Lok Sabha Election 2024: దేశ రాజధానిలో... బీజేపీకి సవాలే | Sakshi
Sakshi News home page

Lok Sabha Election 2024: దేశ రాజధానిలో... బీజేపీకి సవాలే

Published Thu, May 23 2024 12:37 AM

Lok Sabha Election 2024: AAP-Congress alliance vs BJP tough fight in delhi

ఆప్‌–కాంగ్రెస్‌ గట్టి పోటీ 

7 లోక్‌సభ స్థానాలకు 25న పోలింగ్‌

దేశ రాజధానివాసులు గత రెండు లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీకి జైకొట్టారు. ఈసారి మాత్రం కాంగ్రెస్‌–ఆప్‌ గట్టి పోటీ ఇస్తున్నాయి. 2014, 2019 ఎన్నికల్లో మూడు పారీ్టలూ విడిగా పోటీ చేయడం బీజేపీకి బాగా కలిసొచ్చింది. ఇండియా కూటమి భాగస్వాములైన కాంగ్రెస్‌ 3, ఆప్‌ 4 చోట్ల బీజేపీకి సవాలు విసురుతున్నాయి. దాంతో అధికార వ్యతిరేకతను అధిగమించేందుకు ఏకంగా ఆరుగురు సిట్టింగులను కాషాయ పార్టీ మార్చేసింది! 

ఆప్‌ సర్కారుపై అవినీతి ఆరోపణలనే ప్రచారాస్త్రంగా చేసుకుంది. అదంతా తమ పార్టీని అంతం చేసే కుట్రలో భాగమంటూ ఆప్‌ తిప్పికొడుతోంది. జైలు నుంచి తిరిగొచ్చిన అధినేత కేజ్రీవాల్‌ ప్రచార భారాన్ని భుజాలపై మోశారు. శనివారం జరిగే పోలింగ్‌లో ఓటర్లు ఎవరిని దీవిస్తారన్నది ఉత్కంఠగా మారింది...            

న్యూఢిల్లీ
కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి స్థానంలో దివంగత సుష్మా స్వరాజ్‌ కుమార్తె, యువ న్యాయవాది, బాసురీ స్వరాజ్‌కు బీజేపీ టికెటిచ్చింది. 40 ఏళ్ల బాసురీ రాజకీయాలకు కొత్త కాదు. 2013, 2015, 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మాలవీయనగర్‌ నుంచి విజయం సాధించారు. ఆప్‌ అభ్యర్థి సోమనాథ్‌ భారతి కూడా లాయరే. ఇద్దరూ పోటాపోటీగా ప్రచారం చేశారు. ప్రధాని, కేంద్ర మంత్రులు, విపక్ష నేతలు, ప్రభుత్వ ఉన్నతాధికారుల నివాసాలు ఈ వీఐపీ స్థానం పరిధిలోనే ఉన్నాయి. ట్రాఫిక్‌ జామ్, మురుగునీటి సమస్యలపై ప్రజల్లో అసంతృప్తి ఉంది.  

చాందినీ చౌక్‌ 
విస్తీర్ణంలో దేశంలోనే అతి చిన్న లోక్‌సభ స్థానమిది. సిట్టింగ్‌ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి హర్షవర్ధన్‌ బదులు వ్యాపారి ప్రవీణ్‌ ఖండేల్వాల్‌ (64)కు బీజేపీ టికెటిచ్చింది. కాంగ్రెస్‌ నుంచి జై ప్రకాశ్‌ అగర్వాల్‌ పోటీలో ఉన్నారు. ఇక్కడ పెద్ద సంఖ్యలో ఉండే వర్తకుల కోసం తాము చేసిన పనులను గుర్తు చేస్తూ అగర్వాల్, ఖండేల్‌వాల్‌ ఓట్లడిగారు. ఆప్‌ మద్దతు అగర్వాల్‌కు అదనపు బలం.

నార్త్‌ ఈస్ట్‌ ఢిల్లీ 
విస్తీర్ణంలో దేశంలోనే అతి చిన్న లోక్‌సభ స్థానమిది. సిట్టింగ్‌ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి హర్షవర్ధన్‌ బదులు వ్యాపారి ప్రవీణ్‌ ఖండేల్వాల్‌ (64)కు బీజేపీ టికెటిచ్చింది. కాంగ్రెస్‌ నుంచి జై ప్రకాశ్‌ అగర్వాల్‌ పోటీలో ఉన్నారు. ఇక్కడ పెద్ద సంఖ్యలో ఉండే వర్తకుల కోసం తాము చేసిన పనులను గుర్తు చేస్తూ అగర్వాల్, ఖండేల్‌వాల్‌ ఓట్లడిగారు. ఆప్‌ మద్దతు అగర్వాల్‌కు అదనపు బలం.

నార్త్‌ ఈస్ట్‌ ఢిల్లీ 
బీజేపీ సిట్టింగ్‌ ఎంపీ, భోజ్‌పురి నటుడు మనోజ్‌ తివారీ హ్యాట్రిక్‌ కోసం ప్రయతి్నస్తున్నారు. మాజీ విద్యార్థి నేత కన్హయ్య కుమార్‌ కాంగ్రెస్‌ అభ్యరి్థగా సవాల్‌ విసురుతున్నారు. బిహార్, యూపీ, జార్ఖండ్‌ నుంచి వలస వచ్చిన ఓటర్లు ఇక్కడ ఏకంగా 30 శాతం పైగా ఉంటారు.  అందుకే బిహార్‌కు చెందిన కన్హయ్యకు కాంగ్రెస్‌ చాన్సిచి్చంది. అయితే ఆయన పోటీ తమకే కలిసొస్తుందని బీజేపీ అంటోంది. ఢిల్లీ జేఎన్‌యూ విద్యార్థి సంఘం నాయకునిగా కన్హయ్య ఎదుర్కొన్న ఆరోపణలను ప్రచారంలో పదేపదే ప్రస్తావించింది.

ఈస్ట్‌ ఢిల్లీ 
సిట్టింగ్‌ ఎంపీ, ప్రముఖ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ బదులు హర్షా మల్హోత్రాకు బీజేపీ టికెటిచ్చింది. ఆప్‌ నుంచి కులదీప్‌ కుమార్‌ పోటీ చేస్తున్నారు. వీరిద్దరూ తొలిసారి లోక్‌సభ బరిలో దిగారు. అయితే ఈస్ట్‌ ఢిల్లీ మేయర్‌గా చేసిన అనుభవం మల్హోత్రా సొంతం. ఈస్ట్‌ ఢిల్లీ బీజేపీ కంచుకోట అనే చెప్పాలి. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి అయిన పీసీసీ మాజీ చీఫ్‌ రవిందర్‌ సింగ్‌ లవ్లీ ఇటీవలే బీజేపీలో చేరడం ఆ పారీ్టకి మరింత కలిసి రానుంది.

నార్త్‌వెస్ట్‌ ఢిల్లీ 
ఈ ఎస్సీ రిజర్వ్‌డ్‌ స్థానం నుంచి సిట్టింగ్‌ ఎంపీ హన్స్‌రాజ్‌ హన్స్‌ బదులు కౌన్సిలర్‌ యోగేంద్ర చందోలియాకు బీజేపీ చాన్సిచి్చంది. ఆయన గతంలో నార్త్‌ ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌గా చేశారు. 2014 ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై ఎంపీగా గెలిచిన ఉదిత్‌రాజ్‌ ఈసారి కాంగ్రెస్‌ అభ్యరి్థగా బరిలో దిగడం ఆసక్తికరం. ఆయన ఎంపీగా నియోజకవర్గానికి ముఖం కూడా చూపించలేదని ప్రచారంలో చందోలియా పదేపదే చెప్పారు.

వెస్ట్‌ ఢిల్లీ 
ఆప్‌ నేత మహాబల్‌ మిశ్రా, బీజేపీ అభ్యర్థి కమలీత్‌ షెరావత్‌ మధ్య గట్టి పోటీ నెలకొంది. 70 ఏళ్ల మహాబల్‌ మిశ్రాది బిహార్‌లోని మధుబని. ఇక్కడ బిహారీ ఓటర్లు భారీగా ఉండటం ఆయనకు అనుకూలించే అంశం. షెరావత్‌ బీజేపీ మహిళా మోర్చా ప్రెసిడెంట్‌గా పనిచేశారు. ఎక్కువ మంది ఇంటి నుంచి ఓటేసిన లోక్‌సభ స్థానంగా ఈసారి వెస్ట్‌ ఢిల్లీ వార్తల్లోకెక్కింది. 85 ఏళ్లు పై బడిన 969 మంది, 179 మంది దివ్యాంగులు ఇంటి నుంచి ఓటేశారు.

సౌత్‌ ఢిల్లీ 
సిట్టింగ్‌ ఎంపీ, వివాదాస్పద నేత రమేశ్‌ బిదురి బదులు బదార్‌పూర్‌ ఎమ్మెల్యే రామ్‌వీర్‌ సింగ్‌ బిదురికి బీజేపీ టికెటిచి్చంది. ఆప్‌ నుంచి సాహిరాం పహిల్వాన్‌ బరిలో ఉన్నారు. ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని 10 అసెంబ్లీ సీట్లలో బీజేపీ చేతిలో ఉన్నది బదార్‌పూర్‌ ఒక్కటే! అభ్యర్థులిద్దరూ గుర్జర్‌ సామాజికవర్గానికి చెందిన వారే కావడంతో పోటీ ఆసక్తికరంగా మారింది.  
 
– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Advertisement
 
Advertisement
 
Advertisement