విమానంలో స్టాండింగ్‌ | Sakshi
Sakshi News home page

విమానంలో స్టాండింగ్‌

Published Thu, May 23 2024 5:17 AM

IndiGo flight returns to airport after crew spots overbooked passenger standing

ముంబై: బస్సు, రైల్లో ప్రయాణికులు నిలబడి ప్రయాణించడం చూస్తుంటాం. కానీ విచిత్రంలో విమానంలో ఓ వ్యక్తి నిలబడి వెళ్లేందుకు సిద్దపడ్డాడు. ఈ ఘటన ముంబై నుంచి వారణాసి వెళ్లే ఫ్లైట్‌లో మంగళవారం జరిగింది.  ముంబైలోని ఛత్రపతి శివాజీ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో ప్లైట్‌ టేకాఫ్‌ అవ్వడానికి సిద్ధంగా ఉన్నపుడు ఓ ప్రయాణికుడు నిలబడి ఉండటం చూసిన సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే అతడిని దింపేశారు.

 ఆ ప్రయాణికుడు ఇండిగో ఉద్యోగి. సిబ్బంది ఎయిర్‌లైన్‌ టికెట్లను తగ్గించడంలో భాగంగా కలిగించే ప్రయోజనం స్టాఫ్‌ లీజర్‌ ట్రావెల్‌లో భాగంగా ప్రయాణిస్తున్నాడు. (సిబ్బందికి ఇలా ప్రయాణించే అవకాశం ఉంటుంది) టేకాఫ్‌కు ముందు తనిఖీ చేయగా.. ఇండిగో ఫ్లైట్‌లో రావాల్సిన ఓ ప్రయాణికుడు రాలేదనే సమాచారం వచ్చింది. ఆ సీటును స్టాండ్‌బైగా ఇండిగో ఉద్యోగికిచ్చారు.  తీరా ఫ్లైట్‌లోకి వెళ్లాక చూస్తే ప్రయాణికుడు ఉన్నాడు. దీంతో ఉద్యోగి నిలబడ్డాడు. అది సిబ్బంది గుర్తించి, నిలిపివేయడంతో టేకాఫ్‌ ఆలస్యమైంది. అది బోర్డింగ్‌ ప్రాసెస్‌ తప్పిదంగా గుర్తించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement