'మీ రేటు కార్డ్‌ సిద్ధం చేస్తాం'.. రెడీగా ఉండమని చెప్పాడు: హీరోయిన్‌ | Sakshi
Sakshi News home page

Mahhi Vij: 'అక్కడికి వెళ్తే మీ రేటేంతో చెప్తా అన్నాడు'.. క్యాస్టింగ్‌ కౌచ్‌పై హీరోయిన్‌

Published Fri, May 24 2024 7:42 PM

Bollywood Actress Mahhi Vij recalls her shocking casting couch experience

సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపించే పదం క్యాస్టింగ్‌ కౌచ్‌. కొత్తగా సినిమాల్లోకి వచ్చేవారికి ఇలాంటి అనుభవం ఎక్కడో ఒకచోట ఎదురై ఉంటుంది. చాలామంది సెలబ్రిటీలు తమకు ఎదురైన చేదు అనుభవాన్ని ఏదో ఒక సందర్భంలో రివీల్ చేస్తుంటారు. అలా తాజాగా ఓ నటి తనకు ఎదురైన కాస్టింగ్ కౌచ్ సంఘటనను పంచుకుంది. ఓ ఇంటర్వ్యూకు హాజరైన బాలీవుడ్ నటి మహి విజ్‌ ఆ షాకింగ్ సంఘటనను వెల్లడించింది.

తాను ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో సినిమా కోఆర్డినేటర్‌గా చెప్పుకునే వ్యక్తి నుంచి తనకు కాల్ రావడంతో ముంబయిలోని జుహూ వెళ్లానని తెలిపింది. అతని కారులోనే తన సోదరితో కలిసి వెళ్లినట్లు పేర్కొంది. ఆ సమయంలో అతను మాకు ఆల్బమ్‌లోని కొన్ని ఫోటోలు చూపించాడు. ఈ ఆల్బమ్‌లో మీ ఫోటో కూడా ఉంచుతాం.. మీ రేట్ కార్డ్ సిద్ధంగా ఉంటుందని మాతో అన్నాడని తెలిపింది.

అయితే దీనిపై మొదట్లోనే నెగెటివ్‌గా ఆలోచించవద్దని.. ఒక్క రోజు షూటింగ్‌కి రేటు కార్డు ఎంత అని అడిగాను.. దానికి అతని బదులిస్తూ.. మేడం మీరు క్రూయిజ్‌కి వెళ్తారా? దయచేసి మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అని మాతో అన్నాడు. దీంతో వెంటనే తప్పుడు వ్యక్తిని కలిశానని మాకు అర్థమైంది. కారు వెనకసీట్లో కూర్చున్న మా సోదరి ‍అతన్ని జుట్టు పట్టి లాగింది. దీంతో వెంటనే కారు నుంచి దిగి అక్కడి నుంచి వచ్చేశామని మహి విజ్‌ తెలిపింది. క్రూయిజ్‌ షిప్‌లో అందరిముందు అశ్లీలనృత్యం చేసేందుకు సంప్రదించాడని మాకు అర్థమైందని మహి వెల్లడించింది.

కాగా.. బాలికా వధు సీరియల్‌లో నందినిగా.. లాగీ తుజ్సే లగన్‌లో నకుషా పాత్రలతో మహి విజ్ మంచి పేరు తెచ్చుకుంది. ఢిల్లీలో జన్మించిన ఆమె 17 ఏళ్ల వయసులోనే బాలీవుడ్‌లో అవకాశాల కోసం ముంబయి వచ్చింది. అయితే బుల్లితెర ఇండస్ట్రీలో కెరీర్‌ ప్రారంభించే కంటే ముందే మహి తెలుగు, మలయాళం, కన్నడ చిత్రాల్లో కనిపించింది. తెలుగులో సిద్ధార్థ్ నటించిన తపన చిత్రంలో మహి నటించింది. 
 

Advertisement
 
Advertisement
 
Advertisement