'అదర్ పూనావాలా' రూ.10.5 కోట్ల కారు ఇదే.. చూసారా! | Sakshi
Sakshi News home page

'అదర్ పూనావాలా' రూ.10.5 కోట్ల కారు ఇదే.. చూసారా!

Published Fri, May 24 2024 4:21 PM

Serum Institute Owner Adar Poonawalla Buys New Ferrari Purosangue

సీరమ్‌ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ 'అదర్ పూనావాలా' ఇటీవల 'ఫెరారీ పురోసాంగ్యూ' కొనుగోలు చేశారు. దీని ధర దాదాపు రూ. 10.5 కోట్లు (ఎక్స్-షోరూమ్). ఈ కొత్త కారుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

అదర్ పూనావాలా కొనుగోలు చేసిన కారు రిజిస్ట్రేషన్ నెంబర్ ప్రకారం.. ఇది ఇండియాలో కొనుగోలు చేసింది కాదని తెలుస్తోంది. నాలుగు డోర్స్ కలిగిన ఈ కారు నీరో డేటోనా షేడ్‌లో ఉండటం గమనించవచ్చు. ఎల్లో కలర్ బ్రేక్ కాలిపర్‌లు కలిగిన ఈ కారు బ్లాక్-అవుట్ ఎక్ట్సీరియర్‌ పొందుతుంది. ఇంటీరియర్‌ కూడా ఇదే బ్లాక్ అండ్ ఎల్లో కలర్ కలయికతో ఉండటం చూడవచ్చు.

అద్భుతమైన డిజైన్, ఫీచర్స్ కలిగిన ఈ కారు 6.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి.. 725 పీఎస్ పవర్, 716 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది మార్కెట్లో లంబోర్ఘిని ఉరస్, ఆస్టన్ మార్టిన్ డీబీఎక్స్ కార్లకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. ధర పరంగా ఫెరారీ కారు దాని ప్రత్యర్థుల కంటే ఎక్కువ.

అదార్ పూనావాలా గ్యారేజిలో ఫెరారీ పురోసాంగ్యూ మాత్రమే కాకుండా.. రోల్స్ రాయిస్, ఫెరారీ 488 పిస్టా సూపర్‌కార్‌, బెంట్లీ బెంటెగా EWB, పోర్స్చే కయెన్, బీఎండబ్ల్యూ 7 సిరీస్, మెర్సిడెస్ బెంజ్ ఎస్600, బెంట్లీ కాంటినెంటల్ ఫ్లయింగ్ స్పర్ మొదలైన అన్యదేశ్య కార్లు ఉన్నాయి.

Advertisement
 
Advertisement
 
Advertisement