బంగ్లా ఎంపీ హత్యకు రూ.5 కోట్ల సుపారీ | Bangladesh MP old friend paid Rs 5 crore to kill him | Sakshi
Sakshi News home page

బంగ్లా ఎంపీ హత్యకు రూ.5 కోట్ల సుపారీ

May 24 2024 5:44 AM | Updated on May 24 2024 5:44 AM

Bangladesh MP old friend paid Rs 5 crore to kill him

కోల్‌కతా: చికిత్స కోసం భారత్‌కు వచ్చి పశి్చమబెంగాల్‌లో హత్యకు గురైన బంగ్లాదేశ్‌ ఎంపీ అన్వరుల్‌ అజీమ్‌ అనర్‌ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. అజీమ్‌ హత్యకు అతని పాత స్నేహితుడే రూ.5 కోట్ల సుపారీ ఇచ్చాడని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని పశి్చమబెంగాల్‌ సీఐడీ ఐజీ అఖిలేశ్‌ చతుర్వేది గురువారం ప్రకటించారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇది పక్కా ప్రణాళికతో చేసి హత్య. కోల్‌కతా శివారులోని న్యూ టౌన్‌ ప్రాంతంలో అజీమ్‌ చివరిసారిగా కనిపించిన అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్‌ను అజీమ్‌ పాత స్నేహితుడే అద్దెకు తీసుకున్నాడు. అమెరికా పౌరసత్వమున్న ఆ స్నేహితుడు ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడు. 56 ఏళ్ల అజీమ్‌ను హంతకులు ఊపిరాడకుండా చేసి చంపాక మృతదేహాన్ని ముక్కలుగా చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement