స్వాతి మలివాల్‌పై దాడి కేసు.. కేజ్రీవాల్‌ సహాయకుడికి రిమాండ్‌ | Sakshi
Sakshi News home page

స్వాతి మలివాల్‌పై దాడి కేసు.. కేజ్రీవాల్‌ సహాయకుడికి జ్యుడీషియల్‌ రిమాండ్‌

Published Fri, May 24 2024 4:20 PM

Bibhav Kumar Sent To Judicial Custody In Swathi Maliwal Case

న్యూఢిల్లీ:ఆమ్‌ఆద్మీపార్టీ(ఆప్‌) ఎంపీ స్వాతిమలివాల్‌పై దాడి కేసులో ప్రధాననిందితుడైన బిభవ్‌కుమార్‌కు కోర్టు 4 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. దీంతో పోలీసులు బిభవ్‌కుమార్‌ను రిమాండ్‌కు తరలించారు. 

ఇటీవల తమ పార్టీ అధినేత కేజ్రీవాల్‌ను కలిసేందుకు సీఎం నివాసానికి వెళ్లినపుడు తనపై దాడి జరిగిందని స్వాతిమలివాల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

కేజ్రీవాల్‌ సహాయకుడు బిభవ్‌కుమార్‌ తనను కింద పడేసి తన్నారని ఫిర్యాదులో తెలిపారు. ఢిల్లీలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ దగ్గరపడుతున్న కొద్దీ మలివాల్‌పై దాడి ఘటనపై రాజకీయ దుమారం పెద్దదవుతూనే ఉంది. 

Advertisement
 
Advertisement
 
Advertisement