టెస్లా కొనుగోలు దారులకు మస్క్‌ అనూహ్య ఆఫర్‌ | Tesla Offers Financing On Model Y | Sakshi
Sakshi News home page

టెస్లా కొనుగోలు దారులకు మస్క్‌ అనూహ్య ఆఫర్‌

May 24 2024 2:43 PM | Updated on May 24 2024 3:46 PM

Tesla Offers Financing On Model Y

టెస్లా సీఈవో ఎలోన్‌ మస్క్‌ బంపరాఫర్‌ ప్రకటించారు. టెస్లా ‘మోడల్ వై’ (Model Y) కొనుగోలు దారులకు 0.99శాతం ఏపీఆర్‌(యాన్యువల్‌ పర్సెంటేజ్‌ రేట్‌​) ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఆఫర్‌ మే 31వరకు కొనసాగుతుంది. 

ఆటోమొబైల్‌ మార్కెట్‌లో ఇతర ఎలక్ట్రిక్‌ కార్ల కంపెనీల నుంచి పోటీ, తగ్గిపోతున్న కార్ల అమ్మకాలు టెస్లాపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి.

ఈ తరుణంలో టెస్లా అమ్మకాలను పెంచే ప్రయత్నంలో టెస్లా మోడల్‌ వైపై మోడల్ వై భారీ ఆఫర్లు ఇస్తున్నారు. కొద్ది రోజుల క్రితం చైనా వాహనదారులు జీరో పర్సెంట్‌ వడ్డీతో టెస్లా కారును కొనుగోలు చేసే వెసులు బాటు కల్పించారు. దీంతో వడ్డీ చెల్లించే అవసరం లేకుండా టెస్లా కారును సొంతం చేసుకోవచ్చు.

తాజాగా, అమెరికాలో  మోడల్ వైపై 0.99% ఫైనాన్సింగ్‌తో భారీ తగ్గింపుతో పరిమిత కాల ఆఫర్‌ను అందిస్తున్నట్లు టెస్లా అధికారికంగా తెలిపింది. సాధారణంగా ఈ వడ్డీ  5 నుండి 7శాతం వరకు ఉంటుంది. కానీ మస్క్‌ వాహన కొనుగోలు దారులకు 0.99 శాతం వడ్డీకే టెస్లా వై మోడల్‌ కారును అందిస్తున్నారు.  

టెస్లా వెబ్‌సైట్ ప్రకారం, నిబంధనల మేరకు టెస్లా మోడల్‌ వై కొనుగులు దారులు 4,250వేల డాలర్లు డౌన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది.  72 నెలల టెన్యూర్‌ ఫైనాన్స్‌ అందిస్తుంది. ఎలాంటి బెన్ఫిట్‌ లేకుండా నెలకు 603 డాలర్ల ఈఎంఐ చెల్లించాలి. అర్హతగల కొనుగోలుదారులు ఫెడరల్ టాక్స్ క్రెడిట్ నుండి కూడా ప్రయోజనం పొందవచ్చు. ఇది నిర్దిష్ట ఆదాయ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నవారికి నెలవారీ ఈఎంఐ తగ్గుతుంది. కేవలం 499 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement