వరల్డ్‌ ఫ్యామస్‌ మీమ్‌ డాగ్‌ ఇకలేదు.. గుండె పగిలిందంటున్న నెటిజన్లు | Sakshi
Sakshi News home page

వరల్డ్‌ ఫ్యామస్‌ మీమ్‌ డాగ్‌ ఇకలేదు.. గుండె పగిలిందంటున్న నెటిజన్లు

Published Fri, May 24 2024 5:29 PM

Meme dog Kabosu that inspired Dogecoin, dies

 సోషల్‌మీడియాలో ప్రపంచవ్యాప్తంగా  పాపులర్‌ అయినా జపనీస్ కుక్క(19) ఇకలేదు.   సోషల్ మీడియాలో మీమ్స్   ఐకాన్‌ కబోసు "డాగీ" కన్నుమూసింది. ఈవిషయాన్ని కబోసు యజమాని అత్సుకో సాటో  ప్రకటించారు.  

"మే 26 ఆదివారం నాడు కబో-చాన్‌కు వీడ్కోలు పార్టీ"ని నరిటా సిటీలోని కొట్సు నో మోరిలోని ఫ్లవర్ కౌరీలో మధ్యాహ్నం 1 నుండి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు  కూడా వెల్లడించారు. దీంతో డాగ్‌ లవర్స్‌, సోషల్‌ మీడియా యూజర్లు తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. ఆర్‌ఐపీ కబోసు సందేశాలు వెల్లువెత్తాయి.


క్రిప్టోకరెన్సీ డాగ్‌కాయిన్‌ను,  సోషల్ మీడియా మీమ్స్ బెస్ట్ ఛాయస్‌గా  షిబా ఇను కబోసు పేరుగాంచింది. లుకేమియా , కాలేయ వ్యాధితో బాధపడుతూ శుక్రవారం మృతి చెందింది.  ముందు రోజు రాత్రి ఎప్పటిలాగే అన్నం తిని పుష్కలంగా నీళ్ళు తాగిందనీ, గాఢ నిద్రలో ప్రశాతంగా కన్నుమూసిందని  సాటో  తెలిపారు. 2022లో లుకేమియా , కాలేయ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది.
 

 

Advertisement
 
Advertisement
 
Advertisement