కన్నప్ప మూవీలో ఛాన్స్‌? మంచు లక్ష్మి రియాక్షన్‌ ఇదే! | Sakshi
Sakshi News home page

కన్నప్పలో నటిస్తున్నారా..? మనోజ్‌కు, నాకు ఏ రోల్‌ ఆఫర్‌ చేయలేదు!

Published Fri, May 24 2024 5:26 PM

Manchu Lakshmi Prasanna Reacts On Kannappa Movie Chance

మంచు ఫ్యామిలీ మెంబర్స్‌ అంతా సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నారు. మోహన్‌బాబు నిర్మాతగా విష్ణు 'కన్నప్ప' చిత్రం చేస్తుండగా, మనోజ్‌ 'మిరాయ్‌' మూవీ చేస్తున్నాడు. మంచు లక్ష్మీ 'యక్షిణి' అనే హారర్‌ సిరీస్‌లో నటించింది. తాజాగా ఈ సిరీస్‌ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో లక్ష్మికి కొన్ని ఆసక్తికర ప్రశ్న ఎదురైంది.

నాతో నటించాలంటే భయం
మీ సోదరుడు విష్ణు చేస్తున్న కన్నప్ప సినిమాలో దాదాపు అన్ని భాషల స్టార్స్‌ నటిస్తున్నారు. మరి మీరు అందులో ఉన్నారా? అని ఓ విలేఖరి అడిగాడు. అందుకు మంచు లక్ష్మి స్పందిస్తూ.. 'మా ఇంట్లో ఉన్న అబ్బాయిలు నాతో కలిసి నటించాలంటే భయపడుతున్నారు. అందుకే నేను వారి సినిమాలు చేయడం లేదు. 

అందువల్లే ఇవ్వలేదేమో
నేను నటిస్తే వాళ్లెక్కడ కనిపించరోనని వారి సినిమాల్లో యాక్ట్‌ చేయడం లేదు. ఇది సరదాగా అంటున్నానులే కానీ.. నాకు సరిపోయే క్యారెక్టర్‌ అందులో లేకపోవడం వల్లే విష్ణు నాకు సినిమా ఇవ్వలేదేమో! కన్నప్ప చాలా పెద్ద సినిమా.. నాతో పాటు మనోజ్‌కు కూడా ఏ క్యారెక్టర్‌ ఇవ్వలేదు. అయినా అందరం కలిసి చేస్తే అది ఫ్యామిలీ సినిమా అయిపోతుంది' అని మంచు లక్ష్మి వ్యాఖ్యానించింది.

చదవండి: బాయ్‌ఫ్రెండ్‌ ఫోన్‌ చెక్‌ చేస్తానన్న జాన్వీ కపూర్‌

Advertisement
 
Advertisement
 
Advertisement