breaking news
-
బాబూ.. కేసులు కొట్టేస్తే అంతా అయిపోతుందా?: పొన్నవోలు
సాక్షి, హైదరాబాద్: ఏపీలో నియంత పాలన నడుస్తోందన్నారు వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి(లీగల్) పొన్నవోలు సుధాకర్ రెడ్డి. కూటమి పాలనలో వ్యవస్థలు కీలుబోమ్మలుగా మారాయని ఆరోపించారు. చంద్రబాబు తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ కేసులు కొట్టివేయించుకుంటున్నారు. చంద్రబాబుపై కొట్టివేసిన కేసులన్నింటిపై ఉన్నత న్యాయస్థానంలో కొట్లాడుతాం అని హెచ్చరించారు.వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకర్ రెడ్డి సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ఒక నియంతలా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబుపై ఉన్న కేసులన్నీ ఒక్క నెలలో ఎలా కొట్టివేశారో అర్థం కావడం లేదు. కేసు పెట్టిన వ్యవస్థలే చంద్రబాబు నీతిమంతుడు అని క్లీన్ చిట్ ఇవ్వడం ఆశ్చర్యంగా ఉంది. చంద్రబాబు తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. సీఐడీ, సిట్ సాక్షాదారాలు లేవని చంద్రబాబుపై ఉన్న కేసులు కొట్టివేశారు.స్కీల్ డెవలప్మెంట్ కేసులో వందల మందిని విచారించి ఆధారాలు సేకరించారు. ఆ ఆధారాలు అన్ని ఏమయ్యాయి?. ఏపీలో దొంగా పోలీసు ఆట నడుస్తుంది.. దొంగలు వారే.. న్యాయ నిర్ణేతలు వారే. కేసులో స్పష్టమైన ఆధారాలు ఉన్నాయనే కోర్టు చంద్రబాబును జైలులో వేసింది. మరి ఇప్పుడు ఆధారాలు ఏమయ్యాయి?. చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్న అధికారులు భవిష్యత్‌లో దోషులుగా నిలబడక తప్పదు. చంద్రబాబుపై కొట్టివేసిన కేసులపై మళ్లీ ఉన్నత న్యాయస్థానాల్లో కొట్లాడుతాం’ అని వ్యాఖ్యలు చేశారు. -
అరాచకాలకూ ప్రజలు మద్దతివ్వాలా?
‘‘మన పాలనను జనం మెచ్చడం లేదు.. బాగానే పని చేస్తున్నామని మనం అనుకుంటున్నా ఎండ్ రిజల్ట్ రావడం లేదు..’’ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల జిల్లా కలెక్టర్ల సమావేశంలో చేసిన ఒక వ్యాఖ్య ఇది. కుమారుడు, మంత్రి లోకేశ్ చేస్తున్న బెదిరింపు రాజకీయాలను తెలుసుకుంటే బాబుగారికి ‘ఎండ్ రిజల్ట్’ ఎందుకు రావడం లేదో తెలిసొచ్చేదేమో. ‘రెడ్‌బుక్‌లో మూడు పేజీలే అయ్యాయి. ఇంకా ఉన్నాయి. ఎవరికి, ఎప్పుడు ముహూర్తం పెట్టాలో నాకు బాగా తెలుసు’’ అని లోకేశ్ చేసిన వ్యాఖ్య అర్థమేమిటి? ప్రభుత్వాన్ని, విధానాలను ప్రశ్నించేవారిని వేధిస్తామనడమేగా? అధికారంలో వచ్చింది మొదలు పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయ ప్రత్యర్ధులను అణచివేయాలని ప్రయత్నిస్తున్నారనే కదా? ఇలాంటి ప్రభుత్వాన్ని, పార్టీని ప్రజలు మెచ్చుకుంటారని ఎలా అనుకున్నారు? ప్రజాస్వామ్యంలో అధికారం శాశ్వతం కాదు. అయితే లోకేశ్ వంటి నేతలు అధికారం రాగానే తాము ఏమి చేసినా చెల్లిపోతుందని భ్రమపడుతున్నారు. నిజమే..ఈ మధ్య ఎవరో చెప్పారు. చంద్రబాబుకు పాలనపై పట్టు తగ్గుతోందట. అంతా ఆయన కుమారుడే ఆదిపత్యం చెలాయిస్తున్నారట. చంద్రబాబు కూడా లోకేశ్‌ను పొగడడం తప్ప ఏమీ చేయలేకపోతున్నారట. గతంలో చంద్రబాబు పాలన మరీ ఇంత అధ్వాన్నంగా ఉందని ఆయన ప్రత్యర్దులు సైతం చెప్పరు. ఈ విషయం ఆయకూ తెలుసు. రెడ్‌బుక్ అంటూ ఎవరినైనా పోలీసుల ద్వారా వేధించే అధికారం లోకేశ్‌కు ఎలా వచ్చింది? ఆయన కనీసం హోం మంత్రి కూడా కాదు! అయినా మొత్తం పోలీసు వ్యవస్థను ఆయనే ఎందుకు నడుపుతున్నారు? చివరికి కొంతమంది పోలీసులు కిడ్నాపర్లుగా మారుతున్నారని కొంతమంది సాక్షాత్తూ హైకోర్టుకు ఫిర్యాదు చేశారే! లేదంటే గంజాయి అంటూ తప్పుడు కేసులు పెడుతున్నారన్న భావన ప్రజలలో ఏర్పడుతోంది.సోషల్ యాక్టివిస్ట్ సవిందర్ రెడ్డిపై పెట్టిన గంజాయి కేసుపై న్యాయ వ్యవస్థ మండిపడింది కదా! ఫ్యాక్షనిస్టులకు ప్రోత్సాహం ఇచ్చేలా లోకేశ్ మాట్లాడడమంటే ఇంతకంటే ఏమి చెప్పాలి. ఫ్యాక్షన్ గొడవల్లో హత్యకు గురైన తోట చంద్రయ్య తనకు ఆదర్శమంటే ఏం చెబుతాం? హత్యను సమర్థించరు కానీ.. చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ప్రభుత్వం దుష్ట సంప్రదాయానికి తెరదీసిందా? లేదా? కందుకూరులో జరిగిన మరో హత్యకు టీడీపీ నేత కారణమన్న ఆరోపణలున్నాయి. అది కులపరమైన వివాదంగా మారడంతో హతుని కుటుంబానికి భారీగా పరిహారం, భూమి ఇవ్వడాన్ని టీడీపీని సమర్థించే ఒక మాజీ డీజీపీ స్థాయి అధికారే విమర్శించారే. నెల్లూరులో గంజాయి వ్యతిరేక ఉద్యమకారుడు ఆంజనేయులును కొందరు నేరస్తులు హత్య చేస్తే ఈ ప్రబుత్వం పట్టించుకోలేదు. మాచర్ల ప్రాంతంలో రెండు టీడీపీ వర్గాలు ఘర్షణ పడి హత్యలు జరిగితే దానిని వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సోదరులకు పులిమి జైలుకు పంపించడం రెడ్‌బుక్‌లో భాగమైతే ప్రజలు అంగీకరిస్తారా? చంద్రబాబును స్కిల్ స్కామ్ కేసులో గత ప్రభుత్వం అరెస్టు చేయడంపై లోకేశ్, ఇతర నేతలు విమర్శలు చేశారు. ఇది అక్రమ అరెస్టు అని చెబుతున్నారే తప్ప, అందులో అవినీతి జరగలేదని రుజువు చేసే విధంగా ఒక్కసారైనా మాట్లాడలేకపోయారే! పైగా కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ కేసును దర్యాప్తు చేసిన అధికారులపై కేసులు పెట్టి వేధించి ఇది రెడ్‌బుక్ అని చెబితే ప్రజలు ఎందుకు మెచ్చుకుంటారు? ప్రభుత్వ వైద్య కాలేజీలను ప్రవేటుపరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ జగన్ ఉద్యమం నడుపుతున్నారు. ఆ క్రమంలో గవర్నర్‌ను కలిశాక ఈ ప్రైవేటీకరణ పెద్ద స్కామ్ అని, ఆ కాలేజీలు పొందే వారిపై తమ ప్రభుత్వం వచ్చాక కేసులు పెట్టి జైలుకు పంపుతామని ఆయన అన్నారు. ఈ అంశంపై లోకేశ్ రాజకీయ విమర్శ చేయవచ్చు. కాని అంతకు ముందు తాను ఈ కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల గురంచి ఏమి చెప్పింది? అసలు ప్రభుత్వ వైద్యం గురించి ఎంత గంభీర ప్రకటనలు యువగళం సభలలో చేసింది గుర్తుకు తెచ్చుకుని బదులు ఇవ్వాలి కదా! అది చేయకుండా రెడ్‌బుక్ మూడులో పేజీలే అయ్యాయని, ఇంకా చాలా ఉన్నాయని చెప్పడం ద్వారా ఇది అహంభావ ప్రభుత్వమని, మూర్ఖంగా వ్యవహరిస్తోందన్న విమర్శలక ఆస్కారం ఇవ్వడం లేదా? ఇప్పుడే హుందాతనం లేకుండా ఇంత దారుణంగా ప్రవర్తిస్తుంటే, భవిష్యత్తులో పరిస్థితి ఇంకెంత ఘోరంగా ఉంటుందో అని జనం అనుకోరా? లోకేశ్ యువగళం టీమ్ ఒకటి ఉంటుందట. వీరు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు, ఆయా శాఖలను పర్యవేక్షిస్తుంటారట. విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ వారిని ఎలా వేధించాలి?వారి ఆర్థిఖ మూలాలను ఎలా దెబ్బకొట్టాలి? అధికారులను అడ్డం పెట్టుకుని ఎలా డబ్బులు సంపాదించాలి అన్నవాటిపైనే దృష్టి పెడుతుంటారట. ఇందులో ఏ మాత్రం వాస్తవం ఉన్నా అది లోకేశ్‌కే పెద్ద సమస్య అవుతుంది. సూపర్ సిక్స్, ఎన్నికల మానిఫెస్టోలని 150 హామీలను అమలు చేయలేదు.రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో దింపారు. ప్రజల జీవన ప్రమాణాలు దెబ్బతింటున్న సంగతి అందరికి తెలుస్తూనే ఉంది. అందువల్లే జనం ఈ కూటమి ప్రభుత్వాన్ని మెచ్చుకోవడం లేదు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భూ మాఫియా గురించి ఏమి చెప్పారు? పేకాట క్లబ్లుల గురించి ఏమని తెలిపారు.ఆయన చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వం ఏమి చర్య తీసుకుంది? అప్పుడప్పుడూ ఈ వ్యాఖ్యలు చేస్తున్నా, ప్రభుత్వం 15 ఏళ్లు ఉండాలని అంటూ పవన్ చిటికెలు వేస్తున్నారని సోషల్ మీడియాలో చెణుకులు వస్తున్నాయి. అది వేరే సంగతి. కేంద్ర హోం శాఖ నుంచి ఏపీకి ఏ రకమైన ఉత్తరం వచ్చింది? పది జిల్లాలలో నేరాల రేటు పెరిగిందని పోలీసు నివేదికే వెల్లడిస్తోంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్‌లు ఎన్నికైన నియోజకవర్గాలు ఉన్న జిల్లాలలోనే శాంతిభద్రతల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని ఈ నివేదిక చెబుతోంది కదా! టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలే ఈ అరాచకాలకు కారకులవుతున్నారని అనేక మంది వాపోతున్నారు. టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తమ పార్టీవారు ఎన్ని తప్పుడు పనులు చేస్తున్నది వివరంగా చెబితే ప్రభుత్వం ఏమి చేసింది? ఎదుటి వారిపై తప్పుడు కేసులు పెట్టడం, అదే టీడీపీ వారు ఎంత విశృంఖలంగా ప్రవర్తించినా వారి జోలికి వెళ్లకపోవడం వంటి ఘటనలు కోకొల్లలుగా జరుగుతున్నాయా? లేదా? ఇదంతా రెడ్‌బుక్ ప్రభావమని లోకేశ్ సంతోషిస్తే సంతోషించవచ్చు. అనుభవజ్ఞుడైన చంద్రబాబుకు దీని ఫలితం తర్వాత రోజుల్లో ఎలా ఉంటుందో తెలుసు.ఎవరు తప్పు చేసినా చర్య తీసుకోవడం ధర్మం. అలా కాకుండా ఏకపక్షంగా సాగుతున్న ఈ ప్రభుత్వ పాలనను జనం ఎందుకు మెచ్చుకుంటారు. అసలు ఈ ప్రభుత్వం ఆరంభమైందే ఈ రకమైన అరాచకాలతో. దానికి రెడ్‌బుక్ పేరుతో లోకేశ్ బృందం చేసిన నిర్వాకమే కారణమన్న సంగతి చంద్రబాబుకు తెలియకుండా ఉండదు. మొత్తమ్మీద జనం తన ప్రభుత్వాన్ని మెచ్చుకోకపోవడానికి ప్రధాన కారణం తన కుమారుడి లోకేశ్ పెత్తనం, పిచ్చి రెడ్‌బుక్ అరాచకాలు, హామీలు అమలు చేయయకుండా ప్రజలను భ్రమలలో ఉంచాలన్న యత్నం వంటివి అన్న సంగతిని చంద్రబాబు గుర్తించి సకాలంలో జాగ్రత్తపడకపోతే అదే రెడ్‌బుక్ ఏదో రోజు టీడీపీ నేతల మెడకే చుట్టుకుంటుందని పలువురు హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనా చంద్రబాబు తమ పాలనను జనం మెచ్చడం లేదన్న సంగతి తెలుసుకోవడం కొంతలో కొంత బెటర్ అని చెప్పాలి.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
టీడీపీకి తొత్తులుగా ఏపీ పోలీసులు: వరుదు కళ్యాణి
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో అధికార టీడీపీకి ఏపీ పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. మంత్రి సంధ్యా రాణి పీఏ సతీష్.. మహిళలను లైంగికంగా వేధించడం నిజం కాదా? అని ప్రశ్నించారు.ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘మంత్రి సంధ్యారాణి పీఏ సతీష్ వ్యవహారంలో బాధితురాలిపై తిరిగి కేసు పెట్టారు.. మంత్రి డైరెక్షన్లోనే ఆమెపై కేసు నమోదు చేశారు. అధికారం చేతిలో ఉంది కదా అని మంత్రి, సతీష్ ఇలా వ్యవహరిస్తున్నారు. ఒక మహిళను, మరొక మహిళా మంత్రి ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసం. టీడీపీ తొత్తుల్లాగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. మంత్రి పీఏ మహిళలను లైంగికంగా వేధించడం నిజం కాదా?.బాధితురాలి దగ్గర సతీష్ డబ్బులు తీసుకోవడం నిజం కాదా?. ఇప్పటికైనా సతీష్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ ఘటన పట్ల సీఎం చంద్రబాబు సిగ్గుతో తలదించుకోవాలి. మహిళలకు అన్యాయం జరిగితే తాట తీస్తానన్న పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు?. ఇంతా జరుగుతున్నా ఎందుకు స్పందించడం లేదు?. హోం మంత్రిగా అనిత విఫలమయ్యారు’ అని ఘాటు విమర్శలు చేశారు. -
పసుపు పోస్టింగులు
సాక్షి, అమరావతి: ఓ నిరుపేద వృద్ధురాలికి పింఛను ఇవ్వడానికి చేతులు రావు.. ఓ వికలాంగుడికి పింఛను మంజూరు చేయడానికి మనసొప్పదు.. పేద విద్యార్థికి ఫీజు కట్టడానికి డబ్బులుండవు.. రైతుకు మేలు చేసే ఆలోచనే ఉండదు.. కానీ, తన ప్రచారం కోసం.. తన కుమారుడి రాజకీయ లబ్ధి కోసం ఉన్నవీ లేనివీ కల్పించి పొగడ్తలతో ముంచెత్తడం, ప్రత్యర్థులపై గోబెల్స్ ప్రచారం చేయడం కోసం నెలనెలా వేలాది రూపాయలు చెల్లిస్తూ పార్టీ వారికి రకరకాల పోస్టులు కట్టబెడుతున్నారు సీఎం చంద్రబాబు. సోషల్, డిజిటల్ మీడియా పేరుతో వందల మందిని నియమించారు. చేసే పని చంద్రబాబును, ఆయన కుమారుడిని కీర్తించి, ప్రత్యర్థులపై రాళ్లేయడమే అయినా, వారికి చెల్లించేదంతా ఖజానా నుంచే. అంటే ప్రజాధనమే. ఇక కన్సల్టెంట్ల పేరుతో తన వారిని ఇబ్బడిముబ్బడిగా నియమించేస్తూ వారికీ ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నారు. సోషల్ మీడియా, యువ నిపుణులు, కన్సల్టెంట్ల పేరుతో చంద్రబాబు తన పార్టీకి చెందిన వారికి ఖజానా నుంచి భారీ వేతనాలతో పోస్టులు కట్టబెడుతున్నారు. నెల నెలా రూ.కోట్లలో చెల్లింపులు చేస్తున్నారు. గత ఏడాది కాలంలో ఇలా వందల మందిని నియమించారు. తాజాగా సోషల్ మీడియా పేరుతో ఇద్దరు ప్రచార కన్సల్టెంట్ల నియామకానికి ఏపీ డిజిటల్ కార్పొరేషన్ దరఖాస్తులను ఆహ్వానించింది. కాంట్రాక్టు విధానంలో నియామకానికి ఈ నెల 29వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. నెలకు రూ.75 వేల చొప్పున వేతనాలు చెల్లించనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే మంత్రుల పేషీల్లో 24 సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్స్, 24 సోషల్ మీడియా అసిస్టెంట్లు.. మొత్తం 48 పోస్టులను సృష్టించి, ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ద్వారా ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేశారు. తొలుత ఏడాది పాటు అంటూ ఆదేశాలు జారీ చేసి, ఇటీవల మంత్రులు ఎంతవరకు ఉంటే అంతవరకు వీరు కొనసాగుతారని చంద్రబాబు సర్కారు ఆదేశాలు జారీ చేసింది. సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు ప్రచారం కోసం ఏపీ డిజిటల్ కార్పొరేషన్లో భారీ వేతనాలతో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానంలో 85 మందిని నియమించారు. తాజాగా వారిని మరో రెండేళ్ల పాటు కొనసాగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వీరిలో 58 మందిని ఔట్సోర్సింగ్ విధానంలో నియమించారు. వీరిలో సోషల్ మీడియా ప్రత్యేక ఆఫీసర్‌కు నెలకు రూ.1.20 లక్షలు, 12 మంది కంటెంట్ డెవలపర్స్‌కు నెలకు రూ.75 వేల చొప్పున, 30 మంది సోషల్ మీడియా ఎనలిస్ట్లకు నెలకు రూ.30 వేల చొప్పున, 15 మంది డిజిటల్ ప్రచారకులకు నెలకు రూ, 25 వేల చొప్పున వేతనాలు చెల్లిస్తున్నారు. కాంట్రాక్టు విధానంలో నియమితులైన మరో 27 మందిలో డిజిటల్ డైరెక్టర్‌కు నెలకు రూ.1.75 లక్షల వేతనం చెల్లిస్తారు. క్రియేటివ్ కన్సల్టెంట్‌కు నెలకు రూ.1 లక్ష చొప్పున, మిగతా వారికి నెలకు రూ.60 వేల నుంచి రూ.80 వేల వరకు వేతనాలు చెల్లిస్తున్నారు. ప్రచార కార్యక్రమానికి ఇప్పటికే డిజిటల్ కార్పొరేషన్‌కు రూ.100 కోట్లు కేటాయించారు. ఇందులో ఇప్పటికే రూ. 74 కోట్లు ఖర్చు చేసేశారు. మరోపక్క పీ–4 పేరుతో అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకరు చొప్పున యువ నిపుణులంటూ 175 మంది టీడీపీ వారికి ఖజానా నుంచి భారీగా డబ్బు ముట్టజెపుతున్నారు. వీరికి ఏడాదికి రూ.12.60 కోట్లు చొప్పున నాలుగేళ్ల పాటు రూ.50.40 కోట్లు ప్రజాధనం చెల్లిస్తున్నారు. ఇందుకు ప్రభుత్వం జీవోలు కూడా జారీ చేసింది. ఏపీ స్టేట్ ప్లానింగ్ సొసైటీలో 71 మంది కన్సల్టెంట్లకు లక్షల్లో వేతనాలు ఇస్తూ నియమించారు. అలాగే రాష్ట్ర ఆదాయం పెంచే పేరుతో 11 మంది కన్సల్టెంట్లను నియమించి, రూ.3.28 కోట్లు చెల్లిస్తున్నారు. ఆర్థిక అభివృద్ధి బోర్డులో ఆరుగురు కన్సల్టెంట్లను రూ.3.66 కోట్లతో నియమించారు. మంత్రుల పేషీల్లో, డిజిటల్ కార్పొరేషన్లో, మిగతా చోట్ల నియమితులైన వారంతా టీడీపీకి చెందిన వారే. టీడీపీ ప్రచార దళమే. -
తుస్సుమన్న పీపీపీ బిడ్డింగ్.. జగన్ విజయానికి సూచిక
ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రయివేటు సంస్థలకు ఇవ్వడాన్ని మేం సహించం... దీనివెనుక పెద్ద ఆర్థిక కుంభకోణం ఉన్నది. ఎంతో కష్టపడి మేం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకొస్తే వాటిని చేతగాని చంద్రబాబు ప్రభుత్వం నడపలేక ప్రయివేటుకు ఇచ్చేస్తున్నది. దీన్ని మేం గట్టిగా వ్యతిరేకిస్తున్నాం. ఈ కుంభకోణాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి వారి మద్దతును కూడా కూడగట్టాం. కోటికిపైగా సంతకాలు సేకరించాం.. .. మళ్ళీ చెబుతున్నాం.. మా మాట కాదని ఎవరైనా మెడికల్ కాలేజీలు తీసుకోవడానికి బిడ్డింగ్ వేస్తె మాత్రం తీవ్ర పరిణామాలు తప్పదు. మేం అధికారంలోకి వస్తే మళ్ళీ కాలేజీలు వెనక్కి తీసుకోవడమే కాకుండా వారిపై చర్యలు తీసుకుంటాం అంటూ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ చేసిన ప్రకటన లాంటి హెచ్చరిక ప్రయివేటు మెడికల్ కాలేజీల గుండెల్లో రైళ్లు పరుగులెత్తించింది. అందుకేనేమో ప్రైవేట్ మెడికల్ కాలేజీల యాజమాన్యాలు.. కార్పొరేట్ సంస్థలు ఏవీ పెద్దగా ఈ అంశంలో ముందుకు రాలేదు.వాస్తవానికి మార్కాపురం.. మదనపల్లి, పులివెందుల, ఆదోని మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు ఇచ్చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిచింది. అయితే ఆదోని కాలేజీకి మాత్రమే కిమ్స్ యాజమాన్యం దరఖాస్తు చేసుకున్నది. అంటే మొత్తం నాలుగు కాలేజీలకు గాను ఒకటే దరఖాస్తు వచ్చింది. మిగతా మూడు కాలేజీలకు ఒక్క దరఖాస్తు కూడా రాకపోవడం గమనార్హం.ఈ పరిణామం చూస్తుంటే వైఎస్ జగన్ చెప్పిన మాట ప్రకారం అయన చేసి తీరతారన్న నమ్మకం, మళ్ళీ అయన వస్తే కాలేజీలు వెనక్కి తీసుకుంటారన్న భయం కలగలిపి వారిని ఈ బిడ్డింగ్ నుంచి వెనకడుగు వేసేలా చేసిందని అంటున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, తెలుగుదేశం ప్రభుత్వం పని తీరు.. వివిధ వర్గాల్లో వెల్లువెత్తుతున్న వ్యతిరేకత ఇవన్నీ క్రోడీకరించి చూసుకుంటున్న మెడికల్ వ్యాపారవేత్తలు ఈ విషయంలో ఒక అవగాహనకు వచ్చినట్లు భావిస్తున్నారు. రాష్ట్రంలో వైయస్ జగన్ ఎప్పుడు ఏ పర్యటన చేపట్టినా వెల్లువెత్తుతున్న జనాభిమానం ఒకవైపు.. అటు రైతులు,, మహిళలు.. విద్యార్థులు.. యువత వంటి వర్గాల్లో జగన్ పట్ల పెరుగుతున్న సానుకూలత, అదే తరుణంలో చంద్రబాబు ప్రభుత్వం పట్ల పెరుగుతున్న వ్యతిరేకతలను క్రోడీకరించి మెడికల్ వ్యాపారులు పరిస్థితిని అర్థం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఏడాదిన్నరలోనే కూటమి ప్రభుత్వం పట్ల ఇంత వ్యతిరేకత వస్తే రానున్న మూడేళ్ళలో ఇది మరింత పెరగడం తధ్యమని, అది కూటమి ఓటమిని, వైఎస్ జగన్ విజయాన్ని ఆపడం ఎవరి తరం కాదని భావించిన బిడ్డర్లు ఇక ఈ అంశం జోలికి పోకూడదని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. వైఎస్ జగన్ గెలుపు తథ్యం, అదే జరిగితే కోట్లు పెట్టుబడి పెట్టి తెచ్చుకున్న ఈ కాలేజీలను ప్రభుత్వం మళ్ళీ వెనక్కి తీసుకుంటే భారీగా నష్టపోతామన్న భయంతోనే వారు వెనకడుగు వేసినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తానికి మెడికల్ వ్యాపారులు ముందు చూపుతో వేసిన వెనకడుగు.. వైఎస్ జగన్ విజయానికి సూచనే అని తేల్చేశారు.:::సిమ్మాదిరప్పన్న -
ఇంకా ఎంతమంది జనసైనికులు లోకేష్ దెబ్బకి బలవ్వాలో?
సాక్షి, తాడేపల్లి: ఏ అంటే ఎటాక్.. పీ అంటే ప్రాపగాండ.. వెరసి చంద్రబాబు, లోకేష్‌లు ఏపీ అర్థమే మార్చేశారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అన్నారు. అనంతపురం కదిరి నియోజకవర్గ పరిధిలో జరిగిన ఘటన.. దానిని వైఎస్సార్సీపీకి ఆపాదించే ప్రయత్నంలో టీడీపీ అండ్ కో బోల్తాపడడంపై బుధవారం ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘‘ఆంధ్రా కిమ్ నారా లోకేష్. ఆయన రెడ్ బుక్ మంత్రిగా మారారు. అనంతపురం జిల్లాలో జరిగిన కుటుంబ గొడవని రాజకీయంగా వాడుకున్నారు. అజయ్ దేవ అనే జనసేన కార్యకర్తకి వైఎస్సార్సీపీ ముద్ర వేసి పోలీసులతో కొట్టించారు. సినిమాలో చూపించినట్టు రోడ్డుపై నడిపించారు. అసలు అజయ్ దేవతో మా పార్టీకి ఎలాంటి సంబంధం లేదు.... అజయ్ దేవ జనసేన కార్యకర్త. అతని గ్రామానికే చెందిన జనసేన ఎంపీటీసి అమర్ వాస్తవాన్ని చెప్పాడు. బాధితురాలు, అజయ్ సొంత వదిన మరిదిలే. వారి కుటుంబాల మధ్య చాలాకాలంగా గొడవలు ఉన్నాయి. నారా లోకేష్ అన్యాయంగా జనసేన కార్యకర్తని కొట్టించారు. యోగి ఆదిత్య నాధ్ ట్రీట్మెంట్ ఇస్తానంటూ పవన్ చెప్పిన 24 గంటల్లోనే లోకేష్ జనసేన మీదనే అమలు చేశారు. ఇంకా ఎంతమంది జనసైనికులు లోకేష్ దెబ్బకి బలవ్వాలో?. పిచ్చోడి చేతిలో రాయిలాగ లోకేష్ చేతిలో పదవి ఉంది. దీని వలన రాష్ట్రానికే ప్రమాదం’’ అని నాగార్జున యాదవ్ అన్నారు. -
మా అన్న పవన్ వీరాభిమాని: రజిత
సాక్షి, అనంతపురం: కదిరి ఘటనలో ఇంకో ట్విస్ట్ చేసుకుంది. అజయ్‌కు వైఎస్సార్సీపీతో ఎలాంటి సంబంధం లేదని స్వయంగా అతని సోదరి రజిత స్పష్టత ఇచ్చింది. ఇంతకు ముందు.. ఇదే విషయాన్ని ఎంపీటీసీ అమర్ సైతం ధృవీకరించారు. పోలీసుల చేతుల్లో దెబ్బలు తిన్న అజయ్ జనసేన అని ప్రకటించారు. దీంతో ఎల్లో మీడియా ఎలివేషన్లు కాస్త తుస్సుమనిపిస్తున్నాయి. ‘‘మా అన్నకు వైఎస్సార్సీపీతో సంబంధం లేదు. అతను ముందు నుంచే జనసేనలో ఉన్నాడు. మా అన్న మొదటి నుంచి పవన్ అభిమానే. అందుకే చెయ్యిపై పవన్ కల్యాణ్ టాటూ కూడా వేయించుకున్నాడు(పీఎస్ పీకే). ఎంపీటీసీ అమర్‌తో మా అన్నకు పదేళ్ల పరిచయం ఉంది. పక్కా జనసేన. మా అన్నని పాత కక్షలతోనే ఇరికించారు’’ అని రజిత ఓ వీడియో సందేశంలో క్లారిటీ ఇచ్చింది. మరోవైపు అజయ్‌పై ఫిర్యాదు చేసిన గర్భిణీ కుటుంబంతో పాత గొడవలు ఉన్నాయని.. తన తండ్రిని తిట్టిందన్న కోపంతో ఆమెను అజయ్ తోసేశాడని స్థానికులు చెబుతుతుండడం గమనార్హం.వైఎస్సార్సీపీపై బురదజల్లే ప్రయత్నంలో పచ్చ మీడియా, పోలీసులు చేసిన ప్రయత్నం ఎంత దారుణంగా ఉందో తెలుస్తోంది. కదిరి తనకల్లు మండలం ముత్యాలవాండ్లపల్లిలో వైఎస్ జగన్ బర్త్‌డేనాడు పటాకులు పేలుస్తున్న వాళ్లను ఓ గర్భిణిపై మందలించిందని.. అందుకు ఆమెను కాలితో తన్ని దాడి చేశాడని.. దీంతో ఆమె ఆస్పత్రిపాలై కడుపులో బిడ్డ కదలికలు సైతం లేవని.. పోలీసులు అతన్ని తమశైలిలో బుద్ధి చెప్పి(కోటింగ్) నడిపించారంటూ అజయ్ దేవ్ గురించి కూటమి అనుకూల మీడియా.. సోషల్ మీడియాలో వరుస కథనాలు వచ్చాయి. ఏపీలో ఆదిత్యా యోగినాథ్ ట్రీట్మెంట్ అంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్ ఇచ్చిన స్టేట్మెంట్.. అజయ్ వైఎస్సార్సీపీ కార్యకర్తే అంటూ ఎల్లో మీడియా కలరింగ్.. అది నమ్మి కదిరి పోలీసులు, ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో అజయ్‌ను అదుపులోకి తీసుకోవడం.. నాటకీయ పరిణామాలను తలపించింది. చివరకు.. అజయ్ దేవ్ తమ పార్టీ కార్యకర్తేనని స్థానిక జనసేన ఎంపీటీసీ అమర్ బహిరంగంగా అంగీకరించడంతో ఈ ఎపిసోడ్ మరో మలుపు తిరిగినట్లైంది.ప్రత్యక్ష సాక్షులు, స్థానికులు చెప్పినదాని ప్రకారం.. ఈనెల 21వ తేదీన వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు ముత్యాలవాండ్లపల్లిలో ఘనంగా జరిగాయి. వైఎస్సార్ సీపీ నేతలు కేక్ కట్ చేసే సమయంలో అటుగా వెళ్తున్న జనసేన నేత అజయ్ కూడా కేక్ తిన్నాడు. కాస్త ముందుకు వెళ్లిన తర్వాత సంధ్యారాణితో అజయ్‌కి మాటామాటా పెరిగి గర్భిణి పై చేయి చేసుకున్నారు. ఈ ఘటనను ఆసరాగా చేసుకుని టీడీపీ నేతలు, ఎల్లో మీడియా ప్రతినిధులు రెచ్చిపోయారు. అజయ్ దేవ్ వైఎస్సార్ సీపీ నేత అని.... గర్భిణి పై దాడి చేశారంటూ అబద్ధాలు ప్రచారం చేశారు. ఆగమేఘాలపై స్పందించిన మంత్రి నారా లోకేష్ వెనుకాముందు ఆలోచించకుండా వైఎస్సార్సీపీపై అభాండాలు వేశారు. విచారణ సందర్భంగా అజయ్ దేవ్ జనసేన నేత అని కదిరి పోలీసులు గుర్తించారు. అయితే... మంత్రి నారా లోకేష్, ఎల్లో మీడియా ఆరోపణలు నిజం చేసే బాధ్యత తీసుకున్న పోలీసులు అజయ్‌ని ఊరేగించారు. ఇప్పుడు.. అజయ్ జనసేన కండువాతో ఉన్న ఫోటోలు, పవన్ కళ్యాణ్ అభిమానులతో కలిసి సంబరాలు చేసుకున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. అటు జనసేన అమర్ క్లారిటీ ఇవ్వగా.. ఇటు ఫేక్ ప్రచారంపై అజయ్ సోదరి రజిత భగ్గుమంది. -
ఎల్లో మీడియా ఎఫెక్ట్.. జనసేన కార్యకర్తకు పోలీసుల కోటింగ్!
సాక్షి, శ్రీ సత్యసాయి జిల్లా: వైఎస్సార్సీపీపై బురదజల్లాలని పచ్చ మీడియా, పోలీసులు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. కదిరిలో గర్భిణిపై దాడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గర్భిణిపై దాడి చేసిన అజయ్ దేవ్ వైఎస్సార్సీపీకి చెందిన కార్యకర్త కాదని.. అతడు జనసేన యాక్టివ్ కార్యకర్త అని ఆ పార్టీ నేత అంగీకరించారు. దీంతో, ఈ కేసులో మరో టర్న్ తీసుకుంది.వివరాల ప్రకారం.. శ్రీసత్యసాయి జిల్లాలో కదిరి నియోజకవర్గం తనకల్లు మండలం ముత్యాలవాండ్లపల్లిలో గర్భిణిపై అజయ్ దేవ్ దాడి చేశాడు. దీంతో, నిందితుడు అజయ్.. వైఎస్సార్సీపీ కార్యకర్త అంటూ ఎల్లో మీడియా కలరింగ్ ఇచ్చింది. తప్పుడు కథనాలను ప్రచురించింది. పచ్చ మీడియా ప్రచారాన్ని నమ్మిన కదిరి పోలీసులు, ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో అజయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్త అని భావించి.. అతడిపై పోలీసులు తమదైన మార్క్‌తో కోటింగ్ ఇచ్చారు. అనంతరం, పోలీసుల విచారణలో తీవ్రంగా గాయపడిన నిందితుడిని కదిరి పట్టణంలో ఊరేగింపుగా తీసుకెళ్లారు. అంతేకాకుండా.. అతడిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. అయితే, నిందితుడు అజయ్ జనసేనకు చెందిన వ్యక్తి అని తాజాగా వెలుగులోకి వచ్చింది. అజయ్ దేవ్ తమ పార్టీ కార్యకర్తేనని స్థానిక జనసేన ఎంపీటీసీ అమర్ బహిరంగంగా అంగీకరించారు. అజయ్‌కి వైఎస్సార్సీపీకి సంబంధం లేదన్నారు. అజయ్ చేతిపై పవన్ కల్యాణ్ పచ్చబొట్టు కూడా ఉందని క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా.. పవన్ కళ్యాణ్ అభిమాని అంటూ అజయ్ దేవ్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక, ఏదైనా ఘటన జరిగిన వెంటనే నిందితులను వైఎస్సార్సీపీ కార్యకర్తలుగా ఎల్లో మీడియా, పోలీసులు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని పార్టీ నేతలు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. నిందితుడు జనసేన కార్యకర్త అజయ్‌పై ఫిర్యాదు చేసిన గర్భిణీ.. ఇతనికి దాయాదులని, తన తండ్రిని తిట్టిందన్న కోపంతో ఆమెను అజయ్ తోసేశాడని స్థానికులు చెబుతున్నారు. -
కల్లలైన బాబు ‘రియల్’ మాటలు!
ఏపీలో 2024 ఎన్నికలకు ముందు టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రచారం చేసిన విషయం ఒకటుంది. వైఎస్ జగన్ ప్రభుత్వం కొనసాగితే రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకోదు అని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఆస్తుల విలువలు పెరగవని ప్రజలు, రైతులను బెదిరించారు. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులను కప్పిపుచ్చి భూముల విలువలు పడిపోయాయంటూ ఎల్లోమీడియా కూడా తన కథనాలలో విషం చిమ్మింది. ఏదైతేనేం.. ఎన్నికల్లో ఈ కూటమి అధికారం దక్కించుకుంది. ఇంకేం.. మా భూములు బంగారమవుతాయని అందరూ ఆశించారు. ఇరవై నెలలు గడిచిపోయింది కానీ.. వీరి ఆశలు మాత్రం పెద్దగా నెరవేరలేదు. పైగా.. జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడే రియల్ ఎస్టేట్ లావాదేవీలు మెరుగ్గా సాగాయని గణాంకాలు చెబుతున్నాయి.వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ప్రభుత్వానికి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా గణనీయమైన ఆదాయం సమకూరింది. 2023-24లో 22.25 లక్షల డాక్యుమెంట్లు రిజిస్టర్ కాగా.. రూ.9546 కోట్ల ఆదాయం సమకూరింది. చంద్రబాబు అధికారంలో ఉన్న 2024-25లో మాత్రం ఈ సంఖ్యలు పడిపోయాయి. ఆదాయం రూ.8843 కోట్లు మాత్రమే. 2025-26లో రూ.10169 కోట్ల లక్ష్యం పెట్టుకున్నా.. అక్టోబర్ నాటికి అయ్యింది రూ.ఏడు వేల కోట్లే. కూటమి ప్రభుత్వం 2024-25లోనూ రూ.11997 కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకుంది కానీ.. ఈ ఏడాది దీన్ని రూ.10169 కోట్లకు తగ్గించుకుంది. ఏటా ఆయా పద్దుల కింద ఆదాయం పదిశాతం వరకూ పెరిగేలా ప్రభుత్వాలు లక్ష్యాలు పెట్టుకుని బడ్జెట్ తయారు చేస్తుంటాయి. ఏపీలో మాత్రం లక్ష్యాన్ని తగ్గించుకున్నారన్న మాట.రాష్ట్రవ్యాప్తంగా భూముల విలువను ఏభై శాతం మేర పెంచినా ఆశించినంత ఆదాయం రాకపోవడం ఆందోళన కలిగించేదే. వేల కోట్లు అప్పు తెచ్చి మరీ రాజధాని అమరావతిలో ఖర్చు చేస్తున్నా ప్రజలలో నమ్మకం కలగడం లేదు. పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్కడి తమ వెంచర్ల భవిష్యత్తు అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. ఉద్యోగులు చాలామందికి నెలలకొద్దీ జీతాలు కూడా అందడం లేదని ఈ రంగంలో పని చేస్తున్న ఉద్యోగి ఒకరు చెప్పడం గమనార్హం. ఇల్లు కట్టుకుంటున్నాను అంటూ చంద్రబాబు హడావుడి చేసినా ఫలితం లేకపోయింది. ఇవన్నీ చూస్తుంటే.. కూటమి ప్రభుత్వం వస్తే భూముల విలువలు బాగా పెరుగుతాయన్న ప్రచారం రాజకీయ లబ్ది కోసం మాత్రమే చేసిన అబద్ద ప్రచారం అని స్పష్టమవుతుంది.జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎంతో కొంత సాగేది. విశాఖపట్నం వంటి చోట్ల జోరుమీద ఉండేది కూడా. కానీ, చంద్రబాబు ప్రభుత్వం పరిశ్రమలకు 99 పైసలకే భూములు ఇచ్చేయడం మొదలుపెట్టడంతో పరిస్థితి మారిపోయింది. ఈ రకమైన చర్యలతో ప్రభుత్వం విశాఖ ఇమేజీని ప్రభుత్వం దెబ్బ తీస్తోందన్న భావన ఏర్పడింది అంటున్నారు. జగన్ ప్రభుత్వం రామాయపట్నంలో ఓడరేవు నిర్మాణం ప్రారంభించగానే ఆ చుట్టుపక్కల భూముల విలువలు బాగా పెరిగాయని అక్కడి రైతులు తెలిపారు. అయితే, ఏడాదిన్నరగా ఈ ప్రాజెక్టు వేగం మందగించింది. ఫలితంగా రియల్ ఎస్టేట్ వ్యాపారమూ తగ్గిపోయే పరిస్థితి. విజయవాడ పటమట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జగన్ టైమ్‌లో రోజుకు 150 రిజిస్ట్రేషన్లు జరిగితే, ప్రస్తుతం అవి 80 దాటడం లేదట. తూర్పు గోదావరి జిల్లాలో 2023-24లో సుమారు 129355 డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యాయి. కూటమి వచ్చాక ఏడాది కాలంలో ఇది 61597 డాక్యుమెంట్లకు పరిమితమైంది. కడపలో గతంలో రోజుకు 300 రిజిస్ట్రేషన్లు జరిగితే ఇప్పుడవి ఏభై - అరవై వరకే ఉంటున్నాయి.రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతింటే అనేక అనుబంధ పరిశ్రమలు దెబ్బతిని ఉద్యోగవకాశాలు తగ్గిపోతాయి. ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు అష్టకష్టాలు పడుతున్నారు. సిమెంట్, ఐరన్, కలప పెయింటింగ్, విద్యుత్, ప్లంబింగ్ తదితర రంగాల వారు ఇబ్బంది పడుతున్నారు. జగన్ టైమ్‌లో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాలు చేపట్టడం, నాలుగు కొత్త పోర్టులు, పది ఫిషింగ్ హార్బర్లు, 31 లక్షల ఇళ్ల స్థలాలను పేదలకు కేటాయించి, సుమారు 21 లక్షల ఇళ్ల నిర్మాణం ఆరంభించడం ప్రతి గ్రామంలో సచివాలయం, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్ తదితర భవనాల నిర్మాణాలు చేపట్టారు. ఇవన్ని రియల్ ఎస్టేట్ లావాదేవీలు కొనసాగడానికి ఉపకరించాయి. అయినా అప్పట్లో ఎల్లో మీడియా నెగిటివ్ ప్రచారాన్ని సాగించేది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఈ పనులు ఏవీ సజావుగా సాగడం లేదు. అమరావతి తప్ప మిగలిన రాష్ట్రంలో ఎక్కడా కొత్త నిర్మాణం చేపట్టినట్లు కనిపించదు. ఫలితంగా అనంతపురం సహా వివిధ జిల్లాలలో పేదలు, కూలీలు వలసలు వెళుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గిట్టుబాటు ధరలు లేక రైతుల పరిస్థితి కూడా అగమ్యగోచరంగా తయారైంది.తెలంగాణలో కూడా రియల్ ఎస్టేట్ ఆశించిన రీతిలో పెరగలేదు. కానీ, భూముల వేలంపాటల్లో మంచి రేట్లు వస్తుండటంతో ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయం సమకూరుతోంది. కోకాపేట పరిసరాలలో ఇటీవల జరిగిన వేలంపాటలో ప్రభుత్వానికి రూ.మూడు వేల కోట్లు వచ్చాయి. అలాగే కూకట్పల్లి హౌసింగ్ బోర్డుకు చెందిన 300 ఎకరాల స్థలాల ద్వారా రూ.ఎనిమిది వేల కోట్ల ఆదాయాన్ని అంచనా వేస్తున్నారు. మరోవైపు విశాఖలో ప్రభుత్వ భూములను అణా, బేడాకు చంద్రబాబు ప్రభుత్వం పందారం చేస్తోంది. సత్వా అనే రియల్ ఎస్టేట్ కంపెనీ హైదరాబాద్‌లో 2020లో రూ.600 కోట్లు ఖర్చు చేసి 20 ఎకరాలు కొనుగోలు చేసింది. వేలం పాట ద్వారా ఎకరాకు రూ.150 కోట్లు పెట్టి మరీ కొనుక్కుంది. కానీ ఏపీకి వచ్చేసరికి సత్వా కంపెనీకి ఏభై కోట్ల విలువైన భూమిని రూ.1.5 కోట్లకే కట్టబెడుతున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెబుతున్నారు. చంద్రబాబుకు సన్నిహితుడన్న పేరు ఉన్న యూసఫ్ అలీకి చెందిన లూలూ గ్రూపు అహ్మదాబాద్ లో సుమారు 16.35 ఎకరాల భూమిని రూ.519 కోట్లకు కొనుగోలు చేస్తే ఏపీ ప్రభుత్వం విజయవాడ, విశాఖల్లో నామమాత్రపు లీజుకు భూములు ఇచ్చేసింది.అందువల్లే ఈ ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ఆదాయ అంచనాలు దారుణంగా బోల్తా పడ్డాయి. వేర్వేరు మార్గాల ద్వారా మొత్తం రూ.2.18 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తే.. నవంబర్ నాటికి కేంద్రం ఇచ్చే గ్రాంట్లతో కలిపి రూ.1.05 లక్షల కోట్లు మాత్రమే వచ్చింది. ఇందులో రియల్ ఎస్టేట్ ద్వారా అందిన రూ.7132 కోట్లు ఆశించిన మొత్తంలో 54 శాతమే కాగ్ వెల్లడించింది. రెవెన్యూ లోటు మాత్రం వేగంగా పెరుగుతూ 54వేల కోట్లకు చేరింది. ఈ అంశాలన్నిటిని పరిగణనలోకి తీసుకుంటే ఎపిలో రియల్ ఎస్టేట్ రంగం ఆశించిన రీతిలో పుంజుకోకపోవడానికి తన ప్రభుత్వ అసమర్థతే కారణం అని చంద్రబాబు అంగీకరిస్తారా?.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఇది అసలు నిజం.. వైఎస్ జగన్ సంచలన ట్వీట్
సాక్షి, తాడేపల్లి: టీడీపీ, జనసేన అబద్ధాల దుష్ప్రచారాన్ని ఎక్స్ వేదికగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బట్టబయలు చేశారు. టీడీపీ, జనసేన అసత్య ప్రచారాన్ని మరోసారి ఆయన ఎండగట్టారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై కూటమి సర్కార్ చేస్తోన్న తప్పుడు ప్రచారాన్ని వైఎస్ జగన్ బయటపెట్టారు. ఆర్బీఐ గణాంకాలను చూపుతూ కూటమి ప్రభుత్వానికి వైఎస్ జగన్ సూటి ప్రశ్నలు వేశారు.‘‘వైఎస్సార్సీపీ హయాంలో ఏపీ బ్రాండ్ దెబ్బతిందంటూ తప్పుడు ప్రచారం చేశారు. అదే నిజమైతే ఆర్బీఐ విడుదల చేసిన గణాంకాలు భిన్నంగా ఎందుకున్నాయి?. ఆర్బీఐ గణాంకాలు చూస్తే వైఎస్సార్సీపీ పనితీరు ఏంటో తెలుస్తుంది...2019-24 మధ్య ఉత్పత్తి రంగంలో ఏపీ దక్షిణ భారత్‌లో నెం.1. యావత్ దేశంలోనే ఐదో స్థానంలో నిలిచింది. 2019-24 మధ్య ఏపీ పారిశ్రామిక రంగంలో పురోగతి. దక్షిణ భారత్‌లో నెం.1, యావత్ దేశంలో 8వ స్థానం. మరి దీన్ని బ్రాండ్ ఏపీ నాశనం అంటారా?. లేక సమర్థవంతమైన నాయకత్వం ద్వారా రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందింది అంటారా? సత్యమేవ జయతే‘‘ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. 𝗧𝗗𝗣 – 𝗝𝗦𝗣 𝗹𝗶𝗲𝘀 𝗲𝘅𝗽𝗼𝘀𝗲𝗱 TDP and JSP, before and after forming Government persistently made the following allegations-Brand AP was destroyed owing to YSRCP Government-Investors abandoned AP owing to YSRCP Government-No industrial growth was witnessed during… pic.twitter.com/KvB40DJWGL— YS Jagan Mohan Reddy (@ysjagan) December 23, 2025 -
పవన్ కల్యాణ్ భయం అదే: అంబటి
సాక్షి, తాడేపల్లి: పవన్ ప్రసంగాలు పరిశీలిస్తే విచిత్రంగా ఉందని.. ఓపెనింగ్‌లో ఓవరాక్షన్ చేస్తారు.. ఇంటర్వెల్లో ఇరిటేషన్ అవుతారు.. కన్ క్లూజన్లో కన్ఫ్యూజ్ అవుతారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు చురకలు అంటించారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పవన్ ఏం మాట్లాడుతున్నాడో ఆయనకీ అర్థం కాదని.. వినేవాళ్లకు అంతకన్నా అర్ధం కాదంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు.‘‘వైఎస్సార్సీపీ పార్టీని, పార్టీ నాయకత్వంపై తీవ్రమైన పదజాలం వాడుతున్నారు. ఎందుకు పవన్ అంతలా ఊగిపోయి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు. ఎవరినో బెదిరించాలనే భావన పవన్ మాటల్లో కనిపిస్తుంది. పవన్ మిమ్మల్ని ఎవరైనా వైఎస్సార్సీపీ వాళ్లు ఏమైనా అన్నారా.. అంటే చెప్పండి. మిమ్మల్ని తిట్టింది తెలంగాణ వాళ్లు.. వైఎస్సార్సీపీ వాళ్లు కాదు. ఎందుకు వైఎస్సార్సీపీపై తీవ్రమైన పదజాలంతో ఊగిపోతున్నారు’’ అంటూ అంబటి దుయ్యబట్టారు.‘‘కూటమి అసమర్థత వల్ల అనేకమైన ఇష్యూలు వచ్చాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం, చంద్రబాబు ప్రైవేట్‌పరం చేయాలని చూస్తున్నారు. భవిష్యత్‌లో లక్షల కోట్ల విలువ చేసే మెడికల్ కాలేజీలను తన మనుషులకు చంద్రబాబు కట్టబెట్టేస్తున్నాడు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ స్కామ్. కోటి మందికి పైగా ప్రజలు కోటి సంతకాలు చేశారు. మెడికల్ కాలేజీల అంశాన్ని డైవర్ట్ చేయడానికే పవన్ కళ్యాణ్ ఇప్పుడు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. మెడికల్ కాలేజీల్లో స్కామ్ జరుగుతుంది..ఈ స్కామ్‌లో ఎవరైనా చేరితే.. చంద్రబాబు, లోకేష్‌కు కిక్ బ్యాగ్‌లు ఇస్తే చట్టం ముందు శిక్షిస్తామని చెప్పాం. విచారణ క్రమంలో లోపల కూడా వేస్తామని చెప్పాం. స్కామ్ ఉందని మేం చెబుతున్నాం. మమ్మల్నే లోపల వేస్తారా.. మీ సంగతి తేలుస్తామని పవన్ మాట్లాడుతున్నాడు. చంద్రబాబు మాట్లాడకుండా పవన్‌తో మాట్లాడిస్తున్నాడు. ఎందుకు మీకంత భయం?. 15 ఏళ్లు కలిసే ఉంటామని చెబుతున్నావ్.. కలిసుంటే మంచిదేగా వద్దని ఎవరు చెప్పారు?. 15 ఏళ్లు అగ్రిమెంట్ రాసే పార్టీ దేశంలో ఎక్కడా లేదు. పవన్ కళ్యాణ్ పార్టీ తప్ప. 15 ఏళ్లు కలిసి ఉండేది రాష్ట్రానికి మంచి చేయడానికి కాదు. వైఎస్ జగన్ అధికారంలోకి వస్తాడని మీకు భయం..ఏమీ లేకపోయినా మద్యం స్కామ్ పేరుతో ఎంతమందిని లోపలేశారు. విచారణల పేరుతో లడ్డూ వ్యవహారంలో మీరు చేస్తున్నది ఏంటి?. మెడికల్ కాలేజీల స్కామ్‌లో పవన్‌కు వాటా ఉంది కాబట్టే ఊగిపోతున్నాడు. ప్రజలు మెచ్చిన రోజున వైఎస్సార్సీపీని అధికారంలోకి రాకుండా ఎవరూ అడ్డుకోలేరు. అవినీతి, లంచాలకు తావులేకుండా పాలన ఉండాలన్నారు. డబ్బులు లేనిదే లోకేష్ ట్రాన్స్ఫర్లు చేస్తున్నారా?. సీజ్ ద షిప్ అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ బియ్యం అమ్మకం ఆగిందా పవన్ సమాధానం చెప్పాలి..కాకినాడ పోర్టు నుంచి బియ్యం బ్రహ్మాండంగా వెళ్లిపోతోంది. మధ్యవర్తులు డబ్బులు సంపాదించుకుంటున్నారు. బియ్యం డబ్బుల్లో మీకు వస్తుందిగా. చక్కగా డబ్బు తీసుకుని సర్దుకుంటున్నారుగా. మీరు నీతి నిజాయితీ గురించి మాట్లాడుతున్నారు. ఎన్ని సంవత్సరాలైనా మీరు చంద్రబాబుకు కాపు కాయండి మాకేం అభ్యంతరం లేదు. ఎన్నికల్లో ఓడినా .. గెలిచినా జగన్ సింగిల్‌గానే వస్తారు. పదవుల కోసం ఎవరి వద్దా దేహీ అని మేం అడుక్కోం. పవన్ మాట్లాడితే బంధు ప్రీతి లేదు.. అవినీతి సహించను అంటారు. మీ అన్నగారికి ఎమ్మెల్సీ ఎందుకు?...కులతత్వానికి వ్యతిరేకమంటారు. జనసేనలో రెండు మంత్రి పదవులు ఓసీలకే ఎలా ఇచ్చారు?. బీసీలు, ఎస్సీలు మీ పార్టీకి అవసరం లేదా?. పవన్ కళ్యాణ్ సోదరుడే ఎమ్మెల్సీ అవ్వాలా?. క్యాబినెట్లో పవన్ కళ్యాణ్ సోదరుడికి మంత్రి ఇస్తామని చంద్రబాబు రాసిచ్చాడు. చంద్రబాబు ఈ మాట చెప్పి ఏడాదైంది.. ఏమైంది మంత్రి పదవి. దేహీ అని పదవులు అడుక్కునే మీరు మమ్మల్ని దూషించడమా?. ప్రైవేట్ పంచాయతీలు చేస్తున్నారని డీఎస్పీ జయసూర్య పై ఫిర్యాదు చేశావ్ ఏమైంది?..నీ ఫిర్యాదు ఎవరైనా పట్టించుకున్నారా...ఆ డీఎస్పీపై చర్యలు తీసుకున్నారా?. రోమాలు తీస్తాం.. అరచేతిలో గీతలు చెరిపేస్తాం లాంటి పిచ్చిమాటలను పవన్ మానుకోవాలి. నా ఇష్టం నేను చేస్తాను అంటే కచ్చితంగా అనుభవిస్తారు. మాట్లాడితే ప్రాణత్యాగం చేయడానికి సిద్ధం అంటాడు. రాష్ట్రంలో అనేక సమస్యలున్నాయి మీకు చేతనైతే వాటిపై పోరాడండి. చంద్రబాబు, లోకేష్ అవినీతిలో వాటా లేదని పవన్ ప్రమాణం చేయగలరా?. పవన్ జలధారపై ప్రమాణం చేసి చెప్పండి... నేను క్షమాపణ చెబుతా. జనసేన పార్టీ కార్యాలయం క్రమంగా పెరిగిపోతోంది. పార్టీ కార్యాలయం కోసం 20 ఎకరాలు కొన్నారు. మీ సినిమాలన్నీ ప్లాపులవుతుంటే అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది..చంద్రబాబు, లోకేష్ నెలకు ఇంత అని లెక్కగట్టి పవన్ కు ఇస్తున్నారు. పవన్ వాళ్ల దగ్గర మేస్తున్నాడు. మాపై కూస్తున్నాడు. మీ ఎమ్మెల్యే పంతం నానాజీ ఓ ప్రొఫెసర్‌ను కొట్టాడు అది రౌడీయిజం కాదా? మాట్లాడితే పీకుతాం పీకుతాం అని మాట్లాడుతున్నారు. పవన్ ఏంటీ ఈ పీకుడు లాంగ్వేజ్. నువ్వు మాత్రం చంద్రబాబు, లోకేష్ దగ్గర కమిషన్లను స్ట్రాపెట్టి మరీ పీకేస్తున్నావ్. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎవరిని ఏం పీకలేరు...ఏపీలో అనేక స్కామ్‌లు జరుగుతున్నాయి. అన్ని స్కాములపై వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక చట్టప్రకారం లోపలేస్తాం. అన్ని స్కాముల పై విచారణ జరుగుతుంది. మీ రెడ్ బుక్‌ను మా కుక్క కూడా లెక్కచేయదు. రెడ్ బుక్ సాంప్రదాయాన్ని తెచ్చింది మీరే. మీరు తెచ్చిన రెడ్ బుక్ సాంప్రదాయానికి మీరూ బలయ్యే పరిస్థితులు వస్తాయేమో ఆలోచించండి. రెడ్ బుక్ సంప్రదాయాన్ని సమాజానికి ఎక్కిస్తున్నారు. పిల్లకాకి లోకేష్‌కు ఏం తెలుసు ఉండేలు దెబ్బ. ముందుంది మొసళ్ల పండుగ’’ అంటూ అంబటి రాంబాబు హెచ్చరించారు. -
‘పవన్ అంటే.. ఓవరాక్షన్.. ఇరిటేషన్.. కన్ఫ్యూజన్’
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబుకి రాజకీయంగా ఇబ్బంది వచ్చినప్పుడు పనిచేసే పొలిటికల్ టూల్లా పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నాడని.. అందుకోసం ఆయన దగ్గర మేత తిని వైఎస్సార్సీపీ గురించి నోటికొచ్చినట్టు కూతలు కూస్తున్నాడంటూ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ పరిశీలకుడు పోతిన మహేష్ మండిపడ్డారు.మంగళవారం ఆయన తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం రాష్ట్ర ప్రజలందరికీ చేరిందని, దాన్నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే పవన్ కళ్యాణ్ సమయం, సందర్భం లేకుండా మధ్యలో వచ్చి వైఎస్సార్సీపీ నాయకుల గురించి నోటికొచ్చినట్లు మాట్లాడి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడని ధ్వజమెత్తారు.ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఆయనకే స్పష్టత ఉండదని, సినిమా భాషలో ఆయన మైండ్ సెట్ గురించి చెప్పాలంటే ఓపెనింగ్‌లో ఓవరాక్షన్, ఇంటర్వెల్లో ఇరిటేషన్, క్లైమాక్స్‌లో కన్ఫ్యూజన్ అన్నట్టుగా ఉందంటూ పోతిన మహేష్ దుయ్యబట్టారు. సింగపూర్‌లో అమలు చేసే కేనింగ్ పనిష్మెంట్ విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్న జనసేనలో ఎమ్మెల్యేల దగ్గర నుంచే మొదలుపెట్టాలని సూచించారు. చంద్రబాబుకి సపోర్టు చేయడానికి జనసేన పార్టీ పెట్టి ఆ పార్టీ కార్యకర్తలతో టీడీపీ జెండాలు మోయిస్తున్న పవన్ కళ్యాణ్‌కి ఆత్మాభిమానం ఉందా అంటూ ఆయన ప్రశ్నించారు.పిల్లనిచ్చిన మామ నుంచి తెలుగుదేశం పార్టీని లాక్కున్న చంద్రబాబు, చిరంజీవి ద్వారా సినిమాల్లోకి ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్.. సొంతంగా పార్టీ పెట్టి సొంతంగా అధికారంలోకి తీసుకొచ్చిన వైఎస్ జగన్ పేరెత్తే అర్హత కూడా లేదని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్న ఈ 18 నెలల కాలంలో ప్రజల కోసం తాను చేసిన ఒక్క మంచి పని ఉన్నా చూపించాలని పవన్ కళ్యాణ్‌కు సవాల్ విసిరారు. ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడుస్తున్నా, 18 లక్షల మంది జాబ్ కార్డులు తీసేసినా నోరు మెదపని పవన్ కళ్యాణ్ ప్రజల బాగోగులు అంటూ డ్రామాలాడుతున్నారని, ముందుగా తన శాఖలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని పోతిన మహేష్ హితవు పలికారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..పాలన చేతకాక వైఎస్సార్సీపీని తిడుతున్నాడు.. వైఎస్ జగన్ ప్రజా సమస్యలపై మాట్లాడుతుంటే చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు మాత్రం వైఎస్సార్సీపీ నాయకులను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. వారి ప్రవర్తన చూస్తుంటే అధికారంలో ఉన్నది టీడీపీ-జనసేన కూటమి ప్రభుత్వమా లేక వైఎస్సార్సీపీనా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. వైఎస్ జగన్ ప్రెస్‌మీట్ పెట్టి లేదా ప్రజల్లోకి వచ్చినప్పుడు ప్రజా సమస్యల గురించి ప్రభుత్వ వైఫల్యాల గురించి మాట్లాడిన సందర్భంలో పవన్ కళ్యాణ్ ఏనాడూ ఒక్కదానికీ సమాధానం చెప్పకపోగా చంద్రబాబుకి వకాల్తా పుచ్చుకుని మరో 15 ఏళ్లు ఆయనే సీఎంగా ఉండాలని కోరడం చూస్తుంటే ఆయనకు ప్రజా సమస్యలకు పరిష్కారం కావాలా?. చంద్రబాబు అధికారంలో ఉండటం కావాలో అర్థం కావడం లేదు. చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ పొలిటికల్ టూల్ లా మారిపోయాడు. ఆయనకు ఎప్పుడు సమస్య వస్తే అప్పుడు పవన్ బయటకొస్తాడు. ఒకపక్క సొంత పార్టీని, ఇంకోపక్క ప్రజలను మభ్యపెడుతున్నాడు. పాలన చేయడం చేతకాకనే ఇలా వైఎస్సార్సీపీని తిట్టి పబ్బం గడుపుతున్నాడు.చంద్రబాబు ఆదేశాలతో డైవర్షన్ పాలిటిక్స్మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంలో కూటమి ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయింది. అధికారంలో వస్తే మెడికల్ కాలేజీలు కట్టబెట్టేలా చంద్రబాబు ఎన్నికలకు ముందే ఒక ఒప్పందం చేసుకుని ఆ విధంగా ఇప్పుడు ముందుకుపోతున్నాడు. మళ్లీ అధికారంలోకి రావడం కలలో మాటేనని వారికి అర్థమైంది అందుకే ప్రైవేటీకరణపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అవుతున్నా ఆయన వెనక్కి తగ్గకుండా దోచుకోవడమే పనిగా పెట్టుకున్నాడు. ఈ అంశం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు పవన్ కళ్యాణ్ వైఎస్సార్సీపీ నాయకులపై బూతులతో విరుచుకు పడుతున్నాడు.చంద్రబాబు ఆదేశాలతోనే పవన్ కళ్యాణ్ ఇలా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వద్దని కోటికి పైగా సంతకాలు చేసిన ప్రజలను అవమానించేలా పవన్ కళ్యాణ్ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నాడు. ప్రశ్నిస్తానని పార్టీ పెట్టిన వ్యక్తి ప్రశ్నించడమే మర్చిపోయాడు. ఆయన డ్రామాలు గుర్తించలేని స్థితిలో ప్రజలున్నారని పవన్ కళ్యాణ్ భ్రమపడుతున్నాడు. -
పులివెందులలో వైఎస్ జగన్ ప్రజాదర్బార్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందులలోని భాకరాపురం క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాదర్బార్ నిర్వహించారు. కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో మమేకమయ్యారు. వారి బాధలు, కష్టాలు, సమస్యలు వింటూ నేనున్నాను అంటూ భరోసానిస్తూ.. ధైర్యాన్ని కల్పించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించి, యోగక్షేమాలు తెలుసుకుని, వారి సమస్యలు ఓపిగ్గా విని, వారికి భరోసా కల్పించారు.వైఎస్ జగన్‌ను కడప నూతన మేయర్ పాకా సురేష్ కలిశారు. నూతన మేయర్‌ను వైఎస్ జగన్ అభినందించారు. వైఎస్ జగన్‌ను మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కూడా కలిశారు.కాగా, రేపు(బుధవారం, డిసెంబర్ 24) ఉదయం 10.30 గంటలకు పులివెందుల నుంచి ఇడుపులపాయకు చేరుకుని ప్రేయర్ హాల్లో జరిగే క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఇడుపులపాయ నుంచి బయలుదేరి పులివెందులకు చేరుకుని భాకరాపేట క్యాంప్ ఆఫీస్‌లో ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు. గురువారం(డిసెంబర్ 25) ఉదయం 8.30 గంటలకు క్రిస్మస్ సందర్భంగా సీఎస్ఐ చర్చిలో జరిగే వేడుకల్లో పాల్గొంటారు. -
స్కిల్ స్కాం.. కేసు కొట్టివేతకు బాబు మాస్టర్ ప్లాన్!
