చాలామంది అనుకున్నదే జరిగింది. నిఖిల్.. బిగ్‌బాస్ 8 విజేత అయ్యాడు
చివరివరకు గౌతమ్ vs నిఖిల్ అన్నట్లే పోటీ నడిచింది
కానీ మొదటి నుంచి హౌసులో ఉన్న నిఖిల్ మళియక్కల్ విన్నర్ అయ్యాడు
మరి ఈసారి బిగ్‌బాస్ విజేతకు ఈసారి ఏమేం బహుమతులు వచ్చాయంటే?
రూ.55 లక్షల మొత్తం నిఖిల్ సొంతమైంది. ఇందులో కొంత ట్యాక్స్ ఉంటుందిలేండి!
టాప్-3లో ఉన్నప్పుడు హోస్ట్ నాగార్జున.. బ్రీఫ్ కేసు ఆఫర్ ఇచ్చాడు కానీ ఎవరు తీసుకోలేదు
దీంతో ఈసారి ప్రైజ్‌మనీలో కోతలేం లేకుండా అంతా నిఖిల్ సొంతమైంది
విజేతగా నిలిచిన నిఖిల్‌కి ఇన్ఫినిటి ట్రోఫీని అందజేశారు
దీనితో పాటు మారుతీ కంపెనీకి చెందిన డాజ్లర్ కారుని కూడా నిఖిల్‌కి అందజేశారు
సూట్ కేసు తీసుకుని తన అభిమానుల్ని మోసం చేసుకోదలుచుకోలేనని చెప్పాడు
సూట్ కేసులో రూ.55 లక్షలున్న సరే తనకు వద్దని నిఖిల్ ఖరాఖండీగా చెప్పేశాడు
తొలి నుంచి బ్యాలెన్స్‌గా గేమ్ ఆడిన నిఖిల్.. విజేత కావడానికి అన్ని విధాల అర్హుడే!


