
చంద్రబాబు అరాచక పాలనకు 2019 మే 23న ముగింపు పలుకుతూ ప్రజా తీర్పు
50 శాతం ఓట్లు.. 151 శాసన సభ, 22 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ చారిత్రక విజయం
రాష్ట్ర చరిత్రలో సువర్ణక్షరాలతో లిఖించేలా ఐదేళ్లుగా సీఎం జగన్ సుపరిపాలన
వైఎస్సార్‌సీపీకి మరో చారిత్రక విజయాన్ని జనం కట్టబెడతారంటున్న విశ్లేషకులు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ సీపీ చారిత్రక విజయానికి ఐదేళ్లు పూర్తయ్యాయి. రాష్ట్రంలో 2014–19 మధ్య చంద్రబాబు అరాచక పాలనకు తెరదించుతూ 2019, మే 23న ప్రజలు చారిత్రక తీర్పు ఇచ్చారు. 50 శాతం ఓట్లు.. 151 శాసనసభ, 22 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించి గతంలో ఎన్నడూలేనంత ఘన విజయాన్ని అందించారు. 2019, మే 30న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ ఐదేళ్లూ సుపరిపాలన అందించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేసి రికార్డు సృష్టించారు.
అర్హతే ప్రామాణికంగా వివక్ష చూపకుండా.. లంచాలకు తావు లేకుండా.. అత్యంత పారదర్శకంగా సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ రూపంలోనే రూ.2.70 లక్షల కోట్లను పేదల ఖాతాల్లోకి జమ చేశారు. నాన్ డీబీటీ రూపంలో మరో రూ.1.79 లక్షల కోట్ల ప్రయోజనాన్ని పేదలకు చేకూర్చారు. వాటిని సద్వినియోగం చేసుకున్న పేదలు సాధికారత దిశగా అడుగులు వేస్తున్నారు.
మీ బిడ్డ ప్రభుత్వం వల్ల మీ కుటుంబానికి మంచి జరిగి ఉంటే.. ఫ్యాన్ గుర్తుపై రెండు బటన్లు నొక్కి ఆశీర్వదించాలని సీఎం జగన్ వినమ్రంగా చేసిన విజ్ఞప్తికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలు భారీఎత్తున స్పందించారు. ఈనెల 13న జరిగిన పోలింగ్ సరళిని బట్టి చూస్తే.. వైఎస్సార్‌సీపీ మరోసారి అఖండ విజయం సాధించడం ఖాయమని.. చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి చిత్తుగా ఓడిపోవడం తథ్యమని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు.
సరిగ్గా 5 యేళ్ళ కిందట ఇదే రోజున ఏపీని ఊపేసిన ఫ్యాను గాలి.
151 ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలతో చరిత్ర తిరగరాసిన వైయస్ఆర్ సీపీ
జూన్ 4న అంతకుమించి సాధించే ఫలితాలతో మరోసారి దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేయనున్న జగనన్న.#5YearsOfYSRCPMassVictory pic.twitter.com/XmdiIPvMEa— YSR Congress Party (@YSRCParty) May 23, 2024