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. తనపై ఉన్న కేసులను మూసివేసే ప్రక్రియలో చంద్రబాబు స్పీడ్ పెంచారు. ఇందులో భాగంగానే.. స్కిల్ స్కామ్ కేసు మూసివేతకు చురుకుగా ప్రక్రియ కొనసాగుతోంది. ఏపీ సీఐడీ.. చంద్రబాబు అడుగులకు మడుగులొత్తుతోంది. పూర్తి సహకారం అందిస్తున్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు తనపై ఉన్న కేసులను మూసివేయించుకుంటున్నారు. ఇప్పటికే ఫైబర్ నెట్, రాజధానిలో అసైన్డ్ ల్యాండ్స్, లిక్కర్ కేసు, ఇసుక కేసులను చంద్రబాబు క్లోజ్ చేయించుకున్నారు. ఈ క్రమంలోనే స్కిల్ స్కాం కేసు మూసివేతకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశారు. అందుకు, చంద్రబాబు అడుగులకు సీఐడీ కూడా మడుగులొత్తుతున్నది. స్కిల్ కేసు మూసివేతకు పూర్తి సహకారం అందిస్తోంది.ఈ క్రమంలో క్లోజర్ రిపోర్టును వ్యతిరేకిస్తే కోర్టుకు వచ్చి చెప్పాలంటూ ఏపీఎస్ఎస్డీసీ ఎండీకి సీఐడీ నోటీసులు ఇచ్చింది. దీనిపై వారం రోజుల్లోగా వచ్చి సమాధానం చెప్పాలని నోటీసు పంపింది. ఈ నేపథ్యంలో స్కిల్ స్కాం కేసును కూడా చంద్రబాబు త్వరగా మూసివేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. కాగా, స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు.. 52 రోజులు జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. స్కిల్ స్కాంలో ఈడీ సైతం కేసు నమోదు చేసింది. ఈ కేసులో నిందితుల ఆస్తులను కూడా ఈడీ అటాచ్ చేసింది. తీవ్రమైన అవినీతి కేసును మూసేసేందుకు ఇప్పుడు చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇది కూడా చదవండి: చంద్రబాబు.. ఫైబర్‌నెట్ కేసు క్లోజ్! -
ప్రశ్నిస్తే బెదిరింపులా?.. మీ భాషేంటి?: బొత్స సీరియస్
సాక్షి, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వ పాలనను ప్రజలు ఏ మాత్రం మెచ్చుకోవడం లేదన్నారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రుల భాష ఏ మాత్రం బాగోలేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, వైఎస్సార్సీపీ కోటి సంతకాలు సేకరించడంపై కూటమి నేతలు వణికిపోతున్నారని అన్నారు. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ..‘కూటమి నేతల భాష, ఆలోచన విధానాన్ని ప్రజలు అర్ధం చేసుకోవాలి. వారి ప్రవర్తనను రాష్ట్ర ప్రజలు గమనించాలి. కోటి సంతకాల సేకరణపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విచిత్రంగా మాట్లాడుతున్నారు. ఆరోగ్య శాఖ మంత్రికి రాష్ట్రంలో ఎంతమంది ఓటర్లు ఉన్నారో తెలుసా?. జనంలోకి వెళ్లి అడిగితే ఎంత మంది మెడికల్ కాలేజీల కోసం సంతకాలు చేశారో అర్ధం అవుతుంది. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తామని ప్రజల్లోకి వెళ్లి చెప్పండి.. అప్పుడు వాళ్ళే సమాధానం చెబుతారు. మెడికల్ కాలేజీల విషయంలో అవినీతికి పాల్పడిన వారిని చట్ట ప్రకారం శిక్షిస్తాం. ప్రజారోగ్యాన్ని స్వలాభం కోసం వాడుకోవాలని చూస్తున్నారో వారిపై మా ప్రభుత్వం వచ్చాక కఠిన చర్యలు తీసుకుంటాం..20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఉద్యోగాలు ఇస్తారో.. చస్తారో పక్కన పెడితే గ్రామీణ ఉపాధి హామీ పథకం అటక ఎక్కేసింది. రాష్ట్రం 25 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ వలసలు మొదలవుతాయి. పేదలకు అన్నం దొరకలేని దయనీయ పరిస్థితి మళ్ళీ వస్తుంది. ఉపాధి హామీ పథకం కోసం కేంద్రాన్ని ఎందుకు అడగటం లేదు. ఉపాధి హామీ పథకం డిప్యూటీ సీఎం శాఖలోకే వస్తుంది కదా కేంద్రాన్ని ఎందుకు అడగటం లేదు. చంద్రబాబుకి పేదలు అవసరం లేదు.. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌కి కూడా అవసరం లేదు. చంద్రబాబు ఏనాడూ పేదల కోసం ఆలోచన చేయలేదు.ప్రశ్నించడానికే పార్టీ పెట్టాను అన్నారు కదా పవన్.. మరి ఎందుకు ప్రశ్నించడం లేదు?. అధికారం, గెలుపు ఓటములు సహజం. సిద్దాంతం, ఆలోచన ముఖ్యం. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతే.. శాంతి భద్రతలు లేవు. హాస్టల్ పిల్లలు మధ్యాహ్నం మంచి భోజనం తినే పరిస్థితి లేదు.. పవన్ వ్యాఖ్యలు విన్నాక ఏం మాట్లాడాలో అర్ధం కాలేదు. ఉక్రెయిన్‌లో యుద్ధం జరిగి ఏపీలో యూరియా కొరత వస్తే.. మిగతా రాష్ట్రాల్లో యూరియా ఎలా వచ్చింది?. ఎన్డీయే పాలిత రాష్ట్రాలు అన్నింటిలో యూరియా కొరత లేదు. ఉత్తరాంధ్రపై చంద్రబాబు ఆయన టీమ్ కన్ను పడింది. ఇక్కడున్న భూములు దోచుకుందామని ప్రయత్నిస్తున్నారు.రియల్ ఎస్టేట్ కంపెనీలకు భూములు ఇవ్వడం ఎక్కడైనా ఉందా?. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలవకుండా కేటాయింపులు ఎప్పుడైనా జరిగాయా?. భూ కేటాయింపులు అన్నింటిని తిరగదోడుతాం. గోదావరి జిల్లాల్లో ఎక్కడ చూసినా పేకాట క్లబ్బులు. సీ పోర్టుల్లో చూస్తే అక్రమ రవాణా?. రాష్ట్రంలో ఉన్నది ఎన్డీయే ప్రభుత్వమా లేక వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉందా అని డిప్యూటీ సీఎంను సూటిగా ప్రశ్నిస్తున్నా?. తప్పు చేస్తే చర్యలు తీసుకోవచ్చు కదా ఎందుకు వెనకాడుతున్నారు. ప్రతీ రోజూ రాష్ట్రంలో అత్యాచారమో, హత్య, కిడ్నాప్ ఇలా ఏదో ఒక సమస్య చూస్తున్నాం. పెద్ద ఎత్తున అప్పు చేసింది ఈ ప్రభుత్వం ఆ డబ్బు ఏం చేశారంటే సమాధానం లేదు. భూ కేటాయింపులపై న్యాయ పోరాటం చేస్తున్నాం. మీ ఇష్టం వచ్చినట్టు.. కేటాయింపులు చేస్తే చూస్తూ ఊరుకోవాలా?. రియల్ ఎస్టేట్ సంస్థలకు భూములు ఎలా ఇస్తారు?.ఫీజురియింబర్స్‌మెంట్ రాక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడం వలన రోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలం చెందింది. రూ. 2.66 లక్షల కోట్లు అప్పులు తెచ్చిన ఈ ప్రభుత్వం విద్య, వైద్యానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. 15వ ఆర్ధిక నిధులు వినియోగానికి బ్రేకులు పడ్డాయి. డిప్యూటీ సీఎం పవన్‌కు ఆ విషయం తెలుసా?. ఉన్నప్పుడు ఏం పీకారని పవన్ అడుగుతున్నారు.. ఏంటి ఈ మాటలు. మాటలు ఎక్కువ మాట్లాడే వారికి చేతనైంది తక్కువ. రెండేళ్ల పాలనపై ఈ ప్రభుత్వానికి, మంత్రులపై ప్రజలకు ఉన్న అభిప్రాయం ఏమిటో తెలుసుకోండి. సంక్రాంతికల్లా గోతులు కప్పేయాలని చంద్రబాబు అంటున్నారు.. కానీ ఏ సంక్రాంతో చెప్పడం లేదు. గోతులు కప్పడానికి నిధులు ఇవ్వండి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మంచి భోజనం పెట్టంది. పిల్లల అవసరాలను తీర్చండి’ అని హితవు పలికారు. -
గురువింద సామెతను గుర్తు చేస్తున్న పవన్!
ఏపీ ఉపముఖ్యమంత్రి నిజజీవితంలోనూ నటించడంలో ఆరితేరుతున్నారు. సినీ అభిమానులు అతడిని పవర్‌స్టార్ అంటూ పిలుచుకుంటూంటారు. ప్రజా జీవితంలో ఆయన నటనను చూసిన తరువాత ‘‘రాజకీయ నట శూర’’ అన్న అవార్డు ఇస్తే బాగుంటుందని అనిపిస్తోంది. పెరవలిలో ఆయన లేని ఆవేశం తెచ్చేసుకుని వైఎస్సార్సీపీపై విరుచుకుపడ్డారు. అనవసరమైన విమర్శలు చేస్తూ పీకుడు భాష వాడారు. ఈ క్రమంలో పవన్ తెలిసో తెలియకుండానో యూపీ సీఎం ఆదిత్యనాథ్‌ను పొగిడి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన సామర్థ్యంపై ప్రశ్నలు లేవనెత్తారు. ఏపీలో శాంతి భద్రతలు అధ్వాన్నంగా ఉందని చెప్పకనే చెప్పారు. నెపం వైఎస్సార్సీపీకి నెట్టి టీడీపీ మెప్పుకోసం ప్రయత్నించారు. కానీ టీడీపీ, జనసేనల అరాచకం గురించి రాష్ట్రంలో తెలియందెవరికి? తీరు చూడబోతే పవన్ మంత్రి లోకేశ్ రెడ్‌బుక్ తో పోటీపడుతున్నట్లుగా ఉంది. సందర్భ శుద్ది లేకుండా, అసలు సమస్యలను డైవర్ట్ చేయడానికి చంద్రబాబు డైరెక్షన్లో మాట్లాడారా? లేక తన ఉనికిని కాపాడుకోవడానికి బెదిరించే రీతిలో ప్రసంగించారా?అన్న డౌట్లు కూడా వస్తున్నాయి. ఎల్లో మీడియా ఆయన ప్రసంగాన్ని ఎడిట్ చేసి ఇబ్బందిలేని రీతిలో ప్రచారం చేసింది. కాని సోషల్ మీడియాలో మాత్రం ఆయన మాట్లాడిన వైనం అర్థమైపోయింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని జనం మెచ్చడం లేదని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కలెక్టర్ల సమావేశంలో వెల్లడించారు.అలాగే ఉత్తరాంధ్రలో భూ మాఫియా గురించి పవన్ కళ్యాణే ఫిర్యాదు చేశారు. ఇవన్ని కూటమి ప్రభుత్వం పరువు తీశాయి.దీంతో డామేజీని కవర్ చేసుకోవడానికి చంద్రబాబు సూచన మేరకు ఆయన వైఎస్సార్సీపీపై ఆవేశపడినట్లు నటించారా? అన్న అనుమానం చాలామందికి కలిగింది. వైఎస్సార్సీపీని తిట్టి వారిలో ఎవరైనా పరుష భాష వాడితే దాన్ని రాజేసి పోలీసుల సాయంతో కేసులు పెట్టవచ్చుననా ఇలా వ్యవహరించి ఉండవచ్చని కొందరు విశ్లేషించారు. అయితే వైఎస్సార్సీపీ నేతలు పట్టించుకోకపోవడంతో ఆ వ్యూహం కాస్తా బెడిసికొట్టినట్లు అయ్యింది. ఎందుకంటే ప్రభుత్వంలో పవన్ మాటలను ఎవరూ అంత సీరియస్‌గా తీసుకోవడం లేదన్న విషయం వీరికి తెలుసు. రాష్ట్రంలో జూద శిబిరాలు పెచ్చుమీరాయని చేసిన ఫిర్యాదులపై ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోలేదు. జనసేన శ్రీకాళహస్తి మహిళా నేత ప్రైవేటు వీడియోలు తీయించిన టీడీపీ ఎమ్మెల్యేని ఒక్క మాట అనలేని పవన్ కళ్యాణ్, ఈ మధ్య వైఎస్సార్సీపీపై మాత్రం ఇష్టారీతిన దూషించడం వెనుక చంద్రబాబు ఉన్నారని ఎక్కువమంది నమ్ముతున్నారు. పవన్ ఈ పదకుండేళ్లలో ఎన్ని విన్యాసాలు చేసింది అందరికి తెలుసు. ఎప్పుడు ఏది మాట్లాడతారో, ఎప్పుడు ఎవరితో పొత్తు పెట్టుకుంటారో అంతా అగమ్యగోచరం. 2019లో ఓడిపోగానే బీజేపీని బతిమలాడి వారితో కలిశారు. వాళ్ల కాళ్లు విరగగొడతా..వీళ్ల కీళ్లు తీస్తా.. వేళ్లు అరగగొడతా, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇప్పించాలని చెప్పడం ద్వారా పవన్ కళ్యాణ్ రాజ్యాంగాన్ని అపహాస్యం పాలు చేస్తున్నారు. లోకేశ్ రెడ్‌బుక్ మాత్రమే కాదు..తాను కూడా ఆయనతో పోటీ పడి అరాచకాలు చేయించగలనని పవన్ చెబుతున్నట్లు ఉంది. ముందుగా అక్కడక్కడా అరాచకాలకు పాల్పడుతున్న జనసేనకు చెందినవారి కీళ్లు విరగగొడితే, ఆ తర్వాత పవన్ ఏ కబుర్లు చెప్పినా జనం వింటారు. ఉత్తరాంధ్రకు చెందిన కొందరు జనసేన ఎమ్మెల్యేలే భూదందాలకు పాల్పడుతున్నారని ఈయనకే ఫిర్యాదులు వచ్చాయని అంటారు. ఇదే టైమ్ లో టీడీపీ నేతలు తమపై పెత్తనం చేస్తున్నారని జనసేన ఎమ్మెల్యేలు ఆయనతో మొరపెట్టుకున్నారు.వారికి ఊరట ఇవ్వకపోగా టీడీపీ వారు ఏమి చేసినా భరించాలని అన్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి. టిపి గూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తను ఎలా కాంట్రాక్టర్ల నుంచి డబ్బు తీసుకుని పని చేస్తున్నది బాహాటంగానే వెల్లడించారు. పవన్‌కు ఆయన బాహుబలిగా కనిపిస్తున్నారు. దీని అర్థమేమిటో? మచిలీపట్నంలో ఏదో బానర్ గొడవ వస్తే జనసేన నేత యర్రంశెట్టి సాయితో టీడీపీ నేతలు కాళ్లు పట్టించుకున్నారట. వీరి కీళ్లు తీసే ధైర్యం పవన్‌కు లేకపోయిందా? అని జనసేనలో కొందరు ప్రశ్నించుకుంటున్నారు. టీడీపీ ఎమ్మెల్యేల అరాచకాల గురించి ఆ పార్టీ మీడియానే చెబుతోంది. కొందరు ఎమ్మెల్యేలు మహిళలపై వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తే కూటమి పెద్దలు రాజీ చేశారే తప్ప చర్య తీసుకోలేదు. రాష్ట్రంలో గంజాయి అరికట్టడం సంగతి దేవుడెరుగు..గంజాయి వ్యతిరేక ఉద్యమకారుడిని హత్య చేసే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం మొత్తం లోకేశ్ పర్యవేక్షణలోనే నడుస్తోందన్న అభిప్రాయం సర్వత్రా ఉంది. పవన్ ఆయనకు విధేయుడిగా ఉండడానికే మొగ్గు చూపుతున్నారన్న భావన అభిమానులది. పవన్‌కు అండగా నిలిచిన ఒక సామాజికవర్గంలో పెరుగుతున్న అసంతృప్తిని దారి మళ్లించి, తనను వైఎస్సార్సీపీ వాళ్లు ఏదో అంటున్నారన్న అభూత కల్పనను సృష్టించి సానుభూతి పొందడానికి యత్నించినట్లుగా ఉందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చినట్లు కాపు నేస్తం వంటి స్కీముల ద్వారా ఆయా వర్గాల మహిళలను ఆదుకోవడానికి కృషి చేయకుండా ఈ కీళ్ల పంచాయతీ పెడితే ఎవరికి ప్రయోజనం? 'సూపర్ సిక్స్,ఎన్నికల ప్రణాళికలోని హామీలు ఎటూ చేయలేరు కనుక, ఈ డ్రామా ఆడితే సరిపోతుందని అనుకున్నారా? ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తున్న తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ గట్టిగా నిలదీసి కోటి సంతకాల ఉద్యమాన్ని విజయవంతం చేసింది. దీనిపై జనసేనకు ఒక విధానం ఉందో లేదో తెలియదు. 99 పైసలకే ఎకరాలకు ఎకరాలు కట్టబెడుతున్న ప్రభుత్వాన్ని భుజాన వేసుకున్న పవన్ కేవలం టీడీపీ వారు ఏమి చెబితే దానినే గుడ్డిగా సమర్థిస్తున్నట్లు కనబడుతుంది. ఈ నేపథ్యంలో ప్రజలలో పెల్లుబుకిన అసమ్మతిని కప్పిపుచ్చి చంద్రబాబు నుంచి మెప్పు పొందడానికి ఈయన యత్నిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.తాము అధికారంలోకి వస్తే పనిచేసే కాంట్రాక్టర్లను జైలులో వేస్తామని అంటున్నారని జగన్‌పై ఒక అబద్దాన్ని సృష్టించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పెద్ద స్కామ్ అని, తాము అధికారంలోకి వచ్చాక ఈ స్కామ్‌లో భాగస్వాములయ్యే ప్రైవేటు వారిని కూడా జైళ్లలో పెడతామని జగన్ హెచ్చరించారు తప్ప పనిచేసే కాంట్రాక్టర్లను కాదు. ఒక ఆశయం కోసం ప్రాణాలు పోయినా లెక్క చేయనని, పోయే ముందు తాట తీస్తానని, రోమాలు తీసి కూర్చోబెడతానని పవన్ అనడం హస్యాస్పదంగా ఉంది. ఈయన ప్రాణాలు ఎవరు తీస్తారు?అలాంటి బెదిరింపులు ఎమైనా వచ్చాయా? వాటిపై ఫిర్యాదు చేశారా? ఇవేమి లేకుండా అడ్డంగా మాట్లాడితే జనం నమ్ముతారా? ఇంతటి సాహసవంతుడు పవన్ తన తల్లిని దూషించారటూ ఎవరిపై గతంలో ఆరోపణలు చేశారు? వారిని ఏమి చేశారో చెప్పి ఆ తర్వాత ఇతరుల తాట తీయవచ్చు. లేకుంటే ఈయనవి ఉడుత ఊపులే అవుతాయి. ఎవరు తప్పు చేసినా తప్పే. నిజంగానే వైఎస్సార్సీపీ వారు ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే చర్య తీసుకోవచ్చు.కాని ప్రస్తుతం ఏపీలో ఏమి జరుగుతోందో తెలియదా? పిల్లి కళ్లుమూసుకుని పాలు తాగితే ఎవరూ చూడడం లేదనుకుంటే సరిపోతుందా? యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇస్తారట.అది చట్టబద్దమైతే గంజాయి వ్యతిరేక ఉద్యమకారుడిని హత్య చేసిన వారికి ఇవ్వండి.. వినుకొండలో రషీద్ అనే యువకుడిని నడి వీధిలో నరికి చంపిన టీడీపీ వారికి ఇవ్వండి.. సుగాలి ప్రీతి కేసు నిందితులకు ఇవ్వండి. ఈ కేసులో తాను ఇచ్చిన హామీ ఏమిటో గుర్తుకు తెచ్చుకుంటే బాగుంటుంది కదా! విజయవాడలో పోలీసులు, టీడీపీ వారు కలిసి 42 ఇళ్లు కూల్చివేశారు.రాష్ట్రం అంతటా బెల్ట్ షాపులు ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. టీడీపీ నేతల నకిలీ మద్యం వ్యవహారం తెలియదా? ఇలాంటి వాటిపై నోరు విప్పని పవన్ కళ్యాణ్‌కు వైఎస్సార్సీపీని ప్రశ్నించే నైతిక హక్కు ఉంటుందా? ఆయనకు విసుగు వస్తోందట. అది విసుగు కాదు.తనను అటు ప్రభుత్వం పెద్దగా సీరియస్‌గా తీసుకోవడం లేదు. ఇటూ విపక్షం పట్టించుకోవడం లేదన్న ఫ్రస్టేషన్ కావచ్చు. హద్దుమీరి అంటే ఏదో చేస్తారట. నిజమే.. ఎవరూ హద్దులు దాటి మాట్లాడరాదు. కాని తాను అధికారంలో లేని ఐదేళ్లలో ఎన్నిరకాలుగా మాట్లాడింది. ఎన్నిసార్లు హద్దు దాటింది ఆత్మ విమర్శ చేసుకునే ధైర్యం పవన్ కళ్యాణ్ వంటివారికి ఉండకపోవచ్చు. అధికారం వచ్చాక పవన్ కళ్యాణ్ తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందని బాధ్యతారాహిత్యంగా ఆరోపించిన చంద్రబాబుకు వంత పాడారు. పైగా ఆ లడ్డూలు అయోధ్యకు వెళ్లాయని చెప్పి సడన్‌గా సనాతని వేషం కట్టడాన్ని మించి హద్దు దాటిన వైనం మరొకటి ఉంటుందా? విపక్షంలో ఉన్నప్పుడు 30 వేల మంది మహిళలు కిడ్నాప్ అయ్యారని, వలంటీర్లు కిడ్నాప్ చేస్తున్నారని అనుచిత వ్యాఖ్యలు చేసినదానికన్నా ఘోరం ఇంకొకటి ఉంటుందా? ఇంకా ఎన్నో ఉన్నాయి. తప్పులెన్నువారు తమ తప్పులెరుగరని వేమన శతకం చెబుతుంది. పవన్ కళ్యాణ్ తనకు దొరికిన పదవిని ఎంజాయ్ చేస్తున్నారు.అంతవరకు అభ్యంతరం లేదు. డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఇలాంటి హద్దుమీరిన హెచ్చరికలు, బెదిరింపుల వల్ల పవన్ కళ్యాణ్ పరువు తక్కువ అవుతుందన్న సంగతి గ్రహిస్తే మంచిది!:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
చంద్రబాబుకు కొత్త టెన్షన్..!
సాక్షి, అమరావతి: సూపర్ సిక్స్ ఎన్నికల హామీలను అమలు చేయకుండా మోసం చేసిన సీఎం చంద్రబాబు కనీసం ప్రజల ఆర్థికేతర సమస్యలకు పరిష్కారం చూపడంలోనూ దారుణంగా విఫలమయ్యారు. ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన కలెక్టర్ల సదస్సులోనే ఈ విషయం వెల్లడైంది. సమస్యలపై ప్రజలు ఇచ్చిన అర్జీలు కుప్పలు తెప్పలుగా పేరుకుపోయాయి. పరిష్కరించామని చెబుతున్న సమస్యలపై ఆర్టీజీఎస్ ద్వారా నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో ఈ డొల్లతనం బయటపడింది. అల్లూరి జిల్లాలో అత్యధికం.. విజ్ఞాపనల పరిష్కారంపై ఈ ఏడాది సెప్టెంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు ఆరీ్టజీఎస్ ద్వారా సర్వే చేయగా 43 శాతం మంది ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పరిష్కరించినట్లు చెబుతున్న వినతులపై ఆడిట్ నిర్వహించడంతోపాటు అర్జీదారులకు ఐవీఆర్ఎస్ కాల్ చేసి అభిప్రాయం కోరగా తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. అత్యధికంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 80% మంది, చిత్తూరు జిల్లాలో 60, శ్రీసత్యసాయి జిల్లాలో 62, అన్నమయ్య జిల్లాలో 60, అనంతపురం జిల్లాలో58, ఎన్టీఆర్ జిల్లాలో 53, బాపట్ల జిల్లాలో 50% మంది ప్రజలు విజ్ఞాపనల పరిష్కారం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై కలెక్టర్ల సదస్సుల్లో సీఎం సమక్షంలో అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు.ఈ ఏడాది జూన్ 15 నుంచి అసంతృప్తి స్థాయి మూడునెలల్లో భారీగా పెరిగినట్లు వెల్లడైంది. ఇక రెవెన్యూ శాఖలో పరిష్కరించినట్లు చెబుతున్న అంకెలన్నీ తప్పేనని కలెక్టర్ల సదస్సుల్లోనే ఓ ఉన్నతాధికారి స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారం విషయంలో లెక్కలకు, వాస్తవాలకు పొంతనలేదని కలెక్టర్ల సదస్సులో తేలడంతో సీఎం చంద్రబాబు స్పందించారు. ఎక్కడో ఫెయిల్ అవుతున్నామని వ్యాఖ్యానించారు. -
అత్యాచారప్రదేశ్‌గా ఏపీ
నెల్లూరు రూరల్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీని అత్యాచారప్రదేశ్‌గా మార్చారని వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత మండిపడ్డారు. నగరంలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. 18 నెలల కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం తనయుడు లోకేశ్ ప్రాతినిథ్యం వహిస్తున్న మంగళగిరిలో 13 ఏళ్ల బాలికపై నలుగురు లైంగికదాడికి పాల్పడడం కిరాతకమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం చేష్టలుడిగి చోద్యం చూస్తోందని మండిపడ్డారు. పోలీసులను ప్రజల రక్షణకు కాకుండా ప్రతిపక్షాన్ని అణిచివేసేందుకు ఉపయోగించుకుంటోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని చెప్పడానికి ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్‌షా రాసిన లేఖే నిదర్శనమన్నారు. జగన్ చేతల సీఎం.. బాబు మాటల సీఎం వైఎస్ జగన్ పాలనలో మహిళల భదత్రకు అనేక సంస్కరణలు తీసుకొచ్చారని పూజిత గుర్తుచేశారు. దిశ యాప్‌ను పటిష్టంగా అమలు చేశారని, దిశ పోలీసుస్టేషన్లు ఏర్పాటు చేశారని వివరించారు. ఆపదలో అబలలు ఉంటే ఐదు నుంచి ఎనిమిది నిమిషాల్లోపే పోలీసులు ఘటనాస్థలంలో ఉండేవారని పేర్కొన్నారు. కానీ చంద్రబాబు సీఎం అయ్యాక పోలీసులు శాంతిభద్రతలను గాలికొదిలేశారని విమర్శించారు.నేరస్థులపై కఠినంగా వ్యవహరిస్తామని డైలాగ్‌లు చెప్పే చంద్రబాబు మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా ఎందుకు స్పందించడం లేదని ప్రశి్నంచారు. పోలీసులు అధికారపక్ష సేవలో తరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు మహిళల రక్షణ కోసమే రాజకీయాల్లోకి వచ్చానన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశి్నంచారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ సరిగా పనిచేయడం లేదని అమిత్‌షా సీఎం చంద్రబాబుకు లేఖరాశారని, దీనిపై ప్రజలకు సర్కారు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. -
‘కూటమి పాలనలో అడ్డూ అదుపు లేకుండా పేకాట డెన్లు’
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ మండిపడ్డారు. సోమవారం ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గంజాయి, మద్యంతో యువత జీవితాలను రోడ్డున పడేశారని.. అనధికార క్లబ్‌లు నిర్వహిస్తూ కోట్ల బిజినెస్ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘2014-19లో కాల్ మనీ రాకెట్‌తో మహిళల జీవితాలను నాశనం చేశారు. ఇప్పుడు విచ్చవిడిగా ఏపీలో క్యాసినోలను నిర్వహిస్తున్నారు. మ్యాంగో బే కల్చరల్ అండ్ రిక్రియేషన్ సొసైటీ వెనుక కూటమి పెద్దల పాత్ర ఉంది. హైకోర్టు అనుమతి ఉందంటూ బోర్డులు కూడా పెట్టారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పోలీసులు, మీడియాను కూడా లోపలకు రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. 108 అంబులెన్స్‌ను కూడా పేకాట క్లబ్ దగ్గర ఏర్పాటు చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు’’ అని శివశంకర్ పేర్కొన్నారు.‘‘ఇతర రాష్ట్రాల నుంచి కూడా పేకాట కోసం ఏపీకి వస్తున్నారు. ఈ క్లబ్ వెనుక మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. వారందరి వివరాలను ప్రభుత్వం బయట పెట్టాలి. పది వేలు, యాభై వేలు, లక్ష చొప్పున మూడు జోన్లగా విభిజించి మరీ పేకాట ఆడిస్తున్నారు. ఆ పక్కన కుటుంబాల వారు చాలాకాలంగా పేకాట ఆడుతున్నారని ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదు. ప్రభుత్వ పెద్దలు ప్రత్యేక విమానాల్లో విలాసాలు చేస్తుంటే.. ఎమ్మెల్యేలు, మంత్రులు పేకాట ఆడిస్తూ డబ్బు దోచుకుంటున్నారు. ఈ పేకాట క్లబ్‌లపై విచారణ జరిపించాలి’’ అని శివశంకర్ డిమాండ్ చేశారు. -
కూటమి పాలనలో డ్రగ్స్ డెన్‌గా ఏపీ: వంగవీటి నరేంద్ర
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ను డ్రగ్ డెన్‌గా కూటమి సర్కార్ మార్చేసిందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. విచ్చలవిడిగా పేకాట క్లబ్‌లను కూడా నిర్వహిస్తున్నారంటూ దుయ్యబట్టారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున జనం వచ్చి పేకాట ఆడుతున్నారని.. టీడీపీ నేతల కనుసన్నల్లోనే డ్రగ్స్ అమ్మకాలు జరుగుతున్నాయన్నారు. ‘‘హోం మంత్రి.. పోలీసులను వైఎస్సార్సీపీ కార్యకర్తలను అక్రమ అరెస్టులకే ఉపయోగిస్తున్నారు. డ్రగ్స్ అరికట్టాం అంటున్న చంద్రబాబు, అనిత ఇప్పుడు దొరుకుతున్న డ్రగ్ర్కి ఏం సమాధానం చెప్తారు?. ఢిల్లీ నండి డ్రగ్స్ ఏపీకి వస్తుంటే పోలీసు వ్యవస్థ ఏం చేస్తున్నట్టు?. జగన్ హయాంలో డ్రగ్స్, గంజయిని అరికట్టడానికి సెబ్ అనే వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల్ వ్యవస్థ ఏం చేస్తుందో ఏమీ అర్థం కావటం లేదు’’ అని నరేంద్ర నిలదీశారు.‘‘ఈ విచ్చలవిడి డ్రగ్ర్ని నిలిపేయకపోతే కోర్టును ఆశ్రయిస్తాం. విద్యా సంస్థల దగ్గర్లో యథేచ్ఛగా డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నాయి. డ్రగ్స్ వాడటం మొదలుపెడితే యువత తీవ్రంగా నాశనం అవుతుంది. ప్రభుత్వ అండదండలతోనే డ్రగ్స్ రాష్ట్రంలోకి వస్తోంది. మ్యాంగో బే కల్చరల్ రిక్రియేషన్ క్లబ్ వెనుక టీడీపీ నేతలు ఉన్నారు. వారెవరో బయట పెట్టాలి. రాష్ట్రాన్ని దౌర్భాగ్యకర పరిస్థితిలోకి తీసుకెళ్లారు’’ అంటూ వంగవీటి నరేంద్ర ధ్వజమెత్తారు. -
‘చంద్రబాబుపై కేసీఆర్ మాట్లాడింది వంద శాతం కరెక్ట్’
సాక్షి, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతోందని.. అందుకే వైఎస్సార్సీపీలోకి చేరికలు జరుగుతున్నాయని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. సోమవారం వైఎస్సార్సీపీలోకి భారీ చేరికల కార్యక్రమం జరిగింది. అయితే ఆ సమయంలో అనుమతులు నిరాకరణ పేరుతో వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఏరినా సిబ్బంది తాళం వేశారు. ఈ పరిణామాలపై స్పందిస్తూ ఆయన కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ప్రభుత్వం మీద వ్యతిరేకతతో పెద్ద ఎత్తున వైఎస్సార్సీపీలోకి చేరికలు జరుగుతున్నాయి. అనుమతి తీసుకున్న తర్వాత చిల్డ్రన్ ఏరియా థియేటర్ ఇవ్వకపోవడాన్ని ఖండిస్తున్నాం. దళితులు వైఎస్సార్సీపీలో చేరకూడదా?.. దళితులకు చిల్డ్రన్ ఏరినా ధియేటర్లో అడుగుపెట్టే అర్హత లేదా?. దళితులంటే అంత చిన్న చూపా చంద్రబాబు? అని గుడివాడ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ అంటే కూటమి నేతల భయపడుతున్నారని.. చంద్రబాబు లోకేష్, టీడీపీ బచ్చాలు ఎందుకు పనికిరారని అన్నారాయన. చంద్రబాబు కోసం కేసిఆర్ చేసిన వ్యాఖ్యలను గుడివాడ అమర్నాథ్ సమర్థించారు. ‘‘కేసీఆర్ ఎన్నడూ అబద్దాలు మాట్లాడలేదు. అందుకే ఆయన అంత పెద్ద నేత అయ్యారు. చంద్రబాబుపై ఆయన చేసిన వ్యాఖ్యలను నేను పూర్తిగా ఏకీభవిస్తున్నా. ప్రభుత్వంలో ఉండి ప్రజల కోసం ఆలోచించాలి.. కొడుకు, కుటుంబం కోసం కాదు’’ అని అన్నారాయన. అంతకు ముందు.. చేరికల కార్యక్రమం సమయంలో ఆఖరి నిమిషంలో వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఏరినా సిబ్బంది అనుమతి నిరాకరిస్తూ గేటుకు తాళం వేశారు. ఈ క్రమంలో గేటు ముందు వైఎస్సార్సీపీ నేతలు ధర్నాకు దిగారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. దీంతో పరిస్థితి స్వల్ప ఉద్రిక్తంగా మారింది. కూటమి నేతల ఒత్తిడితోనే అనుమతి నిరాకరించారని.. వైఎస్సార్సీపీ చేరికలను చూసి కూటమి నేతల భయపడుతున్నారని.. అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని వైఎస్సార్సీపీ నేత కేకే రాజు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.కేసీఆర్ ఏమన్నారంటే.. చంద్రబాబు మాటలు విని.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసింది. పాలమూరులో చెరువులను బాగు చేయాలని కేంద్రానికి మేం అధికారంలో ఉన్నప్పుడు లేఖలు రాశాం. అయితే.. చంద్రబాబు మాటలు విని కేంద్రం అన్యాయం చేసింది. కనీసం పట్టించుకోలేదు. బీజేపీ పాలకులు శనిలా దాపురించారు. -
వాసు పోస్టింగ్.. ఊస్టింగ్!
సాక్షి ప్రతినిధి, కడప: రాజకీయ నేతలు అనుక్షణం సేవాభావం కలిగి ఉండాలి. సమాజ శ్రేయస్సుపై అంకితభావంతో మెలగాలి. చెప్పే మాటల్లో నిజాయితీ, ఆచరణలో చిత్తశుద్ధి కన్పించాలి. అప్పుడే ప్రజల్లో మెప్పు, ఆయా రాజకీయ పార్టీల్లో పరపతి ఉంటుంది. ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తే అంతే స్పీడ్‌గా తిరోగమనం చవిచూడాల్సి వస్తుంది. టీడీపీ నేత శ్రీనివాసులరెడ్డే తీరే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. వాసు వ్యవహారశైలితో విసిగిపోయిన టీడీపీ అధిష్టానం తాజాగా జిల్లా బాధ్యతల నుంచి తప్పించింది. జిల్లా తెలుగుదేశం పార్టీలో రెడ్డెప్పగారి శ్రీనివాసులరెడ్డి కింగ్ పిన్... పార్టీ యావత్తు తన చుట్టే తిరిగేది. నియోజకవర్గాల్లో తాను సూచించిందే ఫైనల్. ఇది పదేళ్ల క్రితం మాట. క్రమేపీ తప్పించుకునే ధోరణి అలవాటు చేసుకున్నారు. ఉన్న కేడర్‌లో నమ్మకం సన్నగిల్లింది. కడప పార్లమెంటు పరిధిలో కీలక నేతగా ఉన్న ఆయన, కేవలం కడప అసెంబ్లీ నియోజకవర్గానికి పరిమితం కావాల్సి వచ్చిందని విశ్లేషకులు వివరిస్తున్నారు. పోనీ కడప నియోజకవర్గంలో కూడా పార్టీ కేడర్‌కు భరోసాగా నిలిచారా?అంటే అదీ లేదు. అంతర్గతంగా పైచేయి సాధించాలనే తపనతో ఎన్నో ఏళ్లుగా టీడీపీ కోసం అంటిపెట్టుకొని వస్తున్నవారిని వ్యూహాత్మకంగా దెబ్బతీశారు. చివరికి కార్పొరేషన్ పాలకమండలిలో టీడీపీ పరువు నిలిపిన ఏకై క కార్పొరేటర్ ఉమాదేవి కుటుంబానికి రాజకీయంగా ముప్పుతిప్పలు పెట్టారు. ఎన్నికలకు ముందు సర్వస్వం టీడీపీనే అనుకున్న వారిని క్రమేపి దూరం చేసుకుంటూ వచ్చారని పరిశీలకులు పేర్కొంటున్నారు.ఒంటెత్తు పోకడలు...దౌర్జన్యకర ఘటనలుటీడీపీ అధికారంలోకి వచ్చాక పార్టీలో తాను చెప్పిందే వేదం, తన మాటే శాసనం అన్నట్లు వాసు వ్యవహరించారు. కడప గడపలో వైరిపక్షానికి చెందిన రెండు బార్లు బలవంతంగా లాక్కున్న ఘటన తెరపైకి వచ్చింది. మూడు దశాబ్దాలుగా మద్యం వ్యాపారంలో తలమునకలైనప్పటికీ ఇలాంటి పరిస్థితి ఎప్పుడు చూడలేదని సదరు మద్యం వ్యాపారి వాపోవడం గమనార్హం. టీడీపీ కేడర్‌పై అంతర్గతంగా పైచేయి సాధించాలనే తపనే ఇలాంటి దౌర్జన్యకర ఘటనలను ప్రోత్సహించేలా చేసిందని విశ్లేషకుల మాట. ఇలాంటి చర్యలతో విసిగిపోయిన టీడీపీ కేడర్ పొరుగు నియోజకవర్గానికి చెందిన పుత్తా నరసింహారెడ్డి వద్దకు క్యూ కట్టారు. వివిధ రూపాల్లో నిరసనలు పాటించడం, కమలాపురానికెళ్లి మరీ పుత్తాకు మొరపెట్టుకుంటూ వచ్చారు. ఈ పరిణామాలను సరిదిద్దుకోవాలనే ఆలోచన లేకపోవడంతో అధిష్టానం వద్ద మరింత చులకన కావాల్సి వచ్చిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు కడపలో నిర్దిష్ట అభివృద్ధి సాధించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టలేకపోయారు. ఎంతసేపు వైరిపక్షంపై కక్ష సాధింపు రాజకీయాలకు పరిమితం అయ్యారు. ఇలాంటి ఘటన లన్నీ కూడా అధ్యక్ష పదవి తొలగింపునకు ప్రధాన కారణమయ్యాయని పరిశీలకులు వివరిస్తున్నారు.టీడీపీ అధ్యక్షుడిగా భూపేష్కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా జమ్మలమడుగు ఇన్‌ఛార్జి చదిపిరాళ్ల సుబ్బరామిరెడ్డి (భూపేష్‌రెడ్డి)ని ఆ పార్టీ అధిష్టానం నియమించింది. ప్రధాన కార్యదర్శిగా జబీబుల్లా (ప్రొద్దుటూరు)ను నియమించారు. కాగా భూపేష్ జమ్మలమడుగు ఎమ్మెల్యే టికెట్‌పై ఆశలు పెట్టుకుంటే చిన్నాన్న ఆదినారాయణరెడ్డి పొత్తులో భాగంగా బీజేపీ టికెట్ దక్కించుకున్నారు. విధిలేని పరిస్థితుల్లో ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలవాల్సి వచ్చింది. గ్రూపు రాజకీయాలకు, అంతర్గత విభేదాలకు తావు లేకుండా ఉండేందుకే తాజాగా జిల్లా అధ్యక్ష పదవి అప్పగించి ఉంటుందని రాజకీయ వేత్తలమాట. పైగా అధిష్టానం రిమోట్ కంట్రోల్ ద్వారా పార్టీని చక్కదిద్దేందుకు కట్టబెట్టారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. -
ప్రజల సొమ్ము పంచడమే బాబు సంస్కరణలా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎకనమిక్ టైమ్స్ దినపత్రిక ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు అందించింది. పారిశ్రామిక సంస్కరణలు, పెట్టుబడులు ఆకర్షణలకు గుర్తింపుగా ఈ అవార్డు ఇస్తున్నట్లు ఆ పత్రిక ప్రకటించింది. అయితే రాష్ట్ర ప్రజానీకం, ఆర్థిక నిపుణులు కొందరు అంటున్నది ఏమిటంటే.. ప్రభుత్వ సంపద అంటే ప్రజల సంపదను ప్రైవేటు వ్యక్తులకు కారుచౌకగా కట్టబెడుతున్నందుకే ఈ అవార్డు అని! పైగా మీడియా సంస్థలు అధికారంలో ఉన్న వారికి అవార్డులు ఇస్తున్నాయంటే ప్రజలు సందేహించే పరిస్థితులున్నాయి. వ్యాపార లావాదేవీల్లో భాగంగానే.. సీఎం లేదా ప్రభుత్వంలో బాగా పలుకుబడి ఉన్న నేతలకు ఇలా అవార్డులు ఇస్తూంటారన్న విమర్శ ఉండనే ఉంది. అంతేకాదు.. ఈ మీడియా సంస్థలు ప్రభుత్వాల నుంచి భారీ ఎత్తున ప్రకటనలు తీసుకుని ఆర్థిక ప్రయోజనం కూడా పొందుతూండటం గమనార్హం. ఎకనమిక్ టైమ్స్ అలా ఇచ్చిందా? లేదా? అన్నదానికి జోలికి వెళ్లడం లేదు. కాని ఈ పత్రిక గ్రూపు నిర్వహించిన ఒక సదస్సుకు ఏపీ ప్రభుత్వం రూ.కోటిన్నరతో పాటు రూ.27 లక్షలు జీఎస్టీగా చెల్లించడం విమర్శలకు కారణమవుతోంది. ఈ అవార్డు ఎంపిక కమిటీలో చాలామంది ప్రముఖులే ఉన్నారు. ఆయా సందర్భాల్లో వీరు చంద్రబాబును ఆకాశానికి ఎత్తేసిన విషయం బహిరంగమే. ఓకే కానీ... ఏ కొలమానాల ప్రకారం చంద్రబాబును ఈ అవార్డుకు ఎంపిక చేశారన్నది ప్రశ్న. ఎందుకంటే.. 18 నెలల అధికార అవధిలో ఆంధ్రప్రదేశ్‌కు కొత్తగా వచ్చిన పరిశ్రమలేవీ లేవు. మంత్రి లోకేశ్ వంటి వారు.. చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్‌తోనే బోలెడన్ని పరిశ్రమలు వచ్చేస్తాయని గొప్పలు చెప్పుకున్నా వాస్తవం దీనికి పూర్తిగా భిన్నంగానే ఉంది. కూటమి సర్కారు విశాఖపట్నంతోపాటు మరికొన్ని చోట్ల కొన్ని కంపెనీలకు ఎకర భూమి రూ.99 పైసలకే లీజు లేదా గంపగుత్తగా ఇస్తున్నా అవే కంపెనీలు హైదరాబాద్‌లో వందల కోట్ల రూపాయలతో భూములు కొంటున్నాయి. రహేజా వంటి సంస్థలకు అంత తక్కువ ధరకు భూములిస్తున్న విషయాన్ని తెలుసుకుని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సైతం ఆశ్చర్యపోయింది. సత్వా అనే రియల్ ఎస్టేట్ కంపెనీ, వేల కోట్ల లాభాలు ఆర్జించే టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి సంస్థలు.. ఊరు పేరూ లేని ఉర్సా అనే కంపెనీలు ఈ చౌక బేరంతో లబ్ధి పొందాయి. చంద్రబాబు సన్నిహితుడిగా చెప్పే లూలూ మాల్ అధిపతి అహ్మదాబాద్‌లో రూ.519 కోట్లు పెట్టి భూమి కొనుక్కుంటే విశాఖ, విజయవాడలలో కాణీ ఖర్చు లేకుండా పలు రాయితీలతో భూమి పొందారు. విజయవాడలో వందల కోట్ల రూపాలయ విలువైన ఆర్టీసీ స్థలాన్ని కేటాయించేశారు. గూగుల్ డేటా సెంటర్ అని ప్రచారం చేసిన అదాని డేటా సెంటర్‌కు భూములు కేటాయించడమే కాకుండా ఏకంగా రూ.22 వేల కోట్ల విలువైన రాయితీలు ఇవ్వడానికి ప్రభుత్వం ఓకే చేసింది. ఈ డేటా సెంటర్ వల్ల వచ్చే ఉద్యోగాలు చూస్తే ఆ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెడుతున్నాయా? లేక చంద్రబాబు ప్రభుత్వమే ఆ సంస్థలలో ప్రజల సొమ్మును ఎదురు పెట్టుబడిగా పెడుతోందా అన్న సందేహాలు వస్తున్నాయి. ఈ కంపెనీలకు ఇస్తున్న భూములు ఏకంగా 66 ఏళ్ల వరకు వారి అధీనంలోనే ఉంటాయి. అవి కల్పించే ఉద్యోగాల సంఖ్య ఎంత ఉంటుందో చెప్పలేం కాని, ఆ భూములవల్ల వారికి కలిగే ప్రయోజనం మాత్రం జాక్ పాట్ వంటిదే. పరిశ్రమలకు భూమి, రాయితీలు ఇవ్వడం కొత్త కాదు.కాని ప్రభుత్వానికి బొత్తిగా ఆదాయం రాకుండా ప్రైవేటువారికే మేలు కలిగేలా ,వారికే సంపద సమకూరేలా నిర్ణయాలు తీసుకుంటూ అవే వ్యాపార సంస్కరణలు ఈ మీడియా సంస్థలు డప్పు కొడితే ఏమి చేయగలం? ఇవే కాదు.. జగన్ ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలను తీసుకు వచ్చి వందల కోట్ల విలువైన భూములు కేటాయించి, నిర్మాణాలు చేపట్టి వేల కోట్ల సంపదను సృష్టిస్తే, వాటిని పీపీపీ పేరుతో ప్రైవేటు వారికి సంపదగా మార్చేస్తున్నారు. అయితే ఇది కూడా వ్యాపార సంస్కరణ అనే ఆ అవార్డు కమిటీ భావించిందేమో.ఆంధ్రప్రదేశ్ ప్రాథమికంగా వ్యవసాయాధార రాష్ట్రం. కాని అక్కడ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు రావడం లేదు. ఫలితంగా పలుమార్లు రైతులు తమ పంటలను పారబోస్తున్నారు. చాలా సందర్భాల్లో వ్యాపారులకు ఈ పంటలు కారుచౌకగా దొరుకుతున్నాయి.రైతులేమో నష్టాల్లో కూరుకుపోతున్నారు. వై.ఎస్.జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా రైతుల సంక్షేమం కాంక్షించి ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలను ప్రస్తుత కూటమి ప్రభుత్వం నీరు కార్చేయడంతో నష్టం మరింత ఎక్కువగా ఉంటోంది. యూరియా కొరతను అదనుగా చేసుకున్న వ్యాపారులు అందినంత దండుకున్నారు. ఆ రకంగా వారికి చంద్రబాబు అంటే మక్కువ ఏర్పడిందేమోనని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. విద్య, వైద్య సామాజిక రంగాలలో జగన్ సంస్కరణలు తేగా, ఇప్పుడు కూటమి సర్కార్ ప్రజలను ప్రైవేటు సంస్థల దోపిడీకి వదలి వేసే విధానాలు తీసుకుంటోందన్న విమర్శలు ఉన్నాయి. ఆరోగ్యశ్రీని సక్రమంగా అమలు చేయకుండా మొత్తం ప్రైవేటు బీమా కంపెనీల చేతిలో పెట్టడానికి ప్రభుత్వం సిద్దం అవుతోంది. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను, వలంటీర్లను ప్రవేశపెట్టి జగన్ పాలన సంస్కరణలు తెచ్చి ప్రజలకు పౌరసేవలను వారి ఇంటివద్దే అందిస్తే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇవన్ని ఏ రకంగా చూసినా పేదల వ్యతిరేక, పెట్టుబడిదారుల అనుకూల విధానాలుగానే కనిపిస్తాయి. జగన్ టైమ్‌లో సెకీ ద్వారా తక్కువ ధరకు విద్యుత్ తీసుకోవాలని ఒప్పందం చేసుకుంటే అది అధిక ధర అని గగ్గోలు పెట్టిన చంద్రబాబు అదానితో భేటీ అయిన వెంటనే దానికి ఓకే చేశారని వార్తలు వచ్చాయి. అంతేకాక సోలార్ పవర్‌ను యూనిట్‌కు రూ.మూడు కంటే ఎక్కువ ధరకు కొనడానికి సిద్దపడుతున్నారు. ఇక రెడ్ బుక్ అరాచకాలతో పరిశ్రమలను కూడా వదలి పెట్టడం లేదు. ఒక మోసకారి నటిని అడ్డం పెట్టుకుని ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త జిందాల్ పై కూడా కేసు పెట్టే యత్నం జరిగింది. చిత్రంగా ఆయన కూడా ఈ కమిటీలో సభ్యుడిగా ఉన్నారట. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబానికి వాటా ఉన్న భారతి సిమెంట్తోసహా మరో రెండు సిమెంట్ కంపెనీల లీజును కక్షపూరితంగా రద్దు చేయాలని నోటీసులు ఇచ్చారు. ఇది ఏ రకంగా వ్యాపార సంస్కరణ అవుతుంది? ఏది ఏమైనా చంద్రబాబుకు ఎకనమిక్స్ టైమ్స్ అవార్డు ఇచ్చినందుకు ఏపీ ప్రజలు సంతోషిస్తారా? భయపడతారా? అన్నది చెప్పలేం. ఇలాంటి బిజినెస్ అవార్డుల ఉత్సాహంతో మరింతగా పెట్టుబడిదారులు, వ్యాపారులకు అణాకు, బేడాకు విలువైన రైతుల, ప్రభుత్వ భూములను కట్టబెట్టకుండా ఉంటే అదే పదివేలు అన్నది జనాభిప్రాయంగా ఉంది. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
తండ్రీ కొడుకులిద్దరిదీ ఓన్లీ పబ్లిసిటీ.. నో యాక్టివిటీ: వైఎస్ అవినాష్‌రెడ్డి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందులలో వాటర్ గ్రిడ్ పనులకు మళ్లీ శంకుస్థాపనకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నాడని వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి అన్నారు. ఈ పథకాన్ని వైఎస్ జగన్ సీఎంగా 50 శాతం పనులు పూర్తి చేశారు. అసలు ఆ వాటర్ గ్రిడ్ పథకాన్ని వీళ్లే కనిపెట్టినట్లు, దాన్ని వీళ్లే మంజూరు చేసినట్లు ప్రచారం చేసుకుంటున్నారని చంద్రబాబు ప్రభుత్వంపై అవినాష్‌రెడ్డి మండిపడ్డారు. పులివెందులలోని వైఎస్సార్ ఆడిటోరియంలో జరిగిన వైఎస్ జగన్ జన్మదిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. కూటమి సర్కార్ తీరును ఎండగట్టారు.‘‘గూగుల్ డేటా సెంటర్ నుంచి అన్నింటిలో క్రెడిట్ చోరీ కార్యక్రమం పెట్టుకున్నారు. ఆ క్రెడిట్ చోరీలో భాగంగానే పులివెందులలో రూ.450 కోట్లతో జగన్ చేపట్టిన వాటర్ గ్రిడ్‌కు మళ్లీ శంకుస్థాపన చేస్తారట. ఎవరి హయాంలో ఏం అభివృద్ధి జరిగిందో పులివెందుల ప్రజలందరికీ తెలుసు. గతంలోనూ వైఎస్సార్ పూర్తి చేసిన చిత్రావతి, పైడిపాలెం రిజర్వాయర్లలను చంద్రబాబు క్రెడిట్ చోరీ చేశాడు..ఆనాడు చంద్రబాబు చేసిన ప్రారంభోత్సవాలకు నేనే స్వయంగా వెళ్లి వైఎస్సార్ ఏం చేశాడో చెప్పా.. ప్రజల్లో విపరీతమైన స్పందన వచ్చింది. వీళ్లు ఎన్ని కాకమ్మ కబుర్లు చెప్పినా ప్రజలకు అన్నీ తెలుసు.. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉచిత పంటల బీమా ఒక హక్కుగా ప్రతి ఒక్కరికీ వచ్చేది. డిసెంబర్ 15 నాటికి వరి మినహా అన్ని పంటలకు బీమా గడువు పూర్తయ్యింది. ఈ ప్రభుత్వం రైతు బీమా చేసుకునేందుకు ఎటువంటి అవగాహన కార్యక్రమం చేపట్టలేదు...ఫలితంగా రైతులు బీమా ప్రీమియం కట్టుకోలేని పరిస్థితి నెలకొంది. రైతులు ప్రీమియం కట్టుకునేలే జనవరి 15వరకూ గడువును పెంచాలని నా డిమాండ్. ఇప్పటికైనా ప్రభుత్వం ముందుకు వచ్చి బీమాపై స్పష్టత ఇవ్వాలి. చంద్రబాబు.. అమరావతి, 99 పైసలకే భూముల పందేరంలో బిజీగా ఉన్నాడు. అదేమన్నా అంటే సంపద సృష్టించాను అంటాడు. తండ్రీ కొడుకులిద్దరిదీ ఓన్లీ పబ్లిసిటీ...నో యాక్టివిటీ...విదేశాలకు వెళ్లి ఓ ఫోటో దిగి పచ్చ పత్రికల్లో వేయించుకుని చెమటోడుస్తున్నట్లు కలరింగ్ ఇస్తారు. ఇండిగో సంక్షోభంలో ఇలా క్రెడిట్ చోరీకి పాల్పడాలని అర్నాబ్ గోస్వామి వద్ద అడ్డంగా దొరికారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. వీరికి బుద్దిచెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి’’ అని అవినాష్‌రెడ్డి హెచ్చరించారు. -
జగన్‌లా ఒక్కరోజు పాలించినా చాలూ..!
ఉన్న మాటంటే ఉలుకెక్కువ.. చంద్రబాబుకి ఈ విషయంలో మరీనూ. ఆయన ఒప్పుకున్నా.. ఒప్పుకోకున్నా.. 2019-2024 ఈ ఐదేళ్లు ఏపీ రాజకీయ చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయం. కరోనా లాంటి కష్ట కాలంలోనూ రాష్ట్రానికి జగన్ ఎంతో సమర్థవంతంగా పాలించడం యావత్ దేశం దృష్టిని ఆకర్షించగలిగింది. మరి విజనరీగా చెప్పుకునే చంద్రబాబు అన్నీ బాగున్నా.. నాలుగుసార్లు సీఎంగా ఉండి చేసింది ఏంటి?. ఆ వివరాలే కాస్త లోతుల్లోకి వెళ్లి చెప్పుకుందాం..‘‘చెప్పిందే చేస్తాం.. చేయగలిగిందే చెప్తాం..’’ మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా, ఒక బైబిల్‌గా, ఓ ఖురాన్‌గా భావించే వైఎస్ జగన్ చెప్పే ముందు మాట ఇది. ఆ మాటను మడమ తిప్పకుండా ఐదేళ్లపాటు ఆచరణలో చేసి చూపించారాయన. ఇచ్చిన హామీలలే కాదు చెప్పని మంచిని చేసి చూపించి ఎన్నికల హామీలకంటూ ఒక నిర్వచనం.. ఓ పరిపూర్ణతను తీసుకొచ్చారు. మరి చంద్రబాబు చేసిందేంటి.. ఇప్పుడు చేస్తోంది ఏంటి?..మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసిన ఘనత చంద్రబాబుది. పైగా ప్రజలకిచ్చిన హామీల్ని ఎగ్గొట్టిన ట్రాక్ రికార్డ్ కూడా బాబుగారి సొంతం!. వీటికి తోడు ‘‘అమలు చేసేశాం’’ అంటూ హడావిడితో జనాల్ని మభ్య పెడుతూ.. కాకి లెక్కలతో కాలం గడిపేస్తుంటారు. గత ఎన్నికల్లోనూ అప్పులతో ఏపీ శ్రీలంక అయిపోతోందని జగన్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేసి.. తీరా ఈ ఏడాదిన్నరలో 2 లక్షల 66 వేల కోట్ల అప్పులు చేసి సౌత్ సూడాన్లా మార్చేస్తున్నారు. అందుకే చంద్రబాబులా.. అధికారం కోసం అబద్ధాలు చెప్పడం, జనాల్ని చీటింగ్ చేయడం తనవల్ల కాదంటూ జగన్ ఏనాడో తేల్చేశారు!.అటు సంక్షేమం.. ఇటు అభివృద్ధి.. జగన్ ఐదేళ్ల పాలనలో ఏపీ చూసిన నిత్య చిత్రం ఇది. గ్రామస్థాయి పాలన మొదలుకుని రైతులతో పాటు అన్ని వర్గాల సంక్షేమం కోసం పథకాలు.. సకాలంలో ఆ పథకాల అమలు.. తద్వారా ప్రత్యక్ష లబ్ధిదారులకు నిధుల పంపిణీ.. విద్య, ఆరోగ్యం, పరిశ్రమలు ఇలా అన్ని రంగాలపై దృష్టి పెట్టి విప్లవాత్మక నిర్ణయాలతో పరిపాలించారు. మరీ ముఖ్యంగా పేద ప్రజల గుండెల్లో స్థానం సంపాదించారు. మరి బాబుగారో..ఒకప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడూ.. ఎటూ తిరిగి ప్రజలకు తాను ఇచ్చిన వాగ్దానాల్లో చంద్రబాబు ఏ ఒక్కటి కూడా నెరవేర్చిన దాఖలాలు లేవు. ఆయన పని చేసేది పెత్తందారుల కోసమే. తనకో విజన్ ఉందని చెబుతూ పెట్టుబడుల కోసం పాకులాడడం, పరిశ్రమలు.. కంపెనీలు రాబోతున్నాయంటూ హడావిడి చేయడం.. అమరావతి పేరిట అంతర్జాతీయ రాజధానంటూ ఊహాలోకంతో జనాలను మాయ చేయడం.. ఇదే ఆయనకు తెలిసింది. సీఎంగా ఇన్నేళ్లలో అభివృద్ధి ప్రాజెక్టుల పేరు చెప్పుకుని ఆయన సంక్షేమాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. ఫలితంగా.. రైతుల నుంచి మొదలు అన్నివర్గాలు ఆయన చేతుల్లో మోసపోయి అవస్థలు పడ్డాయి.జగన్ పాలనలో ఏపీలో శాంతి భద్రతలు అదుపులో ఉండేవి. దిశ లాంటి చట్టం, యాప్‌తో మహిళలు భద్రంగా ఉండేవాళ్లు. ఆ ఐదేళ్లలో నేరాలు-ఘోరాలు పెద్దగా రికార్డు కాలేదు. సమత్యుల అభివృద్ధి కోసం మూడు రాజధానుల కోసం తీవ్రంగా ప్రయత్నించింది జగన్ ప్రభుత్వం. అయినా కూడా ఐదేళ్లపాటు జగన్ జన సంక్షేమ ప్రభుత్వంపై ఎల్లో మీడియా విషం చిమ్మని రోజంటూ లేదు. ప్రజల్లో లేని భయాలు.. అపోహలు సృష్టించుకుంటూ వచ్చింది చంద్రబాబుకి బాకా ఊదే మీడియా.. టీడీపీ అనుకూల సోషల్ మీడియా. మరి ఇప్పుడు కూటమి పాలనలో ఏం జరుగుతోంది?..👉నవరత్నాలతో పేద, రైతు, మహిళ, వృద్ధులు, విద్యార్థులు.. ఇలా ప్రతీ వర్గానికి మేలు చేసింది ఎవరు?. అన్ని వర్గాలను మోసం చేసింది.. చేస్తోంది ఎవరు?.. సంక్షేమం పేరిట లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా 2 లక్షల 70 వేల కోట్ల రూపాయలు జమ చేసింది ఎవరు?. తల్లికి వందనం.. నిరుద్యోగ భృతి.. సంక్షేమాన్ని ఎగ్గొడుతోంది ఎవరు?. ఇళ్ల పట్టాలు మహిళల పేరుతో ఇచ్చి మహిళా సాధికారతకు పెద్ద పునాది వేసింది ఎవరు?. డ్వాక్రా మహిళలను మోసం చేసింది ఎవరు?.. 👉రైతు భరోసా రూపంలో అన్నదాతకు ఆర్థిక సాయం.. ఆర్బీకేలతో అన్నివిధాలుగా ఆదుకుంది ఆదుకుంది ఎవరు?. అన్నదాత సుఖీభవతో మోసం చేస్తోంది ఎవరు?.. గిట్టుబాట ధర అందించడంతో పాటు బీమాలు, సకాలంలో పంట నష్టాలు అందించింది ఎవరు?. వ్యవసాయం దండగ అన్నది ఎవరు?.. గిట్టుబాటుధర లేక అల్లాడుతున్న రైతుల్ని గాలికొదిలేసింది ఎవరు?. 👉నాడు-నేడు కార్యక్రమంతో ప్రభుత్వ బడులు బాగుచేసింది ఎవరు?.. వాటిల్లో ట్యాబులిచ్చి అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను పేద పిల్లలకు అందించే ప్రయత్నం చేసింది ఎవరు?. అవే బడుల్లో ఇంగ్లీష్ మీడియాన్ని తొలగించింది ఎవరు?.. పిల్లలకు నాసిరకం బ్యాగుల్ని అందిస్తోంది ఎవరు?. 👉గ్రామ సచివాలయాల పేరిట ప్రజలకు ఒకే దగ్గర వివిధ సేవల్ని అందించింది ఎవరు?.. వలంటీర్ లాంటి వారధి వ్యవస్థను మోసం చేసి నిర్వీర్యం చేసిందెవరు?. క్యూల అవసరమే లేకుండా ఒకటో తేదీనే ఫించన్లు.. రేషన్‌ను డోర్‌డెలివరీ చేసింది ఎవరు?.. ఫించన్ హామీని నెరవేర్చకుండా.. లబ్ధిదారుల్లో కోతలు విధిస్తోంది ఎవరు?. ఆరోగ్యశ్రీ పరిధిని రూ.25 లక్షలకు విస్తరించింది ఎవరు?. విలేజ్ క్లినిక్స్.. ఫ్యామిలీ డాక్టర్‌తో ప్రజల వద్దకే వైద్యం చేర్చింది ఎవరు?.. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తోంది ఎవరు?.👉పేద, మధ్యతరగతి వర్గాలకు కార్పొరేట్ స్థాయి వైద్యం.. పిల్లలకు వైద్య విద్య కోసం మెడికల్ కాలేజీల కట్టించింది ఎవరు?.. ఇప్పుడు వాటిని ప్రైవేట్‌పరం చేస్తోంది ఎవరు?.. కరోనా కాలంలోనూ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంది ఎవరు?.. కరోనా కాలంలో పొరుగు రాష్ట్రం పారిపోయింది ఎవరు?.. సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చి ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చింది ఎవరు?.. ఆ ప్రజల జీవితాల్ని పట్టించుకోనిది ఎవరు?.👉అసలు అభివృద్ధి చేసిందెవరు?.. ఆ అభివృద్ధిపై తప్పుడు ప్రచారాలు చేస్తూ.. క్రెడిట్ కొట్టేస్తుందెవరు?.. ఏపీని అన్ని రంగాల్లో దూసుకుపోయేలా చేసి.. కేంద్రం నుంచి అవార్డులు, పేరు ప్రఖ్యాతులు తెచ్చింది ఎవరు?.. ఇప్పుడు ఏపీని పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్నట్లు మారుస్తోంది ఎవరు?. ఎవరిది సంక్షేమం.. ఎవరిది మోసం.. అబద్ధాలతో ఎల్లకాలం పాలించగలరా?.. ఏపీ ప్రజలు ఆ మాత్రం ఆలోచించలేరా?..కాకిలా కలకాలం కాదు.. హంసలా బతకాలంటారు పెద్దలు(చంద్రబాబు లాంటి వాళ్ల కాదు). నిబద్ధత కలిగిన నాయకుడంటే ఎలా ఉండాలో.. ఒక రాష్ట్రాన్ని ఎలా పాలించాలో.. జగన్ చూసైనా నేర్చుకోవయ్యా చంద్రబాబూ. నీ జీవితంలో కనీసం అలా ఒక్కరోజైనా పాలించగలవా?..


