరోజు(శుక్రవారం, సెప్టెంబర్ 5వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన అంబటి.. తన మీద విజిలెన్స్ అంటూ నానా హడావుడి చేస్తున్నారని, ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదన్నారు అంబటి. ఒకవేళ అరెస్టు చేసినా భయపడేది లేదన్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కూడా విచారణ చేస్తున్నారని, తనపై మరో కేసు పెట్టడానికి రెడీ చేస్తున్నారన్నారు. ఏదైనా న్యాయస్థానాల్లోనే తేల్చుకుంటానన్నారు. లోకేష్ బెదిరింపులకు భయపడే మనిషిని కాదని, యుద్ధానికి తాను సిద్ధమని అంబటి స్పష్టం చేశారు. తన కంఠం పెద్దదరి అక్రమ కేసులు పెట్టాలని చూస్తున్నారని, కిరణ్, బీఆర్ నాయుడు, రాధాకృష్ణ అవినీతి తిమింగళాలని విమర్శించారు.