bigg boss 8 telugu
ప్రధాన వార్తలు
'బిగ్‌బాస్' అగ్నిపరీక్ష.. అభిజిత్ పరువు తీసిన కంటెస్టెంట్!
ప్రతి ఏడాది ప్రసారమయ్యే 'బిగ్‌బాస్' షోకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇందులో కంటెంట్, గొడవలపై విమర్శలు వస్తుంటాయి. అదే టైంలో చూసేవాళ్లు రోజూ చూస్తూనే ఉంటారు. ఎనిమిది సీజన్ల వరకు సెలబ్రిటీలకే ఎక్కువగా అవకాశమిచ్చారు. గతేడాది టెలికాస్ట్ అయిన 9వ సీజన్ నుంచి మాత్రం సామాన్యులకు కూడా హౌస్‌లో అడుగుపెట్టే ఛాన్స్ ఇచ్చారు. దీనికి అగ్నిపరీక్ష పేరుతో పోటీ కూడా నిర్వహించారు. ఈసారి అగ్నిపరీక్షకు రంగం సిద్ధమైంది. ఈ శనివారం నుంచి గేమ్ మొదలవనుంది. ఈ క్రమంలోనే ప్రోమో వదిలారు.(ఇదీ చదవండి: 'డిసి' హీరోయిన్ వామికా ఖరీదైన 'ఐఫోన్' గిఫ్ట్)ఈసారి అమ్మాయిలు, అబ్బాయిలు కలిపి 70 మంది అగ్నిపరీక్షలో పోటీపడబోతున్నారు. రిలీజ్ చేసిన ప్రోమోలో అయితే ముగ్గురు బాగా హైలెట్ అయ్యారు. వీళ్లలో ఒక అమ్మాయి రైతుగా ఊరిలో పనిచేస్తూ పల్లె పాటలు పాడుతూ గుర్తింపు తెచ్చుకుంది. ఈమెకు తొలిదశలో గ్రీన్ సిగ్నల్ లభించింది. అలానే తెలుగుని వెనక నుంచి ముందుకు తిప్పి రాసే మరో అమ్మాయి కూడా ఆకట్టుకుంది.చివరగా ఓ కుర్రాడు.. జడ్జి సీటులో కూర్చున్న 4వ సీజన్ విజేత అభిజిత్‌కే కౌంటర్ వేశాడు. గెలిచిన తర్వాత రెండేళ్లు ఎక్కడా కనిపించకుండా పోయారు అని పరువు తీసేలా మాట్లాడాడు. దీంతో హర్ట్ అయిన అభిజిత్.. ఏం మాట్లాడుతున్నావ్? మాకేం పనిలేదని అనుకుంటున్నావా? అని సీరియస్ అయ్యాడు. ఇకపోతే వచ్చే నెల తొలివారం నుంచి 10వ సీజన్ మొదలయ్యే అవకాశముంది.(ఇదీ చదవండి: మాజీ భర్త రెండో పెళ్లి.. హీరోయిన్ ఊర్మిళా కౌంటర్ పోస్ట్)
బిగ్‌బాస్ హౌస్‌లోకి మరో జబర్దస్త్ కమెడియన్!
బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 త్వరలో ప్రారంభం కానుంది. ఈసారీ కింగ్ నాగార్జునే హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. షోను మరింత ఆసక్తికరంగా మార్చేందుకు మేకర్స్ ఇప్పటికే కంటెస్టెంట్ల ఎంపికపై దృష్టి సారించారు. సెలబ్రిటీలతో పాటు సామాన్యులకూ అవకాశం కల్పించేందుకు ‘అగ్నిపరీక్ష 2’ ద్వారా కంటెస్టెంట్లను ఎంపిక చేస్తున్నారు. అయితే ఇప్పటికే పలువురు ఈ సీజన్ 10 ఆడిషన్స్‌కు హాజరవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు షోలోకి ఎంట్రీ ఇవ్వబోయే కంటెస్టెంట్ల విషయంలో సోషల్ మీడియాలో రోజుకో పేరు వైరల్ అవుతోంది. ఇప్పుడు ఈ జాబితాలోకి మరో క్రేజీ పేరు చేరినట్లు టాక్ నడుస్తోంది. జబర్దస్త్ నటుడు రామ్ ప్రసాద్ బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టనున్నారనే వార్త ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న రామ్ ప్రసాద్.. తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. బుల్లితెరతో పాటు సినిమాల్లోనూ నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆయన బిగ్‌బాస్ హౌస్‌లోకి వస్తే షోలో కామెడీ మరింత పెరిగే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. ఇప్పటికే బిగ్‌బాస్ టీమ్ రామ్ ప్రసాద్‌ను సంప్రదించిందని, ఆయన కూడా షోలో పాల్గొనేందుకు ఓకే చెప్పారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
బ్లాస్ట్ దర్శకుడికి లక్కీచాన్స్!
తన తొలి సినిమాతోనే సంచలన విజయాన్ని అందుకున్న తమిళ యువ దర్శకుడు సుభాష్ కె రాజ్.. రెండో సినిమా అగ్ర కథానాయకుడితో చేయనున్నారని సమాచారం. బ్లాస్ట్ సినిమాతో హిట్ కొట్టిన ఈ యువ డైరెక్టర్ భారీ ఆఫర్ అందుకున్నట్టు కోలివుడ్లో గుసగుసలు విన్పిస్తున్నాయి. విలక్షణ నటుడు సియాన్ విక్రమ్‌ను డైరెక్ట్ చేసే చాన్స్ దక్కించున్నాడని తాజా అనధికార సమాచారం. ఆయనకు కథ వినిపించి, గ్రీన్ సిగ్నల్ అందుకున్నాడన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సుభాష్ కె రాజ్ చెప్పిన కథ విక్రమ్‌కు బాగా నచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఆయనతో సినిమా చేసేందుకు చియాన్ ఓకే అన్నారని సమాచారం.దర్శకుడు, హీరో ప్రదీప్ రంగనాథం శిష్యుడైన సుభాష్ కే రాజ్ (Subash K. Raj).. బ్లాస్ట్ సినిమాతో దర్శకుడిగా వెండి తెరకు పరిచయమయ్యారు. యాక్షన్ కింగ్ అర్జున్, అభిరామి, ప్రీతి ముకుందన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకుంది. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 76 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించింది. తెలుగు డబ్బింగ్లోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఫస్ట్ మూవీలో మిస్.. సెకండ్ చాన్స్!నిజానికి బ్లాస్ట్ సినిమాలో అర్జున్ పోషించిన పాత్రకు ముందుగా విక్రమ్‌నే అనుకున్నారట దర్శకుడు సుభాష్ కే రాజ్. అనివార్య కారణాలవల్ల తన మొదటి సినిమాలో విక్రమ్ నటించకపోయినా రెండో చిత్రంలో ఆయనను డైరెక్ట్ చేసే చాన్స్ దక్కించుకున్నాడని కోలివుడ్లో టాక్ నడుస్తోంది. తన రెండో సినిమాకు కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఈ క్రేజీ కాంబినేషన్లో రూపొందనున్న చిత్రానికి సంబంధించిన చర్చలు ప్రస్తుతం జరుగుతున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన ధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉందని టాక్.చదవండి: నటుడు మాధవన్ గాయబ్.. ఫొటో వైరల్!63వ చిత్రంలో విక్రమ్వీరధీర సూరన్ సినిమాతో కమర్షియల్ హిట్ అందుకున్న హీరో విక్రమ్ చిన్న బ్రేక్ తీసుకొని తాజాగా తన 63వ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇంతకుముందు వీరి కాంబినేషన్లో వచ్చిన ఇరుముగన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఆనంద్ శంకర్ సినిమా తర్వాత సుభాష్ కె రాజ్ డైరెక్షన్లో విక్రమ్ నటిస్తారని సమాచారం.
రెండేళ్లుగా ఖాళీ.. పిచ్చిదానిలా ప్రవర్తించినా సరే..: దీప్తి ఎమోషనల్
దీప్తి సునయన.. ఒకప్పుడు యూట్యూబ్‌లో సెన్సేషన్.. కవర్ సాంగ్స్, డబ్ స్మాష్‌తో పాపులర్ అయిన ఈ బ్యూటీ తెలుగు బిగ్‌బాస్ రెండో సీజన్లో పాల్గొంది. అమాయకత్వం, చిలిపితనంతో అభిమానులను సంపాదించుకున్న ఈ నటి అప్పట్లో యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్‌తో ప్రేమలో పడింది. కొన్నేళ్లపాటు కలిసిమెలిసి ఉన్న వీరిద్దరూ 2022లో బ్రేకప్ చెప్పుకున్నారు. అప్పటినుంచి ఎవరి దారి వారు చూసుకున్నారు.టైంపాస్ చేస్తున్న దీప్తిఇటీవలే షణ్ముఖ్ ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో కలిసి కొత్తింట్లో కొత్త జీవితం ప్రారంభించాడు. మరోపక్క ఈ మధ్యే ఓ ప్రైవేట్ సాంగ్ చేశాడు. అలాగే ఓ సినిమా కూడా చేస్తున్నాడు. ఇటు దీప్తి సునయన మాత్రం పనిని పక్కనపెట్టేసి జాలీగా ఎంజాయ్ చేస్తోంది. ఆడుతూ పాడుతూ కాలక్షేపం చేస్తోంది. మధ్యమధ్యలో గుళ్లుగోపురాలు కూడా తిరుగుతోంది. అయితే ఆమె ఏ ప్రాజెక్టులు చేయకపోయినా తనపై ప్రేమను అలాగే కొనసాగిస్తున్న అభిమానులకు తాజాగా కృతజ్ఞతలు తెలిపిందీ బ్యూటీ.ఏం చేశానని ఇంత ప్రేమ?'గత 10 ఏళ్లుగా మీరు నాపై ఎంతో ప్రేమ చూపిస్తున్నారు. నేను ఎలా ఉన్నా ప్రేమించారు. పిచ్చిగా ప్రవర్తించినా ఇష్టపడ్డారు. ప్రతిదానిలో నన్ను సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఇంతటి స్వచ్ఛమైన ప్రేమను పొందేందుకు నేను ఏం చేశానో నాకే తెలీదు. మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. నిజం చెప్పనా.. నాకు పని చేయడానికి ఒంట్లో శక్తి లేదు. రెండేళ్లుగా విశ్రాంతి తీసుకోవడంలోనే గడిపేశాను. అయినా మీరు నన్ను సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. మళ్లీ వర్క్‌లో బిజీ అవమని ప్రోత్సహిస్తూ ఉన్నారు. మీరిచ్చే ప్రోత్సాహం మాటల్లో చెప్పలేనిది.ఆ ప్రయత్నంలోనే ఉన్నా..నేను ఎందుకిలా డీలా పడిపోయానో తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాను. నేను మళ్లీ పూర్తి ఉత్సాహంతో మీ ముందు నిలబడతాను. నేను ఏ పనీ చేయకపోయినా సరే.. నన్ను ప్రేమిస్తున్నందుకు, నాపై నమ్మకం ఉంచినందుకు, నాకోసం నిలబడినందుకు థాంక్యూ సో మచ్' అని దీప్తి ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఇది చూసిన అభిమానులు ఆమెకు ఆల్ ద బెస్ట్ చెప్తున్నారు.చదవండి: వరుస కష్టాలు.. నాకే ఎందుకిలా జరుగుతోంది?: శ్రీజ కొణిదెల
బిగ్‌బాస్ న్యూస్
'గొర్రెలు కాయడానికి కూడా పనికిరాదు'.. యాంకర్ శ్రీముఖిపై ట్రోల్స్
తెలుగువారి బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్‌కు సమయం ఆసన్నమవుతోంది. ఈ షోలో పాల్గొని వారిని అగ్నిపరీక్ష పేరుతో సెలెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అగ్నిపరీక్ష నడుస్తోంది. పదో సీజన్ కావడంతో అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది. వచ్చేనెల ప్రారంభం కానున్న ఈ షోకు నాగార్జునే హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.ఈ నేపథ్యంలో అగ్నిపరీక్ష పేరుతో జరుగుతోన్న సెలెక్షన్ ప్రాసెస్‌లో ఎంతోమంది సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్లు పాల్గొన్నారు. వీరందరినీ వడపోసి ఫైనల్‌కు ఓ 15 మందిని ఎంపిక చేశారు. మొత్తం 55 మంది ఎలిమినేట్ చేయగా.. వీరిలో ఉప్పల్ బాలు కూడా ఉన్నారు. తనకు అన్యాయం చేశాడంటూ నవదీప్‌పై ఫైరవుతున్నాడు. తాజాగా ఈ షో యాంకర్ శ్రీముఖి తీరుపై విమర్శలొస్తున్నాయి. ఇంతకీ ఆమె ఏ చేసింది? ఎందుకు ట్రోల్ చేస్తున్నారో తెలుసుకుందాం.అయితే ఇదే బిగ్‌బాస్ అగ్నిపరీక్షలో మరో సోషల్ మీడియా ఇన్ప్లూయన్సర్ రన్నింగ్ రాజా కూడా పాల్గొన్నారు. బిగ్‌బాస్ ఛాన్స్ కోసం తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు కర్నూలు జిల్లా కోడుమూరు నుంచి వచ్చాడు. అయితే టాస్క్‌లో భాగంగా అతను శ్రీముఖిని ఇమిటేట్ చేసేందుకు యత్నించాడు. శ్రీముఖి మేకప్ ఇలా వేసుకుంటుందని తన హావాభావాలతో చూపించాడు. అదే సమయంలో శ్రీముఖి దగ్గరికీ రన్నింగ్ రాజా వెళ్లాడు. దీంతో అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నన్ను టచ్ చేస్తే చెంప పగలగొడతా అంటూ ఆమె దురుసుగా ప్రవర్తించింది.దీంతో శ్రీముఖి తీరుపై నెటిజన్స్ మండిపడుతున్నారు. మా ఊర్లో గొర్రెలు కాయడానికి కూడా శ్రీముఖి పనికిరాదంటూ ట్రోల్ చేస్తున్నారు. పల్లెటూరి వాళ్లను షోలకు పిలిచి అవమానించడమే వీళ్ల పని అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనలాంటి పల్లెటూరి వాళ్లను స్టేజీల మీదకు తీసుకెళ్లి బకరాలను చేస్తారని ఆవేదన చెందుతున్నారు. ఏదేమైనా ఇదంతా షోలో భాగమైతే ఓకే కానీ.. గ్రామీణ ప్రాంతాల ప్రజల టాలెంట్‌ను మాత్రం హేళన చేస్తే సరికాదని మరికొందరు అంటున్నారు. View this post on Instagram A post shared by Khadeer Palleturi (@palleturikurrallu2)
బిగ్‌బాస్ సీజన్-10.. ఈ సారి దశవతారమే..!
తెలుగువారి బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్‌కు సమయం ఆసన్నమవుతోంది. ఈ షోలో పాల్గొని వారిని అగ్నిపరీక్ష పేరుతో సెలెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అగ్నిపరీక్ష నడుస్తోంది. పదో సీజన్ కావడంతో అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది. వచ్చేనెల ప్రారంభం కానున్న ఈ షోకు నాగార్జునే హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సారి సరికొత్తగా.. సవాల్‌గా ఉండనుందని చెబుతున్నారు.ఈ నేపథ్యంలోనే బిగ్‌బాస్ మరో ప్రమోషన్ వీడియో రిలీజ్ చేశారు. ఇందులో నాగార్జున విభిన్నంగా కనిపించారు. మీరు ఎంతైనా ఆశించండి. 'బిగ్‌బాస్ సీజన్-10 నెక్ట్స్ లెవల్, వెరైటీ, సర్ప్రైజ్, డ్రామా, ఛాలెంజ్ పదింతలు..వారం వారం సరికొత్త అవతారం.. ఈ సారి దశవతారం' అంటూ హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఆటలో సవాల్ కాదు.. ఆటే సవాల్ అంటూ ఆడియన్స్‌లో మరింత ఆసక్తి క్రియేట్ చేశారు. తాజాగా రిలీజైన ఈ ప్రోమో మీరు కూడా చూసేయండి.
బిగ్‌బాస్ రియాలిటీ షో.. ముహుర్తం ఫిక్స్
బుల్లితెరపై ఫుల్ క్రేజ్ ఉన్న రియాలిటీ షో బిగ్‌బాస్. ఏ భాషలోనైనా ఈ షోకు ఆడియన్స్ ఆదరణ ఏమాత్రం తగ్గడం లేదు. మరోసారి బుల్లితెర ప్రియులను అలరించేందుకు రియాలిటీ షో వచ్చేస్తోంది. హిందీలో ఇప్పటికే సక్సెస్‌ఫుల్‌గా ఈ షో 19 సీజన్స్ పూర్తి చేసుకుంది. ఈ ఏడాది బిగ్ బాస్ సీజన్- 20కి కౌంట్‌డౌన్ మొదలైంది. రాబోయే సీజన్‌కు సంబంధించి తాజాగా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సారి కూడాహోస్ట్గా సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరించనున్నారు.ఈ తాజా సీజన్ సెప్టెంబర్ 6 నుంచి మొదలు కానుందని మేకర్స్ రివీల్ చేశారు. ఈ టీజర్లో గుర్రంతో పాటు సల్మాన్ ఖాన్ ఎంట్రీ ఇచ్చారు. టీజర్ చూస్తుంటే ఈ సారి సరికొత్తగా సీజన్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ టీజర్లో కంటెస్టెంట్ల వివరాలు మాత్రం రివీల్ చేయలేదు. ఈ సీజన్లో కొత్త ట్విస్ట్‌లను ప్రేక్షకులను పరిచయం చేస్తుందని..అంతే కాకుండా సీజన్-20 మధ్యలో ఒక మిస్టరీ ఉంటుందని సల్మాన్ ఖాన్ టీజర్లో ప్రస్తావించారు. ఈ టీజర్ కేవలం ఆరంభం మాత్రమేనన్నారు.బిగ్ బాస్-20 స్ట్రీమింగ్ ఎక్కడంటే?ఈ ఏడాది బిగ్ బాస్ సీజన్- 20 సెప్టెంబర్ 6న ప్రారంభం కానుందని వెల్లడించారు. ఈ రియాలిటీ షో జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. అంతేకాకుండా కలర్స్ టీవీలో ప్రత్యక్ష ప్రసారం కానుంది. అయితే ఈ ఏడాది అన్ని భాషల్లోనూ ఓకేసారి ఈ షో ప్రారంభమవుతుందని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో మరింత క్లారిటీ రావాల్సి ఉంది. అదే జరిగితే తెలుగుతో పాటు మిగతా భాషల్లోనూ అదో రోజు నుంచే షో మొదలు కానుంది. View this post on Instagram A post shared by JioHotstar (@jiohotstar)
బిగ్ బాస్‌పై పుస్తకం... బిగ్ రియాలిటీ...!
ఈ ఏడాది హిందీ, తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం బంగ్లా భాషలలో బిగ్ బాస్ ఆరు ఎడిషన్లను ఒకేసారి ప్రారంభించడానికి జియోస్టార్ సిద్ధమైంది. తద్వారా తొలిసారి దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు బిగ్ బాస్ వినోదాన్ని ఏకకాలంలో అనుభవించబోతున్నారు. ఇది భారతదేశంలో రియాలిటీ ఎంటర్టైన్ మెంట్ రంగంలో ఒక మైలురాయిగా నిలువనుంది. ఈ ఆరు ఎడిషన్లు సెప్టెంబర్ 2026 నుంచి జియోస్టార్ టెలివిజన్ నెట్వర్క్, జియో హాట్‌స్టార్‌లో దేశ వ్యాప్తంగా ప్రసారం కానున్నాయి. బిగ్ బాస్‌కు పర్యాయపదంగా మారిన దిగ్గజ హోస్ట్‌లు సల్మాన్ ఖాన్, విజయ్ సేతుపతి, నాగార్జున, కిచ్చా సుదీప్, మోహన్ లాల్ ఈ సీజన్ లోనూ కొనసాగనున్నారు. ఈ సంవత్సరం బెంగాల్ దాదా సౌరవ్ గంగూలీ రాకతో ఇది మరింత ఆకర్షణీయంగా మారనుంది. ఈ మైలురాయిని పురస్కరించుకుని, ’ఇండియాస్ బిగ్ రియాలిటీ’ అనే ఒక ప్రత్యేకమైన డేటాతో నిండిన కాఫీ టేబుల్ పుస్తకాన్ని జియో హాట్‌స్టార్ ఆవిష్కరించింది. రెండు దశాబ్దాల బిగ్ బాస్, అద్భుతమైన ప్రయాణం, సాంస్కృతి ప్రభావం శాశ్వత వారసత్వాన్ని ఈ పుస్తకం వివరిస్తుంది.గత ఏడాది 500 మిలియన్ వీక్షకులు...భారతదేశపు అతిపెద్ద వినోద ఫ్రాంచైజీలలో ఒకటిగా బ్రాండ్లకు ఎలా వేదికగా నిలిచిందో ’ ఇండియాస్ బిగ్ రియాలిటీ’ వెల్లడించింది. కేవలం 2025లోనే, 500 మిలియన్లకు పైగా వీక్షకులను ఈ షో చేరుకుని 438 బిలియన్లకు పైగా వీక్షణ నిమిషాలను సృష్టించింది ఆరు భాషా ఎడిషన్లనూ కలిపి చూసినప్పుడు ఈ ఎంగేజ్మెంట్లో ఇయర్ ఆన్ ఇయర్ 47% వృద్ధిని సాధించింది. దాదాపు 625 కు పైగా బ్రాండ్లు ఈ షో ని ఉపయోగించుకుని, జాతీయ ప్రాంతీయ మార్కెట్లలో ఉత్పత్తులను విడుదల చేయటం, అవగాహన కల్పించడం, వినియోగదారులతో శాశ్వత సంబంధాలను ఏర్పరచుకోవడం చేశాయి. జియోహాట్‌స్టార్‌లో, ప్రతి 10 మంది వీక్షకులలో ఆరుగురు బిగ్ బాస్ లైవ్ ఫీడ్‌ను చూస్తున్నారు.ఇంటర్నెట్లోనూ ఫుల్ క్రేజ్...బిగ్ బాస్ కేవలం చూసే అనుభవం కంటే ఎంతో ఎక్కువ అని ఈ కాఫీ టేబుల్ పుస్తకం వెల్లడిస్తుంది. జియోహాట్‌స్టార్‌లో 9.32 బిలియన్లకు పైగా ఓట్లు పోలవడం 43 మిలియన్ల లైవ్ చాట్లు నమోదు కావడం ద్వారా ప్రేక్షకులు చురుకుగా వ్యవహరించారు. దాదాపు ప్రతి నలుగురు వీక్షకులలో ముగ్గురు ఈ షోతో భిన్న రకాలుగా మమేకమవుతున్నారు, బిగ్ బాస్ ఇంటర్నెట్లో విపరీతమైన క్రేజ్‌ను సృష్టించింది. కేవలం 2025లోనే 1.7 బిలియన్లకు పైగా సోషల్ ఎంగేజ్మెంట్లను 30 మిలియన్ల యూజర్–జనరేటెడ్ మీమ్స్‌ను బిగ్ బాస్ సృష్టించింది. బిగ్ బాస్ ఇప్పుడు హిందీ మార్కెట్లలో 20 కోట్లకు పైగా వీక్షకులను, దక్షిణ భారతదేశంలో 3 కోట్లకు పైగా వీక్షకులను చేరుకుంది. ఇక్కడ ప్రతి 10 మంది టెలివిజన్ వీక్షకులలో 8 మంది ఈ షోతో మమేకమవుతున్నారు. ఈ ప్రాంతంలోని మిగతా అన్ని రియాలిటీ షోల కంటే దీని రీచ్ 3.5 రెట్లు ఎక్కువ.అదే బిగ్ బలం...గత రెండు దశాబ్దాలుగా, బిగ్ బాస్ ప్రతి సీజన్ తో తన స్థాయిని, ఆదరణను, ప్రాముఖ్యతను పెంచుకుంటూ, నిరంతరం తనను తాను పునరావిష్కరించుకుంది. ప్రేక్షకులను నిరంతరం పాల్గొనేలా చేయడమే బిగ్ బాస్ బలం, ’ఈ కాఫీ టేబుల్ పుస్తకం భారత దేశ వినోద పర్యావరణ వ్యవస్థ పరిణామంలోని కీలకమైన క్షణాలను వెలుగులోకి తెచ్చింది‘ అని పుస్తకావిస్కరణ సందర్భంగా జియోస్టార్ టీవీ, ఎంటర్టైన్ మెంట్ సేల్స్ హెడ్ మహేష్ శెట్టి అన్నారు. ‘ పండుగ సీజన్ లో ప్రేక్షకుల వివిధ అంశాలపై దృష్టి మరల్చే తరుణంలో, బిగ్ బాస్ ఒక శక్తివంతమైన అయస్కాంతంలా పనిచేస్తుంది. 24/7 లైవ్ ఫీడ్లు, బిలియన్ల కొద్దీ ఓట్లు, లైవ్ చాట్ల ద్వారా ఏటా 47% ఎంగేజ్మెంట్ వృద్ధిని సాధిస్తూ, ఈ షో వీక్షకులను సైతం తమ చురుకైన భాగస్వాములుగా మారుస్తుంది. ‘ అని జియోస్టార్ డిజిటల్, ఎంటర్టైన్మెంట్ సేల్స్ హెడ్ భాస్కర్ రమేష్ అన్నారు.
బిగ్‌బాస్ గ్యాలరీ
బిగ్‌బాస్‌లోకి పూజ.. కుంకుమ పెట్టి ఏడ్చేసిన 'తనూజ'
బిగ్‌బాస్ 9 కంటెస్టెంట్స్.. బ్యాక్ గ్రౌండ్ డీటైల్స్ (ఫొటోలు)
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తత
రిషబ్ శెట్టి, ప్రగతిల పెళ్లిరోజు.. ప్రత్యేకమైన ఫోటోలు షేర్ చేసిన జోడి
ఇప్పటి వరకు బిగ్ బాస్ తెలుగు విజేతలు వీళ్లే.. (ఫొటోలు)
తెర వెనక 'బిగ్‌బాస్ 8' ఫినాలే హంగామా (ఫొటోలు)
బిగ్‌బాస్ 8 విజేతగా నిఖిల్.. ఏమేం గెలుచుకున్నాడు? (ఫొటోలు)
కుటుంబ సమేతంగా సింహాచలం అప్పన్నను దర్శించుకున్న బిగ్‌బాస్ విన్నర్ కౌశల్ (ఫోటోలు)
జడలో మల్లెపూలు పెట్టి.. కళ్లు తిప్పుకోలేని అందంతో యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)

