Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Special Article On Pithapuram Assembly Constituency 2024
వంగా గీత బలం.. ప్యాకేజ్‌ స్టార్‌ బలహీనతలు ఇవే!

ఏపీలో పోలింగ్‌ ముగిసి పది రోజులు గడిచింది.. కాని ఇప్పటికీ అందరి చూపూ పిఠాపురం నియోజకవర్గం మీదే ఉంది. కారణం అక్కడ ప్యాకేజీ స్టార్‌గా పేరు తెచ్చుకున్న పవన్‌ కల్యాణ్‌ పోటీ చేయడమే. దత్త తండ్రి పచ్చ పార్టీని గెలిపించడానికి రాజకీయాల్లోకి వచ్చిన పవన్‌ ఈసారి పిఠాపురంలో ఎలాగైనా గెలవాలని పడరాని పాట్లు పడ్డారు. ఇక్కడ పవన్ ప్రత్యర్థి వంగా గీత అత్యంత ఆదరణ కలిగిన ప్రజా నాయకురాలు. పిఠాపురంలో పోటీ చేసిన వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి వంగా గీత బలం ఏంటి? ప్యాకేజీ స్టార్‌ బలహీనతలు ఏంటి? పిఠాపురం ఓటర్లు ఎవరి పక్షాన నిలిచారు? కారణాలు ఏంటి?2019 ఎన్నికల్లో భీమవరం, గాజువాక నుండి పోటీ చేసి రెండు చోట్లా ఓడిపోయిన పవన్ కళ్యాణ్ .. ఈసారి కాపులు అత్యధికంగా ఉన్నారన్న కారణంతో పిఠాపురం నుంచి అసెంబ్లీకి పోటీ చేశారు. పవన్ పిఠాపురం నుండి పోటీ చేస్తానని ప్రకటించక ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతా విశ్వనాధ్ ను పిఠాపురం ఇంఛార్జిగా ప్రకటించి..బరిలో నిలిపింది. గత ఎన్నికల్లో కంటే ఈసారి పిఠాపురంలో అదనంగా 6 శాతం పోలింగ్‌ నమోదైంది. దీంతో పోలింగ్ సరళిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ .. జనసేన పార్టీలు అంచనాలు వేసుకుని గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి.వాస్తవంగా చూస్తే గతంలో జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్‌గా, పిఠాపురం ఎమ్మెల్యేగా, ఒకసారి రాజ్యసభ సభ్యురాలిగా, ప్రస్తుతం లోక్‌సభ ఎంపీగా ఉన్న వంగా గీత ఉన్నత విద్యావంతురాలు. న్యాయశాస్త్ర పట్టభద్రురాలు. ప్రజాసేవలో దశాబ్దాల అనుభవం గడించి, ప్రజల ఆదరణ చూరగొన్న వంగా గీతతో టెన్త్‌ క్లాస్‌ చదివిన పవన్‌కల్యాణ్‌కు ఏమాత్రం పోలిక లేదు. అసలు పవన్‌కల్యాణ్‌ పార్ట్‌టైమ్ పొలిటీషియన్‌ అనే విషయం అందిరికీ తెలుసు. పైగా రాష్ట్రంలో ఏ జిల్లా గురించీ అవగాహన లేదు. గతంలో రెండు జిల్లాల నుంచి పోటీ చేసి ఓడిపోయి..ఈసారి మరో జిల్లానుంచి పోటీ చేస్తున్నారు.టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ త్యాగం చేస్తే పవన్ కు పిఠాపురం నుండి పోటీ చేసే అవకాశం కలిగింది. తన గెలుపు కోసం వర్మ మీద ఆధారపడిన పవన్..ఒక దశలో ఆయన్ను నమ్మలేదు. చివరికి టివి, సినిమా నటులతో తన కోసం పిఠాపురంలో ప్రచారం చేయించుకున్నాడు పవన్. మెగా కుటుంబాన్ని సైతం తన తరపున ప్రచారానికి పిఠాపురం తెచ్చుకుని గెలుపు కోసం పడరాని పాట్ల పడ్డాడు.ఎలాగైనా గెలవాలని ఇన్ని పాట్లు పడినా..ఒకవేళ ఎమ్మెల్యేగా గెలిస్తే పవన్ తమకు అందుబాటులో ఉండరని ప్రజలకు తెలిసొచ్చింది. ఎందుకంటే పవన్ ప్రచారం కోసం పిఠాపురం వచ్చిన కొత్తలో చిన్నపాటి జర్వానికి రాత్రుళ్లు ప్రత్యేక హెలికాప్టర్, విమానాల్లో హైదరాబాదు వెళ్లి వచ్చేవారు. దీంతో పవన్‌పై పిఠాపురం ప్రజల్లో నమ్మకం పోయింది. అందువల్ల అందరికి అందుబాటులో ఉండే వంగా గీతా పిఠాపురంకు ఎమ్మెల్యే ఐతే బెటర్ అని ప్రజలు నమ్మారు. ఇక పిఠాపురంలో కాపుల్లో మెజార్టీ పవన్ వైపు ఉన్నా...వంగా గీతను కూడా అభిమానించే కాపులు అధికంగానే ఉన్నారు. అంతేకాదు బీసీ, ఎస్సీ, మైనార్టీలు వంగా గీతకు ఏకపక్షంగా మద్దతు పలికారు.2009లో వంగా గీత పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా గెలిచాక..అనేక అభివృద్ది పనులను చేసి ప్రజల విశ్వాసం పొందారు. కాకినాడ ఎంపీగా కూడా జిల్లా అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. గొల్లప్రోలు, పిఠాపురం వద్ద రైల్వే అండర్ పాస్‌లు నిర్మించి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించారు. యూ.కొత్తపల్లి మండలంలోని సెజ్ లో ప్రతిష్టత్మక ఐఐఎఫ్టీ విద్యా సంస్దను తీసుకువచ్చారు. కాకినాడలో వంద పడకల ఈఎస్ఐ ఆసుపత్రిని నిర్మించి కార్మికులకు అండగా నిలిచారు. మరోవైపు యూ.కొత్తపల్లి మండలంలో సీఎం జగన్‌ జగన్ చోరవతో రూ.400 కోట్లతో ఫిషింగ్ హర్బర్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఉప్పాడ తీర ప్రాంతం కోతకు గురికాకుండా జియో ట్యూబ్ నిర్మాణం కోసం వంగా గీత కేంద్రానికి ప్రతిపాదన పంపించారు.ఇలా చెప్పుకుంటే కాకినాడ జిల్లాకు ప్రత్యేకించి పిఠాపురంకు వంగా గీత చేసిన సేవలు చాలా ఉన్నాయి. అందుకే ఇక్కడి ప్రజలకు గీత అంటే నమ్మకం. ప్రజల్లో ఆదరణ ఉన్నందునే సీఎం జగన్‌ పిఠాపురం ప్రచార సభలో మాట్లాడుతూ.. వంగా గీతను డిప్యూటీ సీఎం చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో ఇక్కడ ప్రజలు ఇది తమకో వరమని భావించారు. అందుకే అటు అభివృద్ది.. ఇటు సంక్షేమం కలిపి పిఠాపురంలో ఓటింగ్ శాతం భారీగా పెంచాయని అర్దమవుతోంది. మొత్తం మీద వంగా గీతకే విజయావకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Chittoor TDP Leaders Hand In Bangalore Rave Party
బెంగుళూరు రేవ్ పార్టీలో టీడీపీ నేతల హస్తం

బెంగళూరు: కర్ణాటకలోని బెంగళూరు నగరంలో జరిగిన రేవ్‌ పార్టీలో టీడీపీ మూలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రేవ్‌ పార్టీలో డ్రగ్స్‌ విక్రయించిన నిందితుల్లో మరో ఇద్దరు టీడీపీ నేతలు హస్తం ఉన్న విషయం తాజాగా బయటపడింది.చిత్తూరు జిల్లా మద్దిపట్ల పల్లికి చెందిన ప్రణీత్‌ చౌదరితో పాటు అదే జిల్లా కొండేటివండ్ల గ్రామానికి చెందిన సుకుమార్‌ నాయుడు ఉన్నట్లు తేలింది. ఈ ఇద్దరూ టీడీపీ బెంగళూరు ఐటీ ఫారంకి చెందిన కీలక వ్యక్తులు. వీరికి పూతలపట్టు టీడీపీ అభ్యర్థి మురళితో సత్సంబంధాలున్నాయి.కాగా, అంతకుముందు రేవ్‌ పార్టీలో డ్రగ్స్‌ విక్రయించిన ఐదుగురు ప్రధాన నిందితుల ఫోటోలు, వివరాలను బెంగళూరు పోలీసులు వెల్లడించగా, తాజాగా ప్రణీత్‌ చౌదరి, సుకుమార్‌ నాయుడులు సైతం ఇందులో నిందితులుగా ఉన్నట్లు గుర్తించారు.చిత్తూరుకు చెందిన టీడీపీ యువనేత రణధీర్‌ విక్రమ్‌నాయుడు, టీడీపీ కార్యకర్త కాణిపాకానికి చెందిన అరుణ్‌కుమార్‌నాయుడులు ఈ రేవ్‌ పార్టీకి డ్రగ్స్‌ సప్లై చేశారు. వీళ్లపై మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.రణధీర్‌విక్రమ్‌నాయుడుకు చిత్తూరులోని టీడీపీకి చెందిన పలువురు నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయంటున్నారు. అరుణ్‌కుమార్‌నాయుడుది కాణిపాకం సమీపంలోని మద్దిపట్లపల్లెగా చెబుతున్నారు. బెంగళూరు ఎలక్ట్రానిక్‌ సిటీలో జరిగిన రేవ్‌ పార్టీలో 101 మందిని పట్టుకున్న పోలీసులు ఐదుగురు మినహా.. మిగిలినవాళ్లను సొంత పూచికత్తుపై విడుదల చేశారు. వీళ్ల రక్తనమూనాలు సేకరించగా, విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరుకావాలని షరతు పెట్టారు.మాదక ద్రవ్యాలు విక్రయించిన ఐదుగురిలో వీరిద్దరితో పాటు మొహ్మద్‌ అబూబక్కర్‌ సిద్ధికి, ఎల్‌.వాసు, డి.నాగబాబులున్నారు. నిందితుల నుంచి 15.56 గ్రా. ఎండీఎంఏ పిల్స్, 6 గ్రాముల హైడ్రో గాంజా, 6.2 గ్రాముల కొకైన్‌తో పాటు ఇతర మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. వీళ్లపై మాదక ద్రవ్యాల నిరోధక చట్టం–1985, సెక్షన్‌ 8(సి), 22(బి), 22(సి), 22(ఏ), 27(బి), 25, 27, ఐపీసీ 1860 సెక్షన్‌ 290, 294 కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అంతా ఓ పద్ధతి ప్రకారం.. వాసు బర్త్‌ డే పేరుతో నిర్వహించిన ఈ రేవ్‌ పార్టీలో వాస్తవానికి ఎలాంటి బర్త్‌ డే వేడుకలు జరగలేదు. ఉద్దేశపూర్వకంగా డ్రగ్స్‌ విక్రయించడం, వేశ్యా గృహాన్ని నిర్వహించడాన్ని పోలీసులు గుర్తించారు. రేవ్‌ పార్టీలోకి వచ్చే ప్రతి ఒక్కరికీ ఓ పాస్‌వర్డ్‌ ఇచ్చారు. వాసు బర్త్‌ డే పార్టీ అనే యూజర్‌ నేమ్, పాస్‌వర్డ్‌ చెప్పినవాళ్లకు మాత్రమే ఇక్కడ ప్రవేశం ఉంటుంది. ఇందుకోసం నిర్వాహకులు ఓ ప్యాకేజీ ఇచ్చారు. ఒక్కో వ్యక్తి నుంచి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేసినట్టు తెలిసింది.‘సన్‌సెట్‌ టు సన్‌రైజ్‌ విక్టరీ’ పేరిట ఈ నెల 19వ తేదీ సాయంత్రం 5 నుంచి 20వ తేదీ ఉదయం 6 గంటల వరకు రేవ్‌ పార్టీ జరిగేలా ప్రణాళిక రూపొందించారు. తొలుత ఎలక్ట్రానిక్‌ సిటీ స్టేషన్‌ పరిధిలో కేసు నమోదవగా, తర్వాత హెబ్బాగోడికి బదిలీ చేయాలనుకున్నారు. తాజాగా ఈ కేసును సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ బెంగళూరు(సీసీబీ) పోలీసులకు అప్పగిస్తున్నట్లు కర్ణాటక పోలీసులు ప్రకటించారు. ఇందులో సెక్స్‌ రాకెట్‌ అంశం కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానించి, ఆ దిశగా సైతం విచారణ చేస్తున్నారు.ఈ ఘటనలో పోలీసులు సీజ్‌ చేసిన కార్లలో ఫార్చూనర్‌ కారు ఏపీ 39 హెచ్‌ 0002 నంబర్‌తో ఉంది. ఇది చిత్తూరులోని గుడిపాల మండలం రాసనపల్లెకు చెందిన త్యాగరాజులు నాయుడు అనే వ్యక్తి పేరిట ఉంది. త్యాగరాజులు నాయుడు కారు అక్కడ ఎందుకు ఉందనే దానిపై పోలీసులు ఇప్పటికే విచారణ ప్రారంభించారు. ఇంతలోపు ఈ కారును తొమ్మిది నెలల కిందటే మరో వ్యక్తికి విక్రయించినట్లు, అతను ఇంకా కారును తన పేరిట మార్చకోలేదని కొత్త డ్రామా చేస్తున్నట్లు తెలుస్తోంది. చిత్తూరు నియోజకవర్గానికి చెందిన ఓ టీడీపీ ముఖ్య నేత ఈ కారును ఉపయోగించినట్లు సమాచారం.

Rajasthan Royals and Sunrisers Hyderabad Qualifier 2 Live Updates
క్వాలిఫ‌య‌ర్‌-2.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజ‌స్తాన్‌

Rajasthan Royals and Sunrisers Hyderabad Qualifier 2 Live Updates:ఐపీఎల్‌-2024లో క్వాలిఫ‌య‌ర్‌-2కు రంగం సిద్ద‌మైంది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదిక‌గా క్వాలిఫ‌య‌ర్‌-2లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజ‌స్తాన్ రాయ‌ల్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ రెండు మార్పుల‌తో బ‌రిలోకి దిగగా.. రాజ‌స్తాన్ ఎటువంటి మార్పులు చేయ‌లేదు. ఎస్ఆర్‌హెచ్ జట్టులోకి మార్‌క్ర‌మ్‌, జయదేవ్ ఉనద్కత్ వ‌చ్చారు. ఈ మ్యాచ్‌లో గెలిచిన జ‌ట్టు ఫైన‌ల్‌కు అర్హ‌త సాధిస్తోంది.తుది జ‌ట్లుసన్‌రైజర్స్ హైదరాబాద్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, నితీష్ రెడ్డి, ఐడెన్ మార్క్‌రామ్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీప‌ర్‌), అబ్దుల్ సమద్, పాట్ కమిన్స్(కెప్టెన్‌), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, టి నటరాజన్రాజస్తాన్‌ రాయల్స్ : యశస్వి జైస్వాల్, టామ్ కోహ్లర్-కాడ్మోర్, సంజు శాంసన్ (వికెట్ కీప‌ర్‌/ కెప్టెన్‌), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, రోవ్‌మన్ పావెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్

Aarogyasri Services Continue In Ap
AP: ఆరోగ్యశ్రీ ఆగలేదు.. అయినా అసత్య ప్రచారమే!

సాక్షి, విజయవాడ: ఏపీ వ్యాప్తంగా డా.వైఎస్సార్ ఆరోగ్య శ్రీ సేవలు కొనసాగుతున్నాయి. ఆరోగ్యశ్రీ సేవలకు అంతరాయం లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయినా కూడా నిలిచిపోయాయంటూ ఎల్లో మీడియా తప్పుడు కథనాలు ఇస్తోంది. రెండు రోజుల క్రితం నెట్ వర్క్ ఆసుపత్రులకి 200 కోట్ల బకాయిలు విడుదల చేసింది. మిగిలిన బకాయిల విడుదలపై ఇప్పటికే సీఎస్ జవహర్ రెడ్డి, వైద్య శాఖ స్పెషల్ సీఎస్ కృష్ణబాబు, ఆరోగ్యశ్రీ సిఈవో లక్ష్మీ షాతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే.. 2023-24 ఆర్ధిక సంవత్సరంలో నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు ప్రభుత్వం రూ.3566 కోట్లు చెల్లించింది. 2024-25 ఆర్ధిక సంవత్సరంలో నెట్ వర్క్ ఆసుపత్రులకు తొలి రెండు నెలలలో రూ.366 కోట్ల చెల్లింపులు చేసింది. ఇక ఏడాది కాలంగా రోజుకి సరాసరిన 5349 మందికి ఆరోగ్యశ్రీలో చికిత్సలు జరిగాయి. మొన్న(మే 22, బుధవారం) 6718 మందికి.. నిన్నన(మే 23, గురువారం) 7118 మందికి ఆరోగ్యశ్రీలో చికిత్సలు అందాయి. ఈ విషయాన్ని ఆరోగ్యశ్రీ సీఈవో లక్ష్మీ షా తెలిపారు. ఆరోగ్యశ్రీ సేవలకు అంతరాయం కలిగించవద్దన్న పిలుపుకి నెట్ వర్క్ ఆసుపత్రులు సహకరిస్తున్నాయని ఆయన వెల్లడించారు. పొరుగు రాష్ట్రాలలోనూ ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగుతున్నాయని.. ఆరోగ్యశ్రీ సేవలకు ఎక్కడా అంతరాయం లేదని లక్ష్మీషా స్పష్టం చేశారు.

SS Rajamouli Appreciates The Cannes Film Festival Award Winners and Nominees From India
భారత టాలెంట్‌ సరిహద్దులు దాటుతోంది: రాజమౌళి

టాలీవుడ్‌ దర్శకధీరుడు రాజమౌళి వారిపై ప్రశంసలు కురిపించారు. ఫ్రాన్స్‌లో జరుగుతున్న కేన్స్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌-2024లో బెస్ట్ షార్ట్‌ ఫిల్మ్‌గా ఇండియాకు చెందిన చిత్రం ఎంపిక కావడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా 'సన్‌ఫ్లవర్స్‌ వర్‌ ద ఫస్ట్ వన్‌ టు నో' చిత్రబృందాన్ని అభినందించారు. ఈ మేరకు తన ట్విటర్‌ ద్వారా వారికి శుభాకాంక్షలు తెలిపారు.రాజమౌళి తన ట్వీట్‌లో రాస్తూ..'భారతీయ ప్రతిభ సరిహద్దులను దాటుతోంది. ఇది వినడానికి చాలా సంతోషంగా ఉంది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్- 2024లో ఉత్తమ షార్ట్ ఫిల్మ్‌గా లా సినీఫ్ అవార్డును గెలుచుకున్న సందర్భంగా ‘సన్‌ఫ్లవర్స్ వర్ ద ఫస్ట్ ఒన్స్ టు నో’ రూపొందించిన యువతకు ఇవే నా వందనాలు' అంటూ పోస్ట్‌ చేశారు. అంతేకాకుండా ఈ షార్ట్‌ ఫిల్మ్ తీసిన చిదానంద నాయక్‌ను ట్యాగ్‌ చేశారు.కాగా.. చిదానంద తెరకెక్కించిన సన్‌ఫ్లవర్స్‌ వర్‌ ద ఫస్ట్ వన్‌ టు నో షార్ట్‌ ఫిల్మ్ కేన్స్‌లో అరుదైన ఘనత సాధించింది. వివిధ భాషలకు చెందిన 17 చిత్రాలతో పోటీ పడి తొలి స్థానంలో నిలిచింది. 16 నిమిషాలు ఉన్న ఈ షార్ట్‌ ఫిల్మ్‌ను ఓ కన్నడ జానపద కథ ఆధారంగా రూపొందించారు. వృద్ధురాలి కోడిని ఎవరో దొంగలించడం.. దానిని కనుగొనడం కోసం ఆమె పడే తపనను ఈ చిత్రంలో చూపించారు. ఇప్పుడీ షార్ట్‌ ఫిల్మ్ హాలీవుడ్‌తో పోటీ పడి మొదటి బహుమతి గెలుచుకోవడంపై చిత్ర బృందం హర్షం వ్యక్తం చేసింది. Indian talent breaching boundaries… Happy to hear that @Chidanandasnaik’s ‘Sunflowers Were the First Ones to Know’ has won the La Cinef Award for Best Short Film at Cannes 2024!Kudos to the youngsters 👏🏻👏🏻— rajamouli ss (@ssrajamouli) May 24, 2024

Internal Differences Between CM Revanth Reddy And Congress?
సీఎం నిర్ణయాలే ఫైనల్‌.. ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి మధ్య గ్యాప్?

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీకి, రేవంత్‌ ప్రభుత్వానికి మధ్య సమన్వయం లేదా? ముఖ్యమంత్రి చేసే ప్రకటనలు పార్టీ నాయకత్వానికి ముందు చెప్పడంలేదా? తానే పీసీసీ చీఫ్ కావడంతో పార్టీకి చెప్పక్కర్లేదని రేవంత్ అనుకుంటున్నారా? సమాచారం తెలియకే ప్రభుత్వ నిర్ణయాలను సమర్థించడంలో పార్టీ నాయకులు ఇబ్బందులు పడుతున్నారా? పార్టీకి, ప్రభుత్వానికి దూరం పెరగడానికి కారణం ఏంటి? గత కొద్దిరోజులుగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వ నిర్ణయాలపై కాంగ్రెస్ పార్టీ నేతలే అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఏదైనా కీలక నిర్ణయం తీసుకునేముందు కనీసం పార్టీలో సీనియర్లతో అయినా చర్చించరా అంటూ అవేదన వెళ్ళగక్కుతున్నారు. ఏ అంశం మీదైనా ప్రభుత్వం సడెన్‌గా నిర్ణయం తీసుకుంటే దాన్ని మేము గుడ్డిగా సమర్దించాలా అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారట సదరు సీనియర్‌ నేతలు.కొన్ని రోజులుగా ప్రభుత్వం తీసుకుంటున్న పలు నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయి. ప్రతిపక్షాలకు ప్రభుత్వమే ఆయుధాలు ఇచ్చినట్లుగా అవుతోంది. విపక్షాల విమర్శలకు అధికార పార్టీ నేతలు ధీటుగా బదులివ్వాలి కదా అని ముఖ్యమంత్రి రేవంత్‌ కార్యాలయంలో కీలకంగా వ్యవహరిస్తున్న నేత అనడంతో.. ప్రభుత్వ నిర్ణయాలన్నీ మాకు ముందుగా చెబుతున్నారా అని సీఎంఓ కార్యాలయంలోని ఆ నేతను ప్రశ్నించారట సీనియర్లు. మూడు రోజుల క్రితం సన్న వడ్లకు బోనస్ ఇవ్వనున్నట్లు కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని ప్రకటించడంతో, దొడ్డు వడ్ల సంగతి ఏంటని ప్రశ్నిస్తున్నాయి ప్రతిపక్షాలు. ఈ అంశంపై బీఆర్ఎస్, బీజేపీ నేతలు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఎదురు దాడి చేస్తున్నారు. అయితే అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి అనుకున్నస్థాయిలో కౌంటర్స్‌ రావడం లేదని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారట. ఎందుకు మాట్లాడటంలేదని అడిగితే ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునేముందు మాకు కనీస సమాచారం అయినా ఇస్తే.. దాని వల్ల తలెత్తే ఇబ్బందులను అంచనా వేసుకుని ప్రతిపక్షాల మీద దాడికి సిద్ధం అవుతాం కదా అని రివర్స్‌ అవుతున్నారట కొందరు సీనియర్ వరి ధాన్యం కొనుగోలు విషయం మాత్రమే కాదు, రైతు బంధు, కరెంటు వంటి పలు విషయాలలో ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి మధ్య గ్యాప్ కనిపిస్తోంది. విపక్షాలు చేసే విమర్శలను కౌంటర్‌ చేయడానికి తమకు సమాచారం ఇచ్చేవారే లేరని పార్టీ నాయకులు ప్రభుత్వం తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధ్యక్షుడే సీఎం కావడంతో ఆయన నిర్ణయాలే ఫైనల్ అవుతున్నాయి. దీంతో పార్టీ నేతలు సీఎం రేవంత్‌ను కలవడానికి అవకాశం లేకుండాపోతోంది. దీంతో విపక్షాల విమర్శలకు ఎలా స్పందించాలో తోచక, తమకు ఎందుకులే అనుకుని కొందరు నేతలు సైలెంట్‌ అవుతున్నారు. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం చేయడానికి ఎవరైనా సీనియర్ నాయకుడికి బాధ్యతలు అప్పగించాలని ఇప్పటికే సీఎంకు సలహా ఇచ్చారట. ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్వయం కోసం సహజంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటారు. కాని టీ.కాంగ్రెస్‌లో ఆ పరిస్థితి కనిపించడంలేదనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పార్టీకి ప్రభుత్వానికి మధ్య అనుసంధానం చేయడానికి ఓ నేత ఉండేవారు. ఏదైనా అంశం మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి ముందో లేక తర్వాతో..పార్టీ తీసుకోవాల్సిన లైన్‌పై నాయకులకు క్లియర్‌గా వివరించేవారు. అయితే ప్రస్తుతం టీ కాంగ్రెస్‌లో అలాంటి ఏర్పాటు లేకపోవడం వల్ల అటు పార్టీకి ఇటు ప్రభుత్వానికి నష్టం చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకే వీలైనంత త్వరగా పార్టీ, ప్రభుత్వం మధ్య అనుసంధానం చేసేందుకు సీఎం రేవంత్‌కు సన్నిహతుడైన ఓ కీలక నేతకు బాధ్యత అప్పగించాలని భావిస్తున్నారనే టాక్ నడుస్తోంది. ప్రస్తుతం సీఎం రాజకీయ సలహాదారుగా వేం నరేందర్‌రెడ్డి ఉన్నారు. ఆయనకే సమన్వయం బాధ్యత అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Delhi Court Convicts Medha Patkar In Defamation Case
పరువు నష్టం కేసు.. మేధాపాట్కర్‌ను దోషిగా తేల్చిన కోర్టు

న్యూఢిల్లీ: ‘నర్మదా బచావో’ ఆందోళన్‌ ఉద్యమానికి నాయకత్వం వహించిన మేధాపాట్కర్‌ను పరువు నష్టం కేసులో ఢిల్లీ‌ కోర్టు దోషిగా తేల్చింది. ఈకేసులో ఆమెకు రెండేళ్ల జైలు శిక్ష లేదా జరిమానా లేదంటే రెండూ విధించే అవకాశం ఉంది. పాట్కర్‌ దోషిగా తేలిన పరువు నష్టం కేసును ప్రస్తుత ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా గతంలో ఫైల్‌ చేశారు. అప్పట్లో సక్సేనా అహ్మదాబాద్‌ కేంద్రంగా పనిచేసే ఎన్జీవో నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌కు నేతృత్వం వహించేవారు. పాట్కర్‌ గుజరాత్‌లో ‘నర్మదా బచావో’ ఆందోళన్‌కు నాయకత్వం వహించేవారు.ఈ క్రమంలోనే పాట్కర్‌, సక్సేనా ఒకరిపై ఒకరు తరచూ కోర్టులకెక్కేవారు. తనపై పాట్కర్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారని సక్సేనా క్రిమినల్‌ డిఫమేషన్‌ కేసు దాఖలు చేశారు. ఈ కేసులోనే ప్రస్తుతం ఢిల్లీ సాకేత్‌ కోర్టు పాట్కర్‌ను దోషిగా తేల్చింది.

Elon Musk And X User Tweet Viral
యూజర్ ప్రశ్న.. మస్క్ సమాధానం: ట్వీట్స్ వైరల్

బిలినీయర్, టెస్లా సీఈఓ 'ఇలాన్ మస్క్' ఇటీవల ఎక్స్(ట్విటర్)లో ఓ యూజర్ ట్వీట్‌కు రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఎక్స్ఏఎన్ బార్క్స్‌డేల్ అనే యూజర్ ట్విటర్‌లో వచ్చిన మార్పులు గురించి, చాలా రోజుల నుంచి ఎదుర్కొంటున్న సమస్యలను గురించి వివరించారు. ''ఐ లవ్ ట్విటర్ అంటూ.. ఇప్పటివరకు ఇందులో చెత్త ఫీచర్ ఏమిటంటే, నేను యాప్‌ని ఓపెన్ చేసిన ప్రతిసారీ ఆసక్తికరంగా అనిపించే ట్వీట్‌ని చూస్తాను, ఆపై ఫీడ్ రిఫ్రెష్ అవుతుంది. దాన్ని మళ్ళీ కనుగొనలేకపోతున్నాను'' అని పేర్కొన్నారు. ఈ సమస్య ఎంతోమందికి ఎదురైంది. ఇది సరైనదేనా అంటూ ప్రశ్నించారు.యూజర్ ప్రశ్నకు మస్క్ రిప్లై ఇస్తూ.. అవును, మేము దీన్ని సరి చేస్తున్నాము, కాబట్టి మీరు ఆసక్తికరమైన పోస్ట్‌లను చూడటానికి వెనుకకు స్క్రోల్ చేయవచ్చు'' అని ట్వీట్ చేశారు. తన ప్రశ్నకు రిప్లై ఇచ్చిన ఇలాన్ మస్క్‌కు.. బార్క్స్‌డేల్ కృతఙ్ఞతలు తెలిపారు. ఈ చర్చ మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.Yeah, we’re fixing this so you can scroll back to see interesting posts— Elon Musk (@elonmusk) May 23, 2024

Engineering Councelling Schedule Released In Telangana
TG: ఈసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల

సాక్షి,హైదరాబాద్‌: పాలిటెక్నిక్‌ డిప్లొమో విద్యార్థులు బీటెక్‌, బీఫార్మసీ రెండో సంవత్సరంలో లేటరల్‌ ఎంట్రీ ద్వారా ప్రవేశాలకు పొందడం కోసం ప్రవేశాలకు సంబంధించిన షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. అడ్మిషన్ల ప్రక్రియ మూడు విడతల్లో జరగనుంది. జూన్ 27 నుంచి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభంజూన్ 30 నుంచి మొదటి విడత వెబ్ ఆప్షన్లుజులై 12న మొదటి విడత సీట్ల కేటాయింపుజులై 19 నుంచి రెండో విడత కౌన్సెలింగ్జులై 24న రెండో విడత సీట్ల కేటాయింపుజులై 30 నుంచి తుది విడత కౌన్సెలింగ్ఆగస్టు 5న తుది విడత సీట్ల కేటాయింపుఇంటర్నల్ స్లైడింగ్ ఆన్‌లైన్‌లో కన్వీనర్ ద్వారా చేపట్టాలని నిర్ణయించారు. ఆగస్టు 12 నుంచి ఇంటర్నల్ స్లైడింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆగస్టు 16న ఇంటర్నల్ స్లైడింగ్ సీట్లు కేటాయిస్తారు. ఆగస్టు 17న స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలు విడుదల చేస్తారు. పాలిసెట్ కౌన్సెలింగ్‌ షెడ్యూల్ ఇదీ..తెలంగాణలో రెండు విడతల్లో పాలిసెట్ కౌన్సెలింగ్ జరగనుంది.జూన్‌ 20 నుంచి పాలిసెట్‌ కౌన్సెలింగ్ ప్రారంభంజూన్ 22 నుంచి తొలి విడత వెబ్ ఆప్షన్లుజూన్ 30న మొదటి విడత సీట్ల కేటాయింపుజులై 7 నుంచి రెండో విడత కౌన్సెలింగ్జులై 9న రెండో విడత వెబ్ ఆప్షన్లుజులై 13న రెండో విడత సీట్ల కేటాయింపు పాలిసెట్‌లోనూ ఇంటర్నల్ స్లైడింగ్‌ను కన్వీనర్ ద్వారా చేపట్టాలని నిర్ణయించారు. జులై 21 నుంచి ఇంటర్నల్ స్లైడింగ్‌కు అవకాశం ఉంటుంది. జులై 23న స్పాట్ అడ్మిషన్ మార్గదర్శకాలు విడుదలవుతాయి.

Jaya Badiga, An Andhra Pradesh Native Becomes Judge In US
యూఎస్‌ జడ్జిగా తొలి తెలుగు మహిళ! వైరల్‌గా ప్రమాణ స్వీకారం..!

మహిళలు అన్ని రంగాల్లో ముందుంటున్నారు. పట్టుదల, శ్రమించే తత్వం ఉన్న మహిళలు చరిత్రలో తమకో పేజీని లిఖించుకుంటున్నారు. మన దేశ కీర్తి పతాకన్ని ప్రపంచ వినువీధుల్లో ఎగుర వేసి చరిత్ర సృష్టిస్తున్నారు. అలానే భారత సంతతికి చెందిన జయ బాడిగ అమెరికా కాలిఫోర్నియాలోని శాకమెంటో కోర్టులో న్యాయమూర్తిగా నియమితురాలై మన దేశానికి గర్వ కారణంగా నిలిచింది. ముఖ్యంగా ఆమె ప్రమాణ స్వీకారం హాట్‌టాపిక్‌గా మారింది. ఇంతకీ ఎవరీమె? ఆమె నేపథ్యం ఏంటంటే..భారత సంతతికి చెందిన జయ బాడిగ ఆమెరికా కాలిఫోర్నియాలో కౌంటీ సుపీరియర్‌ కోర్టులో న్యాయమూర్తిగా నియమితులయ్యారు. పైగా ఇలాంటి అత్యున్నత పదవిని అలంకరించిన తొలి తెలుగు మహిళగా చరిత్ర సృష్టించింది జయ బాడిగా. అంతేగాదు ఆమె ప్రమాణ స్వీకారం కూడా నెట్టింట ఓ సంచలనంగా మారింది. భారతీయ మూలాలు ఉన్న ఆమె సంస్కృత శ్లోకాలు పఠిస్తూ.. జడ్జిగా ప్రమాణ స్వీకారం చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అంతేగాదు సభను ఉద్దేశించి తన మాతృభాష తెలుగులో మాట్లాడి.. ఎన్నటికీ మన మూలాలను మర్చిపోకూడదనే విషయాన్ని చాటి చెప్పింది.అంతేగాదు బాడిగ సభను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా 80 మిలియన్లకు పైగా ప్రజలు మాట్లాడే మాతృభాష తెలుగులో మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం పలకాలని కోరుకున్నాను అని చెప్పారు. ఇలా శాక్రమెంటోలో తెలుగులో మాట్లాడటం తొలిసారి అని బాడిగ అన్నారు. ఆమె ప్రసంగం పూర్తి అయిన వెంటనే కరతాళధ్వనులతో ప్రశంసించారు అక్కడి అధికారులు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఆమె నేపథ్యం..ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నగరంలో జన్మించిన భారత సంతతి అమెరికన్‌ న్యాయవాది జయ బాడిగ. ఇక ఆమె 2022 వరకు శాక్రమెంటో కౌంటీ సుపీరియర్‌ కోర్టులో కమిషనర్‌గా పనిచేసిన జయ బాడిగను అదే కోర్టుకి న్యాయమూర్తిగా కాలిఫోర్నియా గవర్నర్‌ గావిన్‌ న్యూసోమ్‌ నియమించారు. ఆమె బడిగా శాంటా క్లారా యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ లా నుంచి జ్యూరిస్ డాక్టర్ డిగ్రీని, బోస్టన్ విశ్వవిద్యాలయం నుంచి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్స్‌లో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని పూర్తి చేశారు. డెమోక్రాట్ పార్టీకి చెందిన బాడిగా, 2020లో కాలిఫోర్నియా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ కేర్ సర్వీసెస్‌లోనూ, 2018లో కాలిఫోర్నియా గవర్నర్ ఆఫీసు ఆఫ్ ఎమర్జెన్సీ సర్వీసెస్‌లో అటార్నీగానూ సేవలందించారు. అంతేగాదు బడిగా సర్టిఫైడ్‌ కుటుంబ న్యాయ నిపుణురాలే గాక పదేళ్లకు పైగా కుటుంబ చట్టంలో పనిచేసిన వ్యక్తి ఆమె. Jaya Badiga impressed by speaking in Sanskrit as well as Telugu on the occasion of taking oath as Santa Clara Chief Justice. pic.twitter.com/tli9FTAQaR— PURUSHOTHAM (@purushotham999) May 22, 2024 (చదవండి: ఆనందమే జీవిత మకరందం!)

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement