ఆకలిని అడ్డు పెట్టుకుని యుద్ధం చేయడం లేదు: నెతన్యాహు | Sakshi
Sakshi News home page

ఆకలిని అడ్డు పెట్టుకుని యుద్ధం చేయడం లేదు: నెతన్యాహు

Published Wed, May 22 2024 9:53 PM

Benjamin Nethanyahu Comments On Icc Prosecutors

జెరూసలెం: యుద్ధ నేరాల కింద తనకు అరెస్టు వారెంట్‌ ఇవ్వాలని ఇంటర్నేషనల్‌ క్రిమినల్‌ కోర్టు (ఐసీసీ)లో ప్రాసిక్యూటర్ చేసిన వాదనపై ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ మండిపడ్డారు. అబద్ధాల ఆధారంగా తనపై ఆ వారెంట్‌ కోరుతున్నారని మండిపడ్డారు. ఈ విషయమై ఆయన బుధవారం(మే22) మీడియాతో మాట్లాడారు. 

గాజాలో ఆకలి కేకలను అడ్డం పెట్టుకుని హమాస్‌తో యుద్ధంలో ఇజ్రాయెల్‌ పైచేయి సాధిస్తోందన్న వాదనను ఖండించారు. ఆకలి మంటలను ఇజ్రాయెల్ యుద్ధతంత్రంగా వాడుతున్నట్లు అనిపిస్తోందని గతంలో ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తంచేసింది.

ఇదే గనుక నిజమైతే దానిని యుద్ధ నేరం కింద పరిగణిస్తామని ఆగ్రహం వ్యక్తంచేసింది. ఐక్యరాజ్యసమితి ఆందోళన సరైనదే అనేందుకు కావాల్సిన ఆధారాలున్నాయని ఐసీసీ ప్రాసిక్యూటర్ల బృందం తాజాగా వెల్లడించింది. 

Advertisement
 
Advertisement
 
Advertisement