మరి ఎక్కడ తినమంటారు సార్?: టాలీవుడ్ నటుడు ఆసక్తికర ప్రశ్న | Sakshi
Sakshi News home page

Brahmaji: ఇలాగైతే.. ఎక్కడ తినమంటారు సార్?: బ్రహ్మజీ ఫన్నీ రిప్లై

Published Fri, May 24 2024 3:27 PM

Tollywood Actor Brahmaji Reply To Telangana Food Safety Officers Tweet

గత కొద్ది రోజులుగా హైదరాబాద్‌లో ఫుడ్‌ సెఫ్టీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని ప్రముఖ హోటల్స్, రెస్టారెంట్స్‌లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈ దాడుల్లో పలుచోట్ల నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం, ఎక్స్‌పైరీ అయిన ఆహార పదార్థాలను అధికారులు సీజ్ చేశారు. పలు హోటల్‌ యజమానులకు నోటీసులు కూడా ఇచ్చారు. అయితే ఫుడ్‌ సెఫ్టీ అధికారుల దాడుల్లో ఇంత పెద్దఎత్తున హోటల్ యజమాన్యాలు నిర్లక్ష్యం బయటపడడంతో ఆహార ప్రియుల గుండెల్లో దడ మొదలైంది.

తాజాగా ఈ దాడులపై టాలీవుడ్ నటుడు బ్రహ్మజీ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఫుడ్‌ సెఫ్టీ కమిషనర్‌ ట్వీట్‌ను ఉద్దేశించి పోస్ట్ చేశారు. ఇలా అయితే మరీ ఎక్కడ తినాలి సార్‌? ఇంట్లోనేనా? అని రిప్లై ఇచ్చారు. సెలబ్రిటీలు సైతం ఇంట్లో కుదరని సమయాల్లో ప్రముఖ రెస్టారెంట్స్‌కు వెళ్తుంటారు. ఇలా భాగ్యనగరంలో హోటల్‌ యజమాన్యాల నిర్లక్ష్యానికి ఆహార ప్రియులు భయపడుతున్నారు. ఇక నుంచి బయట తినాలంటేనే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సి వస్తుందని నెటిజన్స్‌ పోస్టులు పెడుతున్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement