తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఈసీ అనుమతి | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఈసీ అనుమతి

Published Fri, May 24 2024 5:38 PM

EC Gives Permission To Telangana Formation Day Celebrations

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిచ్చింది. ఈసీ అనుమతి లభించిన నేపథ్యంలో వేడకులకు సంబంధించిన ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ మేరకు జూన్‌ 2న సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో రాష్ట్ర అవతరణ వేడుకలను నిర్వహించాలని నిర్ణయించారు.

అదే రోజు ముందుగా గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద సీఎం రేవంత్‌ రెడ్డి నివాళులర్పించనున్నారు. గన్ పార్క్ కార్యక్రమం తర్వాత పరేడ్ గ్రౌండ్ ఆవిర్భావ వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement