తెలుగులో రిలీజ్ ‍అవుతోన్న సూపర్ హిట్ మూవీ.. ఎప్పుడంటే? | Super Hit Movie Released In Tollywood in This Date | Sakshi
Sakshi News home page

Paa.. Paa Movie: తెలుగు ప్రేక్షకుల ముందుకు పా.. పా.. రిలీజ్ ఎప్పడంటే?

Dec 29 2024 7:09 PM | Updated on Dec 29 2024 7:09 PM

Super Hit Movie Released In Tollywood in This Date

గ‌తేడాది త‌మిళంలో విడుద‌లై సూపర్ హిట్‌గా నిలిచిన చిత్రం ‘డా..డా’.  ఈ చిత్రంలో కవిన్, అపర్ణ దాస్ హీరో, హీరోయిన్లుగా నటించారు. గణేశ్ కె బాబు దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ మూవీ తమిళ ప్రేక్షకులను ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.30 కోట్లు వసూలు చేసింది. తండ్రి కొడుకుల సెంటిమెంట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం కోలీవుడ్‌లో సక్సెస్ సాధించింది.

కోలీవుడ్‌లో సూపర్ హిట్ కావడంతో తెలుగు ఆడియన్స్‌ ముందుకు ఈ మూవీని తీసుకొస్తున్నారు. పా.. పా పేరుతో తెలుగులో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. జేకే ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై నిర్మాత నీరజ కోట విడుద‌ల చేయ‌బోతున్నారు. ఈ చిత్రాన్ని జ‌న‌వ‌రి 3న ఆంధ్ర, తెలంగాణతో పాటు అమెరికా, ఆస్ట్రేలియా థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుందని ప్రకటించారు. ఇటీవ‌ల‌ే విడుద‌ల చేసిన‌ పా.. పా.. మూవీ ట్రైల‌ర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ రావ‌డంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Advertisement
 
Advertisement
Advertisement